రామగుండంలో ఎన్ఐఏ తనిఖీలు కలకలం...బీటెక్ విద్యార్థిని విచారించి లాప్ టాప్ సెల్ ఫోన్ పట్టుకెళ్ళిన ఎన్ఐఏ అధికారులు పెద్దపల్లి జిల్లా రామగుండం లో ఎన్ఐఏ అధికారులు ఇంజనీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకొని సోదాలు నిర్వహించడం సర్వత్రా ఆందోళనకు గురిచేసింది. రామగుండం అయోద్యనగర్ లో నివాసం ఉండే ఇంజనీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్ కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇంజనీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకుని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లో విచారించారు. ఫేస్ బుక్ ద్వారా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించి అతని ల్యాప్ టాప్ సెల్ఫోన్ ను స్వాధీనం చేసుకుని వెళ్ళారు. ఏఐ కోర్సు నేర్పిస్తామని ఏడాది క్రితం లింక్ లో ఆడ్ చేశారని బిటెక్ విద్యార్థి ముజామిల్ ఖాన్ తెలిపారు. క్రైమ్ సంబంధించి కొన్ని పంపిస్తే అందులోంచి బయటికి వచ్చానని చెప్పారు. గ్రూప్ కు సంబంధించిన వారు అరెస్ట్ అయితే తనను ప్రస్తుతం విచారించారని, లాఫ్ టాప్ సెల్ఫోన్ తీసుకెళ్లారని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన గ్రూప్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఏఐ కోర్సు నేర్పిస్తామని తన నంబర్ ఆ గ్రూపులో ఆడ్ చేశారని ముజామిల్ ఖాన్ తెలిపారు.
రామగుండంలో ఎన్ఐఏ తనిఖీలు కలకలం...బీటెక్ విద్యార్థిని విచారించి లాప్ టాప్ సెల్ ఫోన్ పట్టుకెళ్ళిన ఎన్ఐఏ అధికారులు పెద్దపల్లి జిల్లా రామగుండం లో ఎన్ఐఏ అధికారులు ఇంజనీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకొని సోదాలు నిర్వహించడం సర్వత్రా ఆందోళనకు గురిచేసింది. రామగుండం అయోద్యనగర్ లో నివాసం ఉండే ఇంజనీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్ కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇంజనీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకుని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లో విచారించారు. ఫేస్ బుక్ ద్వారా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించి అతని ల్యాప్ టాప్
సెల్ఫోన్ ను స్వాధీనం చేసుకుని వెళ్ళారు. ఏఐ కోర్సు నేర్పిస్తామని ఏడాది క్రితం లింక్ లో ఆడ్ చేశారని బిటెక్ విద్యార్థి ముజామిల్ ఖాన్ తెలిపారు. క్రైమ్ సంబంధించి కొన్ని పంపిస్తే అందులోంచి బయటికి వచ్చానని చెప్పారు. గ్రూప్ కు సంబంధించిన వారు అరెస్ట్ అయితే తనను ప్రస్తుతం విచారించారని, లాఫ్ టాప్ సెల్ఫోన్ తీసుకెళ్లారని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన గ్రూప్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఏఐ కోర్సు నేర్పిస్తామని తన నంబర్ ఆ గ్రూపులో ఆడ్ చేశారని ముజామిల్ ఖాన్ తెలిపారు.
- కరీంనగర్ లో రోడ్డెక్కిన 22ఏ బాధితులు...కలెక్టరేట్ ఎదుట మహాధర్నా....వారంరోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే కలెక్టరేట్ నుంచి సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టి ఆందోళన ఉదృతం చేస్తాం- ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరిక ఏళ్ల తరబడి పట్టాలు ఉండి నివాసాలు ఏర్పరచుకొని ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న భూములను సైతం నిషేధిత 22ఏ జాబితాలో చేర్చడంపై కరీంనగర్ లో బాధితులు ఆందోళనకు దిగారు. బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రేకుర్తి, విద్యానగర్ బాధితులు ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి మహా ధర్నా చేపట్టారు. ధర్నాలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ లు రవీందర్ రెడ్డి, అనిల్ గౌడ్, నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్ తోపాటు కార్పోరేట్మర్ లు పాల్గొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని రేకుర్తి, విద్యానగర్, హిందూపురి కాలనీ, కొత్తపల్లి, ఆరేపల్లి తో పాటు పలు కాలనీలకు చెందిన దాదాపు 1000 ఎకరాల పట్టా భూమిని నిషేధిత 22ఏ జాబితాలో చేర్చారని ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 వరకు ఎలాంటి ప్రాబ్లమ్ లేని పట్టా భూములను 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని కోరారు. 22ఏపై పొంతన లేని సమాధానం చెబుతున్న రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పట్టాలున్న భూములను 22a జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించనిచో కలెక్టరేట్ నుంచి సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టి ఆందోళన ఉదృతం చేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు.3
- సామాజిక,ప్రజా చైతన్యం కోసం కళాకారుల కలాలు, గళాలు ఉండాలి. కళాకారులు శిక్షణ ద్వారా కళా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి : సిపిఐ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి. సకల జనుల హితం కోసం,సామాజిక కోణంలో ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం కళాకారులు తమ కళాలకు, గళాలకు పనిచెప్పాలని,కళాకారులు శిక్షణ ద్వారా తమ నైపుణ్యం పెంపొందించుకోవాలని సిపిఐ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరంను చాడ వెంకట రెడ్డి ప్రారంభించారు. ఈ శిక్షణ శిబిరంకు హాజరైన కళాకారులను ఉద్దేశించి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రచయితలు,కవులు,కళాకారులు కార్మిక,కర్షక,ప్రజా సమస్యలపై,వారి జీవనవిధానాలపై నిరంతరం అధ్యయనం చేస్తూ రచనలు, పాటలు,వీధి నాటకాలు వ్రాయాలని,కళాకారులు ఎంతో మంది ఉంటారు కానీ ప్రజా కళాకారులు కొంత మంది మాత్రమే ఉంటారని అలాంటి కళాకారులు నిత్యం ప్రజల బాధలను చూసి వాటిని ప్రపంచానికి తెలిజేసేందుకు పాటలు పాడాలని,కళ కాసుల కోసం కాదు ప్రజల కోసమని పాడే కళాకారులే ప్రజానాట్య మండలి కళాకారులని, అలాంటి కళాకారులు నిత్య విద్యార్థులుగా ఎన్నో విషయాలు తెలుసుకొని,పాటలు నేర్చుకొని పాడాలని అందుకు ఇలాంటి శిక్షణా శిబిరాలు ఉపయోగపడతాయని వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్రజల కష్ట,సుఖాలను పాటల రూపంలో బయటకు తెచ్చి ఎంతో మందిని మెప్పించే అత్యంత బలమైన ఆయుధం పాట అని, ఏ పోరాటాలు,ఉద్యమాలు,బహిరంగ సభలు విజయవంతం కావాలన్నా కళాకారులు ఉండాల్సిందేనని, కరీంనగర్ లో సెప్టెంబర్ 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభల విజయవంతం కోసం కళాకారులు తమ వంతుగా కళారూపాలు ప్రదర్శించాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఈ శిక్షణా శిబిరం కార్యక్రమంలో సిపిఐ కరీంనగర్ ,పెద్దపల్లి జిల్లాల కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, తాండ్ర సదానందం,ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కురుమిద్ద శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కవ్వంపల్లి స్వామి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి కటిక రెడ్డి బుచన్న యాదవ్,టేకుమల్ల సమ్మయ్య, ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ,ఉప్పలయ్య,సహాయ కార్యదర్శి రేగుంట చంద్ర శేఖర్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గణేష్,వెంకటాచారి, రోంటాల శ్యామ్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు దుడ్డేల సమ్మయ్య, వరకోలు సదానందం, ఎజ్జ రాజయ్య,లక్ష్మీరాజం,ఆసాల రమ,ఇందిరా,లక్ష్మణ్,ఎర్రోజు శ్రీనివాస్,మోహన్,డప్పురాజు తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ లో ఒరిగిన భారీ వృక్షం: భయాందోళనలో స్థానికులు.. కరీంనగర్ నగరంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో, మటన్ మార్కెట్ పక్కన ఉన్న ఒక భారీ వృక్షం ప్రమాదకరంగా కిందకు వంగిపోయింది. తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు.. రాకపోకలకు ఆటంకంగా ఉన్న కొమ్మలను నరికివేశారు. ఏ క్షణంలో చెట్టు కూలుతుందోనని ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, ఆ చెట్టును అక్కడి నుంచి పూర్తిగా తొలగించి ప్రమాదాన్ని తప్పించాలని కోరుతున్నారు.3
- ఎల్లారెడ్డిపేట కలెక్టర్ లో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ..చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో రోడ్డు ప్రమాదం లారీని ఢీకొన్న ఇన్నోవా రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఇన్నోవా కారు ఢీకొన్నట్లు సమాచారం.ఈ ప్రమాదంలో ఇన్నోవా కారులో ఉన్న ఒక వ్యక్తికి కాలు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏 𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌[𝐌𝐀𝐋𝐄][𝐁𝐀 3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑][𝐇𝐈𝐍𝐃𝐇𝐔;𝐑𝐄𝐋𝐈𝐆𝐈𝐎𝐍][☆𝐎𝐖𝐍:𝐇𝐎𝐔𝐒𝐄;𝐍𝐎.3-9-592##𝐑𝐄𝐃𝐃𝐘 𝐂𝐎𝐋𝐎𝐍𝐘#𝐑𝐎𝐀𝐃 𝐍𝐎.1#𝐇𝐀𝐍𝐀𝐌 𝐊𝐎𝐍𝐃𝐀 -𝐂𝐈𝐓𝐘&𝐃𝐈𝐒𝐓𝐑𝐈𝐂#][☆𝐓𝐇𝐄𝐋𝐀𝐍𝐆𝐀𝐀𝐍𝐀 :𝐓𝐇𝐄𝐋𝐔𝐆𝐔-𝐋𝐀𝐍𝐆𝐔𝐀𝐆𝐄-𝐒𝐓𝐀𝐓𝐄*#☆☆𝐈𝐍𝐃𝐈𝐀-𝐊𝐍𝐓𝐑𝐈#𝐀𝐒𝐈𝐀#☆☆☆𝐖𝐎𝐑𝐋𝐃#]1
- రామగుండంలో ఎన్ఐఏ తనిఖీలు కలకలం...బీటెక్ విద్యార్థిని విచారించి లాప్ టాప్ సెల్ ఫోన్ పట్టుకెళ్ళిన ఎన్ఐఏ అధికారులు పెద్దపల్లి జిల్లా రామగుండం లో ఎన్ఐఏ అధికారులు ఇంజనీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకొని సోదాలు నిర్వహించడం సర్వత్రా ఆందోళనకు గురిచేసింది. రామగుండం అయోద్యనగర్ లో నివాసం ఉండే ఇంజనీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్ కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇంజనీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకుని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లో విచారించారు. ఫేస్ బుక్ ద్వారా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించి అతని ల్యాప్ టాప్ సెల్ఫోన్ ను స్వాధీనం చేసుకుని వెళ్ళారు. ఏఐ కోర్సు నేర్పిస్తామని ఏడాది క్రితం లింక్ లో ఆడ్ చేశారని బిటెక్ విద్యార్థి ముజామిల్ ఖాన్ తెలిపారు. క్రైమ్ సంబంధించి కొన్ని పంపిస్తే అందులోంచి బయటికి వచ్చానని చెప్పారు. గ్రూప్ కు సంబంధించిన వారు అరెస్ట్ అయితే తనను ప్రస్తుతం విచారించారని, లాఫ్ టాప్ సెల్ఫోన్ తీసుకెళ్లారని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన గ్రూప్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఏఐ కోర్సు నేర్పిస్తామని తన నంబర్ ఆ గ్రూపులో ఆడ్ చేశారని ముజామిల్ ఖాన్ తెలిపారు.2
- *బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం* *-- రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* *మృతులకు నివాళు అర్పించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే* చందుర్తి మండలం లింగంపేట గ్రామ పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మృతి చెందిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన షాదుల్లా కుటుంబం వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన రక్తసంబంధీకులు నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో షాదుల్లాతో పాటు ఆయన భార్య హాసీనా, మరో హాసీనా, పదో తరగతి చదువుతున్న చిన్నారి మృతి చెందడం బాధాకరమని విప్ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఒక్కొక్కరుగా మృతి చెందారని తెలిపారు. వేములవాడ పట్టణంలోనీ ఏరియా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పరామర్శించి, ఓదార్చారు. మృతదేహాలకు నివాళి అర్పించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందజేస్తామని తెలిపారు.. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు ముందు, వెనుక సీట్లలో ఉన్నప్పటికీ సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. వాహనాలను అతివేగంగా నడపకుండా జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు. రాష్ట్ర పోలీసు శాఖ ప్రయాణికుల భద్రత పై అవగాహన కల్పించడానికి అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు...ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరూ తమ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకుని సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఒకే ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రక్తసంబంధీకులు మృతి చెందడం అత్యంత బాధాకరమైనoదన్నారు., మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవండుతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు... ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించి, వేగ నియంత్రణ పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలి అని విప్ విజ్ఞప్తి చేశారు..4