Shuru
Apke Nagar Ki App…
ఆటో స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పాన్ షాప్ తొలగించాలి బెల్లంపల్లి కాంట చౌరస్తాలో కాంట చౌరస్తా వద్ద ఆటో స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పాన్ షాప్ తొలగించాలని ఆటో యూనియన్ అధ్యక్షులు కట్ల రాంకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం మాట్లాడుతూ ఆటో స్టాండ్ ఏర్పాటు చేయుట నిమిత్తంలో వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు చూపించిన స్థలంలో ఆటోలు నిలుపుకుంటున్నామని ఈ క్రమంలో అదే స్థలంలో కాంట రాత్రికి రాత్రే అక్రమంగా పాన్ షాప్ ఏర్పాటు చేశారన్నారు. దింతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయించి ఆటో స్టాండ్ ఏర్పాటు చేయించాలని కోరారు
Bellampalli news
ఆటో స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పాన్ షాప్ తొలగించాలి బెల్లంపల్లి కాంట చౌరస్తాలో కాంట చౌరస్తా వద్ద ఆటో స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పాన్ షాప్ తొలగించాలని ఆటో యూనియన్ అధ్యక్షులు కట్ల రాంకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం మాట్లాడుతూ ఆటో స్టాండ్ ఏర్పాటు చేయుట నిమిత్తంలో వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు చూపించిన స్థలంలో ఆటోలు నిలుపుకుంటున్నామని ఈ క్రమంలో అదే స్థలంలో కాంట రాత్రికి రాత్రే అక్రమంగా పాన్ షాప్ ఏర్పాటు చేశారన్నారు. దింతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయించి ఆటో స్టాండ్ ఏర్పాటు చేయించాలని కోరారు
More news from Telangana and nearby areas
- ఆధ్యాత్మిక సదస్సుకు దారుస్సలాం తరలివెళ్లిన ఎంఐఎం శ్రేణులు.. జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించిన ఎంఐఎం అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్.. ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ దారుసలాంలో నిర్వహించ తలపెట్టిన జల్సా రహమతుల్-లీల్-ఆలమీన్ ఆధ్యాత్మిక బహిరంగ సభకు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు ఆదివారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి వందలాదిగా ఎంఐఎం శ్రేణులు, పార్టీ కరీంనగర్ సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో మంగళవారం తరలివెళ్లారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ .. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి 100 వాహనాలలో 500 మంది, కరీంనగర్ పట్టణం నుంచి 35 డివిజన్లలో ప్రతి డివిజన్ నుంచి 4కార్ల చొప్పున 125 వాహనాలలో దాదాపు 500 మంది ఎంఐఎం పార్టీ నాయకులు, డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, క్రియాశీలక కార్యకర్తలు హైదరాబాద్ తరలివెళ్లినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా భారీ ఎత్తున క్రియాశీలక కార్యకర్తలను కూడగట్టి ఎక్కువ సంఖ్యలో వెళ్లినట్లు చెప్పారు. ర్యాలీకి ముందు హాఫిజ్ అస్గర్ అలీ దువా ప్రార్థన చేశారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్లు సయ్యద్ ఇబ్రహీం, మాజిద్ హుస్సేన్, మాజీ కార్పొరేటర్ ఆరిఫ్ అహ్మద్, మాజీ కోఆప్షన్ సభ్యులు అహ్మద్ మొహియుద్దీన్ బాబుజానీ, నాయకులు ఫసియుద్దీన్ ఖాలీద్, ఎంఏ సలీమ్, అబ్దుల్ గఫ్ఫార్, ఖాజా మజారోద్దీన్, వాజిద్ అలీఖాన్, మేరాజ్, అబ్దుల్లా ఖాన్, ఆమెర్, హాఫిజ్ అబ్దుల్ జబ్బార్, యునూస్, యాసర్, అల్మాస్, ఇమ్రాన్, జాకీర్, బాబా ఖాలీద్ తదితరులున్నారు.3
- జన్నారంలో ముందస్తు రక్షాబంధన్, రాఖీలు కట్టిన అక్క చెల్లెళ్లు జన్నారం మండల కేంద్రంలో హనుమాన్ భక్త బృందం సభ్యులు ముందస్తు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రావణమాసం మంగళవారం సందర్భంగా వారు జన్నారం పట్టణంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం హనుమాన్ భక్త బృందం సభ్యులు, భక్తులు ముందస్తు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమ సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సోదరులకు స్వీట్లను తినిపించి పండుగను ఘనంగా నిర్వహించారు.1
- ఉనికి కోసమే బిజేపి ఫీజు లడాయి చేస్తుంది...బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది- మంత్రి పొన్నం ప్రభాకర్ ఫీజులు, స్కాలర్ షిప్ లు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంటే బిజెపి తన ఉనికిని చాటు కోవడానికి లడాయి పేరుతో ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన పల్లెపల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెలో ప్రజా పాలన ఏడో రోజు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట, పెరుకపల్లి, గొల్లగూడెం, ఆకునూరు, వెంకటేశ్వర్ల పల్లి ఘనపూర్ గ్రామాల్లో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వనమహోత్సవంలో మొక్కలు నాటారు. గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షించడంతో పాటు ప్రజల నుంచి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా, గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి అనే అంశాలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకుని పరిష్కరించడానికే పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రామస్థులకు సూచించారు. మొక్క నాటడం సులభం కానీ, దానిని పెంచి పెద్ద చెట్టుగా మార్చడం మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు జీవితంలో కనీసం ఒక మొక్క నాటి, కుటుంబ సభ్యుడిలా భావించి సంరక్షించాలని సూచించారు. నవంబర్ 14లోపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ అధికారులను మంత్రి సూచించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించి జీరో డెత్ లక్ష్యాన్ని సాధించడమే తమ లక్ష్యమన్నారు. ప్రజల వద్దకే ప్రజాపాలనను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పల్లెపల్లెలో ప్రజాపాలన నిర్వహిస్తున్నామని ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం అధికారులు, ప్రజాప్రతినిధుల కర్తవ్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమ రెండు కలల ముందుకు తీసుకు వెళ్తుంటే బిజెపి తమ ఉనికిని చాటుకోవడానికి ఆందోళన చేయడం అర్ధరహితమన్నారు.1
- ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నేత్రదానం చేయండి.. మరొకరికి చూపు ఇవ్వండి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ నేత్రదానం ద్వారా చూపును కోల్పోయిన వారికి కొత్త జీవితాన్ని అందించవచ్చని, ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అన్నారు. జాతీయ అంధత్వం, దృష్టిలోపాల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహిస్తున్న 41వ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా మంగళవారం సిరిసిల్ల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి గాంధీ చౌక్ వరకు నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక వ్యక్తి మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా సాధారణంగా ఇద్దరు చూపు కోల్పోయిన వ్యక్తులకు చూపు పునరుద్ధరణకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. “ఒకరి జీవితం ముగిసిన చోట.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు ప్రారంభమయ్యేలా నేత్రదానం దోహదపడుతుంది” అని అన్నారు. వ్యక్తి మరణించిన అనంతరం సాధ్యమైనంత త్వరగా, సాధారణంగా 6 నుంచి 8 గంటలలోపు నేత్ర కణజాలాన్ని సేకరించే అవకాశం ఉంటుందని తెలిపారు. నేత్రదానం వల్ల మృతదేహం రూపంలో ఎలాంటి మార్పు ఉండదని, వైద్య నిపుణులు అవసరమైన నేత్ర కణజాలాన్ని గౌరవప్రదంగా సేకరిస్తారని స్పష్టం చేశారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. మరణానంతరం నేత్రదానానికి కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరారు. రక్తపోటు, క్షయవ్యాధి, ఉబ్బసం ఉన్నవారు, కళ్లద్దాలు ఉపయోగించేవారు, కంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారు కూడా కొన్ని సందర్భాల్లో నేత్రదానం చేయవచ్చని తెలిపారు. అయితే నేత్రదానానికి అర్హతను వైద్య నిపుణులు నిర్ధారిస్తారని పేర్కొన్నారు. నేత్రదానం ప్రతి కుటుంబ ఆచారంగా మారాలని, నేత్రదానం కేవలం దానం మాత్రమే కాదని, మరణానంతరం కూడా మానవత్వాన్ని కొనసాగించే గొప్ప సేవ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తేజస్విని, జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమ అధికారి డాక్టర్ నయం జహా, నేత్ర వైద్య సహాయకులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.2
- వేములవాడ రాజన్న ఆలయం సంబంధించిన కోడెలు మృతి చెందుతున్నాయి దానిపై విచారణ జరిపించాలన్న ప్రతాప రామకృష్ణ రాజన్న ఆలయానికి సంబంధించిన కోడెలు చనిపోతున్నాయి దానిపైన విచారణ జరిపించాలని ప్రతాప రామకృష్ణ కోరారు ఎందుకు చనిపోతున్నాయి ఎలా చనిపోతున్నాయి అని టెంపుల్ వారిని అడిగారు దానిపై కచ్చితంగా విచారణ జరిపించాలని ఆలయాన్ని కోరారు వేములవాడ వచ్చే ప్రతి భక్తులు కోడెలను దేవునిగా కొలుస్తూ కోడలు కడతారు దీనిపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలని కోరుతున్నారు1
- ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతుల అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్, అలాగే కూరగాయలు, పూల తోటల సాగు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతుల అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్, అలాగే కూరగాయలు, పూల తోటల సాగు చేస్తున్నారు. కాలానికి అనుగుణంగా పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక దృష్టి.. పక్కా కార్యాచరణ సత్పలితాలు ఇస్తున్నాయి. ప్రతి వారం జిల్లా కలెక్టర్ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్న రైతులను నేరుగా కలిసి సాగు విధానాలు, పంట దిగుబడి, ఆదాయం తదితర వివరాలు సేకరిస్తూ.. ప్రభుత్వ సబ్సిడీలు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రణాళిక ప్రకారం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతు వేదికలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించారు. ఆయిల్ పామ్, కూరగాయలు, పూల మొక్కల సాగుతో లాభాలను వివరిస్తూ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు, యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ.. కరపత్రాలు రైతులకు పంచి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఉద్యానవన, వ్యవసాయ శాఖ, సహకార శాఖ అధికారులతో నిర్వహించారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 420 ఎకరాల్లో రైతులు వరి సాగు నుంచి ఆయిల్ పామ్ సాగులోకి మారారు. 1250 ఎకరాల్లో కూరగాయల సాగు ఎల్ నినో ప్రభావం, ఇబ్బందులు అధిగమించేందుకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి ఆదాయం పొందాలనే ఉద్దేశం జిల్లాలోని రైతులు దాదాపు 1250 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు, 35 ఎకరాల్లో వివిధ రకాల పూల మొక్కలు సాగు చేస్తున్నారు. ఆయా పంటల సాగుతో రైతులకు నిరంతర ఆదాయం సమకూరుతున్నది.సంప్రదాయ వరిసాగుకు స్వస్తి పలికి 25 నుంచి ముప్పై ఏండ్ల పాటు ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్ తోటల సాగు వైపు రైతులు మారారు. ఈ సీజన్లో జిల్లాలో ఇప్పటివరకు 162 మంది రైతులు 420 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. మొదటి మూడు ఏండ్లపాటు అంతర పంటలు సాగు చేసి ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం ఆయిల్ పామ్ ఒక టన్నుకు రూ. 23 వేలపైగా ధర ఉంది. జిల్లాలో సంప్రదాయ వరి సాగుకు స్వస్తి పలుకుతూ.. మిగితా పంటలు సాగు చేస్తున్న ఆదర్శ రైతులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి మంగళవారం క్షేత్రస్థాయిలో కలిసి .. సాగు విధానాలు, దిగుబడి, లాభాలు తదితర అంశాలు తెలుసుకొని.. అభినందిస్తున్నారు. రెండు ఎకరాల్లో బంతి పూల సాగు గంభీరావుపేట మండలం గజ సింగవరంలో రైతు బోయిని మల్లేశం తనకు ఉన్న మూడున్నర ఎకరాల నుంచి రెండు ఎకరాలలో జూలైలో బంతి పూల సాగు చేపట్టారు. ఈ పంట నాటిన 60-65 రోజుల నుంచి సెప్టెంబర్ నుండి ప్రారంభమై డిసెంబర్ వరకు కొనసాగుతుంది. ప్రతి 2-3 రోజుల వ్యవధిలో పూల కోత చేయవచ్చు, ఇది 60-75 రోజుల పాటు కొనసాగుతుంది. ఎకరానికి సుమారు 45-50 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. రెండు ఎకరాల సాగుకు గాను రైతు రూ. 50 వేల నుంచి రూ. 60వేల వరకు ఖర్చు చేశారు. ఇందులో ఉద్యాన శాఖ ద్వారా విత్తనాలు, ఎరువులకు కలిపి 50% రాయితీ లేదా ఎకరానికి రూ. 8వేల చొప్పున గరిష్టంగా ఐదు ఎకరాల వరకు రాయితీ అందనుంది. రైతుకు సగటున ఒక్కో కిలో బంతి పూలకు రూ. 60/- ధర లభిస్తుంది. దసరా, దీపావళి, శుభకార్యాలు, అయ్యప్ప పూజా కార్యక్రమాలతో ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే ఉంది. జిల్లా కలెక్టర్ అభినందన గజ సింగవరంలో రైతు బోయిని మల్లేశం వరి సాగును వదిలి బంతి పూల సాగు చేస్తుండగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? పంట ఎన్ని రోజుల్లో చేతికి వస్తుంది? ఎంత ఆదాయం వస్తుంది? అనే వివరాలను రైతు మల్లేశంను అడిగి తెలుసుకున్నారు. అతడిని శాలువాతో సన్మానించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వరి పంటకు ప్రత్యామ్నాయంగా బంతి పూల సాగు చేయడం అభినందనీయమని కొనియాడారు. మిగితా రైతులు ఆదర్శంగా తీసుకొని తమకు ఉన్న భూమిలో ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేసి ఆదాయం పొందాలని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. ఉద్యానవన శాఖ, ఇతర శాఖల నుంచి వచ్చే ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. పరిశీలనలో సర్పంచ్ ఉమ్మారెడ్డి విమల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.1
- ఆలయ పౌండేషన్ ఆధ్వర్యంలో 45 మందికి ఉచిత కేటరాక్ట్ శస్త్రచికిత్స : IAS నరహరి బసంత్‌నగర్, ఆగస్టు 25: పేద, నిరుపేదలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పరికిపండ్ల నరహరి, ఐఏఎస్ సహకారంతో, ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర విజన్ సెంటర్, బసంత్‌నగర్ నుంచి 45 మందికి ఉచిత కేటరాక్ట్ శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌లోని శంకర ఐ హాస్పిటల్‌కు తరలించారు. ఈ సందర్భంగా శ్రీ పరికిపండ్ల నరహరి, ఐఏఎస్ స్వయంగా వారితో మాట్లాడి, వారికి ధైర్యం కల్పిస్తూ, శంకర ఐ హాస్పిటల్‌లో నాణ్యమైన వైద్య చికిత్స పొందిన అనంతరం సురక్షితంగా తిరిగి రావాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కంటి శస్త్రచికిత్స చేయించుకోలేని పేదలకు ఉచితంగా వైద్యం అందించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తు, పేదల కంటి ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని శంకర విజన్ సెంటర్ ఇన్‌చార్జ్ పరికిపండ్ల రామ్ తెలిపారు.1
- ప్రభుత్వం తన హామీలను నెరవేర్చకపోతే విద్యార్థులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.కసిరెడ్డి మణికంఠ రెడ్డి, AISF రాష్ట్ర అధ్యక్షుడు హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైతున్నా, విద్యార్థులకు ఇచ్చిన హామీలను (స్కూటీలు, లాప్‌టాప్‌లు, విద్యా భరోసా కార్డ్, ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు) అమలు చేయడంలో విఫలమైందని AISF రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి విమర్శించారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, మేము అధికారంలో రాగానే ఐదవ గ్యారెంటీ పేరు మీద యువవికాసం పేరిట విద్యార్థులకు ఇచ్చిన హామీని అమలు చేస్తాం అన్నాడు. ఇయ్యాల అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు కావస్తా ఉంది. 34 రోజులు కావస్తా ఉంది విద్యార్థులకు ఇస్తామన్న స్కూటీలు ఎందుకు ఇవ్వలేదు? విద్యార్థులకు ఇస్తామన్న లాప్‌టాప్‌లు ఎందుకు ఇవ్వలేదు? విద్యార్థులు ఉన్నత విద్య చదువుకోవడానికి 5 లక్షల విద్యా భరోసా కార్డ్ ఎందుకు ఇవ్వలేదు? ఒకటేసారి రీఎంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేస్తామన్న రేవంత్ రెడ్డి 34 కాలంలో ఫీజు బకాయిలు విడుదల చేయకుండా.. ఇయ్యాల రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలను విస్మరించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నీరుగారిస్తా ఉంది. ఇయ్యాల రీఎంబర్స్‌మెంట్ రాక రాష్ట్రంలో విద్యార్థుల పర్సులు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. మేనేజ్‌మెంట్ల ఫీజులు కట్టి.. ఇయ్యాల విద్యార్థులకు స్కూటీలు ఇవ్వకపోతే, విద్యార్థులకు లాప్‌టాప్‌లు ఇవ్వకపోతే.. ఇయ్యాల రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తన భుజాన విద్యారంగం పెట్టుకొని ఇయ్యాల విద్యాశాఖను పూర్తిగా భ్రష్టుపట్టిస్తా ఉన్నాడు. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి విద్యాశాఖకు కొత్త వాళ్ళనైనా ఇవ్వాలి.. లేకపోతే విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు కూడా AISF ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం. ఇయ్యాల అందాల పోటీలకు ఉన్న నిధులు, ఫుట్‌బాల్ పోటీలకు ఉన్న నిధులు, హెలికాప్టర్ తిరగడానికి ఉన్న నిధులు.. ఇయ్యాల విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలుకు ఎందుకు లేవు అని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇయ్యాల మనవడు అట కోసం మెస్సీని తీసుకొచ్చినమని.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సంక్షేమం కోసం లాప్‌టాప్‌లు, స్కూటీలు ఇవ్వకపోతే.. రానున్న రోజుల్లో విద్యార్థులందరినీ ఏకం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు3
- కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ వినూత్న నిరసన...రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మితే జేబులు ఖాళీ అయ్యాయని ఖాళీపర్సులు ప్రదర్శించిన విద్యార్థులు... విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిక విద్యారంగ సమస్యలపై కరీంనగర్ లో స్టూడెంట్స్ ఆందోళన ఉదృతం అవుతుంది. విద్యార్థులతో పాటు రాజకీయ పార్టీలు సైతం రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడింది. ఫీజు రియంబర్స్మెంట్ పై బిజెపి లడాయి పేరుతో దీక్షలు చేపట్టగా పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావంగా బిఆర్ఎస్ నిరసన ఆందోళన కొనసాగిస్తుంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి విద్యార్థులకు స్క్రూటిలు, లాఫ్ టాప్ లు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే జేబులు ఖాళీ అయ్యాయని ఖాళీపరుసులు, స్క్రూటీలు లాప్టాప్ ప్రదర్శిస్తు తెలంగాణ చౌక్ లో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకొని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిచో మంత్రుల ఇళ్ళతో పాటు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అసెంబ్లీని సైతం ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి హెచ్చరించారు.2