Shuru
Apke Nagar Ki App…
వినుకొండ,జాలపాలెం భూములు పేదలకు పంచాలి. పిడిఎం డిమాండ్ వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలపాలెం గ్రామంలో 175 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అక్రమ పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్లపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, భూముల్లోని ఎర్రచందనం తదితర కలపను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. వినుకొండ–వెల్లటూరు రహదారిపై జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Orsu Krishna
వినుకొండ,జాలపాలెం భూములు పేదలకు పంచాలి. పిడిఎం డిమాండ్ వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలపాలెం గ్రామంలో 175 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అక్రమ పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్లపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, భూముల్లోని ఎర్రచందనం తదితర కలపను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. వినుకొండ–వెల్లటూరు రహదారిపై జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- వినుకొండ,జాలపాలెం భూములు పేదలకు పంచాలి. పిడిఎం డిమాండ్ వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలపాలెం గ్రామంలో 175 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అక్రమ పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్లపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, భూముల్లోని ఎర్రచందనం తదితర కలపను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. వినుకొండ–వెల్లటూరు రహదారిపై జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.1
- *గంజాయి తాగిన సమాచారం ఇస్తే 1500...అమ్మిన సమాచారం ఇస్తే 5 వేలు బహుమతి ఇబ్రహీంపట్నం సీఐ ఏ సుబ్రహ్మణ్యం* ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తాగిన సమాచారం ఇస్తే 1500, అమ్మిన వారి సమాచారం ఇస్తే 5000 వేలు బహుమతి ఇస్తామని ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 1900 మందికి టెస్టులు చేస్తే 90 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోస్ ద్వారా గంజాయి వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించామని, దీనితో కొంతమందిలో మార్పు వచ్చిందని వివరించారు మూడు నెలల తర్వాత గతంలో టెస్టులు చేసిన 70 మందికి తిరిగి టెస్టులు చేయగా వారిలో 23 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని, గంజాయి తాగే వాళ్లలో మార్పు రావడం వల్లనే తగ్గారని వివరించారు. గంజాయి మూలాలపై కొద్దికాలంగా దృష్టి పెట్టడం వలన గంజాయి అమ్మకాలు, తాగే వారి సంఖ్య తగ్గిందని రాబోయే రోజుల్లో ఈగల్ కార్యక్రమంలో భాగంగా గంజాయి పూర్తిస్థాయి నిర్మూలనే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. గంజాయి నిర్మూలనకు పోలీస్ శాఖ చేపట్టే కార్యక్రమాలని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని మీడియా సిబ్బందిని సిఐ కోరారు.4
- భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. నేలకొండపల్లి మండలంలోని భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయాన్నే బోనాలు తయారు చేసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి, కోళ్లు, యాటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో పండుగ సందడి నెలకొంది.1
- బోనమెత్తిన పల్లె... కొత్త కొత్తూరు గ్రామంలో బొడ్రాయికి ప్రత్యేక పూజలు... బోనమెత్తిన పల్లెలు... నేలకొండపల్లి మండలం లోని వివిధ గ్రామాలలో ఆదివారం బోనమెత్తారు. ముత్యాలమ్మ తల్లి పండగ ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో, కోలాటం, నృత్యాలతో సందడి చేశారు. బోనాలను ఎత్తుకుని ప్రదర్శన నిర్వహించారు. అమ్మవారికి బోనాల సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పలు గ్రామాలలో కుటుంబ సభ్యులతో పాటు, బంధువులు రాకతో సందడి వాతావరణం నెలకొంది. వర్షాలు సమృద్ధిగా పడాలని... పాడి పంటలతో ప్రజలు సంతోషంగా ఉండాలని కొత్తకొత్తూరు గ్రామంలో బొడ్రాయి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలతో గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ వెన్నపూసల * సీతారాములు, సర్పంచ్ కళావతి, ఉప సర్పంచ్ వల్లాల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.1
- వైభవంగా ముత్యాలమ్మ తల్లి ఉత్సవాలు.. భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ! డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ అమ్మవారికి మొక్కులు నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరు గ్రామంలో ముత్యాలమ్మ తల్లి సంబరాలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే భక్తులు డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. గ్రా ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవాల్లో గ్రామస్థులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.1
- రైల్వే దుప్పట్లే శాలువాలుగా! - రైల్వేలో దారుణం బయటపడింది.. - WESTERN RAILWAY అని రాసి ఉన్న తెల్లటి దుప్పట్లను శాలువాలుగా కప్పుకొని తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులు... సూర్యాపేట సిటీ: ------------------------ ఇదిలా ఉండగా సంచలన RTI రిపోర్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. 2022 జనవరి నుంచి 2026 మే వరకు ఏకంగా 1.27 కోట్ల రైల్వే బెడ్ రోల్ వస్తువులు చోరీకి గురయ్యాయని తెలుస్తోంది. దీంతో కాంట్రాక్టర్లకు ఏకంగా రూ.104.51 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.1
- బార్‌లో మద్యం మత్తులో పోలీసుల రచ్చ..! బెటాలియన్ కానిస్టేబుల్‌పై లాఠీ దాడి వరంగల్ జిల్లా ఉర్సుగుట్ట వద్ద ఓ బార్‌లో మద్యం మత్తులో ఓ బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేసిన ఘటన కలకలం రేపింది. బార్‌లో మద్యం సేవించిన బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేస్తున్నాడంటూ బార్ సిబ్బంది 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి వెంటనే బార్ వద్దకు చేరుకున్నారు. అక్కడ న్యూసెన్స్ చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుల్‌ను షర్ట్ వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచిస్తూ చెంపపై కొట్టినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన బెటాలియన్ కానిస్టేబుల్ తిరిగి సంతోష్ రెడ్డి చెంపపై కొట్టడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి లాఠీతో బెటాలియన్ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు కూడా ఈ ఘటనలో జోక్యం చేసుకున్నట్లు సమాచారం. మద్యం మత్తులో మొదలైన న్యూసెన్స్... చివరకు ఇద్దరు పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసిన ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.1
- ఖమ్మం జిల్లా లో ఉదయం నుంచి భారీ వర్షం దంచిపోతుందివర్షం రాకతో రైతులు, వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు ఖమ్మం జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షం దంచిపోతుంది. రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, బోనకల్, నేలకొండపల్లి, కల్లూరు, ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వర్షం రాకతో రైతులు, వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తూ.. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.1