Shuru
Apke Nagar Ki App…
యూపీఐ లావాదేవీలకు పదేళ్ళు ...టీ తాగి యుపిఐ పేమెంట్ చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ దేశంలో యూపీఐ లావాదేవీలు ప్రారంభమై పదేళ్ళు అయింది. యూపిఐ పేమెంట్లకు దశాబ్దం పూర్తికావడంతో కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వేడుకలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు కార్పొరేటర్ ప్రవీణ్ రావుతో పాటు పలువురు బిజెపి నాయకులతో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ టీ తాగి యూపీఐ పేమెంట్ చేశారు. నగదు రహిత లావాదేవీలతో దేశం పురోగతి సాధిస్తుందని తెలిపారు.
K.V.REDDY
యూపీఐ లావాదేవీలకు పదేళ్ళు ...టీ తాగి యుపిఐ పేమెంట్ చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ దేశంలో యూపీఐ లావాదేవీలు ప్రారంభమై పదేళ్ళు అయింది. యూపిఐ పేమెంట్లకు దశాబ్దం పూర్తికావడంతో కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వేడుకలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు కార్పొరేటర్ ప్రవీణ్ రావుతో పాటు పలువురు బిజెపి నాయకులతో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ టీ తాగి యూపీఐ పేమెంట్ చేశారు. నగదు రహిత లావాదేవీలతో దేశం పురోగతి సాధిస్తుందని తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- 16 ఏళ్ల లోపు పిల్లలకు సామాజిక మాధ్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించాలి హుస్నాబాద్ పట్టణంలో ప్రముఖ సంఘ సేవకులు, బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం బాలల హక్కుల కోసం బాల్య వివాహ నిర్మాణ కోసం గత రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు వచ్చే సెప్టెంబర్ మాసంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన బాల్యవివాహల నిర్మూలన బాలల హక్కులు తెలిపేందుకు ప్రజలకు విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్నారి బాలబాలికల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారిని దయతో కోరుతూ 16 ఏళ్ల లోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల వినియోగంపై నిషేధం విధించాలని ఆయన కోరారు ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో నల్లగొండ మరికొన్ని సంఘటనలు చూస్తా ఉంటే ఎంతో బాధగా అయితుందని ఆయన పేర్కొన్నారు స్మార్ట్‌ఫోన్ నేటి తరం పిల్లలు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన ఆందోళన చెందారు* *రాష్ట్రంలో కొంతమంది చిన్నారి విద్యార్థులు మద్యం, సిగరెట్ వంటి అలవాట్లకు బానిస కావడం* *గంజాయి, డ్రగ్స్ వంటి ప్రాణాంతక మత్తు పదార్థాల ఉచ్చులో పడటం* *ఇంటర్నెట్ ప్రభావంతో అమ్మాయిలు పురుషులపై, అబ్బాయిలు స్త్రీలపై ద్వేషం పెంచుకోవడం* *విలాసాలకు అలవాటుపడి, సులభ మార్గాల్లో డబ్బు* *సంపాదించాలని వెంపర్లాడటం.* *మనుషుల పట్ల జాలి, దయ తగ్గిపోయి క్రూరత్వం*, *హింసాత్మక ఆలోచనలు పెరగడం. చదువును పూర్తిగా పక్కన పెట్టేసి భవిష్యత్తును పాడు చేసుకోవడం కొంతమంది విద్యార్థులు తయారవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు* *చెడు సావాసాలతో సమాజానికి హానికరమైన శక్తులుగా మారడం బాధాకరమైన పేర్కొన్నారు* *రాత్రింబవళ్లు ఫోన్‌కు అతుక్కుపోయి నిద్రలేమి* *తీవ్ర అనారోగ్యాల బారిన పడటం* *తల్లిదండ్రులు, పెద్దలు మంచి చెప్పినా వినకుండా ఎదురు తిరిగే మనస్తత్వం కలగడం ఇంతవరకు సమజసమని విద్యార్థులు తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు* *ఒక్క స్మార్ట్‌ఫోన్ పిల్లల చేతికి సరైన పర్యవేక్షణ లేకపోతే పై వాటిలో కనీసం రెండు మూడు సమస్యలైనా వారి జీవితాల్లోకి రావడం ఖాయం తల్లిదండ్రులారా గమనించండి* *పిల్లలు మితిమీరిన మొబైల్ వ్యసనంలో పడి దారితప్పితే చివరికి మీ కుటుంబ శాంతికి* *ఆస్తికి, భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది పిల్లల పట్ల* *జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు* *తల్లిదండ్రులు కు విజ్ఞప్తి* *పిల్లల చేతికి ఫోన్ ఇచ్చి వదిలేయకుండా, వారి అలవాట్లు మరియు స్క్రీన్ సమయంపై కచ్చితమైన పర్యవేక్షణ ఉంచాలి* *ఉపాధ్యాయులు* *తరగతి గదుల్లో మొబైల్ వాడకాన్ని నియంత్రిస్తూ, విద్యార్థుల్లో నైతిక విలువలు మరియు క్రమశిక్షణను పెంపొందించాలి* *విద్యార్థి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, హానికర డిజిటల్ కంటెంట్‌పై కఠిన చట్టాలు తేవాలి ఆయన ప్రభుత్వాన్ని కోరారు సాంకేతిక జ్ఞానాన్ని పెంచే సాధనం కావాలి కానీ, జీవితాన్ని నాశనం చేసే వ్యసనం కాకూడదు. రాష్ట్రంలో కొంతమంది విద్యార్థులు మారకద్రవ్యాలు వాడుతూ వాటికి బానిసై సమాజంలో చీడపురుగుల తయారవుతున్నారని ఆయన ఆందోళన చెందారు అలాంటి వారిపై కఠినంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించాలని మానవత విలువలు సనాత ధర్మం పెంచేందుకు తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని వారు పేర్కొన్నారు అధిక సెల్ ఫోన్ వినియోగం వల్ల పిల్లల్లో కంటి చూపు ఏకాగ్రత లోపం, నిద్రలేమి, నిరుత్సాహం పెరుగుతున్నాయి. హింసాత్మక విషయాలు అపరిచితులతో పరిచయాలు సైబర్ వేధింపులు పిల్లల భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయి ఆయన అన్నారు అలాగే పిల్లల కోసం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే తీసుకున్న చర్యలు ఆదర్శమని ఆయన పేర్కొన్నారుతెలంగాణలో కూడా నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు కాబట్టి పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర శాసనసభ సమావేశంలో చట్టం చేయాలని ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర కమిటీ నుండి విజ్ఞప్తి చేస్తున్నాము ఆయన తెలిపారు ఈ సమావేశంలో న్యాయవాది జేరిపోతుల కిరణ్ కుమార్ నర్రా రాజిరెడ్డి కొమ్ముల నగేష్ తదితరులు పాల్గొన్నారు.*1
- ఆధ్యాత్మిక సదస్సుకు దారుస్సలాం తరలివెళ్లిన ఎంఐఎం శ్రేణులు.. జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించిన ఎంఐఎం అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్.. ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ దారుసలాంలో నిర్వహించ తలపెట్టిన జల్సా రహమతుల్-లీల్-ఆలమీన్ ఆధ్యాత్మిక బహిరంగ సభకు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు ఆదివారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి వందలాదిగా ఎంఐఎం శ్రేణులు, పార్టీ కరీంనగర్ సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో మంగళవారం తరలివెళ్లారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ .. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి 100 వాహనాలలో 500 మంది, కరీంనగర్ పట్టణం నుంచి 35 డివిజన్లలో ప్రతి డివిజన్ నుంచి 4కార్ల చొప్పున 125 వాహనాలలో దాదాపు 500 మంది ఎంఐఎం పార్టీ నాయకులు, డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, క్రియాశీలక కార్యకర్తలు హైదరాబాద్ తరలివెళ్లినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా భారీ ఎత్తున క్రియాశీలక కార్యకర్తలను కూడగట్టి ఎక్కువ సంఖ్యలో వెళ్లినట్లు చెప్పారు. ర్యాలీకి ముందు హాఫిజ్ అస్గర్ అలీ దువా ప్రార్థన చేశారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్లు సయ్యద్ ఇబ్రహీం, మాజిద్ హుస్సేన్, మాజీ కార్పొరేటర్ ఆరిఫ్ అహ్మద్, మాజీ కోఆప్షన్ సభ్యులు అహ్మద్ మొహియుద్దీన్ బాబుజానీ, నాయకులు ఫసియుద్దీన్ ఖాలీద్, ఎంఏ సలీమ్, అబ్దుల్ గఫ్ఫార్, ఖాజా మజారోద్దీన్, వాజిద్ అలీఖాన్, మేరాజ్, అబ్దుల్లా ఖాన్, ఆమెర్, హాఫిజ్ అబ్దుల్ జబ్బార్, యునూస్, యాసర్, అల్మాస్, ఇమ్రాన్, జాకీర్, బాబా ఖాలీద్ తదితరులున్నారు.3
- విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం గంభీరావుపేట మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, స్టోర్ రూమ్ పరిశీలించి, తరగతి గదులు, వసతి, తదితర అంశాలపై వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సౌకర్యార్థం నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా తరగతి గదుల నిర్మాణాలు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న టాయిలెట్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి, వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టి, గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. విద్యాలయంలో నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, ఇతర సదుపాయాలపై కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని సూచించారు. వంటకు ఉపయోగించే సరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని అన్నారు. సందర్శనలో సర్పంచ్ మల్లుగారి పద్మ, పంచాయితీ రాజ్ ఈఈ సుదర్శన్ రెడ్డి, మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా ఈఈ లు అన్వర్, సుమలత, ఎంపీడీఓ రాజేందర్, జీసీడీఓ పద్మజ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.1
- ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నేత్రదానం చేయండి.. మరొకరికి చూపు ఇవ్వండి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ నేత్రదానం ద్వారా చూపును కోల్పోయిన వారికి కొత్త జీవితాన్ని అందించవచ్చని, ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అన్నారు. జాతీయ అంధత్వం, దృష్టిలోపాల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహిస్తున్న 41వ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా మంగళవారం సిరిసిల్ల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి గాంధీ చౌక్ వరకు నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక వ్యక్తి మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా సాధారణంగా ఇద్దరు చూపు కోల్పోయిన వ్యక్తులకు చూపు పునరుద్ధరణకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. “ఒకరి జీవితం ముగిసిన చోట.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు ప్రారంభమయ్యేలా నేత్రదానం దోహదపడుతుంది” అని అన్నారు. వ్యక్తి మరణించిన అనంతరం సాధ్యమైనంత త్వరగా, సాధారణంగా 6 నుంచి 8 గంటలలోపు నేత్ర కణజాలాన్ని సేకరించే అవకాశం ఉంటుందని తెలిపారు. నేత్రదానం వల్ల మృతదేహం రూపంలో ఎలాంటి మార్పు ఉండదని, వైద్య నిపుణులు అవసరమైన నేత్ర కణజాలాన్ని గౌరవప్రదంగా సేకరిస్తారని స్పష్టం చేశారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. మరణానంతరం నేత్రదానానికి కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరారు. రక్తపోటు, క్షయవ్యాధి, ఉబ్బసం ఉన్నవారు, కళ్లద్దాలు ఉపయోగించేవారు, కంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారు కూడా కొన్ని సందర్భాల్లో నేత్రదానం చేయవచ్చని తెలిపారు. అయితే నేత్రదానానికి అర్హతను వైద్య నిపుణులు నిర్ధారిస్తారని పేర్కొన్నారు. నేత్రదానం ప్రతి కుటుంబ ఆచారంగా మారాలని, నేత్రదానం కేవలం దానం మాత్రమే కాదని, మరణానంతరం కూడా మానవత్వాన్ని కొనసాగించే గొప్ప సేవ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తేజస్విని, జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమ అధికారి డాక్టర్ నయం జహా, నేత్ర వైద్య సహాయకులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.2
- వేములవాడ రాజన్న ఆలయం సంబంధించిన కోడెలు మృతి చెందుతున్నాయి దానిపై విచారణ జరిపించాలన్న ప్రతాప రామకృష్ణ రాజన్న ఆలయానికి సంబంధించిన కోడెలు చనిపోతున్నాయి దానిపైన విచారణ జరిపించాలని ప్రతాప రామకృష్ణ కోరారు ఎందుకు చనిపోతున్నాయి ఎలా చనిపోతున్నాయి అని టెంపుల్ వారిని అడిగారు దానిపై కచ్చితంగా విచారణ జరిపించాలని ఆలయాన్ని కోరారు వేములవాడ వచ్చే ప్రతి భక్తులు కోడెలను దేవునిగా కొలుస్తూ కోడలు కడతారు దీనిపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలని కోరుతున్నారు1
- చాగల్‌లో ఘనంగా పోచమ్మ బోనాల పండుగ, గుడి చుట్టూ తిరిగిన ఎడ్ల బండ్లు జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మున్సిపాలిటీలోని చాగల్‌లో శ్రావణమాసంలో పోచమ్మ తల్లికి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాలు ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా పోచమ్మ గుడి చుట్టూ ఎడ్ల బండ్లు తిరుగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు, పిల్లలు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆలయం వద్ద భక్తి శ్రద్ధలతో వాతావరణం మార్మోగింది. ఎడ్ల బండ్లతో జరిగిన ఊరేగింపు పండుగకు మరింత శోభను తీసుకొచ్చింది. గ్రామస్థులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. బోనాల సందర్భంగా భక్తులు మొక్కులు తీర్చుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ బోనాల పండుగతో చాగల్ లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తూ జరిగిన ఈ వేడుకలు స్థానికుల మనసులను ఆకట్టుకున్నాయి.1
- కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ వినూత్న నిరసన...రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మితే జేబులు ఖాళీ అయ్యాయని ఖాళీపర్సులు ప్రదర్శించిన విద్యార్థులు... విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిక విద్యారంగ సమస్యలపై కరీంనగర్ లో స్టూడెంట్స్ ఆందోళన ఉదృతం అవుతుంది. విద్యార్థులతో పాటు రాజకీయ పార్టీలు సైతం రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడింది. ఫీజు రియంబర్స్మెంట్ పై బిజెపి లడాయి పేరుతో దీక్షలు చేపట్టగా పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావంగా బిఆర్ఎస్ నిరసన ఆందోళన కొనసాగిస్తుంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి విద్యార్థులకు స్క్రూటిలు, లాఫ్ టాప్ లు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే జేబులు ఖాళీ అయ్యాయని ఖాళీపరుసులు, స్క్రూటీలు లాప్టాప్ ప్రదర్శిస్తు తెలంగాణ చౌక్ లో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకొని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిచో మంత్రుల ఇళ్ళతో పాటు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అసెంబ్లీని సైతం ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి హెచ్చరించారు.2
- ప్రభుత్వం తన హామీలను నెరవేర్చకపోతే విద్యార్థులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.కసిరెడ్డి మణికంఠ రెడ్డి, AISF రాష్ట్ర అధ్యక్షుడు హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైతున్నా, విద్యార్థులకు ఇచ్చిన హామీలను (స్కూటీలు, లాప్‌టాప్‌లు, విద్యా భరోసా కార్డ్, ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు) అమలు చేయడంలో విఫలమైందని AISF రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి విమర్శించారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, మేము అధికారంలో రాగానే ఐదవ గ్యారెంటీ పేరు మీద యువవికాసం పేరిట విద్యార్థులకు ఇచ్చిన హామీని అమలు చేస్తాం అన్నాడు. ఇయ్యాల అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు కావస్తా ఉంది. 34 రోజులు కావస్తా ఉంది విద్యార్థులకు ఇస్తామన్న స్కూటీలు ఎందుకు ఇవ్వలేదు? విద్యార్థులకు ఇస్తామన్న లాప్‌టాప్‌లు ఎందుకు ఇవ్వలేదు? విద్యార్థులు ఉన్నత విద్య చదువుకోవడానికి 5 లక్షల విద్యా భరోసా కార్డ్ ఎందుకు ఇవ్వలేదు? ఒకటేసారి రీఎంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేస్తామన్న రేవంత్ రెడ్డి 34 కాలంలో ఫీజు బకాయిలు విడుదల చేయకుండా.. ఇయ్యాల రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలను విస్మరించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నీరుగారిస్తా ఉంది. ఇయ్యాల రీఎంబర్స్‌మెంట్ రాక రాష్ట్రంలో విద్యార్థుల పర్సులు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. మేనేజ్‌మెంట్ల ఫీజులు కట్టి.. ఇయ్యాల విద్యార్థులకు స్కూటీలు ఇవ్వకపోతే, విద్యార్థులకు లాప్‌టాప్‌లు ఇవ్వకపోతే.. ఇయ్యాల రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తన భుజాన విద్యారంగం పెట్టుకొని ఇయ్యాల విద్యాశాఖను పూర్తిగా భ్రష్టుపట్టిస్తా ఉన్నాడు. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి విద్యాశాఖకు కొత్త వాళ్ళనైనా ఇవ్వాలి.. లేకపోతే విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు కూడా AISF ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం. ఇయ్యాల అందాల పోటీలకు ఉన్న నిధులు, ఫుట్‌బాల్ పోటీలకు ఉన్న నిధులు, హెలికాప్టర్ తిరగడానికి ఉన్న నిధులు.. ఇయ్యాల విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలుకు ఎందుకు లేవు అని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇయ్యాల మనవడు అట కోసం మెస్సీని తీసుకొచ్చినమని.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సంక్షేమం కోసం లాప్‌టాప్‌లు, స్కూటీలు ఇవ్వకపోతే.. రానున్న రోజుల్లో విద్యార్థులందరినీ ఏకం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు3
- పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ మొక్కలు నాటాలని.. వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. అటవీ శాఖ ఆద్వర్యంలో గంభీరావుపేట మండలం గోరంటాల బీట్ పరిధి గజ సింగవరం శివారులో మంగళవారం వన మహోత్సవం కింద మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై మొక్కలు నాటి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. అడవులను అందరూ సంరక్షించాలని పిలుపు నిచ్చారు. దీంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమని తెలిపారు. అడవులతోనే వర్షాలు కురుస్తాయని వివరించారు. అటవీ విస్తీర్ణం తగ్గడంతో వన్యప్రాణులు, పక్షుల మనుగడకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వన్యప్రాణులు ఇండ్లలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని వివరించారు. జిల్లా మొత్తం లక్ష్యం 8,65,200 కాగా, 6,89, 212 మొక్కలు నాటి.. 79.66 శాతం లక్ష్యం పూర్తి చేశామని వెల్లడించారు. వన మహోత్సవంలో భాగంగా రెండు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటికి మూడు నుంచి ఐదు మొక్కలు పంపిణీ చేస్తామని, అందరూ నాటి సంరక్షించాలని పిలుపు నిచ్చారు. మునగ మొక్కలు నాటాలని, దీంతో ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలు ఉన్నాయని వివరించారు. ప్రతి ఇంటికి ఇచ్చిన తడి, పొడి చెత్త బుట్టలను సద్వినియోగం చేసుకోవాలని, ఇంటి నుంచే చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లు వాడటంతో పర్యావరణ ఇబ్బందులు వస్తున్నాయని, అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. మార్కెట్, షాపుకి వెళ్లినప్పుడు బట్ట సంచితో వెళ్లాలని తెలిపారు. ప్రతి ఇంట్లో, అన్ని ఫంక్షన్లలో స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వాడాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కొమురిశెట్టి విజయ, సర్పంచ్ లతిక, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, మిషన్ భగీరథ ఈఈలు అన్వర్, సుమలత, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.1