logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ వినూత్న నిరసన...రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మితే జేబులు ఖాళీ అయ్యాయని ఖాళీపర్సులు ప్రదర్శించిన విద్యార్థులు... విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిక విద్యారంగ సమస్యలపై కరీంనగర్ లో స్టూడెంట్స్ ఆందోళన ఉదృతం అవుతుంది. విద్యార్థులతో పాటు రాజకీయ పార్టీలు సైతం రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడింది. ఫీజు రియంబర్స్మెంట్ పై బిజెపి లడాయి పేరుతో దీక్షలు చేపట్టగా పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావంగా బిఆర్ఎస్ నిరసన ఆందోళన కొనసాగిస్తుంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి విద్యార్థులకు స్క్రూటిలు, లాఫ్ టాప్ లు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే జేబులు ఖాళీ అయ్యాయని ఖాళీపరుసులు, స్క్రూటీలు లాప్టాప్ ప్రదర్శిస్తు తెలంగాణ చౌక్ లో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకొని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిచో మంత్రుల ఇళ్ళతో పాటు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అసెంబ్లీని సైతం ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి హెచ్చరించారు.

4 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
4 hrs ago

కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ వినూత్న నిరసన...రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మితే జేబులు ఖాళీ అయ్యాయని ఖాళీపర్సులు ప్రదర్శించిన విద్యార్థులు... విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిక విద్యారంగ సమస్యలపై కరీంనగర్ లో స్టూడెంట్స్ ఆందోళన ఉదృతం అవుతుంది. విద్యార్థులతో పాటు రాజకీయ పార్టీలు సైతం రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడింది. ఫీజు రియంబర్స్మెంట్ పై బిజెపి లడాయి పేరుతో దీక్షలు చేపట్టగా పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావంగా బిఆర్ఎస్ నిరసన ఆందోళన కొనసాగిస్తుంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి

విద్యార్థులకు స్క్రూటిలు, లాఫ్ టాప్ లు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే జేబులు ఖాళీ అయ్యాయని ఖాళీపరుసులు, స్క్రూటీలు లాప్టాప్ ప్రదర్శిస్తు తెలంగాణ చౌక్ లో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకొని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిచో మంత్రుల ఇళ్ళతో పాటు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అసెంబ్లీని సైతం ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి హెచ్చరించారు.

More news from తెలంగాణ and nearby areas
  • యూపీఐ లావాదేవీలకు పదేళ్ళు ...టీ తాగి యుపిఐ పేమెంట్ చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ దేశంలో యూపీఐ లావాదేవీలు ప్రారంభమై పదేళ్ళు అయింది. యూపిఐ పేమెంట్లకు దశాబ్దం పూర్తికావడంతో కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వేడుకలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు కార్పొరేటర్ ప్రవీణ్ రావుతో పాటు పలువురు బిజెపి నాయకులతో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ టీ తాగి యూపీఐ పేమెంట్ చేశారు. నగదు రహిత లావాదేవీలతో దేశం పురోగతి సాధిస్తుందని తెలిపారు.
    1
    యూపీఐ లావాదేవీలకు పదేళ్ళు ...టీ తాగి యుపిఐ పేమెంట్ చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ 
దేశంలో యూపీఐ లావాదేవీలు ప్రారంభమై పదేళ్ళు అయింది. 
యూపిఐ పేమెంట్లకు దశాబ్దం పూర్తికావడంతో కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వేడుకలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు కార్పొరేటర్ ప్రవీణ్ రావుతో పాటు పలువురు బిజెపి నాయకులతో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ టీ తాగి యూపీఐ పేమెంట్ చేశారు. నగదు రహిత లావాదేవీలతో దేశం పురోగతి సాధిస్తుందని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    31 min ago
  • కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన బెజ్జంకి మండలం నేతలు బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం సిద్దిపేట జిల్లాకు విచ్చేసిన సందర్భంగా దేవక్కపల్లి స్టేజి వద్ద బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండల బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కరివేద మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య పరిష్కారం కోసం హైదరాబాద్ నగర నడిబొడ్డున జరిగే పోరాటానికి బీజేపీ శ్రేణులతో కలిసి తరలివెళ్తున్నామని ప్రకటించారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆడిచర్ల రాజు, బీజేవైఎం నాయకులు సంఘ నరేష్, విమల్ కుమార్, గుంజేటి శివకుమార్, రావుల రాజిరెడ్డి, బెజ్జంకి మండల బీజేపీ ఉపాధ్యక్షులు గైని రాజుతో పాటు బెజ్జంకి మండల ముఖ్య నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థుల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
    1
    కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన బెజ్జంకి మండలం నేతలు
బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం  సిద్దిపేట జిల్లాకు విచ్చేసిన సందర్భంగా దేవక్కపల్లి స్టేజి వద్ద బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండల బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా కరివేద మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య పరిష్కారం కోసం హైదరాబాద్ నగర నడిబొడ్డున జరిగే పోరాటానికి బీజేపీ శ్రేణులతో కలిసి తరలివెళ్తున్నామని ప్రకటించారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆడిచర్ల రాజు, బీజేవైఎం నాయకులు సంఘ నరేష్, విమల్ కుమార్, గుంజేటి శివకుమార్, రావుల రాజిరెడ్డి, బెజ్జంకి మండల బీజేపీ ఉపాధ్యక్షులు గైని రాజుతో పాటు బెజ్జంకి మండల ముఖ్య నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
విద్యార్థుల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    3 hrs ago
  • హుస్నాబాద్ 20వ వార్డులో పందుల బెడద................... ......... హుస్నాబాద్ పట్టణంలోని 20వ వార్డులో పందుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీధుల్లో పెద్ద సంఖ్యలో పందులు సంచరిస్తుండటంతో పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందుల కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురైతే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పందుల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    హుస్నాబాద్ 20వ వార్డులో పందుల బెడద...................  .........
హుస్నాబాద్ పట్టణంలోని 20వ వార్డులో పందుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీధుల్లో పెద్ద సంఖ్యలో పందులు సంచరిస్తుండటంతో పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందుల కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురైతే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పందుల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    Farmer హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    9 hrs ago
  • 34 నెలల పాలనలో విద్యార్థుల హామీల అమలేది రేవంత్ రెడ్డి? స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, ఫీజు బకాయిలు ఎప్పుడిస్తారు? విద్యార్థుల హామీలు అమలు చేయకపోతే ఉద్యమం ఉధృతం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి స్కూటీలు, ల్యాప్‌టాప్‌లతో ఖాళీ పర్సులు ప్రదర్శిస్తూ ఏఐఎస్ఎఫ్ విన్నూత నిరసన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్‌టాప్‌లను, 5లక్షల విద్య భరోసా కార్డును, పెండింగ్ ఫీజు బకాయిలను అధికారంలోకి వచ్చి 34 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని, సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని విద్యార్థుల హామీల అమలు చేయకుండా విద్యార్థులకు ఓట్లు లేవని చిన్నచూపు చూస్తున్నాడని, రాష్ట్రంలో విద్యార్థులు సమస్యల కోసం ప్రతి రోజు రోడ్డు ఎక్కుతున్నారని,సీఎం వద్ద విద్యాశాఖ ఉంది కమిషన్ల కోసమేనని, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం తప్పదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్కూటీలు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఖాళీ పర్సులను ప్రదర్శిస్తూ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ,స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోతే విద్యార్థులు వారి తల్లితండ్రులు జేబులోంచి సర్టిఫికెట్ల కోసం కళాశాలకు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని దీంతో పర్సులు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్‌టాప్‌లను ,యువవికాసం పేరుతో 5లక్షల విద్యా భరోసా కార్డు ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని , ఒక్కొక్క హామీ అమలు చేస్తున్నాం ఇది ప్రజాపాలనని చెబుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల హామీలను అమలుచేయకాపోవడానికి కారణం ఎందని? విద్యార్థుల హామీల అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఓట్లతో ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకుండా విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని బడ్జెట్ లో 15%నిధులు ఇవ్వాలని , ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా వాటిని అమలు చేసి విద్యార్థుల పట్ల తమ చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి నిరూపించుకోవాలని, రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని విద్యా శాఖకు న్యాయం చేయకుంటే విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియమించాలని, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని లేనిపక్షంలో ఢిల్లీ తరహా ఉద్యమాన్ని తెలంగాణ గల్లీలలో విద్యార్థులను ఏకం చేసి ఉద్యమిస్తామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నూనావత్ శ్రీనివాస్ నాయక్, గర్ల్స్ వింగ్ నాయకురాలు జోష్ణ,నగర నాయకులు సందీప్ రెడ్డి, బోయినీ విష్ణు, అరవింద్,సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు
    1
    34 నెలల పాలనలో విద్యార్థుల హామీల అమలేది రేవంత్ రెడ్డి?

స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, ఫీజు బకాయిలు ఎప్పుడిస్తారు?

విద్యార్థుల హామీలు అమలు చేయకపోతే ఉద్యమం ఉధృతం

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి

స్కూటీలు, ల్యాప్‌టాప్‌లతో ఖాళీ పర్సులు ప్రదర్శిస్తూ ఏఐఎస్ఎఫ్ విన్నూత నిరసన

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్‌టాప్‌లను, 5లక్షల విద్య భరోసా కార్డును, పెండింగ్ ఫీజు బకాయిలను  అధికారంలోకి వచ్చి 34 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని, సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద  విద్యాశాఖ పెట్టుకొని విద్యార్థుల హామీల అమలు చేయకుండా  విద్యార్థులకు ఓట్లు లేవని చిన్నచూపు చూస్తున్నాడని, రాష్ట్రంలో విద్యార్థులు సమస్యల కోసం ప్రతి రోజు రోడ్డు ఎక్కుతున్నారని,సీఎం వద్ద విద్యాశాఖ ఉంది కమిషన్ల కోసమేనని, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం తప్పదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
కసిరెడ్డి మణికంఠ రెడ్డి హెచ్చరించారు
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని  నిరసిస్తూ మంగళవారం కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్కూటీలు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఖాళీ పర్సులను ప్రదర్శిస్తూ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి  మాట్లాడుతూ  ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ,స్కాలర్షిప్ బకాయిలు  విడుదల చేయకపోతే విద్యార్థులు వారి తల్లితండ్రులు  జేబులోంచి సర్టిఫికెట్ల కోసం కళాశాలకు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి  వచ్చిందని దీంతో పర్సులు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్‌టాప్‌లను
,యువవికాసం  పేరుతో 5లక్షల విద్యా భరోసా కార్డు ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని , ఒక్కొక్క హామీ అమలు చేస్తున్నాం ఇది ప్రజాపాలనని చెబుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల హామీలను అమలుచేయకాపోవడానికి కారణం ఎందని? విద్యార్థుల హామీల అమలు చేయకుండా  ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఓట్లతో ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని,
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకుండా విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని బడ్జెట్ లో 15%నిధులు ఇవ్వాలని ,
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా వాటిని అమలు చేసి విద్యార్థుల పట్ల తమ చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి నిరూపించుకోవాలని, రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని విద్యా శాఖకు న్యాయం చేయకుంటే విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియమించాలని, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని లేనిపక్షంలో  ఢిల్లీ తరహా ఉద్యమాన్ని తెలంగాణ గల్లీలలో విద్యార్థులను ఏకం చేసి ఉద్యమిస్తామని మణికంఠ రెడ్డి  హెచ్చరించారు
కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్,
నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నూనావత్ శ్రీనివాస్ నాయక్, గర్ల్స్ వింగ్ నాయకురాలు జోష్ణ,నగర నాయకులు సందీప్ రెడ్డి, బోయినీ విష్ణు,
అరవింద్,సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    52 min ago
  • వన మహోత్సవంలో భాగస్వాములు కావాలి: సీఐ రామచందర్ రావు... పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కరీంనగర్ వన్ టౌన్ సీఐ రామచందర్ రావు పిలుపునిచ్చారు. కరీంనగర్ 1వ పట్టణ పోలీస్ శాఖ, 'ఫ్రెండ్లీ వాకర్స్' సంయుక్త ఆధ్వర్యంలో GP గ్రౌండ్‌లో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీఐ రామచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంచడం ద్వారానే భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్లీ వాకర్స్ సభ్యులు, స్థానిక పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    3
    వన మహోత్సవంలో భాగస్వాములు కావాలి: సీఐ రామచందర్ రావు... 
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కరీంనగర్ వన్ టౌన్ సీఐ రామచందర్ రావు పిలుపునిచ్చారు. కరీంనగర్ 1వ పట్టణ పోలీస్ శాఖ, 'ఫ్రెండ్లీ వాకర్స్' సంయుక్త ఆధ్వర్యంలో GP గ్రౌండ్‌లో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీఐ రామచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంచడం ద్వారానే భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్లీ వాకర్స్ సభ్యులు, స్థానిక పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • గొల్లకురుమల జీవనాధారాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో చెట్ల నరికి పంచరాయి భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ చేస్తున్న గ్రామ గొల్ల కురుమలు. గొల్లకురుమల జీవనాధారమైన గొర్రెలు, మేకలకు మేత అందించే భూములతో పాటు గ్రామంలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని సముద్రాల గ్రామానికి చెందిన గొల్లకురుమలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని గడ్డిబోడు, ఈదులబోడు, దేవునిబోడు, దొంగలబోడు తదితర ప్రాంతాల్లోని పంచరాయి భూముల్లో చెట్లను అక్రమంగా నరికివేస్తూ, మొరం తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. రైతులు కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామిలు విలేకరులతో మాట్లాడుతూ.... గ్రామంలోని సర్వే నంబర్లు 189, 212 పరిధిలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రకృతి వనరులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకలకు మేత అందించే భూములే ధ్వంసమైతే తమ జీవనోపాధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు.
    1
    గొల్లకురుమల జీవనాధారాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్
జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో చెట్ల నరికి పంచరాయి భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ చేస్తున్న గ్రామ గొల్ల కురుమలు.
గొల్లకురుమల జీవనాధారమైన గొర్రెలు, మేకలకు మేత అందించే భూములతో పాటు గ్రామంలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని సముద్రాల గ్రామానికి చెందిన గొల్లకురుమలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని గడ్డిబోడు, ఈదులబోడు, దేవునిబోడు, దొంగలబోడు తదితర ప్రాంతాల్లోని పంచరాయి భూముల్లో చెట్లను అక్రమంగా నరికివేస్తూ, మొరం తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు.
రైతులు కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామిలు విలేకరులతో మాట్లాడుతూ.... గ్రామంలోని సర్వే నంబర్లు 189, 212 పరిధిలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రకృతి వనరులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకలకు మేత అందించే భూములే ధ్వంసమైతే తమ జీవనోపాధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు.
    user_Kumar Pasunuri
    Kumar Pasunuri
    Local News Reporter Ghanpur (Station), Jangoan•
    26 min ago
  • ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతుల అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్, అలాగే కూరగాయలు, పూల తోటల సాగు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతుల అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్, అలాగే కూరగాయలు, పూల తోటల సాగు చేస్తున్నారు. కాలానికి అనుగుణంగా పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక దృష్టి.. పక్కా కార్యాచరణ సత్పలితాలు ఇస్తున్నాయి. ప్రతి వారం జిల్లా కలెక్టర్ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్న రైతులను నేరుగా కలిసి సాగు విధానాలు, పంట దిగుబడి, ఆదాయం తదితర వివరాలు సేకరిస్తూ.. ప్రభుత్వ సబ్సిడీలు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రణాళిక ప్రకారం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతు వేదికలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించారు. ఆయిల్ పామ్, కూరగాయలు, పూల మొక్కల సాగుతో లాభాలను వివరిస్తూ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు, యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ.. కరపత్రాలు రైతులకు పంచి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఉద్యానవన, వ్యవసాయ శాఖ, సహకార శాఖ అధికారులతో నిర్వహించారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 420 ఎకరాల్లో రైతులు వరి సాగు నుంచి ఆయిల్ పామ్ సాగులోకి మారారు. 1250 ఎకరాల్లో కూరగాయల సాగు ఎల్ నినో ప్రభావం, ఇబ్బందులు అధిగమించేందుకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి ఆదాయం పొందాలనే ఉద్దేశం జిల్లాలోని రైతులు దాదాపు 1250 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు, 35 ఎకరాల్లో వివిధ రకాల పూల మొక్కలు సాగు చేస్తున్నారు. ఆయా పంటల సాగుతో రైతులకు నిరంతర ఆదాయం సమకూరుతున్నది.సంప్రదాయ వరిసాగుకు స్వస్తి పలికి 25 నుంచి ముప్పై ఏండ్ల పాటు ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్ తోటల సాగు వైపు రైతులు మారారు. ఈ సీజన్లో జిల్లాలో ఇప్పటివరకు 162 మంది రైతులు 420 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. మొదటి మూడు ఏండ్లపాటు అంతర పంటలు సాగు చేసి ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం ఆయిల్ పామ్ ఒక టన్నుకు రూ. 23 వేలపైగా ధర ఉంది. జిల్లాలో సంప్రదాయ వరి సాగుకు స్వస్తి పలుకుతూ.. మిగితా పంటలు సాగు చేస్తున్న ఆదర్శ రైతులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి మంగళవారం క్షేత్రస్థాయిలో కలిసి .. సాగు విధానాలు, దిగుబడి, లాభాలు తదితర అంశాలు తెలుసుకొని.. అభినందిస్తున్నారు. రెండు ఎకరాల్లో బంతి పూల సాగు గంభీరావుపేట మండలం గజ సింగవరంలో రైతు బోయిని మల్లేశం తనకు ఉన్న మూడున్నర ఎకరాల నుంచి రెండు ఎకరాలలో జూలైలో బంతి పూల సాగు చేపట్టారు. ఈ పంట నాటిన 60-65 రోజుల నుంచి సెప్టెంబర్ నుండి ప్రారంభమై డిసెంబర్ వరకు కొనసాగుతుంది. ప్రతి 2-3 రోజుల వ్యవధిలో పూల కోత చేయవచ్చు, ఇది 60-75 రోజుల పాటు కొనసాగుతుంది. ఎకరానికి సుమారు 45-50 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. రెండు ఎకరాల సాగుకు గాను రైతు రూ. 50 వేల నుంచి రూ. 60వేల వరకు ఖర్చు చేశారు. ఇందులో ఉద్యాన శాఖ ద్వారా విత్తనాలు, ఎరువులకు కలిపి 50% రాయితీ లేదా ఎకరానికి రూ. 8వేల చొప్పున గరిష్టంగా ఐదు ఎకరాల వరకు రాయితీ అందనుంది. రైతుకు సగటున ఒక్కో కిలో బంతి పూలకు రూ. 60/- ధర లభిస్తుంది. దసరా, దీపావళి, శుభకార్యాలు, అయ్యప్ప పూజా కార్యక్రమాలతో ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే ఉంది. జిల్లా కలెక్టర్ అభినందన గజ సింగవరంలో రైతు బోయిని మల్లేశం వరి సాగును వదిలి బంతి పూల సాగు చేస్తుండగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? పంట ఎన్ని రోజుల్లో చేతికి వస్తుంది? ఎంత ఆదాయం వస్తుంది? అనే వివరాలను రైతు మల్లేశంను అడిగి తెలుసుకున్నారు. అతడిని శాలువాతో సన్మానించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వరి పంటకు ప్రత్యామ్నాయంగా బంతి పూల సాగు చేయడం అభినందనీయమని కొనియాడారు. మిగితా రైతులు ఆదర్శంగా తీసుకొని తమకు ఉన్న భూమిలో ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేసి ఆదాయం పొందాలని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. ఉద్యానవన శాఖ, ఇతర శాఖల నుంచి వచ్చే ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. పరిశీలనలో సర్పంచ్ ఉమ్మారెడ్డి విమల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతుల అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్, అలాగే కూరగాయలు, పూల తోటల సాగు చేస్తున్నారు. 
ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతుల అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్, అలాగే కూరగాయలు, పూల తోటల సాగు చేస్తున్నారు. కాలానికి అనుగుణంగా పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక దృష్టి.. పక్కా కార్యాచరణ సత్పలితాలు ఇస్తున్నాయి. ప్రతి వారం జిల్లా కలెక్టర్ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్న రైతులను నేరుగా కలిసి సాగు విధానాలు, పంట దిగుబడి, ఆదాయం తదితర వివరాలు సేకరిస్తూ.. ప్రభుత్వ సబ్సిడీలు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నారు.
విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రణాళిక ప్రకారం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతు వేదికలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించారు. ఆయిల్ పామ్, కూరగాయలు, పూల మొక్కల సాగుతో లాభాలను వివరిస్తూ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు, యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ.. కరపత్రాలు రైతులకు పంచి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఉద్యానవన, వ్యవసాయ శాఖ, సహకార శాఖ అధికారులతో నిర్వహించారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 420 ఎకరాల్లో రైతులు వరి సాగు నుంచి ఆయిల్ పామ్ సాగులోకి మారారు.
1250 ఎకరాల్లో కూరగాయల సాగు
ఎల్ నినో ప్రభావం, ఇబ్బందులు అధిగమించేందుకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి ఆదాయం పొందాలనే ఉద్దేశం జిల్లాలోని రైతులు దాదాపు 1250 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు, 35 ఎకరాల్లో వివిధ రకాల పూల మొక్కలు సాగు చేస్తున్నారు. ఆయా పంటల సాగుతో రైతులకు నిరంతర ఆదాయం సమకూరుతున్నది.సంప్రదాయ వరిసాగుకు స్వస్తి పలికి 25 నుంచి ముప్పై ఏండ్ల పాటు ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్ తోటల సాగు వైపు రైతులు మారారు. ఈ సీజన్లో జిల్లాలో ఇప్పటివరకు 162 మంది రైతులు 420 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. మొదటి మూడు ఏండ్లపాటు అంతర పంటలు సాగు చేసి ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం ఆయిల్ పామ్ ఒక టన్నుకు రూ. 23 వేలపైగా ధర ఉంది. జిల్లాలో సంప్రదాయ వరి సాగుకు స్వస్తి పలుకుతూ.. మిగితా పంటలు సాగు చేస్తున్న ఆదర్శ రైతులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి మంగళవారం క్షేత్రస్థాయిలో కలిసి .. సాగు విధానాలు, దిగుబడి, లాభాలు తదితర అంశాలు తెలుసుకొని.. అభినందిస్తున్నారు.
రెండు ఎకరాల్లో బంతి పూల సాగు 
గంభీరావుపేట మండలం గజ సింగవరంలో రైతు బోయిని మల్లేశం తనకు ఉన్న మూడున్నర ఎకరాల నుంచి రెండు ఎకరాలలో జూలైలో బంతి పూల సాగు చేపట్టారు. ఈ పంట నాటిన 60-65 రోజుల నుంచి సెప్టెంబర్ నుండి ప్రారంభమై డిసెంబర్ వరకు కొనసాగుతుంది. ప్రతి 2-3 రోజుల వ్యవధిలో పూల కోత చేయవచ్చు, ఇది 60-75 రోజుల పాటు కొనసాగుతుంది. ఎకరానికి సుమారు 45-50 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. రెండు ఎకరాల సాగుకు గాను రైతు రూ. 50 వేల నుంచి రూ. 60వేల వరకు ఖర్చు చేశారు. ఇందులో ఉద్యాన శాఖ ద్వారా విత్తనాలు, ఎరువులకు కలిపి 50% రాయితీ లేదా ఎకరానికి రూ. 8వేల చొప్పున గరిష్టంగా ఐదు ఎకరాల వరకు రాయితీ అందనుంది. రైతుకు సగటున ఒక్కో కిలో బంతి పూలకు రూ. 60/- ధర లభిస్తుంది. దసరా, దీపావళి, శుభకార్యాలు, అయ్యప్ప పూజా కార్యక్రమాలతో ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే ఉంది.
జిల్లా కలెక్టర్ అభినందన
గజ సింగవరంలో రైతు బోయిని మల్లేశం వరి సాగును వదిలి బంతి పూల సాగు చేస్తుండగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? పంట ఎన్ని రోజుల్లో చేతికి వస్తుంది? ఎంత ఆదాయం వస్తుంది? అనే వివరాలను రైతు మల్లేశంను అడిగి తెలుసుకున్నారు. అతడిని శాలువాతో సన్మానించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వరి పంటకు ప్రత్యామ్నాయంగా బంతి పూల సాగు చేయడం అభినందనీయమని కొనియాడారు. మిగితా రైతులు ఆదర్శంగా తీసుకొని తమకు ఉన్న భూమిలో ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేసి ఆదాయం పొందాలని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. ఉద్యానవన శాఖ, ఇతర శాఖల నుంచి వచ్చే ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.
పరిశీలనలో సర్పంచ్ ఉమ్మారెడ్డి విమల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • ఉనికి కోసమే బిజేపి ఫీజు లడాయి చేస్తుంది...బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది- మంత్రి పొన్నం ప్రభాకర్ ఫీజులు, స్కాలర్ షిప్ లు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంటే బిజెపి తన ఉనికిని చాటు కోవడానికి లడాయి పేరుతో ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన పల్లెపల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెలో ప్రజా పాలన ఏడో రోజు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట, పెరుకపల్లి, గొల్లగూడెం, ఆకునూరు, వెంకటేశ్వర్ల పల్లి ఘనపూర్ గ్రామాల్లో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వనమహోత్సవంలో మొక్కలు నాటారు. గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షించడంతో పాటు ప్రజల నుంచి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా, గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి అనే అంశాలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకుని పరిష్కరించడానికే పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రామస్థులకు సూచించారు. మొక్క నాటడం సులభం కానీ, దానిని పెంచి పెద్ద చెట్టుగా మార్చడం మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు జీవితంలో కనీసం ఒక మొక్క నాటి, కుటుంబ సభ్యుడిలా భావించి సంరక్షించాలని సూచించారు. నవంబర్ 14లోపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ అధికారులను మంత్రి సూచించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించి జీరో డెత్ లక్ష్యాన్ని సాధించడమే తమ లక్ష్యమన్నారు. ప్రజల వద్దకే ప్రజాపాలనను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పల్లెపల్లెలో ప్రజాపాలన నిర్వహిస్తున్నామని ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం అధికారులు, ప్రజాప్రతినిధుల కర్తవ్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమ రెండు కలల ముందుకు తీసుకు వెళ్తుంటే బిజెపి తమ ఉనికిని చాటుకోవడానికి ఆందోళన చేయడం అర్ధరహితమన్నారు.
    1
    ఉనికి కోసమే బిజేపి ఫీజు లడాయి చేస్తుంది...బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది- మంత్రి పొన్నం ప్రభాకర్ 
ఫీజులు, స్కాలర్ షిప్ లు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంటే బిజెపి తన ఉనికిని చాటు కోవడానికి లడాయి పేరుతో ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన పల్లెపల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెలో ప్రజా పాలన ఏడో రోజు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట, పెరుకపల్లి, గొల్లగూడెం, ఆకునూరు, వెంకటేశ్వర్ల పల్లి ఘనపూర్ గ్రామాల్లో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వనమహోత్సవంలో మొక్కలు నాటారు. గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షించడంతో పాటు ప్రజల నుంచి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా, గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి అనే అంశాలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకుని పరిష్కరించడానికే పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రామస్థులకు సూచించారు. మొక్క నాటడం సులభం కానీ, దానిని పెంచి పెద్ద చెట్టుగా మార్చడం మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు జీవితంలో కనీసం ఒక మొక్క నాటి, కుటుంబ సభ్యుడిలా భావించి సంరక్షించాలని సూచించారు. నవంబర్ 14లోపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ అధికారులను మంత్రి సూచించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించి జీరో డెత్ లక్ష్యాన్ని సాధించడమే తమ లక్ష్యమన్నారు. ప్రజల వద్దకే ప్రజాపాలనను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పల్లెపల్లెలో ప్రజాపాలన నిర్వహిస్తున్నామని ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం అధికారులు, ప్రజాప్రతినిధుల కర్తవ్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమ రెండు కలల ముందుకు తీసుకు వెళ్తుంటే బిజెపి తమ ఉనికిని చాటుకోవడానికి ఆందోళన చేయడం అర్ధరహితమన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.