logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*గంజాయి తాగిన సమాచారం ఇస్తే 1500...అమ్మిన సమాచారం ఇస్తే 5 వేలు బహుమతి ఇబ్రహీంపట్నం సీఐ ఏ సుబ్రహ్మణ్యం* ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తాగిన సమాచారం ఇస్తే 1500, అమ్మిన వారి సమాచారం ఇస్తే 5000 వేలు బహుమతి ఇస్తామని ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 1900 మందికి టెస్టులు చేస్తే 90 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోస్ ద్వారా గంజాయి వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించామని, దీనితో కొంతమందిలో మార్పు వచ్చిందని వివరించారు మూడు నెలల తర్వాత గతంలో టెస్టులు చేసిన 70 మందికి తిరిగి టెస్టులు చేయగా వారిలో 23 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని, గంజాయి తాగే వాళ్లలో మార్పు రావడం వల్లనే తగ్గారని వివరించారు. గంజాయి మూలాలపై కొద్దికాలంగా దృష్టి పెట్టడం వలన గంజాయి అమ్మకాలు, తాగే వారి సంఖ్య తగ్గిందని రాబోయే రోజుల్లో ఈగల్ కార్యక్రమంలో భాగంగా గంజాయి పూర్తిస్థాయి నిర్మూలనే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. గంజాయి నిర్మూలనకు పోలీస్ శాఖ చేపట్టే కార్యక్రమాలని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని మీడియా సిబ్బందిని సిఐ కోరారు.

1 day ago
user_పల్లె నరేష్
పల్లె నరేష్
ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
1 day ago

*గంజాయి తాగిన సమాచారం ఇస్తే 1500...అమ్మిన సమాచారం ఇస్తే 5 వేలు బహుమతి ఇబ్రహీంపట్నం సీఐ ఏ సుబ్రహ్మణ్యం* ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తాగిన సమాచారం ఇస్తే 1500, అమ్మిన వారి సమాచారం ఇస్తే 5000 వేలు బహుమతి ఇస్తామని ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం

086776d7-98cf-4ade-8dd1-fc8e96934b85

తెలిపారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 1900 మందికి టెస్టులు చేస్తే 90 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోస్ ద్వారా గంజాయి వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించామని, దీనితో

కొంతమందిలో మార్పు వచ్చిందని వివరించారు మూడు నెలల తర్వాత గతంలో టెస్టులు చేసిన 70 మందికి తిరిగి టెస్టులు చేయగా వారిలో 23 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని, గంజాయి తాగే వాళ్లలో మార్పు రావడం వల్లనే తగ్గారని వివరించారు. గంజాయి మూలాలపై కొద్దికాలంగా దృష్టి పెట్టడం

6e89c0b2-b42a-49d6-aca7-20942b556628

వలన గంజాయి అమ్మకాలు, తాగే వారి సంఖ్య తగ్గిందని రాబోయే రోజుల్లో ఈగల్ కార్యక్రమంలో భాగంగా గంజాయి పూర్తిస్థాయి నిర్మూలనే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. గంజాయి నిర్మూలనకు పోలీస్ శాఖ చేపట్టే కార్యక్రమాలని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని మీడియా సిబ్బందిని సిఐ కోరారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఎన్టీఆర్ జిల్లా మైలవరం నేరపురిత బెదిరింపులతో వసూళ్ల కేసులు నిందితుడు ఉపయోగించిన వాహన స్వాధీనం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నేరపూరిత బెదిరింపులతో కూడిన వసూళ్ల కేసులో నిందితుడు ఉపయోగించిన వాహనం స్వాదీనం. కారులో తుపాకి ఉందని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవము గమనించగలరు . మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మెయిన్ రోడ్డు లోని ఒక హోటల్ కు ఒక వ్యక్తి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పుకుంటూ మరో వ్యక్తితో వచ్చి అక్కడి వంటగదిని తనిఖీ చేసి ఆహార నమూనాలను సేకరించినట్లు తరువాత సదరు వ్యక్తి యొక్క కారు (AP16DQ3479)లో ఫిర్యాదిని కూర్చోబెట్టుకుని హోటల్‌ను సీజ్ చేస్తామని, తనిఖీ సమయంలో తీసిన ఫోటోలు/వీడియోలను మీడియాలో ప్రచారం చేస్తామని డబ్బులు డిమాండ్ చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైలవరం పోలీసులు Cr. No 222/2026, సెక్షన్లు: 308(2), 351(2) BNS కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు దర్యాప్తులో బాగంగా సదరు కారు వివరాలను ఆధునిక టెక్నాలజీ సూరక్షా 360 సి. సి. కెమెరాలలో పొందుపరచడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం సదరు కారు నున్న ప్రాతంలోని ఉన్నట్లు అలర్ట్ రావడంతో వెంటనే పోలీస్ వారు అప్రమత్తమై అక్కడకు వెళ్ళేసరికి పోలీస్ వారి రాకను గమనించిన ముద్దాయి కారును వదిలేసి పారిపోయినాడు. ఈ క్రమంలో సదరు కారును స్వాదీనం చేసుకుని తనిఖీ చేస్తున్న క్రమంలో పోలీసులకు తుపాకీ లాంటి ఒక బొమ్మ పిస్టల్ లభించింది. దానిని పరిశీలించగా అది ఒక తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్ మాత్రమే, అంతేగానీ నిజమైన తుపాకి కాదు ఇది ఒక తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్. సదరు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ముద్దాయి అయిన కుంభా గోవిందు @ వజ్రం ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొన్ని సోషల్ మీడియా లలో మరియు టి. వి. ఛానెల్స్ లలో కారులో నిజమైన తుపాకీ దొరికిందని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది కేవలం తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్ మాత్రమే అని తెలియజేస్తున్నాము గమనించగలరు.
    1
    ఎన్టీఆర్ జిల్లా మైలవరం నేరపురిత బెదిరింపులతో వసూళ్ల కేసులు నిందితుడు ఉపయోగించిన వాహన స్వాధీనం
ఎన్టీఆర్ జిల్లా మైలవరం
నేరపూరిత బెదిరింపులతో కూడిన వసూళ్ల కేసులో నిందితుడు ఉపయోగించిన వాహనం స్వాదీనం.
కారులో తుపాకి ఉందని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవము గమనించగలరు .
మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మెయిన్ రోడ్డు లోని ఒక హోటల్ కు ఒక వ్యక్తి  ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పుకుంటూ మరో వ్యక్తితో  వచ్చి అక్కడి వంటగదిని తనిఖీ చేసి ఆహార నమూనాలను సేకరించినట్లు తరువాత సదరు వ్యక్తి యొక్క కారు (AP16DQ3479)లో ఫిర్యాదిని కూర్చోబెట్టుకుని  హోటల్‌ను సీజ్ చేస్తామని, తనిఖీ సమయంలో తీసిన ఫోటోలు/వీడియోలను మీడియాలో ప్రచారం చేస్తామని డబ్బులు డిమాండ్ చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైలవరం పోలీసులు Cr. No  222/2026, సెక్షన్లు: 308(2), 351(2) BNS కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు దర్యాప్తులో బాగంగా సదరు కారు వివరాలను ఆధునిక టెక్నాలజీ సూరక్షా 360 సి. సి. కెమెరాలలో పొందుపరచడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం సదరు కారు నున్న ప్రాతంలోని ఉన్నట్లు అలర్ట్ రావడంతో వెంటనే పోలీస్ వారు అప్రమత్తమై అక్కడకు వెళ్ళేసరికి పోలీస్ వారి రాకను గమనించిన  ముద్దాయి కారును వదిలేసి పారిపోయినాడు.
ఈ క్రమంలో సదరు కారును స్వాదీనం చేసుకుని తనిఖీ చేస్తున్న క్రమంలో  పోలీసులకు తుపాకీ లాంటి ఒక బొమ్మ పిస్టల్ లభించింది. దానిని పరిశీలించగా అది ఒక తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్ మాత్రమే,  అంతేగానీ నిజమైన తుపాకి కాదు ఇది ఒక తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్.  సదరు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ముద్దాయి అయిన కుంభా గోవిందు @ వజ్రం ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది.  కానీ కొన్ని సోషల్ మీడియా లలో మరియు టి. వి. ఛానెల్స్ లలో కారులో నిజమైన తుపాకీ దొరికిందని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది కేవలం తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్ మాత్రమే అని తెలియజేస్తున్నాము గమనించగలరు.
    user_YAMALA DURGAPRASAD REDDY
    YAMALA DURGAPRASAD REDDY
    మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • వినుకొండ,జాలపాలెం భూములు పేదలకు పంచాలి. పిడిఎం డిమాండ్ వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలపాలెం గ్రామంలో 175 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అక్రమ పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్లపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, భూముల్లోని ఎర్రచందనం తదితర కలపను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. వినుకొండ–వెల్లటూరు రహదారిపై జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
    1
    వినుకొండ,జాలపాలెం భూములు పేదలకు పంచాలి. పిడిఎం డిమాండ్
వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలపాలెం గ్రామంలో 175 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అక్రమ పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్లపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, భూముల్లోని ఎర్రచందనం తదితర కలపను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. వినుకొండ–వెల్లటూరు రహదారిపై జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
    user_Orsu Krishna
    Orsu Krishna
    Social worker పిడుగురాళ్ల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • తుంబూరు సొసైటీలో యూరియా కొరతపై రైతుల ఆందోళన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలోని సొసైటీలో యూరియా కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ద్వారా తుంబూరు సొసైటీ రైతులకు యూరియా బుక్ కావడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే ఇతర సొసైటీల రైతులు బుక్ చేసుకుంటే యూరియా ఎలా అందుబాటులోకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. పంట వేసి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా బుకింగ్‌కు 5జీ ఫోన్ అవసరమని సొసైటీ సిబ్బంది చెబుతున్నారని రైతులు తెలిపారు. అయితే 5జీ ఫోన్‌లో ప్రయత్నించినా యూరియా బుక్ కావడం లేదని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత సమస్యను వెంటనే పరిష్కరించి, తమకు అవసరమైన ఎరువులను అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
    1
    తుంబూరు సొసైటీలో యూరియా కొరతపై రైతుల ఆందోళన
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలోని సొసైటీలో యూరియా కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ద్వారా తుంబూరు సొసైటీ రైతులకు యూరియా బుక్ కావడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే ఇతర సొసైటీల రైతులు బుక్ చేసుకుంటే యూరియా ఎలా అందుబాటులోకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు.
పంట వేసి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యూరియా బుకింగ్‌కు 5జీ ఫోన్ అవసరమని సొసైటీ సిబ్బంది చెబుతున్నారని రైతులు తెలిపారు. అయితే 5జీ ఫోన్‌లో ప్రయత్నించినా యూరియా బుక్ కావడం లేదని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యూరియా కొరత సమస్యను వెంటనే పరిష్కరించి, తమకు అవసరమైన ఎరువులను అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. నేలకొండపల్లి మండలంలోని భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయాన్నే బోనాలు తయారు చేసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి, కోళ్లు, యాటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో పండుగ సందడి నెలకొంది.
    1
    భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను  ఘనంగా నిర్వహించారు.
నేలకొండపల్లి మండలంలోని భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయాన్నే బోనాలు తయారు చేసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి, కోళ్లు, యాటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో పండుగ సందడి నెలకొంది.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • ***సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం***. రేషన్ బియ్యం పట్టివేత సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం నుంచి ఏపీలోని కాకినాడకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా శనివారం తెల్లవారుజా మున పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు, సివిల్ సప్లై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో రేషన్ షాప్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి, మధ్యవర్తి ద్వారా కాకినాడకు బియ్యం తరలిం చేందుకు ఆటోలు లోడ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. సత్తుపల్లి పోలీసులు దాడులు నిర్వహించగా 25క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఆటోను పోలీస్ స్టేషన్కు తరలించారు. రేషన్ బియ్యం తరలించడానికి ప్రయత్నించిన నక్క వెంకటేశ్వరరావు, మధ్యవర్తి ఏపీకి చెందిన రాజా, కాకినాడకు చెందిన బాబీపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పంచనామా నిర్వహించి సివిల్ సప్లై గోదాంకు తరలించారు
    1
    ***సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం***.   రేషన్ బియ్యం పట్టివేత

సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం నుంచి ఏపీలోని కాకినాడకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా శనివారం తెల్లవారుజా మున పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు, సివిల్ సప్లై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో రేషన్ షాప్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి, మధ్యవర్తి ద్వారా కాకినాడకు బియ్యం తరలిం చేందుకు ఆటోలు లోడ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. సత్తుపల్లి పోలీసులు దాడులు నిర్వహించగా 25క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఆటోను పోలీస్ స్టేషన్కు తరలించారు. రేషన్ బియ్యం తరలించడానికి ప్రయత్నించిన నక్క వెంకటేశ్వరరావు, మధ్యవర్తి ఏపీకి చెందిన రాజా, కాకినాడకు చెందిన బాబీపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పంచనామా నిర్వహించి సివిల్ సప్లై గోదాంకు తరలించారు
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • చిలకలపూడి రైల్వే గేట్ సమీపంలో ఉన్న బార్లో మందుబాబులు వీరంగం కృష్ణ జిల్లా మచిలీపట్నం : చిలకపూడి రైల్వే గేట్ సమీపంలో ఉన్న బార్ లో మందు బాబుల వీరంగం ఒకరి ఫై ఒకరు దాడి చేసుకున్న ఇరువురు వ్యక్తులు కనుముడి నాగరాజు అనే వ్యక్తి ఫై దాడి చేసిన వేముల. మహేష్ అనే వ్యక్తి మెరుగైన చికిత్స కోసం నాగరాజు ను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి నుండి విజయవాడ ఆసుపత్రి కు తరలిస్తున్న వైద్యులు కేసు నమోదు చేసి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    1
    చిలకలపూడి రైల్వే గేట్ సమీపంలో ఉన్న బార్లో మందుబాబులు వీరంగం 
కృష్ణ జిల్లా మచిలీపట్నం :
చిలకపూడి రైల్వే గేట్ సమీపంలో ఉన్న బార్ లో మందు బాబుల వీరంగం 
ఒకరి ఫై ఒకరు దాడి చేసుకున్న ఇరువురు వ్యక్తులు 
కనుముడి  నాగరాజు అనే వ్యక్తి ఫై దాడి చేసిన వేముల. మహేష్ అనే వ్యక్తి 
మెరుగైన చికిత్స కోసం నాగరాజు ను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి నుండి విజయవాడ ఆసుపత్రి కు తరలిస్తున్న వైద్యులు 
కేసు నమోదు చేసి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    user_Hareesh Gopu
    Hareesh Gopu
    బంటుమిల్లి, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • మచిలీపట్నం మేయర్ అభ్యర్థిత్వంపై జనసేనలో తారాస్థాయికి చేరిన అంతర్గత విబేధాలు మచిలీపట్నం మేయర్ అభ్యర్థిత్వంపై జనసేనలో అంతర్గత విబేధాలు తారాస్థాయికి చేరాయి. జనసేనలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో జనసేన నేతలు తన్నులాటకు దిగారు. రెండు రోజుల క్రితం నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్ బండి రామకృష్ణ అనుచరుడు గడ్డం రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మేయర్ అభ్యర్థిత్వం ఆశించిన కొట్టె వెంకట్రావ్ ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరైన సమయంలో కొట్టె వెంకట్రావ్ తో వాగ్వివాదానికి దిగిన గడ్డం రాజు. మాటమాట పెరగడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువురికి సర్దుబాటు చేశారు.
    1
    మచిలీపట్నం మేయర్ అభ్యర్థిత్వంపై జనసేనలో తారాస్థాయికి చేరిన అంతర్గత విబేధాలు
మచిలీపట్నం మేయర్ అభ్యర్థిత్వంపై జనసేనలో అంతర్గత విబేధాలు తారాస్థాయికి చేరాయి. జనసేనలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి.
ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో జనసేన నేతలు తన్నులాటకు దిగారు. రెండు రోజుల క్రితం నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్  బండి రామకృష్ణ అనుచరుడు గడ్డం రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మేయర్ అభ్యర్థిత్వం ఆశించిన కొట్టె వెంకట్రావ్
ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరైన సమయంలో కొట్టె వెంకట్రావ్ తో వాగ్వివాదానికి దిగిన గడ్డం రాజు. మాటమాట పెరగడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువురికి సర్దుబాటు చేశారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • నానమ్మ అంత్యక్రియల్లో విషాదం దహన చితిలోకి దూకిన 30 ఏళ్ల వ్యక్తి 30 ఏళ్ల వ్యక్తి నానమ్మ అంత్యక్రియల్లో దహన చితిలోకి దూకిన విషాద ఘటన దహన చితిలోకి దూకిన 30 ఏళ్ల వ్యక్తి పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనతో అక్కడున్న కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....
    1
    నానమ్మ అంత్యక్రియల్లో విషాదం దహన చితిలోకి దూకిన 30 ఏళ్ల వ్యక్తి
30 ఏళ్ల వ్యక్తి నానమ్మ అంత్యక్రియల్లో దహన చితిలోకి దూకిన విషాద ఘటన దహన చితిలోకి దూకిన 30 ఏళ్ల వ్యక్తి
పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. 
ఈ ఘటనతో అక్కడున్న కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.