సామాజిక,ప్రజా చైతన్యం కోసం కళాకారుల కలాలు, గళాలు ఉండాలి. కళాకారులు శిక్షణ ద్వారా కళా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి : సిపిఐ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి. సకల జనుల హితం కోసం,సామాజిక కోణంలో ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం కళాకారులు తమ కళాలకు, గళాలకు పనిచెప్పాలని,కళాకారులు శిక్షణ ద్వారా తమ నైపుణ్యం పెంపొందించుకోవాలని సిపిఐ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరంను చాడ వెంకట రెడ్డి ప్రారంభించారు. ఈ శిక్షణ శిబిరంకు హాజరైన కళాకారులను ఉద్దేశించి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రచయితలు,కవులు,కళాకారులు కార్మిక,కర్షక,ప్రజా సమస్యలపై,వారి జీవనవిధానాలపై నిరంతరం అధ్యయనం చేస్తూ రచనలు, పాటలు,వీధి నాటకాలు వ్రాయాలని,కళాకారులు ఎంతో మంది ఉంటారు కానీ ప్రజా కళాకారులు కొంత మంది మాత్రమే ఉంటారని అలాంటి కళాకారులు నిత్యం ప్రజల బాధలను చూసి వాటిని ప్రపంచానికి తెలిజేసేందుకు పాటలు పాడాలని,కళ కాసుల కోసం కాదు ప్రజల కోసమని పాడే కళాకారులే ప్రజానాట్య మండలి కళాకారులని, అలాంటి కళాకారులు నిత్య విద్యార్థులుగా ఎన్నో విషయాలు తెలుసుకొని,పాటలు నేర్చుకొని పాడాలని అందుకు ఇలాంటి శిక్షణా శిబిరాలు ఉపయోగపడతాయని వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్రజల కష్ట,సుఖాలను పాటల రూపంలో బయటకు తెచ్చి ఎంతో మందిని మెప్పించే అత్యంత బలమైన ఆయుధం పాట అని, ఏ పోరాటాలు,ఉద్యమాలు,బహిరంగ సభలు విజయవంతం కావాలన్నా కళాకారులు ఉండాల్సిందేనని, కరీంనగర్ లో సెప్టెంబర్ 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభల విజయవంతం కోసం కళాకారులు తమ వంతుగా కళారూపాలు ప్రదర్శించాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఈ శిక్షణా శిబిరం కార్యక్రమంలో సిపిఐ కరీంనగర్ ,పెద్దపల్లి జిల్లాల కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, తాండ్ర సదానందం,ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కురుమిద్ద శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కవ్వంపల్లి స్వామి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి కటిక రెడ్డి బుచన్న యాదవ్,టేకుమల్ల సమ్మయ్య, ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ,ఉప్పలయ్య,సహాయ కార్యదర్శి రేగుంట చంద్ర శేఖర్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గణేష్,వెంకటాచారి, రోంటాల శ్యామ్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు దుడ్డేల సమ్మయ్య, వరకోలు సదానందం, ఎజ్జ రాజయ్య,లక్ష్మీరాజం,ఆసాల రమ,ఇందిరా,లక్ష్మణ్,ఎర్రోజు శ్రీనివాస్,మోహన్,డప్పురాజు తదితరులు పాల్గొన్నారు.
సామాజిక,ప్రజా చైతన్యం కోసం కళాకారుల కలాలు, గళాలు ఉండాలి. కళాకారులు శిక్షణ ద్వారా కళా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి : సిపిఐ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి. సకల జనుల హితం కోసం,సామాజిక కోణంలో ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం కళాకారులు తమ కళాలకు, గళాలకు పనిచెప్పాలని,కళాకారులు శిక్షణ ద్వారా తమ నైపుణ్యం పెంపొందించుకోవాలని సిపిఐ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరంను చాడ వెంకట రెడ్డి ప్రారంభించారు. ఈ శిక్షణ శిబిరంకు హాజరైన కళాకారులను ఉద్దేశించి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రచయితలు,కవులు,కళాకారులు కార్మిక,కర్షక,ప్రజా సమస్యలపై,వారి జీవనవిధానాలపై నిరంతరం అధ్యయనం చేస్తూ రచనలు, పాటలు,వీధి నాటకాలు వ్రాయాలని,కళాకారులు ఎంతో మంది ఉంటారు కానీ ప్రజా కళాకారులు కొంత మంది మాత్రమే ఉంటారని అలాంటి కళాకారులు నిత్యం ప్రజల బాధలను చూసి వాటిని ప్రపంచానికి తెలిజేసేందుకు పాటలు పాడాలని,కళ కాసుల కోసం కాదు ప్రజల కోసమని పాడే కళాకారులే ప్రజానాట్య మండలి కళాకారులని, అలాంటి కళాకారులు నిత్య విద్యార్థులుగా ఎన్నో విషయాలు తెలుసుకొని,పాటలు నేర్చుకొని పాడాలని అందుకు ఇలాంటి శిక్షణా శిబిరాలు ఉపయోగపడతాయని వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్రజల కష్ట,సుఖాలను పాటల రూపంలో బయటకు తెచ్చి ఎంతో మందిని మెప్పించే అత్యంత బలమైన ఆయుధం పాట అని, ఏ పోరాటాలు,ఉద్యమాలు,బహిరంగ సభలు విజయవంతం కావాలన్నా కళాకారులు ఉండాల్సిందేనని, కరీంనగర్ లో సెప్టెంబర్ 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభల విజయవంతం కోసం కళాకారులు తమ వంతుగా కళారూపాలు ప్రదర్శించాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఈ శిక్షణా శిబిరం కార్యక్రమంలో సిపిఐ కరీంనగర్ ,పెద్దపల్లి జిల్లాల కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, తాండ్ర సదానందం,ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కురుమిద్ద శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కవ్వంపల్లి స్వామి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి కటిక రెడ్డి బుచన్న యాదవ్,టేకుమల్ల సమ్మయ్య, ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ,ఉప్పలయ్య,సహాయ కార్యదర్శి రేగుంట చంద్ర శేఖర్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గణేష్,వెంకటాచారి, రోంటాల శ్యామ్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు దుడ్డేల సమ్మయ్య, వరకోలు సదానందం, ఎజ్జ రాజయ్య,లక్ష్మీరాజం,ఆసాల రమ,ఇందిరా,లక్ష్మణ్,ఎర్రోజు శ్రీనివాస్,మోహన్,డప్పురాజు తదితరులు పాల్గొన్నారు.
- రామగుండంలో ఎన్ఐఏ తనిఖీలు కలకలం...బీటెక్ విద్యార్థిని విచారించి లాప్ టాప్ సెల్ ఫోన్ పట్టుకెళ్ళిన ఎన్ఐఏ అధికారులు పెద్దపల్లి జిల్లా రామగుండం లో ఎన్ఐఏ అధికారులు ఇంజనీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకొని సోదాలు నిర్వహించడం సర్వత్రా ఆందోళనకు గురిచేసింది. రామగుండం అయోద్యనగర్ లో నివాసం ఉండే ఇంజనీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్ కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇంజనీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకుని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లో విచారించారు. ఫేస్ బుక్ ద్వారా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించి అతని ల్యాప్ టాప్ సెల్ఫోన్ ను స్వాధీనం చేసుకుని వెళ్ళారు. ఏఐ కోర్సు నేర్పిస్తామని ఏడాది క్రితం లింక్ లో ఆడ్ చేశారని బిటెక్ విద్యార్థి ముజామిల్ ఖాన్ తెలిపారు. క్రైమ్ సంబంధించి కొన్ని పంపిస్తే అందులోంచి బయటికి వచ్చానని చెప్పారు. గ్రూప్ కు సంబంధించిన వారు అరెస్ట్ అయితే తనను ప్రస్తుతం విచారించారని, లాఫ్ టాప్ సెల్ఫోన్ తీసుకెళ్లారని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన గ్రూప్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఏఐ కోర్సు నేర్పిస్తామని తన నంబర్ ఆ గ్రూపులో ఆడ్ చేశారని ముజామిల్ ఖాన్ తెలిపారు.2
- *మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి* *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* *ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ* *చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన* అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.4
- కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు టెక్స్టైల్ , పవర్లూమ్ పరిశ్రమ అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలి వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలి పవర్లూమ్ పరిశ్రమకు 10 HP ల వరకు ఉచిత విద్యుత్ అందించాలి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయాలి ఆదివారం సీఐటీయూ టెక్స్టైల్ & పవర్లూమ్ జాతీయ సమావేశాలు సిరిసిల్లలోని గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఐటీయూ- ఆల్ ఇండియా కార్యదర్శి కరుమలయన్ , మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు లు మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మంది కార్మికులకు ఉపాధిని కల్పిస్తూ ఆదాయాన్ని అందిస్తున్న టెక్స్టైల్ పవర్లూమ్ పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు సరిపడా నిధులు కేటాయించకుండా కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తూ మరోవైపు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్రంలో పవర్లూమ్ పరిశ్రమకు ప్రధాన కేంద్రమైన సిరిసిల్లలో కార్మికులకు సంబంధించిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు.కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు టెక్స్టైల్ పవర్ లూమ్ పరిశ్రమల అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని , వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని , పవర్లూమ్ పరిశ్రమకు 10 HP ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని , వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు.కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో సిఐటియు టెక్స్టైల్ ఆల్ ఇండియా కమిటీ , తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని కార్మికులందరూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో CITU - తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ , ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ , సిఐటియు ఆల్ ఇండియా టెక్స్టైల్ కోఆర్డినేషన్ కమిటీలోని వివిధ రాష్ట్రాల నాయకులు చంద్రన్ , సునీల్ చౌహన్ , అశోకన్ , పెరుమాళ్ , తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళి , సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు సోమన్న , సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , కార్యదర్శి కోడం రమణ సిఐటియు జిల్లా నాయకులు , పవర్లూమ్ అనుబంధ యూనియన్ల నాయకులు ,వివిధ ప్రజా సంఘాల నాయకులు , పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులు , ఆసాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు*2
- జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* *జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* పెద్దపల్లి, ఆగస్టు 24: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ మరియు తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ గార్ల అధ్యక్షతన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గార్కి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీల జనాభా, సామాజిక–ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా నమోదు చేసేందుకు జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్, తెలంగాణ రక్షణ సేన నాయకులు సిరవేన స్వప్న, బొల్లబత్తుల భూమయ్య,బొడిగె మహేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కన్న రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లక్ష్మణ్, జిల్లా అధికార ప్రతినిధి కంకటి శ్రీనివాస్, యువజన అధ్యక్షుడు నోమూరి శ్రీధర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం మరియు ఇతర రంగాల్లో తగిన న్యాయం జరగాలంటే సమగ్ర కుల గణన ఎంతో అవసరమని నాయకులు పేర్కొన్నారు. బీసీల న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు.1
- ఆటో స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పాన్ షాప్ తొలగించాలి బెల్లంపల్లి కాంట చౌరస్తాలో కాంట చౌరస్తా వద్ద ఆటో స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పాన్ షాప్ తొలగించాలని ఆటో యూనియన్ అధ్యక్షులు కట్ల రాంకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం మాట్లాడుతూ ఆటో స్టాండ్ ఏర్పాటు చేయుట నిమిత్తంలో వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు చూపించిన స్థలంలో ఆటోలు నిలుపుకుంటున్నామని ఈ క్రమంలో అదే స్థలంలో కాంట రాత్రికి రాత్రే అక్రమంగా పాన్ షాప్ ఏర్పాటు చేశారన్నారు. దింతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయించి ఆటో స్టాండ్ ఏర్పాటు చేయించాలని కోరారు1
- కాంగ్రేస్ పార్టీ ఎన్నికల్లో కార్మిక వర్గానికి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి లేదంటే పోరాటాలు తప్పవు. ___ఎస్.వీరయ్య, CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు. CITU పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్, CITU కార్యాలయం, గోదావరిఖని లో నిర్వహిస్తున్న క్యాడర్ క్లాసులు రెండవ రోజు క్లాసుకు ముఖ్యఅతిథిగా CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య గారు హాజరై CITU నిర్మాణం - కర్తవ్యాలు. అంశం పై క్లాసు బోదించారు. క్యాడర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ ఎన్నికల్లో కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలి పోయాయాని అన్నారు. కాంగ్రేస్ పార్టీ అధికారం లోకి వచ్చింది 3 సంవత్సరాలు దగ్గర పడుతుందని అన్నారు ఇప్పటికి హామీలు వేరవేర్చకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎం చేస్తుందని ప్రశ్నించారు. ఇంకా కాంగ్రేస్ ప్రభుత్వం కు రెండేళ్లు మాత్రమే అధికారం మిగిలి ఉందని అన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పోరాటలు తప్పవని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ను హెచ్చరించారి. యూనియన్ గవర్నమెంట్ (మోడీ గవర్నమెంట్) కనీస వేతనాలను నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. ఈ ప్రాంతం లో ఉన్న సింగరేణి, ఆర్ ఎఫ్ సి ఎల్, ఎన్ టి పి సి లాంటి కంపెనిల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు లేకుండా బానిస సాకిరీ చేయాల్సి వస్తుందని అన్నారు. ముఖ్యంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఫిక్స్డ్ టర్మ్ లాంటి పేర్ల తో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు లేవు అన్నారు.మోడీ గవర్నమెంట్ 2017లో చేసిన కనీస వేతనాల చట్టం 2022 జనవరితో దాని పని అయిపొయింది అన్నారు.ఇప్పుడు నాలుగేండ్లు గడిచింది మోడీ దాని ఊసే మర్చిపోయారని ఇది అత్యంత దారుణం అన్నారు.ఇప్పటికైనా కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిదంగా గోదావరిఖని ప్రాంతం లో ఇప్పటికే సూపర్ స్పెషాలిటీ ESI వంద పడకల హాస్పిటల్ ఏర్పాటుకు స్థలం సేకరించారు ఇంత జరిగాక కూడా హాస్పిటల్ నిర్మాణం ప్రారంభించలేదు అన్నారు. ఈ విషయం లో కేంద్ర గవర్నమెంట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉందొ చెప్పాలని అన్నారు.ప్రతి నెల ESI హాస్పిటల్ కు రెండు కోట్ల నలభై లక్షల ఆదాయం వస్తుంది. వంద పడకల హాస్పిటల్ ను నిర్మించడంలో కేంద్రం నిర్లక్ష్యం తాగదన్నారు. వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని లేని పక్షం లో రానున్న రోజుల్లో కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఈ క్లాసులకు ప్రిన్సిపాల్ గా వేల్పుల కుమారస్వామి CITU జిల్లా అధ్యక్షులు వ్యవహరించగ జిల్లా కార్యదర్శి ఎ. ముత్యం రావు, కోశాధికారి ఎం. రామాచారీ, ఉపాధ్యక్షులు బిక్షపతి,కొమురయ్య, సహాయ కార్యదర్శులు జ్యోతి, రవీందర్,వనజా రాణి, ప్రవీణ్, జిల్లా కమిటీ సభ్యులు గణేష్,లక్ష్మారెడ్డి, శివ రామ్ రెడ్డి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.1
- జీవో 97ను తక్షణమే రద్దు చేయాలి: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సాంకేతిక విద్యను ప్రైవేటీకరించేందుకు దోహదపడే జీవో నంబర్ 97ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన ఆయన, విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... దశాబ్దాలుగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు దిక్సూచిగా ఉన్న పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పేరుతో పిపిపి (PPP) నమూనా కిందకు తెచ్చి కార్పొరేట్ రంగానికి కట్టబెట్టే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. దీనివల్ల నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యకూ, ఇంజనీరింగ్ కోర్సులకూ దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. పాలిటెక్నిక్ వ్యవస్థను యథావిధిగా కొనసాగిస్తూ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, లేనిపక్షంలో వారి తరఫున క్షేత్రస్థాయిలో, అసెంబ్లీలో పెద్ద ఎత్తున పోరాడతామని హెచ్చరించారు.2
- ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం...అత్యధికంగా గట్టుదుద్దెనపల్లి లో 5.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. అత్యధికంగా మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి లో 5.83 సెంటీమీటర్లు, గంభీరావుపేటలో 4.45 సెంటీమీటర్ వర్షపాతం నమోదు అయింది. ముసురులా వర్షం పడడంతో జనజీవనం స్తంభించిపోయింది. శ్రావణ సోమవారంతో వేములవాడలో వర్షంలో తడుస్తూ భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ, కోడె మొక్కులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతుంది. లోయర్ మానేర్ డ్యామ్ కు స్వల్పంగా ఇన్ ఫ్లో ఔట్ ప్లో 242 క్యూసెక్కులు ఉంది. ఎల్ఎండి పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిలువ 10.95 టిఎంసీలు ఉంది. మిడ్ మానేర్ కు ఇన్ ఫ్లో 613 క్యూసెక్కులు ఉండగా ఔట్ ప్లో 127 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 27.55 టిఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిలువ 20.15 టిఎంసీలు ఉంది. ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టుకు స్వల్పంగా వరద పెరిగింది. ఇన్ ఫ్లో 393 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 2 టిఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిలువ 1.95 టిఎంసీలు ఉంది. అటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు వరద క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 6 వేలకు పైగా క్యూసెక్కుల వరద ఎల్లంపల్లి కి వచ్చి చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి.2
- ఒక వెయ్యి ముగ్గురు సీనియర్ సిటిజన్ మహిళలకు చీరలను పంపిణీ చేయడం ద్వారా ఓం మౌజయః విశ్వ మహిళా సేవా సమితి పేరు వరల్డ్ రికార్డ్స్ ఇండియా బుక్ లో నమోదయింది. ఒక వెయ్యి ముగ్గురు సీనియర్ సిటిజన్ మహిళలకు చీరలను పంపిణీ చేయడం ద్వారా ఓం మౌజయః విశ్వ మహిళా సేవా సమితి పేరు వరల్డ్ రికార్డ్స్ ఇండియా బుక్ లో నమోదయింది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామ శివారులోని ఓం మౌజయః ఆశ్రమంలో శ్రావణ మాస ఏకాదశి సందర్భంగా వసుధైక కుటుంబ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. 13 వ వార్షికోత్సవం సందర్బంగా సహస్ర కుంకుమార్చన, సహస్ర కలశ అర్చన, సహస్త్ర దీపారాధన, శక్తిపీఠం మహామాత ర్యాలీ, శ్రీ ప్రభు పల్లకి, ఉచిత అన్నదానం లడ్డు ప్రసాదము వితరణ తదితర కార్యక్రమాలు కన్నుల పండగగా జరిగాయి. అంతేకాకుండా, 50 సంవత్సరాలు పైబడిన 1003 మంది మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంకు వరల్డ్ రికార్డ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. ఇంత పెద్ద ఎత్తున సీనియర్ సిటిజన్ మహిళలకు సేవాభావంతో చీరలను పంపిణీ చేయడం అనేది గొప్ప విషయమని కొనియాడారు. శ్రీ మాశ్రీ పరమో మహా గురూజీ ద్వారా స్థాపించబడిన సంస్థ ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండటం అభినందనీయమన్నారు. పెద్ద ఎత్తున మహిళలకు చీరలు పంపిణీ చేయడం ద్వారా విశ్వ మహిళా సేవా సమితి వారు రికార్డు నెలకొల్పారని, వారి పేరు తమ వరల్డ్ రికార్డ్స్ ఇండియా లో నమోదయినట్లు తెలుపుతూ సర్టిఫికెట్ ప్రధానం చేశారు. కరీంనగర్, సిరిసిల్ల వరంగల్ నిజామాబాద్ విజయవాడ వరంగల్ జిల్లాల నలు మూలల నుండి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.4