కొత్తపల్లి గోరి మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. మహిళా సంఘాల భవనాలకు ఎమ్మెల్యే గండ్ర శంకుస్థాపన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంలో మంగళవారం సుల్తాన్‌పూర్, కొత్తపల్లి గోరి, చిన్నకోడపాక గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందుతాయని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూసిన అర్హులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తోందన్నారు. అనంతరం జగ్గయ్యపేట, సుల్తాన్‌పూర్, గోరుకొత్తపల్లి, చిన్నకోడపాక, చెన్నాపూర్ గ్రామాల్లో మహిళా సంఘాల వివో భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మహిళల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయక సంఘాలు కీలకమని, వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కొత్తపల్లి గోరి మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. మహిళా సంఘాల భవనాలకు ఎమ్మెల్యే గండ్ర శంకుస్థాపన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంలో మంగళవారం సుల్తాన్‌పూర్, కొత్తపల్లి గోరి, చిన్నకోడపాక గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందుతాయని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూసిన అర్హులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తోందన్నారు. అనంతరం జగ్గయ్యపేట, సుల్తాన్‌పూర్, గోరుకొత్తపల్లి, చిన్నకోడపాక, చెన్నాపూర్ గ్రామాల్లో మహిళా సంఘాల వివో భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మహిళల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయక సంఘాలు కీలకమని, వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
- సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్న హరీష్ రావు ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు. ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలనీ ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా?ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా. అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.1
- చాగల్‌లో ఘనంగా పోచమ్మ బోనాల పండుగ, గుడి చుట్టూ తిరిగిన ఎడ్ల బండ్లు జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మున్సిపాలిటీలోని చాగల్‌లో శ్రావణమాసంలో పోచమ్మ తల్లికి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాలు ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా పోచమ్మ గుడి చుట్టూ ఎడ్ల బండ్లు తిరుగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు, పిల్లలు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆలయం వద్ద భక్తి శ్రద్ధలతో వాతావరణం మార్మోగింది. ఎడ్ల బండ్లతో జరిగిన ఊరేగింపు పండుగకు మరింత శోభను తీసుకొచ్చింది. గ్రామస్థులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. బోనాల సందర్భంగా భక్తులు మొక్కులు తీర్చుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ బోనాల పండుగతో చాగల్ లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తూ జరిగిన ఈ వేడుకలు స్థానికుల మనసులను ఆకట్టుకున్నాయి.1
- నర్సంపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు... తొలి బహుజన యోధుడు, గోల్కొండ కోటపై జెండా ఎగరవేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతి వేడుకలను నర్సంపేట పట్టణంలోని పాపన్న గౌడ్ విగ్రహం వద్ద వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహం కమిటీ అధ్యక్షులు సోల్తి సారయ్య గౌడ్ తో పాటు కమిటీ సభ్యులు పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సారయ్య గౌడ్ మాట్లాడుతూ 15వేల మంది బహుజన సైన్యంతో నాటి పాలకులపై ఎదురొడ్డి గోల్కొండ ఖిలాను ఏలిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్నకే దక్కిందని పేర్కొన్నారు.విగ్రహం కమిటీ ప్రధాన కార్యదర్శి, గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయస్ఫూర్తితో గౌడుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. గౌడ సామాజిక వర్గం ఆర్థిక స్వావలంబన, సామాజిక అభ్యున్నతి, సముచిత రాజకీయ ప్రాధాన్యం కోసం ఐక్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విగ్రహం కమిటీ కోశాధికారి ఊడ్గుల శ్రీనివాస్ గౌడ్, మాచర్ల ఐలుమల్లు గౌడ్, నర్సంపేట పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు,కమిటీ సభ్యులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, కొయ్యేడి కొమురయ్య గౌడ్, గిరాగాని చంద్రమౌళి గౌడ్, మద్దెల శ్రీనివాస్ గౌడ్, నాతి సదానందం గౌడ్, గిరాగాని కిరణ్ గౌడ్, మొలగాని సురేష్ గౌడ్, తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, మద్దెల రవి గౌడ్, నాగేలి ప్రమోద్ గౌడ్, వేముల కృష్ణ గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, తాళ్లపెల్లి చంద్రమౌళి గౌడ్, గండు స్వామి గౌడ్, మోకు దెబ్బ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ కందుల శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు గొపగాని వెంకటేశ్వర్లు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాచర్ల దేవేందర్ గౌడ్, దుడ్డే కుమారస్వామి గౌడ్, పోశాల సతీష్ గౌడ్, మచ్చిక రాజు గౌడ్, సోల్తి సాంబయ్య గౌడ్, సోల్తి సునీల్ గౌడ్, సొల్తి మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.1
- నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ఆందోళన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన ఆసుపత్రిలో తాము తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా లేవని, వాష్‌రూమ్స్ అందుబాటులో లేవని, అడ్మినిస్ట్రేషన్ అట్టర్ ప్లాప్ అయిందని ఆసుపత్రి ఎదుట ధర్నా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ఆందోళన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన ఆసుపత్రిలో తాము తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా లేవని, వాష్‌రూమ్స్ అందుబాటులో లేవని, అడ్మినిస్ట్రేషన్ అట్టర్ ప్లాప్ అయిందని ఆసుపత్రి ఎదుట ధర్నా ఇవ్వని ఇవ్వకపోగా.. అన్నిటికీ మమ్మల్నే కారణంగా చూపి నర్సింగ్ సిబ్బందికి సూపరింటెండెంట్ మెమో జారీ చేస్తున్నారు అంటూ ఆవేదన ఆడ పిల్లలమైన తమపై ఉన్నతాధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కన్నీరు పెట్టుకున్న నర్సింగ్ సిబ్బంది1
- యూపీఐ లావాదేవీలకు పదేళ్ళు ...టీ తాగి యుపిఐ పేమెంట్ చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ దేశంలో యూపీఐ లావాదేవీలు ప్రారంభమై పదేళ్ళు అయింది. యూపిఐ పేమెంట్లకు దశాబ్దం పూర్తికావడంతో కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వేడుకలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు కార్పొరేటర్ ప్రవీణ్ రావుతో పాటు పలువురు బిజెపి నాయకులతో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ టీ తాగి యూపీఐ పేమెంట్ చేశారు. నగదు రహిత లావాదేవీలతో దేశం పురోగతి సాధిస్తుందని తెలిపారు.1
- పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి కలెక్టర్ హేమంత్ బోర్కాడే. ములుగు జిల్లా. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి. మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పాటుపడాలని, మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. వన మహోత్సవం సందర్భంగా మంగళవారం గట్టమ్మ సమీపంలోని పంచాయతీరాజ్ పైలాన్ ఆవరణలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనాతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో మొక్కలు, అడవులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు పచ్చదనాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వన మహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా, ప్రకృతిని పరిరక్షించే సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, అవి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను కాపాడినప్పుడే వన మహోత్సవ లక్ష్యం నెరవేరుతుందని, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎఫ్‌డీఓ సత్తయ్య, జాకారం సర్పంచ్, అటవీ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: కలెక్టర్ హేమంత్ ములుగు జిల్లా కేంద్రంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ములుగు జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు తెలిపారు, వన మహోత్సవం సందర్భంగా గట్టమ్మ దేవాలయం.సమీపంలోని పంచాయతీ రాజ్ పైలాన్ ఆవరణలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్.ఐటిడిఏ పివో. లెనిన్ టోప్పో డి ఎఫ్ ఓ. వికాస్ మీనాతో కలిసి మొక్కలు నాటారు1
- విద్యార్థుల చేత చపాతీలు చేయిస్తున్న ప్రిన్సిపాల్....... విద్యార్థుల చేత చపాతీలు చేయిస్తున్న ప్రిన్సిపాల్ నల్గొండ జిల్లా దామరచర్లలోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో వెలుగు చూసిన ఘటన వంట మనుషులు పెట్టించి ప్రభుత్వం జీతాలు ఇస్తున్నా.. విద్యార్థుల చేత పనులు చేయిస్తున్న ప్రిన్సిపాల్, వార్డెన్స్ వంట గదిలో వారి చేత చపాతీలు చేయించిన వైనం వీడియో బయటకు రావడంతో.. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు తీవ్ర మండిపాటు పెన్ను, పుస్తకాలు పట్టుకోవాల్సిన విద్యార్థుల చేత పనులు చేయిస్తారా? అని ఆగ్రహం1
- *భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం* ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు సోమవారం భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భండార్‌పదర్, మునుర్‌కొండ అటవీ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో *భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం* ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు సోమవారం భారీగా నక్సల్స్ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భండార్‌పదర్, మునుర్‌కొండ అటవీ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్, 315 బోర్ తుపాకీ, మస్కెట్ రైఫిల్, బీజీఎల్ లాంచర్, గ్రెనేడ్లు, ఇతర సామగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఆయుధాల స్వాధీనం నేపథ్యంలో అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మరింత విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.1