నర్సంపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు... తొలి బహుజన యోధుడు, గోల్కొండ కోటపై జెండా ఎగరవేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతి వేడుకలను నర్సంపేట పట్టణంలోని పాపన్న గౌడ్ విగ్రహం వద్ద వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహం కమిటీ అధ్యక్షులు సోల్తి సారయ్య గౌడ్ తో పాటు కమిటీ సభ్యులు పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సారయ్య గౌడ్ మాట్లాడుతూ 15వేల మంది బహుజన సైన్యంతో నాటి పాలకులపై ఎదురొడ్డి గోల్కొండ ఖిలాను ఏలిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్నకే దక్కిందని పేర్కొన్నారు.విగ్రహం కమిటీ ప్రధాన కార్యదర్శి, గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయస్ఫూర్తితో గౌడుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. గౌడ సామాజిక వర్గం ఆర్థిక స్వావలంబన, సామాజిక అభ్యున్నతి, సముచిత రాజకీయ ప్రాధాన్యం కోసం ఐక్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విగ్రహం కమిటీ కోశాధికారి ఊడ్గుల శ్రీనివాస్ గౌడ్, మాచర్ల ఐలుమల్లు గౌడ్, నర్సంపేట పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు,కమిటీ సభ్యులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, కొయ్యేడి కొమురయ్య గౌడ్, గిరాగాని చంద్రమౌళి గౌడ్, మద్దెల శ్రీనివాస్ గౌడ్, నాతి సదానందం గౌడ్, గిరాగాని కిరణ్ గౌడ్, మొలగాని సురేష్ గౌడ్, తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, మద్దెల రవి గౌడ్, నాగేలి ప్రమోద్ గౌడ్, వేముల కృష్ణ గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, తాళ్లపెల్లి చంద్రమౌళి గౌడ్, గండు స్వామి గౌడ్, మోకు దెబ్బ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ కందుల శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు గొపగాని వెంకటేశ్వర్లు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాచర్ల దేవేందర్ గౌడ్, దుడ్డే కుమారస్వామి గౌడ్, పోశాల సతీష్ గౌడ్, మచ్చిక రాజు గౌడ్, సోల్తి సాంబయ్య గౌడ్, సోల్తి సునీల్ గౌడ్, సొల్తి మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి కలెక్టర్ హేమంత్ బోర్కాడే. ములుగు జిల్లా. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి. మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పాటుపడాలని, మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. వన మహోత్సవం సందర్భంగా మంగళవారం గట్టమ్మ సమీపంలోని పంచాయతీరాజ్ పైలాన్ ఆవరణలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనాతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో మొక్కలు, అడవులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు పచ్చదనాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వన మహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా, ప్రకృతిని పరిరక్షించే సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, అవి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను కాపాడినప్పుడే వన మహోత్సవ లక్ష్యం నెరవేరుతుందని, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎఫ్‌డీఓ సత్తయ్య, జాకారం సర్పంచ్, అటవీ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- రంగశాయిపేటలో ఘనంగా వనమహోత్సవం.. మొక్కలు నాటిన మంత్రి కొండా సురేఖ వరంగల్: ఖిలా వరంగల్ పరిధిలోని రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక వనమహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, ప్రకృతి సంపద సంరక్షణకు సంబంధించిన ప్రదర్శనలను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- గొల్లకురుమల జీవనాధారాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో చెట్ల నరికి పంచరాయి భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ చేస్తున్న గ్రామ గొల్ల కురుమలు. గొల్లకురుమల జీవనాధారమైన గొర్రెలు, మేకలకు మేత అందించే భూములతో పాటు గ్రామంలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని సముద్రాల గ్రామానికి చెందిన గొల్లకురుమలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని గడ్డిబోడు, ఈదులబోడు, దేవునిబోడు, దొంగలబోడు తదితర ప్రాంతాల్లోని పంచరాయి భూముల్లో చెట్లను అక్రమంగా నరికివేస్తూ, మొరం తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. రైతులు కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామిలు విలేకరులతో మాట్లాడుతూ.... గ్రామంలోని సర్వే నంబర్లు 189, 212 పరిధిలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రకృతి వనరులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకలకు మేత అందించే భూములే ధ్వంసమైతే తమ జీవనోపాధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు.1
- తిరుమలాయపాలెం ఎం ర్ ఓ ఆఫీస్ ను ముట్టడించన తిప్పరెడ్డి గూడెం రైతులు. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం తిప్పరెడ్డి గూడెం దళిత రైతులు ఈ రోజు సిపిఐంల్ న్యూ డెమోక్రసి పార్టీ అధ్యరలో ఎం ర్ ఓ ఆఫీస్ ను ముట్టడించినరు. 128సర్వ్ నెంబర్ లో14ఎకరాల20కుంటాలపేదల భూమి లో సీతారామ ప్రజక్ట్ కాలువలు తవ్వి పేదలకు నష్ట పరిహారం ఇవ్వకుండా ఇప్పుడూ అది ప్రభత్వ భూమి అని తప్పుడు పత్రాలు,పోర్జరి సంతకాలు సూపించి పేద రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రైతులు 50 సంవత్సరాలుగా సేద్యంలో ఉంటూన్న రైతులనుగత ఆరు సంవత్సరాల నుంచి సీతారామ కాలవ పేరుతో పేదల భూములు లాక్కొని ఆ పేదల భూముల్లో కాలువల తవ్వి ఆనాటి ప్రభుత్వం మీకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పిఇప్పుడు ఆ భూమిని ప్రభుత్వ భూమి గా చూపిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తిప్పారెడ్డి గూడెం రైతుల పక్షాన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వం నుంచి వారికి నష్టపరిహారం అందేంతవరకు పోరాటం కొనసాగిస్తామని ఆ పార్టీ నాయకులు తెలిపినారు.1
- హుస్నాబాద్ 20వ వార్డులో పందుల బెడద................... ......... హుస్నాబాద్ పట్టణంలోని 20వ వార్డులో పందుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీధుల్లో పెద్ద సంఖ్యలో పందులు సంచరిస్తుండటంతో పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందుల కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురైతే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పందుల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.1
- నర్సంపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు... తొలి బహుజన యోధుడు, గోల్కొండ కోటపై జెండా ఎగరవేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతి వేడుకలను నర్సంపేట పట్టణంలోని పాపన్న గౌడ్ విగ్రహం వద్ద వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహం కమిటీ అధ్యక్షులు సోల్తి సారయ్య గౌడ్ తో పాటు కమిటీ సభ్యులు పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సారయ్య గౌడ్ మాట్లాడుతూ 15వేల మంది బహుజన సైన్యంతో నాటి పాలకులపై ఎదురొడ్డి గోల్కొండ ఖిలాను ఏలిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్నకే దక్కిందని పేర్కొన్నారు.విగ్రహం కమిటీ ప్రధాన కార్యదర్శి, గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయస్ఫూర్తితో గౌడుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. గౌడ సామాజిక వర్గం ఆర్థిక స్వావలంబన, సామాజిక అభ్యున్నతి, సముచిత రాజకీయ ప్రాధాన్యం కోసం ఐక్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విగ్రహం కమిటీ కోశాధికారి ఊడ్గుల శ్రీనివాస్ గౌడ్, మాచర్ల ఐలుమల్లు గౌడ్, నర్సంపేట పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు,కమిటీ సభ్యులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, కొయ్యేడి కొమురయ్య గౌడ్, గిరాగాని చంద్రమౌళి గౌడ్, మద్దెల శ్రీనివాస్ గౌడ్, నాతి సదానందం గౌడ్, గిరాగాని కిరణ్ గౌడ్, మొలగాని సురేష్ గౌడ్, తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, మద్దెల రవి గౌడ్, నాగేలి ప్రమోద్ గౌడ్, వేముల కృష్ణ గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, తాళ్లపెల్లి చంద్రమౌళి గౌడ్, గండు స్వామి గౌడ్, మోకు దెబ్బ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ కందుల శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు గొపగాని వెంకటేశ్వర్లు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాచర్ల దేవేందర్ గౌడ్, దుడ్డే కుమారస్వామి గౌడ్, పోశాల సతీష్ గౌడ్, మచ్చిక రాజు గౌడ్, సోల్తి సాంబయ్య గౌడ్, సోల్తి సునీల్ గౌడ్, సొల్తి మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.1
- పరువు కోసం.. కుమార్తెను ప్రియుడితో చంపించిన కసాయి తండ్రి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యమైన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మృతురాలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మానసను ఆమె ప్రియుడు వినోద్‌కుమార్ హత్య చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో వినోద్‌ను విచారించగా మానస తండ్రి రాజేశం ఆదేశాలతో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదివరకే రెండుసార్లు వివాహం జరిగి విడాకులు తీసుకున్న మానస, వినోద్‌తో ప్రేమలో పడింది. తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని వినోద్ మానస తండ్రి రాజేశంకు చెప్పాడు. కుటుంబ పరువు తీస్తోందని, కూతురిని చంపేయాలని రాజేశం చెప్పడంతో, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.1