Shuru
Apke Nagar Ki App…
బోనమెత్తిన పల్లె... కొత్త కొత్తూరు గ్రామంలో బొడ్రాయికి ప్రత్యేక పూజలు... బోనమెత్తిన పల్లెలు... నేలకొండపల్లి మండలం లోని వివిధ గ్రామాలలో ఆదివారం బోనమెత్తారు. ముత్యాలమ్మ తల్లి పండగ ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో, కోలాటం, నృత్యాలతో సందడి చేశారు. బోనాలను ఎత్తుకుని ప్రదర్శన నిర్వహించారు. అమ్మవారికి బోనాల సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పలు గ్రామాలలో కుటుంబ సభ్యులతో పాటు, బంధువులు రాకతో సందడి వాతావరణం నెలకొంది. వర్షాలు సమృద్ధిగా పడాలని... పాడి పంటలతో ప్రజలు సంతోషంగా ఉండాలని కొత్తకొత్తూరు గ్రామంలో బొడ్రాయి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలతో గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ వెన్నపూసల * సీతారాములు, సర్పంచ్ కళావతి, ఉప సర్పంచ్ వల్లాల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తేజవత్ గిరిబాబు
బోనమెత్తిన పల్లె... కొత్త కొత్తూరు గ్రామంలో బొడ్రాయికి ప్రత్యేక పూజలు... బోనమెత్తిన పల్లెలు... నేలకొండపల్లి మండలం లోని వివిధ గ్రామాలలో ఆదివారం బోనమెత్తారు. ముత్యాలమ్మ తల్లి పండగ ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో, కోలాటం, నృత్యాలతో సందడి చేశారు. బోనాలను ఎత్తుకుని ప్రదర్శన నిర్వహించారు. అమ్మవారికి బోనాల సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పలు గ్రామాలలో కుటుంబ సభ్యులతో పాటు, బంధువులు రాకతో సందడి వాతావరణం నెలకొంది. వర్షాలు సమృద్ధిగా పడాలని... పాడి పంటలతో ప్రజలు సంతోషంగా ఉండాలని కొత్తకొత్తూరు గ్రామంలో బొడ్రాయి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలతో గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ వెన్నపూసల * సీతారాములు, సర్పంచ్ కళావతి, ఉప సర్పంచ్ వల్లాల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
More news from Khammam and nearby areas
- అంగరంగ వైభవంగా తీస్ సంబరాలు బంజారా సాంప్రదాయ లో భాగంగా అత్యంత వైభవంగా వేడుక... అంగరంగం వైభవంగా తీజ్ వేడుకలు నేలకొండపల్లి మండలం లోని శంకర్ గిరి తండా లో ఆదివారం తీజ్ పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. డీజే ఆటా, పాటలతో గిరిజన సాంప్రాదాయ వస్త్రాలతో నృత్యాలు చేశారు. మేళతాళాలతో డప్పు వాయిద్యాలతో ఘనంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ..... గ్రామంలో, అక్కా చెల్లెలు ఆడబిడ్డలు అన్నదమ్ములు సంస్కృతి సాంప్రదాయాల పండగ గతంలో లేని విధంగా ఎంతో ఆనందంగా ముగింపు సందర్భంగా దేవాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. పంచాయతీ సర్పంచ్ ధరావత్ దీప్లా సరోజిని దంపతులు అమ్మవారికి వస్త్రాలు సమర్పించి, మొక్కులు చెల్లించగానే..అదే సమయంలో వర్షం పడటంతో గిరిజనుల సంబురాలు అంబరాన్నింటాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.1
- తిరుమలాపురం గ్రామంలో లో ముత్యాలమ్మ తల్లి సంబరాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రజలు ఐక్యతతో పండుగను ఉత్సాహభరితంగా నిర్వహించారు. నేలకొండపల్లి మండలం తిరుమలాపురం గ్రామంలో లో ముత్యాలమ్మ తల్లి సంబరాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రజలు ఐక్యతతో పండుగను ఉత్సాహభరితంగా నిర్వహించారు.ఉదయం నుంచే భక్తులు మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ బోనాలు నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. గ్రామంలోని ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.1
- ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు.. గడిచిన రాత్రి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది ఖమ్మం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది..గడిచిన రాత్రి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులన్నీ జలమయంగా మారి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటివరకు ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైన ఖమ్మం జిల్లా ప్రజలకు.. ఈ వర్షాలు కాస్త ఊరటనిస్తున్నాయి. చల్లటి వాతావరణంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.మరోవైపు.. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులు, కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.అయితే ఈ వర్షాలు రైతులకు మాత్రం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. వ్యవసాయ పనులకు వర్షాలు అనుకూలంగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు అవసరమైన నీరు అందడంతో సాగుకు మరింత ఊతం లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇక జిల్లాలోని పలు మండలాల్లో కూడా వర్షం ప్రభావం కొనసాగుతోంది. ఎక్కడ చూసినా వర్షపు నీటితో రహదారులు తడిసి ముద్దవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో ఒకవైపు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. మరోవైపు రైతులకు మాత్రం ఈ వర్షాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి.1
- 23/08/2026 మహబూబాబాద్ : జిల్లా మరిపెడ మండలం వెదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువతను ఉద్దేశించి చారి గారి సందేశం మరిపెడ మండలం కేంద్రంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సీనియర్ నాయకులు చారి గారు యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, యువతే దేశానికి, సమాజానికి నిజమైన భవిష్యత్ శక్తి అని అన్నారు. ప్రతి యువకుడు రాజకీయ చైతన్యంతో పాటు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రశ్నించే ధైర్యం యువతలో ఉండాలని అన్నారు. పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావాలని సూచించారు. యువత ఐక్యంగా ముందుకు వస్తే సమాజంలో గొప్ప మార్పు తీసుకురాగలరని తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువతకు అండగా నిలుస్తుందని, ప్రతి యువకుడు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. యువత మేల్కొంటే మార్పు సాధ్యం — యువత ముందుకు వస్తే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది అని చారి గారు స్పష్టం చేశారు.1
- వినుకొండ,జాలపాలెం భూములు పేదలకు పంచాలి. పిడిఎం డిమాండ్ వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలపాలెం గ్రామంలో 175 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అక్రమ పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్లపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, భూముల్లోని ఎర్రచందనం తదితర కలపను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. వినుకొండ–వెల్లటూరు రహదారిపై జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.1
- ఎన్టీఆర్ జిల్లా మైలవరం నేరపురిత బెదిరింపులతో వసూళ్ల కేసులు నిందితుడు ఉపయోగించిన వాహన స్వాధీనం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నేరపూరిత బెదిరింపులతో కూడిన వసూళ్ల కేసులో నిందితుడు ఉపయోగించిన వాహనం స్వాదీనం. కారులో తుపాకి ఉందని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవము గమనించగలరు . మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మెయిన్ రోడ్డు లోని ఒక హోటల్ కు ఒక వ్యక్తి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పుకుంటూ మరో వ్యక్తితో వచ్చి అక్కడి వంటగదిని తనిఖీ చేసి ఆహార నమూనాలను సేకరించినట్లు తరువాత సదరు వ్యక్తి యొక్క కారు (AP16DQ3479)లో ఫిర్యాదిని కూర్చోబెట్టుకుని హోటల్‌ను సీజ్ చేస్తామని, తనిఖీ సమయంలో తీసిన ఫోటోలు/వీడియోలను మీడియాలో ప్రచారం చేస్తామని డబ్బులు డిమాండ్ చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైలవరం పోలీసులు Cr. No 222/2026, సెక్షన్లు: 308(2), 351(2) BNS కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు దర్యాప్తులో బాగంగా సదరు కారు వివరాలను ఆధునిక టెక్నాలజీ సూరక్షా 360 సి. సి. కెమెరాలలో పొందుపరచడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం సదరు కారు నున్న ప్రాతంలోని ఉన్నట్లు అలర్ట్ రావడంతో వెంటనే పోలీస్ వారు అప్రమత్తమై అక్కడకు వెళ్ళేసరికి పోలీస్ వారి రాకను గమనించిన ముద్దాయి కారును వదిలేసి పారిపోయినాడు. ఈ క్రమంలో సదరు కారును స్వాదీనం చేసుకుని తనిఖీ చేస్తున్న క్రమంలో పోలీసులకు తుపాకీ లాంటి ఒక బొమ్మ పిస్టల్ లభించింది. దానిని పరిశీలించగా అది ఒక తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్ మాత్రమే, అంతేగానీ నిజమైన తుపాకి కాదు ఇది ఒక తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్. సదరు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ముద్దాయి అయిన కుంభా గోవిందు @ వజ్రం ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొన్ని సోషల్ మీడియా లలో మరియు టి. వి. ఛానెల్స్ లలో కారులో నిజమైన తుపాకీ దొరికిందని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది కేవలం తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్ మాత్రమే అని తెలియజేస్తున్నాము గమనించగలరు.1
- నేను చేసింది తప్పే... నేను చేసింది తప్పే భాసింగా బలాలు ఈశ్వర్.. నేను చేసింది తప్పే: బాసింగ బలాలు ఈశ్వర్ TG: ఇటీవల ఓ యువతితో రూములో కన్పించిన ఫోక్ డాన్సర్, బాసింగ బలాలు ఫేమ్ ఈశ్వర్ సాయి ఆ ఘటనపై స్పందించారు. భార్య ఉండగా ఇలా చేయడం కరెక్ట్ కాదని, తాను చేసింది తప్పే అని ఒప్పుకున్నారు. తన పరిస్థితి, ఒత్తిడి తదితర కారణాల వల్ల అలా చేయాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. కాగా ఈశ్వర్ సాయి భార్య తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి, దాడి చేశారని సదరు యువతి వేములవాడ PSలో కంప్లైంట్ చేయగా కేసు నమోదైంది.1
- తుంబూరు సొసైటీలో యూరియా కొరతపై రైతుల ఆందోళన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలోని సొసైటీలో యూరియా కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ద్వారా తుంబూరు సొసైటీ రైతులకు యూరియా బుక్ కావడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే ఇతర సొసైటీల రైతులు బుక్ చేసుకుంటే యూరియా ఎలా అందుబాటులోకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. పంట వేసి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా బుకింగ్‌కు 5జీ ఫోన్ అవసరమని సొసైటీ సిబ్బంది చెబుతున్నారని రైతులు తెలిపారు. అయితే 5జీ ఫోన్‌లో ప్రయత్నించినా యూరియా బుక్ కావడం లేదని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత సమస్యను వెంటనే పరిష్కరించి, తమకు అవసరమైన ఎరువులను అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.1
- ***సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం***. రేషన్ బియ్యం పట్టివేత సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం నుంచి ఏపీలోని కాకినాడకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా శనివారం తెల్లవారుజా మున పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు, సివిల్ సప్లై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో రేషన్ షాప్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి, మధ్యవర్తి ద్వారా కాకినాడకు బియ్యం తరలిం చేందుకు ఆటోలు లోడ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. సత్తుపల్లి పోలీసులు దాడులు నిర్వహించగా 25క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఆటోను పోలీస్ స్టేషన్కు తరలించారు. రేషన్ బియ్యం తరలించడానికి ప్రయత్నించిన నక్క వెంకటేశ్వరరావు, మధ్యవర్తి ఏపీకి చెందిన రాజా, కాకినాడకు చెందిన బాబీపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పంచనామా నిర్వహించి సివిల్ సప్లై గోదాంకు తరలించారు1