కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష.. దాస్యం వినయ్ భాస్కర్.. హనుమకొండ: హనుమకొండ నగరంలోని వైఎస్సార్ నగర్ కాలనీని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించిన ఆయన స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, మౌలిక సదుపాయాల లోపాలు, అభివృద్ధి అవసరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన దాస్యం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై నిరంతరం నిలదీస్తామని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని దాస్యం వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష.. దాస్యం వినయ్ భాస్కర్.. హనుమకొండ: హనుమకొండ నగరంలోని వైఎస్సార్ నగర్ కాలనీని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించిన ఆయన స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, మౌలిక సదుపాయాల లోపాలు, అభివృద్ధి అవసరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన దాస్యం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై నిరంతరం నిలదీస్తామని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని దాస్యం వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు.
- ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ........... నర్సంపేట: మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ కాంపెళ్లి వీణ విజేందర్ రెడ్డి రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.2
- భూభారతి నిషేధిత భూముల జాబితా అని మొత్తం తొలగించారు మాజీ మంత్రి హరీష్ రావు భూభారతిలో నిషేధిత భూముల జాబిత మొత్తం తొలగించారు ఏ తప్పూ చేయనప్పుడు జాబితా ఎందుకు మాయమైంది? మొత్తం హైదరాబాద్ నగరమంతా భూ భారతి నుండి మాయం చేసారు ఇదంతా అసలైన ప్రభుత్వ భూములు కూడా కాజేసే కుట్ర జరుగుతుందనే అనుమానాలు ఉన్నాయి – హరీష్ రావు1
- రామగుండంలో ఎన్ఐఏ తనిఖీలు కలకలం...బీటెక్ విద్యార్థిని విచారించి లాప్ టాప్ సెల్ ఫోన్ పట్టుకెళ్ళిన ఎన్ఐఏ అధికారులు పెద్దపల్లి జిల్లా రామగుండం లో ఎన్ఐఏ అధికారులు ఇంజనీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకొని సోదాలు నిర్వహించడం సర్వత్రా ఆందోళనకు గురిచేసింది. రామగుండం అయోద్యనగర్ లో నివాసం ఉండే ఇంజనీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్ కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇంజనీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకుని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లో విచారించారు. ఫేస్ బుక్ ద్వారా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించి అతని ల్యాప్ టాప్ సెల్ఫోన్ ను స్వాధీనం చేసుకుని వెళ్ళారు. ఏఐ కోర్సు నేర్పిస్తామని ఏడాది క్రితం లింక్ లో ఆడ్ చేశారని బిటెక్ విద్యార్థి ముజామిల్ ఖాన్ తెలిపారు. క్రైమ్ సంబంధించి కొన్ని పంపిస్తే అందులోంచి బయటికి వచ్చానని చెప్పారు. గ్రూప్ కు సంబంధించిన వారు అరెస్ట్ అయితే తనను ప్రస్తుతం విచారించారని, లాఫ్ టాప్ సెల్ఫోన్ తీసుకెళ్లారని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన గ్రూప్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఏఐ కోర్సు నేర్పిస్తామని తన నంబర్ ఆ గ్రూపులో ఆడ్ చేశారని ముజామిల్ ఖాన్ తెలిపారు.2
- ములుగు గోవిందరావుపేట 39 ఏళ్ల నాటి ఘటనను ఇప్పుడు తెరపైకి తేవడం వెనుక ఆంతర్యమేంటి. ములుగు గోవిందరావుపేట 39 ఏళ్ల నాటి ఘటనను ఇప్పుడు తెరపైకి తేవడం వెనుక ఆంతర్యమేంటి? ఖబడ్దార్ బి.ఆర్.ఎస్.పార్టీ ములుగు మండల అధ్యక్షులు సానికొమ్ము రమేశ్ రెడ్డిని హెచ్చరించిన పాలడుగు వెంకటకృష్ణ. ఈరోజున గోవిందరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశములో గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ పాల్గొని ములుగు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సానికొమ్ము రమేశ్ రెడ్డి 39 సంవత్సరాల క్రితం జరిగిన ఘటనను ఇప్పుడు రాజకీయంగా తెరపైకి తీసుకురావడం వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కొత్తగూడలో మంత్రి సీతక్క మాట్లాడి ఆరు రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు రమేశ్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. “ఆ విషయం మీద స్పందించాల్సి ఉంటే అప్పుడే స్పందించాలి. ఇన్ని రోజుల తర్వాత పాత ఘటనను తెరపైకి తీసుకురావడం వెనుక ఏ రాజకీయ ప్రయోజనం ఉంది?” అని నిలదీశారు. మీ పార్టీ నాయకుడు ఏరువా సతీష్ రెడ్డి అలియాస్ గుంటూరు సతీశ్ రెడ్డిపై ఇసుక కాంట్రాక్టర్లను బెదిరించి, చక్రపాణి అనే మధ్యవర్తి ద్వారా భారీ మొత్తంలో నగదు తీసుకున్నారన్నది వాస్తవం కాదా అని వెంకటకృష్ణ అన్నారు. “రెండు కోట్ల రూపాయల ఒప్పందం కుదిరిందని, అందులో రూ.1.80 కోట్ల నగదు తీసుకున్నారన్నది వాస్తవం కాదా. నిజంగా అది అవాస్తవం అయితే సతీశ్ రెడ్డి ప్రజల ముందు స్పష్టమైన వివరణ ఇవ్వాలి కదా? ఎందుకు ఇవ్వట్లేదు. ప్రజలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు. అసలు ఈ నగదు తీసుకున్న వాస్తవాలను కప్పి పుచ్చడానికి, వాటికి సమాధానం చెప్పకుండా, ప్రజల దృష్టిని మళ్లించేందుకే 39 ఏళ్ల నాటి ఘటనను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారా? అని రమేశ్ రెడ్డిని ప్రశ్నించారు. బహిరంగ చర్చకు రండి. ప్రజలు ఎవరి మాటలో నిజం ఉందో, ఎవరు విషయాన్ని దారి మళ్లిస్తున్నారో తేల్చుతారు.”అని పాలడుగు వెంకటకృష్ణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కార్మిక శాఖా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, సీనియర్ నాయకులు కనతల నాగేందర్ రావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారామ్ నాయక్, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు చింత క్రాంతి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భుక్య రాజు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు భైరి అభిలాష్, మాజీ ఎంపీటీసీ చాపల ఉమాదేవి, కాడబోయిన రవి, జిల్లా కార్యదర్శి జంపాల చంద్రశేఖర్, గణపాక సుధాకర్, తండా కృష్ణ, రామచంద్రపు వెంకటేశ్వర్ రావు, సర్పంచ్ లావుడ్యా జోగా, రేగుల లక్ష్మణ్, ఇర్ప విజయ, గోపిదాసు వజ్రమ్మ తదితర నాయకులు పాల్గొన్నారు.2
- కాలేశ్వరంపై రాజకీయాలు కాదు రైతులకు నీళ్లు ఇవ్వండి : బీఆర్ఎస్ పార్టీ నాయకుడు భూక్య జంపన్న ములుగు జిల్లా, ఆగస్టు 23 అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు అద్భుతంగా ఉన్నాయని తేల్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థ, కాంక్రీటు క్వాలిటీ పరీక్షల్లో అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలోని అన్ని పియర్స్‌లో కాంక్రీటు క్వాలిటీ చాలా బాగున్నట్టు తేలిందని స్పష్టం చేసిన సీడబ్ల్యూపీఆర్ఎస్ అని ఓకే జంపన్న తెలిపారు. కాలేశ్వరం నీటిని రైతుల పొలాలకు అందించకుండా వృథాగా వదిలేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తీవ్ర నష్టం చేస్తోందని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ నాయకుడు భూక్య జంపన్న మండిపడ్డారు.1
- బీసీల రాజ్యాధికారమే లక్ష్యం — యువత ముందుకు రావాలి: బత్తుల కుమారస్వామి యాదవ్ ప్రెస్ నోట్ బీసీల రాజ్యాధికారమే లక్ష్యం — యువత ముందుకు రావాలి: బత్తుల కుమారస్వామి యాదవ్ తేది: 23-08-2026 | వేదిక: మరిపెడ మండలం, మహబూబాబాద్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు బత్తుల కుమారస్వామి యాదవ్ మరిపెడ మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో యువతను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ సిద్ధాంతాలు, సామాజిక న్యాయం, బీసీల రాజ్యాధికారం సాధనలో యువత పాత్రపై ఆయన కీలక సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా బత్తుల కుమారస్వామి యాదవ్ మాట్లాడుతూ, “తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేవలం రాజకీయ పార్టీ కాదు.. సామాజిక న్యాయం, సమానత్వం, బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాడే వేదిక. బీసీల జనాభాకు అనుగుణంగా రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యంతో మనం ముందుకు సాగాలి” అని అన్నారు. “యువత రాజకీయాలను దూరంగా ఉంచకుండా రాజ్యాంగాన్ని చదవాలి, తమ హక్కులను తెలుసుకోవాలి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాలి. యువత చైతన్యవంతమై సంఘటితమైతేనే బీసీలకు న్యాయమైన రాజకీయ ప్రాతినిధ్యం సాధ్యమవుతుంది” అని ఆయన పేర్కొన్నారు. “పార్టీ సిద్ధాంతాలను ప్రతి గ్రామానికి తీసుకెళ్లే బాధ్యత యువతపై ఉంది. పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే నాయకత్వాన్ని నిర్మించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరంతరం పోరాడాలి” అని బత్తుల కుమారస్వామి యాదవ్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో యువతను పెద్ద సంఖ్యలో పార్టీతో అనుసంధానం చేసి, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. “యువత ముందుకు వస్తే మార్పు సాధ్యం. బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం దక్కే వరకు మన పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, యువజన విభాగం నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు యువత పాల్గొన్నారు.1
- భూపాలపల్లిలో చైన్ స్నాచింగ్ కలకలం.. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దుండగులు జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు లక్ష్మీనగర్‌లో సోమవారం ఉదయం చైన్ స్నాచింగ్ యత్నం కలకలం రేపింది. మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన వృద్ధ దంపతులను వెంబడించిన ఓ దుండగుడు మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కునేందుకు ప్రయత్నించాడు. అయితే గొలుసు తెగకపోవడంతో యత్నం విఫలమైంది. అనంతరం దుండగుడు వీధి చివర బైక్‌పై సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో లక్ష్మీనగర్‌లో ఓ ఇంట్లో నగదు, బంగారు ఆభరణాల చోరీ జరిగిన నేపథ్యంలో తాజా ఘటనతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, బ్లూ కోల్ట్స్‌తో పాటు పోలీస్ పెట్రోలింగ్‌ను పెంచాలని స్థానికులు పోలీసు అధికారులను కోరుతున్నారు.1
- హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో నిర్వహించిన తీజ్ పండుగ హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు.1
- మల్లెపూల పల్లకి అయ్యప్ప దీక్ష టైంలో మండల పూజా కార్యక్రమంలో స్వామి గొప్పతనాన్ని సూచించే ఈ పాట ఉంటుంది మల్లెపూల పల్లకీ' అయ్యప్ప దీక్ష టైంలో మండల పూజా కార్యక్రమంలో స్వామి గొప్పతనాన్ని కీర్తించేలా ఈ పాట ఉంటుంది. చౌదమ్ శ్రీనివాసరావు లిరిక్స్ అందించగా... జానపద కళాకారుడు డప్పు శ్రీను పాడారు. ఈయన అయ్యప్ప గీతాలు, పలు భక్తి పాటలను ఆలపించడంలో తెలుగు రాష్ట్రాల్లోనే ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆయనే స్వయంగా పాడడంతో మరింత జోష్ వచ్చింది. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్.1