Shuru
Apke Nagar Ki App…
తిరుమలాపురం గ్రామంలో లో ముత్యాలమ్మ తల్లి సంబరాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రజలు ఐక్యతతో పండుగను ఉత్సాహభరితంగా నిర్వహించారు. నేలకొండపల్లి మండలం తిరుమలాపురం గ్రామంలో లో ముత్యాలమ్మ తల్లి సంబరాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రజలు ఐక్యతతో పండుగను ఉత్సాహభరితంగా నిర్వహించారు.ఉదయం నుంచే భక్తులు మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ బోనాలు నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. గ్రామంలోని ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
Kasani Venkatesh
తిరుమలాపురం గ్రామంలో లో ముత్యాలమ్మ తల్లి సంబరాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రజలు ఐక్యతతో పండుగను ఉత్సాహభరితంగా నిర్వహించారు. నేలకొండపల్లి మండలం తిరుమలాపురం గ్రామంలో లో ముత్యాలమ్మ తల్లి సంబరాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రజలు ఐక్యతతో పండుగను ఉత్సాహభరితంగా నిర్వహించారు.ఉదయం నుంచే భక్తులు మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ బోనాలు నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. గ్రామంలోని ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. నేలకొండపల్లి మండలంలోని భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయాన్నే బోనాలు తయారు చేసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి, కోళ్లు, యాటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో పండుగ సందడి నెలకొంది.1
- బోనమెత్తిన పల్లె... కొత్త కొత్తూరు గ్రామంలో బొడ్రాయికి ప్రత్యేక పూజలు... బోనమెత్తిన పల్లెలు... నేలకొండపల్లి మండలం లోని వివిధ గ్రామాలలో ఆదివారం బోనమెత్తారు. ముత్యాలమ్మ తల్లి పండగ ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో, కోలాటం, నృత్యాలతో సందడి చేశారు. బోనాలను ఎత్తుకుని ప్రదర్శన నిర్వహించారు. అమ్మవారికి బోనాల సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పలు గ్రామాలలో కుటుంబ సభ్యులతో పాటు, బంధువులు రాకతో సందడి వాతావరణం నెలకొంది. వర్షాలు సమృద్ధిగా పడాలని... పాడి పంటలతో ప్రజలు సంతోషంగా ఉండాలని కొత్తకొత్తూరు గ్రామంలో బొడ్రాయి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలతో గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ వెన్నపూసల * సీతారాములు, సర్పంచ్ కళావతి, ఉప సర్పంచ్ వల్లాల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.1
- వైభవంగా ముత్యాలమ్మ తల్లి ఉత్సవాలు.. భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ! డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ అమ్మవారికి మొక్కులు నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరు గ్రామంలో ముత్యాలమ్మ తల్లి సంబరాలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే భక్తులు డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. గ్రా ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవాల్లో గ్రామస్థులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.1
- బార్‌లో మద్యం మత్తులో పోలీసుల రచ్చ..! బెటాలియన్ కానిస్టేబుల్‌పై లాఠీ దాడి వరంగల్ జిల్లా ఉర్సుగుట్ట వద్ద ఓ బార్‌లో మద్యం మత్తులో ఓ బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేసిన ఘటన కలకలం రేపింది. బార్‌లో మద్యం సేవించిన బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేస్తున్నాడంటూ బార్ సిబ్బంది 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి వెంటనే బార్ వద్దకు చేరుకున్నారు. అక్కడ న్యూసెన్స్ చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుల్‌ను షర్ట్ వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచిస్తూ చెంపపై కొట్టినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన బెటాలియన్ కానిస్టేబుల్ తిరిగి సంతోష్ రెడ్డి చెంపపై కొట్టడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి లాఠీతో బెటాలియన్ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు కూడా ఈ ఘటనలో జోక్యం చేసుకున్నట్లు సమాచారం. మద్యం మత్తులో మొదలైన న్యూసెన్స్... చివరకు ఇద్దరు పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసిన ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.1
- ఖమ్మం: స్థిరంగా ఏసీ మిర్చి ధర... నాన్ ఏసీ మిర్చి, తగ్గిన పత్తి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,900, అటు క్వింటా పత్తి ధర రూ.9,100గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 21 శుక్రవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100, పత్తి రూ.200 తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు.1
- బీసీల రాజ్యాధికారమే లక్ష్యం — యువత ముందుకు రావాలి: బత్తుల కుమారస్వామి యాదవ్ ప్రెస్ నోట్ బీసీల రాజ్యాధికారమే లక్ష్యం — యువత ముందుకు రావాలి: బత్తుల కుమారస్వామి యాదవ్ తేది: 23-08-2026 | వేదిక: మరిపెడ మండలం, మహబూబాబాద్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు బత్తుల కుమారస్వామి యాదవ్ మరిపెడ మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో యువతను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ సిద్ధాంతాలు, సామాజిక న్యాయం, బీసీల రాజ్యాధికారం సాధనలో యువత పాత్రపై ఆయన కీలక సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా బత్తుల కుమారస్వామి యాదవ్ మాట్లాడుతూ, “తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేవలం రాజకీయ పార్టీ కాదు.. సామాజిక న్యాయం, సమానత్వం, బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాడే వేదిక. బీసీల జనాభాకు అనుగుణంగా రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యంతో మనం ముందుకు సాగాలి” అని అన్నారు. “యువత రాజకీయాలను దూరంగా ఉంచకుండా రాజ్యాంగాన్ని చదవాలి, తమ హక్కులను తెలుసుకోవాలి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాలి. యువత చైతన్యవంతమై సంఘటితమైతేనే బీసీలకు న్యాయమైన రాజకీయ ప్రాతినిధ్యం సాధ్యమవుతుంది” అని ఆయన పేర్కొన్నారు. “పార్టీ సిద్ధాంతాలను ప్రతి గ్రామానికి తీసుకెళ్లే బాధ్యత యువతపై ఉంది. పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే నాయకత్వాన్ని నిర్మించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరంతరం పోరాడాలి” అని బత్తుల కుమారస్వామి యాదవ్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో యువతను పెద్ద సంఖ్యలో పార్టీతో అనుసంధానం చేసి, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. “యువత ముందుకు వస్తే మార్పు సాధ్యం. బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం దక్కే వరకు మన పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, యువజన విభాగం నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు యువత పాల్గొన్నారు.1
- రైల్వే దుప్పట్లే శాలువాలుగా! - రైల్వేలో దారుణం బయటపడింది.. - WESTERN RAILWAY అని రాసి ఉన్న తెల్లటి దుప్పట్లను శాలువాలుగా కప్పుకొని తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులు... సూర్యాపేట సిటీ: ------------------------ ఇదిలా ఉండగా సంచలన RTI రిపోర్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. 2022 జనవరి నుంచి 2026 మే వరకు ఏకంగా 1.27 కోట్ల రైల్వే బెడ్ రోల్ వస్తువులు చోరీకి గురయ్యాయని తెలుస్తోంది. దీంతో కాంట్రాక్టర్లకు ఏకంగా రూ.104.51 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.1
- ఖమ్మం జిల్లా లో ఉదయం నుంచి భారీ వర్షం దంచిపోతుందివర్షం రాకతో రైతులు, వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు ఖమ్మం జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షం దంచిపోతుంది. రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, బోనకల్, నేలకొండపల్లి, కల్లూరు, ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వర్షం రాకతో రైతులు, వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తూ.. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.1