logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన బెజ్జంకి మండలం నేతలు బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం సిద్దిపేట జిల్లాకు విచ్చేసిన సందర్భంగా దేవక్కపల్లి స్టేజి వద్ద బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండల బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కరివేద మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య పరిష్కారం కోసం హైదరాబాద్ నగర నడిబొడ్డున జరిగే పోరాటానికి బీజేపీ శ్రేణులతో కలిసి తరలివెళ్తున్నామని ప్రకటించారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆడిచర్ల రాజు, బీజేవైఎం నాయకులు సంఘ నరేష్, విమల్ కుమార్, గుంజేటి శివకుమార్, రావుల రాజిరెడ్డి, బెజ్జంకి మండల బీజేపీ ఉపాధ్యక్షులు గైని రాజుతో పాటు బెజ్జంకి మండల ముఖ్య నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థుల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

3 hrs ago
user_ప్రభాకర్
ప్రభాకర్
Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
3 hrs ago

కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన బెజ్జంకి మండలం నేతలు బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం సిద్దిపేట జిల్లాకు విచ్చేసిన సందర్భంగా దేవక్కపల్లి స్టేజి వద్ద బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండల బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కరివేద మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య పరిష్కారం కోసం హైదరాబాద్ నగర నడిబొడ్డున జరిగే పోరాటానికి బీజేపీ శ్రేణులతో కలిసి తరలివెళ్తున్నామని ప్రకటించారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆడిచర్ల రాజు, బీజేవైఎం నాయకులు సంఘ నరేష్, విమల్ కుమార్, గుంజేటి శివకుమార్, రావుల రాజిరెడ్డి, బెజ్జంకి మండల బీజేపీ ఉపాధ్యక్షులు గైని రాజుతో పాటు బెజ్జంకి మండల ముఖ్య నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థుల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

More news from తెలంగాణ and nearby areas
  • కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన బెజ్జంకి మండలం నేతలు బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం సిద్దిపేట జిల్లాకు విచ్చేసిన సందర్భంగా దేవక్కపల్లి స్టేజి వద్ద బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండల బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కరివేద మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య పరిష్కారం కోసం హైదరాబాద్ నగర నడిబొడ్డున జరిగే పోరాటానికి బీజేపీ శ్రేణులతో కలిసి తరలివెళ్తున్నామని ప్రకటించారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆడిచర్ల రాజు, బీజేవైఎం నాయకులు సంఘ నరేష్, విమల్ కుమార్, గుంజేటి శివకుమార్, రావుల రాజిరెడ్డి, బెజ్జంకి మండల బీజేపీ ఉపాధ్యక్షులు గైని రాజుతో పాటు బెజ్జంకి మండల ముఖ్య నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థుల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
    1
    కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన బెజ్జంకి మండలం నేతలు
బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం  సిద్దిపేట జిల్లాకు విచ్చేసిన సందర్భంగా దేవక్కపల్లి స్టేజి వద్ద బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండల బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా కరివేద మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య పరిష్కారం కోసం హైదరాబాద్ నగర నడిబొడ్డున జరిగే పోరాటానికి బీజేపీ శ్రేణులతో కలిసి తరలివెళ్తున్నామని ప్రకటించారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆడిచర్ల రాజు, బీజేవైఎం నాయకులు సంఘ నరేష్, విమల్ కుమార్, గుంజేటి శివకుమార్, రావుల రాజిరెడ్డి, బెజ్జంకి మండల బీజేపీ ఉపాధ్యక్షులు గైని రాజుతో పాటు బెజ్జంకి మండల ముఖ్య నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
విద్యార్థుల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    3 hrs ago
  • యూపీఐ లావాదేవీలకు పదేళ్ళు ...టీ తాగి యుపిఐ పేమెంట్ చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ దేశంలో యూపీఐ లావాదేవీలు ప్రారంభమై పదేళ్ళు అయింది. యూపిఐ పేమెంట్లకు దశాబ్దం పూర్తికావడంతో కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వేడుకలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు కార్పొరేటర్ ప్రవీణ్ రావుతో పాటు పలువురు బిజెపి నాయకులతో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ టీ తాగి యూపీఐ పేమెంట్ చేశారు. నగదు రహిత లావాదేవీలతో దేశం పురోగతి సాధిస్తుందని తెలిపారు.
    1
    యూపీఐ లావాదేవీలకు పదేళ్ళు ...టీ తాగి యుపిఐ పేమెంట్ చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ 
దేశంలో యూపీఐ లావాదేవీలు ప్రారంభమై పదేళ్ళు అయింది. 
యూపిఐ పేమెంట్లకు దశాబ్దం పూర్తికావడంతో కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వేడుకలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు కార్పొరేటర్ ప్రవీణ్ రావుతో పాటు పలువురు బిజెపి నాయకులతో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ టీ తాగి యూపీఐ పేమెంట్ చేశారు. నగదు రహిత లావాదేవీలతో దేశం పురోగతి సాధిస్తుందని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    38 min ago
  • 34 నెలల పాలనలో విద్యార్థుల హామీల అమలేది రేవంత్ రెడ్డి? స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, ఫీజు బకాయిలు ఎప్పుడిస్తారు? విద్యార్థుల హామీలు అమలు చేయకపోతే ఉద్యమం ఉధృతం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి స్కూటీలు, ల్యాప్‌టాప్‌లతో ఖాళీ పర్సులు ప్రదర్శిస్తూ ఏఐఎస్ఎఫ్ విన్నూత నిరసన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్‌టాప్‌లను, 5లక్షల విద్య భరోసా కార్డును, పెండింగ్ ఫీజు బకాయిలను అధికారంలోకి వచ్చి 34 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని, సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని విద్యార్థుల హామీల అమలు చేయకుండా విద్యార్థులకు ఓట్లు లేవని చిన్నచూపు చూస్తున్నాడని, రాష్ట్రంలో విద్యార్థులు సమస్యల కోసం ప్రతి రోజు రోడ్డు ఎక్కుతున్నారని,సీఎం వద్ద విద్యాశాఖ ఉంది కమిషన్ల కోసమేనని, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం తప్పదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్కూటీలు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఖాళీ పర్సులను ప్రదర్శిస్తూ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ,స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోతే విద్యార్థులు వారి తల్లితండ్రులు జేబులోంచి సర్టిఫికెట్ల కోసం కళాశాలకు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని దీంతో పర్సులు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్‌టాప్‌లను ,యువవికాసం పేరుతో 5లక్షల విద్యా భరోసా కార్డు ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని , ఒక్కొక్క హామీ అమలు చేస్తున్నాం ఇది ప్రజాపాలనని చెబుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల హామీలను అమలుచేయకాపోవడానికి కారణం ఎందని? విద్యార్థుల హామీల అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఓట్లతో ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకుండా విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని బడ్జెట్ లో 15%నిధులు ఇవ్వాలని , ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా వాటిని అమలు చేసి విద్యార్థుల పట్ల తమ చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి నిరూపించుకోవాలని, రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని విద్యా శాఖకు న్యాయం చేయకుంటే విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియమించాలని, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని లేనిపక్షంలో ఢిల్లీ తరహా ఉద్యమాన్ని తెలంగాణ గల్లీలలో విద్యార్థులను ఏకం చేసి ఉద్యమిస్తామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నూనావత్ శ్రీనివాస్ నాయక్, గర్ల్స్ వింగ్ నాయకురాలు జోష్ణ,నగర నాయకులు సందీప్ రెడ్డి, బోయినీ విష్ణు, అరవింద్,సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు
    1
    34 నెలల పాలనలో విద్యార్థుల హామీల అమలేది రేవంత్ రెడ్డి?

స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, ఫీజు బకాయిలు ఎప్పుడిస్తారు?

విద్యార్థుల హామీలు అమలు చేయకపోతే ఉద్యమం ఉధృతం

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి

స్కూటీలు, ల్యాప్‌టాప్‌లతో ఖాళీ పర్సులు ప్రదర్శిస్తూ ఏఐఎస్ఎఫ్ విన్నూత నిరసన

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్‌టాప్‌లను, 5లక్షల విద్య భరోసా కార్డును, పెండింగ్ ఫీజు బకాయిలను  అధికారంలోకి వచ్చి 34 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని, సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద  విద్యాశాఖ పెట్టుకొని విద్యార్థుల హామీల అమలు చేయకుండా  విద్యార్థులకు ఓట్లు లేవని చిన్నచూపు చూస్తున్నాడని, రాష్ట్రంలో విద్యార్థులు సమస్యల కోసం ప్రతి రోజు రోడ్డు ఎక్కుతున్నారని,సీఎం వద్ద విద్యాశాఖ ఉంది కమిషన్ల కోసమేనని, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం తప్పదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
కసిరెడ్డి మణికంఠ రెడ్డి హెచ్చరించారు
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని  నిరసిస్తూ మంగళవారం కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్కూటీలు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఖాళీ పర్సులను ప్రదర్శిస్తూ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి  మాట్లాడుతూ  ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ,స్కాలర్షిప్ బకాయిలు  విడుదల చేయకపోతే విద్యార్థులు వారి తల్లితండ్రులు  జేబులోంచి సర్టిఫికెట్ల కోసం కళాశాలకు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి  వచ్చిందని దీంతో పర్సులు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్‌టాప్‌లను
,యువవికాసం  పేరుతో 5లక్షల విద్యా భరోసా కార్డు ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని , ఒక్కొక్క హామీ అమలు చేస్తున్నాం ఇది ప్రజాపాలనని చెబుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల హామీలను అమలుచేయకాపోవడానికి కారణం ఎందని? విద్యార్థుల హామీల అమలు చేయకుండా  ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఓట్లతో ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని,
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకుండా విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని బడ్జెట్ లో 15%నిధులు ఇవ్వాలని ,
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా వాటిని అమలు చేసి విద్యార్థుల పట్ల తమ చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి నిరూపించుకోవాలని, రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని విద్యా శాఖకు న్యాయం చేయకుంటే విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియమించాలని, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని లేనిపక్షంలో  ఢిల్లీ తరహా ఉద్యమాన్ని తెలంగాణ గల్లీలలో విద్యార్థులను ఏకం చేసి ఉద్యమిస్తామని మణికంఠ రెడ్డి  హెచ్చరించారు
కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్,
నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నూనావత్ శ్రీనివాస్ నాయక్, గర్ల్స్ వింగ్ నాయకురాలు జోష్ణ,నగర నాయకులు సందీప్ రెడ్డి, బోయినీ విష్ణు,
అరవింద్,సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతుల అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్, అలాగే కూరగాయలు, పూల తోటల సాగు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతుల అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్, అలాగే కూరగాయలు, పూల తోటల సాగు చేస్తున్నారు. కాలానికి అనుగుణంగా పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక దృష్టి.. పక్కా కార్యాచరణ సత్పలితాలు ఇస్తున్నాయి. ప్రతి వారం జిల్లా కలెక్టర్ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్న రైతులను నేరుగా కలిసి సాగు విధానాలు, పంట దిగుబడి, ఆదాయం తదితర వివరాలు సేకరిస్తూ.. ప్రభుత్వ సబ్సిడీలు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రణాళిక ప్రకారం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతు వేదికలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించారు. ఆయిల్ పామ్, కూరగాయలు, పూల మొక్కల సాగుతో లాభాలను వివరిస్తూ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు, యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ.. కరపత్రాలు రైతులకు పంచి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఉద్యానవన, వ్యవసాయ శాఖ, సహకార శాఖ అధికారులతో నిర్వహించారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 420 ఎకరాల్లో రైతులు వరి సాగు నుంచి ఆయిల్ పామ్ సాగులోకి మారారు. 1250 ఎకరాల్లో కూరగాయల సాగు ఎల్ నినో ప్రభావం, ఇబ్బందులు అధిగమించేందుకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి ఆదాయం పొందాలనే ఉద్దేశం జిల్లాలోని రైతులు దాదాపు 1250 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు, 35 ఎకరాల్లో వివిధ రకాల పూల మొక్కలు సాగు చేస్తున్నారు. ఆయా పంటల సాగుతో రైతులకు నిరంతర ఆదాయం సమకూరుతున్నది.సంప్రదాయ వరిసాగుకు స్వస్తి పలికి 25 నుంచి ముప్పై ఏండ్ల పాటు ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్ తోటల సాగు వైపు రైతులు మారారు. ఈ సీజన్లో జిల్లాలో ఇప్పటివరకు 162 మంది రైతులు 420 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. మొదటి మూడు ఏండ్లపాటు అంతర పంటలు సాగు చేసి ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం ఆయిల్ పామ్ ఒక టన్నుకు రూ. 23 వేలపైగా ధర ఉంది. జిల్లాలో సంప్రదాయ వరి సాగుకు స్వస్తి పలుకుతూ.. మిగితా పంటలు సాగు చేస్తున్న ఆదర్శ రైతులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి మంగళవారం క్షేత్రస్థాయిలో కలిసి .. సాగు విధానాలు, దిగుబడి, లాభాలు తదితర అంశాలు తెలుసుకొని.. అభినందిస్తున్నారు. రెండు ఎకరాల్లో బంతి పూల సాగు గంభీరావుపేట మండలం గజ సింగవరంలో రైతు బోయిని మల్లేశం తనకు ఉన్న మూడున్నర ఎకరాల నుంచి రెండు ఎకరాలలో జూలైలో బంతి పూల సాగు చేపట్టారు. ఈ పంట నాటిన 60-65 రోజుల నుంచి సెప్టెంబర్ నుండి ప్రారంభమై డిసెంబర్ వరకు కొనసాగుతుంది. ప్రతి 2-3 రోజుల వ్యవధిలో పూల కోత చేయవచ్చు, ఇది 60-75 రోజుల పాటు కొనసాగుతుంది. ఎకరానికి సుమారు 45-50 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. రెండు ఎకరాల సాగుకు గాను రైతు రూ. 50 వేల నుంచి రూ. 60వేల వరకు ఖర్చు చేశారు. ఇందులో ఉద్యాన శాఖ ద్వారా విత్తనాలు, ఎరువులకు కలిపి 50% రాయితీ లేదా ఎకరానికి రూ. 8వేల చొప్పున గరిష్టంగా ఐదు ఎకరాల వరకు రాయితీ అందనుంది. రైతుకు సగటున ఒక్కో కిలో బంతి పూలకు రూ. 60/- ధర లభిస్తుంది. దసరా, దీపావళి, శుభకార్యాలు, అయ్యప్ప పూజా కార్యక్రమాలతో ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే ఉంది. జిల్లా కలెక్టర్ అభినందన గజ సింగవరంలో రైతు బోయిని మల్లేశం వరి సాగును వదిలి బంతి పూల సాగు చేస్తుండగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? పంట ఎన్ని రోజుల్లో చేతికి వస్తుంది? ఎంత ఆదాయం వస్తుంది? అనే వివరాలను రైతు మల్లేశంను అడిగి తెలుసుకున్నారు. అతడిని శాలువాతో సన్మానించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వరి పంటకు ప్రత్యామ్నాయంగా బంతి పూల సాగు చేయడం అభినందనీయమని కొనియాడారు. మిగితా రైతులు ఆదర్శంగా తీసుకొని తమకు ఉన్న భూమిలో ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేసి ఆదాయం పొందాలని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. ఉద్యానవన శాఖ, ఇతర శాఖల నుంచి వచ్చే ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. పరిశీలనలో సర్పంచ్ ఉమ్మారెడ్డి విమల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతుల అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్, అలాగే కూరగాయలు, పూల తోటల సాగు చేస్తున్నారు. 
ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతుల అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్, అలాగే కూరగాయలు, పూల తోటల సాగు చేస్తున్నారు. కాలానికి అనుగుణంగా పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక దృష్టి.. పక్కా కార్యాచరణ సత్పలితాలు ఇస్తున్నాయి. ప్రతి వారం జిల్లా కలెక్టర్ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్న రైతులను నేరుగా కలిసి సాగు విధానాలు, పంట దిగుబడి, ఆదాయం తదితర వివరాలు సేకరిస్తూ.. ప్రభుత్వ సబ్సిడీలు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నారు.
విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రణాళిక ప్రకారం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతు వేదికలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించారు. ఆయిల్ పామ్, కూరగాయలు, పూల మొక్కల సాగుతో లాభాలను వివరిస్తూ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు, యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ.. కరపత్రాలు రైతులకు పంచి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఉద్యానవన, వ్యవసాయ శాఖ, సహకార శాఖ అధికారులతో నిర్వహించారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 420 ఎకరాల్లో రైతులు వరి సాగు నుంచి ఆయిల్ పామ్ సాగులోకి మారారు.
1250 ఎకరాల్లో కూరగాయల సాగు
ఎల్ నినో ప్రభావం, ఇబ్బందులు అధిగమించేందుకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి ఆదాయం పొందాలనే ఉద్దేశం జిల్లాలోని రైతులు దాదాపు 1250 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు, 35 ఎకరాల్లో వివిధ రకాల పూల మొక్కలు సాగు చేస్తున్నారు. ఆయా పంటల సాగుతో రైతులకు నిరంతర ఆదాయం సమకూరుతున్నది.సంప్రదాయ వరిసాగుకు స్వస్తి పలికి 25 నుంచి ముప్పై ఏండ్ల పాటు ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్ తోటల సాగు వైపు రైతులు మారారు. ఈ సీజన్లో జిల్లాలో ఇప్పటివరకు 162 మంది రైతులు 420 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. మొదటి మూడు ఏండ్లపాటు అంతర పంటలు సాగు చేసి ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం ఆయిల్ పామ్ ఒక టన్నుకు రూ. 23 వేలపైగా ధర ఉంది. జిల్లాలో సంప్రదాయ వరి సాగుకు స్వస్తి పలుకుతూ.. మిగితా పంటలు సాగు చేస్తున్న ఆదర్శ రైతులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి మంగళవారం క్షేత్రస్థాయిలో కలిసి .. సాగు విధానాలు, దిగుబడి, లాభాలు తదితర అంశాలు తెలుసుకొని.. అభినందిస్తున్నారు.
రెండు ఎకరాల్లో బంతి పూల సాగు 
గంభీరావుపేట మండలం గజ సింగవరంలో రైతు బోయిని మల్లేశం తనకు ఉన్న మూడున్నర ఎకరాల నుంచి రెండు ఎకరాలలో జూలైలో బంతి పూల సాగు చేపట్టారు. ఈ పంట నాటిన 60-65 రోజుల నుంచి సెప్టెంబర్ నుండి ప్రారంభమై డిసెంబర్ వరకు కొనసాగుతుంది. ప్రతి 2-3 రోజుల వ్యవధిలో పూల కోత చేయవచ్చు, ఇది 60-75 రోజుల పాటు కొనసాగుతుంది. ఎకరానికి సుమారు 45-50 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. రెండు ఎకరాల సాగుకు గాను రైతు రూ. 50 వేల నుంచి రూ. 60వేల వరకు ఖర్చు చేశారు. ఇందులో ఉద్యాన శాఖ ద్వారా విత్తనాలు, ఎరువులకు కలిపి 50% రాయితీ లేదా ఎకరానికి రూ. 8వేల చొప్పున గరిష్టంగా ఐదు ఎకరాల వరకు రాయితీ అందనుంది. రైతుకు సగటున ఒక్కో కిలో బంతి పూలకు రూ. 60/- ధర లభిస్తుంది. దసరా, దీపావళి, శుభకార్యాలు, అయ్యప్ప పూజా కార్యక్రమాలతో ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే ఉంది.
జిల్లా కలెక్టర్ అభినందన
గజ సింగవరంలో రైతు బోయిని మల్లేశం వరి సాగును వదిలి బంతి పూల సాగు చేస్తుండగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? పంట ఎన్ని రోజుల్లో చేతికి వస్తుంది? ఎంత ఆదాయం వస్తుంది? అనే వివరాలను రైతు మల్లేశంను అడిగి తెలుసుకున్నారు. అతడిని శాలువాతో సన్మానించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వరి పంటకు ప్రత్యామ్నాయంగా బంతి పూల సాగు చేయడం అభినందనీయమని కొనియాడారు. మిగితా రైతులు ఆదర్శంగా తీసుకొని తమకు ఉన్న భూమిలో ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేసి ఆదాయం పొందాలని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. ఉద్యానవన శాఖ, ఇతర శాఖల నుంచి వచ్చే ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.
పరిశీలనలో సర్పంచ్ ఉమ్మారెడ్డి విమల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • వన మహోత్సవంలో భాగస్వాములు కావాలి: సీఐ రామచందర్ రావు... పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కరీంనగర్ వన్ టౌన్ సీఐ రామచందర్ రావు పిలుపునిచ్చారు. కరీంనగర్ 1వ పట్టణ పోలీస్ శాఖ, 'ఫ్రెండ్లీ వాకర్స్' సంయుక్త ఆధ్వర్యంలో GP గ్రౌండ్‌లో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీఐ రామచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంచడం ద్వారానే భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్లీ వాకర్స్ సభ్యులు, స్థానిక పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    3
    వన మహోత్సవంలో భాగస్వాములు కావాలి: సీఐ రామచందర్ రావు... 
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కరీంనగర్ వన్ టౌన్ సీఐ రామచందర్ రావు పిలుపునిచ్చారు. కరీంనగర్ 1వ పట్టణ పోలీస్ శాఖ, 'ఫ్రెండ్లీ వాకర్స్' సంయుక్త ఆధ్వర్యంలో GP గ్రౌండ్‌లో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీఐ రామచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంచడం ద్వారానే భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్లీ వాకర్స్ సభ్యులు, స్థానిక పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నేత్రదానం చేయండి.. మరొకరికి చూపు ఇవ్వండి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ నేత్రదానం ద్వారా చూపును కోల్పోయిన వారికి కొత్త జీవితాన్ని అందించవచ్చని, ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అన్నారు. జాతీయ అంధత్వం, దృష్టిలోపాల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహిస్తున్న 41వ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా మంగళవారం సిరిసిల్ల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి గాంధీ చౌక్ వరకు నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక వ్యక్తి మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా సాధారణంగా ఇద్దరు చూపు కోల్పోయిన వ్యక్తులకు చూపు పునరుద్ధరణకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. “ఒకరి జీవితం ముగిసిన చోట.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు ప్రారంభమయ్యేలా నేత్రదానం దోహదపడుతుంది” అని అన్నారు. వ్యక్తి మరణించిన అనంతరం సాధ్యమైనంత త్వరగా, సాధారణంగా 6 నుంచి 8 గంటలలోపు నేత్ర కణజాలాన్ని సేకరించే అవకాశం ఉంటుందని తెలిపారు. నేత్రదానం వల్ల మృతదేహం రూపంలో ఎలాంటి మార్పు ఉండదని, వైద్య నిపుణులు అవసరమైన నేత్ర కణజాలాన్ని గౌరవప్రదంగా సేకరిస్తారని స్పష్టం చేశారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. మరణానంతరం నేత్రదానానికి కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరారు. రక్తపోటు, క్షయవ్యాధి, ఉబ్బసం ఉన్నవారు, కళ్లద్దాలు ఉపయోగించేవారు, కంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారు కూడా కొన్ని సందర్భాల్లో నేత్రదానం చేయవచ్చని తెలిపారు. అయితే నేత్రదానానికి అర్హతను వైద్య నిపుణులు నిర్ధారిస్తారని పేర్కొన్నారు. నేత్రదానం ప్రతి కుటుంబ ఆచారంగా మారాలని, నేత్రదానం కేవలం దానం మాత్రమే కాదని, మరణానంతరం కూడా మానవత్వాన్ని కొనసాగించే గొప్ప సేవ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తేజస్విని, జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమ అధికారి డాక్టర్ నయం జహా, నేత్ర వైద్య సహాయకులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    2
    ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు

నేత్రదానం చేయండి.. మరొకరికి చూపు ఇవ్వండి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్


నేత్రదానం ద్వారా చూపును కోల్పోయిన వారికి కొత్త జీవితాన్ని అందించవచ్చని, ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అన్నారు.
జాతీయ అంధత్వం, దృష్టిలోపాల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహిస్తున్న 41వ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా మంగళవారం సిరిసిల్ల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి గాంధీ చౌక్ వరకు నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఒక వ్యక్తి మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా సాధారణంగా ఇద్దరు చూపు కోల్పోయిన వ్యక్తులకు చూపు పునరుద్ధరణకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. “ఒకరి జీవితం ముగిసిన చోట.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు ప్రారంభమయ్యేలా నేత్రదానం దోహదపడుతుంది” అని అన్నారు.
వ్యక్తి మరణించిన అనంతరం సాధ్యమైనంత త్వరగా, సాధారణంగా 6 నుంచి 8 గంటలలోపు నేత్ర కణజాలాన్ని సేకరించే అవకాశం ఉంటుందని తెలిపారు. నేత్రదానం వల్ల మృతదేహం రూపంలో ఎలాంటి మార్పు ఉండదని, వైద్య నిపుణులు అవసరమైన నేత్ర కణజాలాన్ని గౌరవప్రదంగా సేకరిస్తారని స్పష్టం చేశారు.
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. మరణానంతరం నేత్రదానానికి కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరారు. రక్తపోటు, క్షయవ్యాధి, ఉబ్బసం ఉన్నవారు, కళ్లద్దాలు ఉపయోగించేవారు, కంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారు కూడా కొన్ని సందర్భాల్లో నేత్రదానం చేయవచ్చని తెలిపారు. అయితే నేత్రదానానికి అర్హతను వైద్య నిపుణులు నిర్ధారిస్తారని పేర్కొన్నారు.
నేత్రదానం ప్రతి కుటుంబ ఆచారంగా మారాలని, నేత్రదానం కేవలం దానం మాత్రమే కాదని, మరణానంతరం కూడా మానవత్వాన్ని కొనసాగించే గొప్ప సేవ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తేజస్విని, జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమ అధికారి డాక్టర్ నయం జహా, నేత్ర వైద్య సహాయకులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • వేములవాడ రాజన్న ఆలయం సంబంధించిన కోడెలు మృతి చెందుతున్నాయి దానిపై విచారణ జరిపించాలన్న ప్రతాప రామకృష్ణ రాజన్న ఆలయానికి సంబంధించిన కోడెలు చనిపోతున్నాయి దానిపైన విచారణ జరిపించాలని ప్రతాప రామకృష్ణ కోరారు ఎందుకు చనిపోతున్నాయి ఎలా చనిపోతున్నాయి అని టెంపుల్ వారిని అడిగారు దానిపై కచ్చితంగా విచారణ జరిపించాలని ఆలయాన్ని కోరారు వేములవాడ వచ్చే ప్రతి భక్తులు కోడెలను దేవునిగా కొలుస్తూ కోడలు కడతారు దీనిపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలని కోరుతున్నారు
    1
    వేములవాడ రాజన్న ఆలయం సంబంధించిన కోడెలు మృతి చెందుతున్నాయి దానిపై విచారణ జరిపించాలన్న ప్రతాప రామకృష్ణ
రాజన్న ఆలయానికి సంబంధించిన కోడెలు చనిపోతున్నాయి దానిపైన విచారణ జరిపించాలని ప్రతాప రామకృష్ణ కోరారు ఎందుకు చనిపోతున్నాయి ఎలా చనిపోతున్నాయి అని టెంపుల్ వారిని అడిగారు దానిపై కచ్చితంగా విచారణ జరిపించాలని ఆలయాన్ని కోరారు వేములవాడ వచ్చే ప్రతి భక్తులు కోడెలను దేవునిగా కొలుస్తూ కోడలు కడతారు దీనిపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలని కోరుతున్నారు
    user_GUDOORU SANTHOSH KUMAR
    GUDOORU SANTHOSH KUMAR
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • 16 ఏళ్ల లోపు పిల్లలకు సామాజిక మాధ్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించాలి హుస్నాబాద్ పట్టణంలో ప్రముఖ సంఘ సేవకులు, బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం బాలల హక్కుల కోసం బాల్య వివాహ నిర్మాణ కోసం గత రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు వచ్చే సెప్టెంబర్ మాసంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన బాల్యవివాహల నిర్మూలన బాలల హక్కులు తెలిపేందుకు ప్రజలకు విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్నారి బాలబాలికల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారిని దయతో కోరుతూ 16 ఏళ్ల లోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల వినియోగంపై నిషేధం విధించాలని ఆయన కోరారు ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో నల్లగొండ మరికొన్ని సంఘటనలు చూస్తా ఉంటే ఎంతో బాధగా అయితుందని ఆయన పేర్కొన్నారు స్మార్ట్‌ఫోన్ నేటి తరం పిల్లలు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన ఆందోళన చెందారు* *రాష్ట్రంలో కొంతమంది చిన్నారి విద్యార్థులు మద్యం, సిగరెట్ వంటి అలవాట్లకు బానిస కావడం* *గంజాయి, డ్రగ్స్ వంటి ప్రాణాంతక మత్తు పదార్థాల ఉచ్చులో పడటం* *ఇంటర్నెట్ ప్రభావంతో అమ్మాయిలు పురుషులపై, అబ్బాయిలు స్త్రీలపై ద్వేషం పెంచుకోవడం* *విలాసాలకు అలవాటుపడి, సులభ మార్గాల్లో డబ్బు* *సంపాదించాలని వెంపర్లాడటం.* *మనుషుల పట్ల జాలి, దయ తగ్గిపోయి క్రూరత్వం*, *హింసాత్మక ఆలోచనలు పెరగడం. చదువును పూర్తిగా పక్కన పెట్టేసి భవిష్యత్తును పాడు చేసుకోవడం కొంతమంది విద్యార్థులు తయారవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు* *చెడు సావాసాలతో సమాజానికి హానికరమైన శక్తులుగా మారడం బాధాకరమైన పేర్కొన్నారు* *రాత్రింబవళ్లు ఫోన్‌కు అతుక్కుపోయి నిద్రలేమి* *తీవ్ర అనారోగ్యాల బారిన పడటం* *తల్లిదండ్రులు, పెద్దలు మంచి చెప్పినా వినకుండా ఎదురు తిరిగే మనస్తత్వం కలగడం ఇంతవరకు సమజసమని విద్యార్థులు తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు* *ఒక్క స్మార్ట్‌ఫోన్ పిల్లల చేతికి సరైన పర్యవేక్షణ లేకపోతే పై వాటిలో కనీసం రెండు మూడు సమస్యలైనా వారి జీవితాల్లోకి రావడం ఖాయం తల్లిదండ్రులారా గమనించండి* *పిల్లలు మితిమీరిన మొబైల్ వ్యసనంలో పడి దారితప్పితే చివరికి మీ కుటుంబ శాంతికి* *ఆస్తికి, భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది పిల్లల పట్ల* *జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు* *తల్లిదండ్రులు కు విజ్ఞప్తి* *పిల్లల చేతికి ఫోన్ ఇచ్చి వదిలేయకుండా, వారి అలవాట్లు మరియు స్క్రీన్ సమయంపై కచ్చితమైన పర్యవేక్షణ ఉంచాలి* *ఉపాధ్యాయులు* *తరగతి గదుల్లో మొబైల్ వాడకాన్ని నియంత్రిస్తూ, విద్యార్థుల్లో నైతిక విలువలు మరియు క్రమశిక్షణను పెంపొందించాలి* *విద్యార్థి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, హానికర డిజిటల్ కంటెంట్‌పై కఠిన చట్టాలు తేవాలి ఆయన ప్రభుత్వాన్ని కోరారు సాంకేతిక జ్ఞానాన్ని పెంచే సాధనం కావాలి కానీ, జీవితాన్ని నాశనం చేసే వ్యసనం కాకూడదు. రాష్ట్రంలో కొంతమంది విద్యార్థులు మారకద్రవ్యాలు వాడుతూ వాటికి బానిసై సమాజంలో చీడపురుగుల తయారవుతున్నారని ఆయన ఆందోళన చెందారు అలాంటి వారిపై కఠినంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించాలని మానవత విలువలు సనాత ధర్మం పెంచేందుకు తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని వారు పేర్కొన్నారు అధిక సెల్ ఫోన్ వినియోగం వల్ల పిల్లల్లో కంటి చూపు ఏకాగ్రత లోపం, నిద్రలేమి, నిరుత్సాహం పెరుగుతున్నాయి. హింసాత్మక విషయాలు అపరిచితులతో పరిచయాలు సైబర్ వేధింపులు పిల్లల భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయి ఆయన అన్నారు అలాగే పిల్లల కోసం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే తీసుకున్న చర్యలు ఆదర్శమని ఆయన పేర్కొన్నారుతెలంగాణలో కూడా నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు కాబట్టి పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర శాసనసభ సమావేశంలో చట్టం చేయాలని ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర కమిటీ నుండి విజ్ఞప్తి చేస్తున్నాము ఆయన తెలిపారు ఈ సమావేశంలో న్యాయవాది జేరిపోతుల కిరణ్ కుమార్ నర్రా రాజిరెడ్డి కొమ్ముల నగేష్ తదితరులు పాల్గొన్నారు.*
    1
    16 ఏళ్ల లోపు పిల్లలకు సామాజిక మాధ్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించాలి
హుస్నాబాద్ పట్టణంలో   ప్రముఖ సంఘ సేవకులు, బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం బాలల హక్కుల కోసం బాల్య వివాహ నిర్మాణ కోసం గత రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు వచ్చే సెప్టెంబర్ మాసంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన బాల్యవివాహల నిర్మూలన బాలల హక్కులు తెలిపేందుకు ప్రజలకు విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్నారి బాలబాలికల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారిని దయతో  కోరుతూ 16 ఏళ్ల లోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల వినియోగంపై నిషేధం విధించాలని ఆయన కోరారు ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో నల్లగొండ మరికొన్ని  సంఘటనలు చూస్తా ఉంటే ఎంతో బాధగా అయితుందని ఆయన పేర్కొన్నారు స్మార్ట్‌ఫోన్ నేటి తరం పిల్లలు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన ఆందోళన చెందారు* *రాష్ట్రంలో కొంతమంది చిన్నారి విద్యార్థులు మద్యం, సిగరెట్ వంటి అలవాట్లకు బానిస కావడం*
*గంజాయి, డ్రగ్స్ వంటి ప్రాణాంతక మత్తు పదార్థాల ఉచ్చులో పడటం*
*ఇంటర్నెట్ ప్రభావంతో అమ్మాయిలు పురుషులపై, అబ్బాయిలు స్త్రీలపై ద్వేషం పెంచుకోవడం*
*విలాసాలకు అలవాటుపడి, సులభ మార్గాల్లో డబ్బు* *సంపాదించాలని వెంపర్లాడటం.*
*మనుషుల పట్ల జాలి, దయ తగ్గిపోయి క్రూరత్వం*, *హింసాత్మక ఆలోచనలు పెరగడం. చదువును పూర్తిగా పక్కన పెట్టేసి భవిష్యత్తును పాడు చేసుకోవడం కొంతమంది విద్యార్థులు తయారవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు*
*చెడు సావాసాలతో సమాజానికి హానికరమైన శక్తులుగా మారడం బాధాకరమైన పేర్కొన్నారు*
*రాత్రింబవళ్లు ఫోన్‌కు అతుక్కుపోయి నిద్రలేమి* 
*తీవ్ర అనారోగ్యాల బారిన పడటం*
*తల్లిదండ్రులు, పెద్దలు మంచి చెప్పినా వినకుండా ఎదురు తిరిగే మనస్తత్వం కలగడం ఇంతవరకు సమజసమని విద్యార్థులు తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు*
*ఒక్క స్మార్ట్‌ఫోన్ పిల్లల చేతికి సరైన పర్యవేక్షణ లేకపోతే పై వాటిలో కనీసం రెండు మూడు సమస్యలైనా వారి జీవితాల్లోకి రావడం ఖాయం తల్లిదండ్రులారా గమనించండి*
*పిల్లలు మితిమీరిన మొబైల్ వ్యసనంలో పడి దారితప్పితే చివరికి మీ కుటుంబ శాంతికి* *ఆస్తికి, భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది పిల్లల పట్ల* *జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు*
*తల్లిదండ్రులు కు విజ్ఞప్తి*
*పిల్లల చేతికి ఫోన్ ఇచ్చి వదిలేయకుండా, వారి అలవాట్లు మరియు స్క్రీన్ సమయంపై కచ్చితమైన పర్యవేక్షణ ఉంచాలి*
*ఉపాధ్యాయులు*
*తరగతి గదుల్లో మొబైల్ వాడకాన్ని నియంత్రిస్తూ, విద్యార్థుల్లో నైతిక విలువలు మరియు క్రమశిక్షణను పెంపొందించాలి*
*విద్యార్థి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, హానికర డిజిటల్ కంటెంట్‌పై కఠిన చట్టాలు తేవాలి ఆయన ప్రభుత్వాన్ని కోరారు సాంకేతిక  జ్ఞానాన్ని పెంచే సాధనం కావాలి కానీ, జీవితాన్ని నాశనం చేసే వ్యసనం కాకూడదు. రాష్ట్రంలో కొంతమంది విద్యార్థులు మారకద్రవ్యాలు  వాడుతూ వాటికి బానిసై సమాజంలో చీడపురుగుల తయారవుతున్నారని ఆయన ఆందోళన చెందారు అలాంటి వారిపై కఠినంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించాలని మానవత విలువలు సనాత ధర్మం పెంచేందుకు తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని వారు పేర్కొన్నారు అధిక సెల్ ఫోన్ వినియోగం వల్ల పిల్లల్లో కంటి చూపు ఏకాగ్రత లోపం,  నిద్రలేమి, నిరుత్సాహం పెరుగుతున్నాయి. హింసాత్మక విషయాలు అపరిచితులతో పరిచయాలు సైబర్ వేధింపులు పిల్లల భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయి ఆయన అన్నారు అలాగే పిల్లల కోసం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే తీసుకున్న చర్యలు ఆదర్శమని ఆయన పేర్కొన్నారుతెలంగాణలో కూడా నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు కాబట్టి పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర శాసనసభ సమావేశంలో  చట్టం చేయాలని ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర కమిటీ నుండి విజ్ఞప్తి చేస్తున్నాము ఆయన తెలిపారు ఈ సమావేశంలో న్యాయవాది జేరిపోతుల కిరణ్ కుమార్ నర్రా రాజిరెడ్డి కొమ్ముల నగేష్ తదితరులు పాల్గొన్నారు.*
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.