logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చాగల్‌లో ఘనంగా పోచమ్మ బోనాల పండుగ, గుడి చుట్టూ తిరిగిన ఎడ్ల బండ్లు జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మున్సిపాలిటీలోని చాగల్‌లో శ్రావణమాసంలో పోచమ్మ తల్లికి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాలు ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా పోచమ్మ గుడి చుట్టూ ఎడ్ల బండ్లు తిరుగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు, పిల్లలు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆలయం వద్ద భక్తి శ్రద్ధలతో వాతావరణం మార్మోగింది. ఎడ్ల బండ్లతో జరిగిన ఊరేగింపు పండుగకు మరింత శోభను తీసుకొచ్చింది. గ్రామస్థులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. బోనాల సందర్భంగా భక్తులు మొక్కులు తీర్చుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ బోనాల పండుగతో చాగల్ లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తూ జరిగిన ఈ వేడుకలు స్థానికుల మనసులను ఆకట్టుకున్నాయి.

18 hrs ago
user_Kumar Pasunuri
Kumar Pasunuri
Local News Reporter Ghanpur (Station), Jangoan•
18 hrs ago

చాగల్‌లో ఘనంగా పోచమ్మ బోనాల పండుగ, గుడి చుట్టూ తిరిగిన ఎడ్ల బండ్లు జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మున్సిపాలిటీలోని చాగల్‌లో శ్రావణమాసంలో పోచమ్మ తల్లికి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాలు ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా పోచమ్మ గుడి చుట్టూ ఎడ్ల బండ్లు తిరుగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు, పిల్లలు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆలయం వద్ద భక్తి శ్రద్ధలతో వాతావరణం మార్మోగింది. ఎడ్ల బండ్లతో జరిగిన ఊరేగింపు పండుగకు మరింత శోభను తీసుకొచ్చింది. గ్రామస్థులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. బోనాల సందర్భంగా భక్తులు మొక్కులు తీర్చుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ బోనాల పండుగతో చాగల్ లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తూ జరిగిన ఈ వేడుకలు స్థానికుల మనసులను ఆకట్టుకున్నాయి.

More news from తెలంగాణ and nearby areas
  • కొత్తపల్లి గోరి మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. మహిళా సంఘాల భవనాలకు ఎమ్మెల్యే గండ్ర శంకుస్థాపన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంలో మంగళవారం సుల్తాన్‌పూర్, కొత్తపల్లి గోరి, చిన్నకోడపాక గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందుతాయని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూసిన అర్హులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తోందన్నారు. అనంతరం జగ్గయ్యపేట, సుల్తాన్‌పూర్, గోరుకొత్తపల్లి, చిన్నకోడపాక, చెన్నాపూర్ గ్రామాల్లో మహిళా సంఘాల వివో భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మహిళల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయక సంఘాలు కీలకమని, వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
    1
    కొత్తపల్లి గోరి మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. మహిళా సంఘాల భవనాలకు ఎమ్మెల్యే గండ్ర శంకుస్థాపన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంలో మంగళవారం సుల్తాన్‌పూర్, కొత్తపల్లి గోరి, చిన్నకోడపాక గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందుతాయని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూసిన అర్హులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తోందన్నారు.
అనంతరం జగ్గయ్యపేట, సుల్తాన్‌పూర్, గోరుకొత్తపల్లి, చిన్నకోడపాక, చెన్నాపూర్ గ్రామాల్లో మహిళా సంఘాల వివో భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మహిళల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయక సంఘాలు కీలకమని, వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్న హరీష్ రావు ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు. ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలనీ ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా?ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా. అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
    1
    సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్న హరీష్ రావు 
ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు. ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలనీ ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా?ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా. అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    8 hrs ago
  • నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ఆందోళన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన ఆసుపత్రిలో తాము తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా లేవని, వాష్‌రూమ్స్ అందుబాటులో లేవని, అడ్మినిస్ట్రేషన్ అట్టర్ ప్లాప్ అయిందని ఆసుపత్రి ఎదుట ధర్నా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ఆందోళన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన ఆసుపత్రిలో తాము తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా లేవని, వాష్‌రూమ్స్ అందుబాటులో లేవని, అడ్మినిస్ట్రేషన్ అట్టర్ ప్లాప్ అయిందని ఆసుపత్రి ఎదుట ధర్నా ఇవ్వని ఇవ్వకపోగా.. అన్నిటికీ మమ్మల్నే కారణంగా చూపి నర్సింగ్ సిబ్బందికి సూపరింటెండెంట్ మెమో జారీ చేస్తున్నారు అంటూ ఆవేదన ఆడ పిల్లలమైన తమపై ఉన్నతాధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కన్నీరు పెట్టుకున్న నర్సింగ్ సిబ్బంది
    1
    నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ఆందోళన

ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన

ఆసుపత్రిలో తాము తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా లేవని, వాష్‌రూమ్స్ అందుబాటులో లేవని, అడ్మినిస్ట్రేషన్ అట్టర్ ప్లాప్ అయిందని ఆసుపత్రి ఎదుట ధర్నా

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ఆందోళన
ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన
ఆసుపత్రిలో తాము తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా లేవని, వాష్‌రూమ్స్ అందుబాటులో లేవని, అడ్మినిస్ట్రేషన్ అట్టర్ ప్లాప్ అయిందని ఆసుపత్రి ఎదుట ధర్నా
ఇవ్వని ఇవ్వకపోగా.. అన్నిటికీ మమ్మల్నే కారణంగా చూపి నర్సింగ్ సిబ్బందికి సూపరింటెండెంట్ మెమో జారీ చేస్తున్నారు అంటూ ఆవేదన 
ఆడ పిల్లలమైన తమపై ఉన్నతాధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కన్నీరు పెట్టుకున్న నర్సింగ్ సిబ్బంది
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    2 hrs ago
  • ఉనికి కోసమే బిజేపి ఫీజు లడాయి చేస్తుంది...బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది- మంత్రి పొన్నం ప్రభాకర్ ఫీజులు, స్కాలర్ షిప్ లు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంటే బిజెపి తన ఉనికిని చాటు కోవడానికి లడాయి పేరుతో ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన పల్లెపల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెలో ప్రజా పాలన ఏడో రోజు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట, పెరుకపల్లి, గొల్లగూడెం, ఆకునూరు, వెంకటేశ్వర్ల పల్లి ఘనపూర్ గ్రామాల్లో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వనమహోత్సవంలో మొక్కలు నాటారు. గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షించడంతో పాటు ప్రజల నుంచి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా, గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి అనే అంశాలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకుని పరిష్కరించడానికే పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రామస్థులకు సూచించారు. మొక్క నాటడం సులభం కానీ, దానిని పెంచి పెద్ద చెట్టుగా మార్చడం మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు జీవితంలో కనీసం ఒక మొక్క నాటి, కుటుంబ సభ్యుడిలా భావించి సంరక్షించాలని సూచించారు. నవంబర్ 14లోపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ అధికారులను మంత్రి సూచించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించి జీరో డెత్ లక్ష్యాన్ని సాధించడమే తమ లక్ష్యమన్నారు. ప్రజల వద్దకే ప్రజాపాలనను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పల్లెపల్లెలో ప్రజాపాలన నిర్వహిస్తున్నామని ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం అధికారులు, ప్రజాప్రతినిధుల కర్తవ్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమ రెండు కలల ముందుకు తీసుకు వెళ్తుంటే బిజెపి తమ ఉనికిని చాటుకోవడానికి ఆందోళన చేయడం అర్ధరహితమన్నారు.
    1
    ఉనికి కోసమే బిజేపి ఫీజు లడాయి చేస్తుంది...బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది- మంత్రి పొన్నం ప్రభాకర్ 
ఫీజులు, స్కాలర్ షిప్ లు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంటే బిజెపి తన ఉనికిని చాటు కోవడానికి లడాయి పేరుతో ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన పల్లెపల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెలో ప్రజా పాలన ఏడో రోజు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట, పెరుకపల్లి, గొల్లగూడెం, ఆకునూరు, వెంకటేశ్వర్ల పల్లి ఘనపూర్ గ్రామాల్లో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వనమహోత్సవంలో మొక్కలు నాటారు. గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షించడంతో పాటు ప్రజల నుంచి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా, గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి అనే అంశాలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకుని పరిష్కరించడానికే పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రామస్థులకు సూచించారు. మొక్క నాటడం సులభం కానీ, దానిని పెంచి పెద్ద చెట్టుగా మార్చడం మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు జీవితంలో కనీసం ఒక మొక్క నాటి, కుటుంబ సభ్యుడిలా భావించి సంరక్షించాలని సూచించారు. నవంబర్ 14లోపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ అధికారులను మంత్రి సూచించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించి జీరో డెత్ లక్ష్యాన్ని సాధించడమే తమ లక్ష్యమన్నారు. ప్రజల వద్దకే ప్రజాపాలనను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పల్లెపల్లెలో ప్రజాపాలన నిర్వహిస్తున్నామని ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం అధికారులు, ప్రజాప్రతినిధుల కర్తవ్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమ రెండు కలల ముందుకు తీసుకు వెళ్తుంటే బిజెపి తమ ఉనికిని చాటుకోవడానికి ఆందోళన చేయడం అర్ధరహితమన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.
    1
    బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్
మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి మంగళవారం రూ.18,92,299 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.6,70,860, కార్ పార్కింగ్తో రూ.3 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,87,200, బ్రేక్ దర్శనాలతో రూ.1,08,300, ప్రధాన బుకింగ్ తో రూ.1,49,854, వ్రతాలతో రూ.1,10,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.
    1
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి
వారి నిత్య ఆదాయ వివరాలు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి మంగళవారం రూ.18,92,299 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.6,70,860, కార్ పార్కింగ్తో రూ.3 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,87,200, బ్రేక్ దర్శనాలతో రూ.1,08,300, ప్రధాన బుకింగ్ తో రూ.1,49,854, వ్రతాలతో రూ.1,10,000, తదితర విభాగాల నుంచి ఆదాయం
వచ్చిందన్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    2 hrs ago
  • పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: కలెక్టర్ హేమంత్ ములుగు జిల్లా కేంద్రంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ములుగు జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు తెలిపారు, వన మహోత్సవం సందర్భంగా గట్టమ్మ దేవాలయం.సమీపంలోని పంచాయతీ రాజ్ పైలాన్ ఆవరణలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్.ఐటిడిఏ పివో. లెనిన్ టోప్పో డి ఎఫ్ ఓ. వికాస్ మీనాతో కలిసి మొక్కలు నాటారు
    1
    పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: కలెక్టర్ హేమంత్
ములుగు జిల్లా కేంద్రంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ములుగు జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు తెలిపారు, వన మహోత్సవం సందర్భంగా గట్టమ్మ దేవాలయం.సమీపంలోని పంచాయతీ రాజ్ పైలాన్ ఆవరణలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్.ఐటిడిఏ పివో. లెనిన్ టోప్పో డి ఎఫ్ ఓ. వికాస్ మీనాతో కలిసి మొక్కలు నాటారు
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • *భారీగా నక్సల్స్‌ ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం* ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు సోమవారం భారీగా నక్సల్స్‌ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. భేజీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని భండార్‌పదర్, మునుర్‌కొండ అటవీ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో *భారీగా నక్సల్స్‌ ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం* ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు సోమవారం భారీగా నక్సల్స్‌ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. భేజీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని భండార్‌పదర్, మునుర్‌కొండ అటవీ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్‌, 315 బోర్‌ తుపాకీ, మస్కెట్‌ రైఫిల్‌, బీజీఎల్‌ లాంచర్‌, గ్రెనేడ్లు, ఇతర సామగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఆయుధాల స్వాధీనం నేపథ్యంలో అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మరింత విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
    1
    *భారీగా నక్సల్స్‌ ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం*

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు సోమవారం భారీగా నక్సల్స్‌ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

 భేజీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని భండార్‌పదర్, మునుర్‌కొండ అటవీ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో 
*భారీగా నక్సల్స్‌ ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం*
ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు సోమవారం భారీగా నక్సల్స్‌ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.
భేజీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని భండార్‌పదర్, మునుర్‌కొండ అటవీ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్‌, 315 బోర్‌ తుపాకీ, మస్కెట్‌ రైఫిల్‌, బీజీఎల్‌ లాంచర్‌, గ్రెనేడ్లు, ఇతర సామగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.
ఆయుధాల స్వాధీనం నేపథ్యంలో అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మరింత విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    3 hrs ago
  • కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ వినూత్న నిరసన...రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మితే జేబులు ఖాళీ అయ్యాయని ఖాళీపర్సులు ప్రదర్శించిన విద్యార్థులు... విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిక విద్యారంగ సమస్యలపై కరీంనగర్ లో స్టూడెంట్స్ ఆందోళన ఉదృతం అవుతుంది. విద్యార్థులతో పాటు రాజకీయ పార్టీలు సైతం రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడింది. ఫీజు రియంబర్స్మెంట్ పై బిజెపి లడాయి పేరుతో దీక్షలు చేపట్టగా పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావంగా బిఆర్ఎస్ నిరసన ఆందోళన కొనసాగిస్తుంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి విద్యార్థులకు స్క్రూటిలు, లాఫ్ టాప్ లు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే జేబులు ఖాళీ అయ్యాయని ఖాళీపరుసులు, స్క్రూటీలు లాప్టాప్ ప్రదర్శిస్తు తెలంగాణ చౌక్ లో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకొని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిచో మంత్రుల ఇళ్ళతో పాటు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అసెంబ్లీని సైతం ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి హెచ్చరించారు.
    2
    కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ వినూత్న నిరసన...రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మితే జేబులు ఖాళీ అయ్యాయని ఖాళీపర్సులు ప్రదర్శించిన విద్యార్థులు... విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిక
విద్యారంగ సమస్యలపై  కరీంనగర్ లో స్టూడెంట్స్ ఆందోళన ఉదృతం అవుతుంది. విద్యార్థులతో పాటు రాజకీయ పార్టీలు సైతం రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడింది. ఫీజు రియంబర్స్మెంట్ పై బిజెపి లడాయి పేరుతో దీక్షలు చేపట్టగా పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావంగా బిఆర్ఎస్ నిరసన  ఆందోళన కొనసాగిస్తుంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి విద్యార్థులకు స్క్రూటిలు, లాఫ్ టాప్ లు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే జేబులు ఖాళీ అయ్యాయని ఖాళీపరుసులు,  స్క్రూటీలు లాప్టాప్ ప్రదర్శిస్తు తెలంగాణ చౌక్ లో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకొని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిచో మంత్రుల ఇళ్ళతో పాటు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అసెంబ్లీని సైతం ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.