logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* *జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* పెద్దపల్లి, ఆగస్టు 24: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ మరియు తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ గార్ల అధ్యక్షతన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గార్కి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీల జనాభా, సామాజిక–ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా నమోదు చేసేందుకు జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్, తెలంగాణ రక్షణ సేన నాయకులు సిరవేన స్వప్న, బొల్లబత్తుల భూమయ్య,బొడిగె మహేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కన్న రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లక్ష్మణ్, జిల్లా అధికార ప్రతినిధి కంకటి శ్రీనివాస్, యువజన అధ్యక్షుడు నోమూరి శ్రీధర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం మరియు ఇతర రంగాల్లో తగిన న్యాయం జరగాలంటే సమగ్ర కుల గణన ఎంతో అవసరమని నాయకులు పేర్కొన్నారు. బీసీల న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు.

1 day ago
user_Thalapalli Ramesh
Thalapalli Ramesh
బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
1 day ago

జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* *జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* పెద్దపల్లి, ఆగస్టు 24: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ మరియు తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ గార్ల అధ్యక్షతన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గార్కి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీల జనాభా, సామాజిక–ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా నమోదు చేసేందుకు జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్, తెలంగాణ రక్షణ సేన నాయకులు సిరవేన స్వప్న, బొల్లబత్తుల భూమయ్య,బొడిగె మహేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కన్న రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లక్ష్మణ్, జిల్లా అధికార ప్రతినిధి కంకటి శ్రీనివాస్, యువజన అధ్యక్షుడు నోమూరి శ్రీధర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం మరియు ఇతర రంగాల్లో తగిన న్యాయం జరగాలంటే సమగ్ర కుల గణన ఎంతో అవసరమని నాయకులు పేర్కొన్నారు. బీసీల న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి : జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష పెద్దపల్లి జిల్లాలో ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి అని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* తెలిపారు. జిల్లాలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, నిర్మాణం పూర్తయిన 2బీహెచ్‌కే ఇళ్ల కేటాయింపు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో* కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* జిల్లాలో నిర్మాణం పూర్తయి ఇంకా కేటాయించని 2బీహెచ్‌కే ఇళ్లను వెంటనే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు కేటాయించేలా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లు ఖాళీగా ఉండకుండా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి ఇళ్లను కేటాయించే ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఇందుకోసం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అవసరమైన పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పొందేందుకు అవసరమైన లబ్ధిదారుల వివరాలన్నింటినీ సెప్టెంబర్ 5, 2026లోగా ఎంఐఎస్ పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. లబ్ధిదారుల వివరాల నమోదు, డేటా అప్‌లోడ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకం ద్వారా ప్రయోజనం అందేలా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, అర్హులైన వారిని పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన పథకాల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ తెలిపారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు త్వరితగతిన అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పీడీ హౌసింగ్ పి. పవన్ కుమార్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి : జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష
పెద్దపల్లి జిల్లాలో ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి అని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* తెలిపారు.
జిల్లాలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, నిర్మాణం పూర్తయిన 2బీహెచ్‌కే ఇళ్ల కేటాయింపు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో* కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* జిల్లాలో నిర్మాణం పూర్తయి ఇంకా కేటాయించని 2బీహెచ్‌కే ఇళ్లను వెంటనే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు కేటాయించేలా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
నిర్మాణం పూర్తయిన ఇళ్లు ఖాళీగా ఉండకుండా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి ఇళ్లను కేటాయించే ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఇందుకోసం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అవసరమైన పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పొందేందుకు అవసరమైన లబ్ధిదారుల వివరాలన్నింటినీ సెప్టెంబర్ 5, 2026లోగా ఎంఐఎస్ పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. లబ్ధిదారుల వివరాల నమోదు, డేటా అప్‌లోడ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకం ద్వారా ప్రయోజనం అందేలా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, అర్హులైన వారిని పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు.
గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన పథకాల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ తెలిపారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు త్వరితగతిన అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో పీడీ హౌసింగ్ పి. పవన్ కుమార్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    2 hrs ago
  • 34 నెలల పాలనలో విద్యార్థుల హామీల అమలేది రేవంత్ రెడ్డి? స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, ఫీజు బకాయిలు ఎప్పుడిస్తారు? విద్యార్థుల హామీలు అమలు చేయకపోతే ఉద్యమం ఉధృతం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి స్కూటీలు, ల్యాప్‌టాప్‌లతో ఖాళీ పర్సులు ప్రదర్శిస్తూ ఏఐఎస్ఎఫ్ విన్నూత నిరసన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్‌టాప్‌లను, 5లక్షల విద్య భరోసా కార్డును, పెండింగ్ ఫీజు బకాయిలను అధికారంలోకి వచ్చి 34 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని, సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని విద్యార్థుల హామీల అమలు చేయకుండా విద్యార్థులకు ఓట్లు లేవని చిన్నచూపు చూస్తున్నాడని, రాష్ట్రంలో విద్యార్థులు సమస్యల కోసం ప్రతి రోజు రోడ్డు ఎక్కుతున్నారని,సీఎం వద్ద విద్యాశాఖ ఉంది కమిషన్ల కోసమేనని, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం తప్పదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్కూటీలు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఖాళీ పర్సులను ప్రదర్శిస్తూ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ,స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోతే విద్యార్థులు వారి తల్లితండ్రులు జేబులోంచి సర్టిఫికెట్ల కోసం కళాశాలకు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని దీంతో పర్సులు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్‌టాప్‌లను ,యువవికాసం పేరుతో 5లక్షల విద్యా భరోసా కార్డు ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని , ఒక్కొక్క హామీ అమలు చేస్తున్నాం ఇది ప్రజాపాలనని చెబుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల హామీలను అమలుచేయకాపోవడానికి కారణం ఎందని? విద్యార్థుల హామీల అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఓట్లతో ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకుండా విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని బడ్జెట్ లో 15%నిధులు ఇవ్వాలని , ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా వాటిని అమలు చేసి విద్యార్థుల పట్ల తమ చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి నిరూపించుకోవాలని, రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని విద్యా శాఖకు న్యాయం చేయకుంటే విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియమించాలని, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని లేనిపక్షంలో ఢిల్లీ తరహా ఉద్యమాన్ని తెలంగాణ గల్లీలలో విద్యార్థులను ఏకం చేసి ఉద్యమిస్తామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నూనావత్ శ్రీనివాస్ నాయక్, గర్ల్స్ వింగ్ నాయకురాలు జోష్ణ,నగర నాయకులు సందీప్ రెడ్డి, బోయినీ విష్ణు, అరవింద్,సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు
    1
    34 నెలల పాలనలో విద్యార్థుల హామీల అమలేది రేవంత్ రెడ్డి?

స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, ఫీజు బకాయిలు ఎప్పుడిస్తారు?

విద్యార్థుల హామీలు అమలు చేయకపోతే ఉద్యమం ఉధృతం

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి

స్కూటీలు, ల్యాప్‌టాప్‌లతో ఖాళీ పర్సులు ప్రదర్శిస్తూ ఏఐఎస్ఎఫ్ విన్నూత నిరసన

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్‌టాప్‌లను, 5లక్షల విద్య భరోసా కార్డును, పెండింగ్ ఫీజు బకాయిలను  అధికారంలోకి వచ్చి 34 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని, సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద  విద్యాశాఖ పెట్టుకొని విద్యార్థుల హామీల అమలు చేయకుండా  విద్యార్థులకు ఓట్లు లేవని చిన్నచూపు చూస్తున్నాడని, రాష్ట్రంలో విద్యార్థులు సమస్యల కోసం ప్రతి రోజు రోడ్డు ఎక్కుతున్నారని,సీఎం వద్ద విద్యాశాఖ ఉంది కమిషన్ల కోసమేనని, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం తప్పదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
కసిరెడ్డి మణికంఠ రెడ్డి హెచ్చరించారు
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని  నిరసిస్తూ మంగళవారం కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్కూటీలు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఖాళీ పర్సులను ప్రదర్శిస్తూ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి  మాట్లాడుతూ  ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ,స్కాలర్షిప్ బకాయిలు  విడుదల చేయకపోతే విద్యార్థులు వారి తల్లితండ్రులు  జేబులోంచి సర్టిఫికెట్ల కోసం కళాశాలకు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి  వచ్చిందని దీంతో పర్సులు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్‌టాప్‌లను
,యువవికాసం  పేరుతో 5లక్షల విద్యా భరోసా కార్డు ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని , ఒక్కొక్క హామీ అమలు చేస్తున్నాం ఇది ప్రజాపాలనని చెబుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల హామీలను అమలుచేయకాపోవడానికి కారణం ఎందని? విద్యార్థుల హామీల అమలు చేయకుండా  ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఓట్లతో ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని,
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకుండా విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని బడ్జెట్ లో 15%నిధులు ఇవ్వాలని ,
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా వాటిని అమలు చేసి విద్యార్థుల పట్ల తమ చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి నిరూపించుకోవాలని, రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని విద్యా శాఖకు న్యాయం చేయకుంటే విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియమించాలని, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని లేనిపక్షంలో  ఢిల్లీ తరహా ఉద్యమాన్ని తెలంగాణ గల్లీలలో విద్యార్థులను ఏకం చేసి ఉద్యమిస్తామని మణికంఠ రెడ్డి  హెచ్చరించారు
కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్,
నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నూనావత్ శ్రీనివాస్ నాయక్, గర్ల్స్ వింగ్ నాయకురాలు జోష్ణ,నగర నాయకులు సందీప్ రెడ్డి, బోయినీ విష్ణు,
అరవింద్,సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    33 min ago
  • పొలంలోకి అడుగుపెట్టిన చిన్నారులు.. రైతు కష్టాన్ని తెలుసుకున్న విద్యార్థులు పొనకల్: తరగతి గదిలో పుస్తకాల్లో చదివిన వ్యవసాయ పాఠాలను ప్రత్యక్ష అనుభవంగా మార్చుకున్నారు పొనకల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పొనకల్ శివారులోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన చిన్నారులు వరి సాగు విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. విత్తనం నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులు పడే శ్రమను తెలుసుకున్న విద్యార్థులు.. నారుమడి, నీటి వినియోగం, నేల స్వభావం, నాట్ల ప్రక్రియ తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలంలోకి దిగి స్వయంగా నారు మోసి, నాట్లు వేసి వ్యవసాయ పనుల్లో భాగస్వాములయ్యారు. దీంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. క్షేత్రస్థాయి అనుభవం విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడంతో పాటు పరిశీలన, ప్రశ్నించే తత్వాన్ని అభివృద్ధి చేస్తుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పుస్తక జ్ఞానానికి ఆచరణాత్మక అనుభవం తోడైతే అభ్యసనం మరింత ఫలప్రదంగా ఉంటుందని హెచ్‌ఎం కే. రాజేశం తెలిపారు. రైతుల శ్రమ, వ్యవసాయం ప్రాధాన్యతను చిన్నారులు అర్థం చేసుకునేలా కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీకాంత్, వనిత, సుజాత, పలువురు రైతులు పాల్గొన్నారు.
    1
    పొలంలోకి అడుగుపెట్టిన చిన్నారులు.. రైతు కష్టాన్ని తెలుసుకున్న విద్యార్థులు
పొనకల్: తరగతి గదిలో పుస్తకాల్లో చదివిన వ్యవసాయ పాఠాలను ప్రత్యక్ష అనుభవంగా మార్చుకున్నారు పొనకల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పొనకల్ శివారులోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన చిన్నారులు వరి సాగు విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు.
విత్తనం నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులు పడే శ్రమను తెలుసుకున్న విద్యార్థులు.. నారుమడి, నీటి వినియోగం, నేల స్వభావం, నాట్ల ప్రక్రియ తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలంలోకి దిగి స్వయంగా నారు మోసి, నాట్లు వేసి వ్యవసాయ పనుల్లో భాగస్వాములయ్యారు. దీంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది.
క్షేత్రస్థాయి అనుభవం విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడంతో పాటు పరిశీలన, ప్రశ్నించే తత్వాన్ని అభివృద్ధి చేస్తుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పుస్తక జ్ఞానానికి ఆచరణాత్మక అనుభవం తోడైతే అభ్యసనం మరింత ఫలప్రదంగా ఉంటుందని హెచ్‌ఎం కే. రాజేశం తెలిపారు. రైతుల శ్రమ, వ్యవసాయం ప్రాధాన్యతను చిన్నారులు అర్థం చేసుకునేలా కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీకాంత్, వనిత, సుజాత, పలువురు రైతులు పాల్గొన్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • వన మహోత్సవంలో భాగస్వాములు కావాలి: సీఐ రామచందర్ రావు... పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కరీంనగర్ వన్ టౌన్ సీఐ రామచందర్ రావు పిలుపునిచ్చారు. కరీంనగర్ 1వ పట్టణ పోలీస్ శాఖ, 'ఫ్రెండ్లీ వాకర్స్' సంయుక్త ఆధ్వర్యంలో GP గ్రౌండ్‌లో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీఐ రామచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంచడం ద్వారానే భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్లీ వాకర్స్ సభ్యులు, స్థానిక పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    3
    వన మహోత్సవంలో భాగస్వాములు కావాలి: సీఐ రామచందర్ రావు... 
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కరీంనగర్ వన్ టౌన్ సీఐ రామచందర్ రావు పిలుపునిచ్చారు. కరీంనగర్ 1వ పట్టణ పోలీస్ శాఖ, 'ఫ్రెండ్లీ వాకర్స్' సంయుక్త ఆధ్వర్యంలో GP గ్రౌండ్‌లో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీఐ రామచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంచడం ద్వారానే భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్లీ వాకర్స్ సభ్యులు, స్థానిక పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • ఆనాడు ఓట్ల కోసమే వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే పాల్వాయి ఎమ్మెల్యే గెలిచాక అభివృద్ధికి తూట్లు.... అభివృద్ధి పట్టించుకోని సిర్పూర్ ఎమ్మెల్యే ఆనాడు ఓట్ల కోసమే వారి నాట్లు వేసిన పాల్వాయి ఎమ్మెల్యే కాకముందు వరి నాట్లు ఎమ్మెల్యే గెలిచాక అభివృద్ధికి తూట్లు .... ఎమ్మెల్యే గెలవక ముందు హరీష్ బాబు మీరు ఎక్కడ బురద ఉంటే అక్కడ వరి నాట్లు వేశారు,,మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత పరిస్థితి మారుతుంది అనుకుంటే గిరివెల్లి ప్రధాన రోడ్డు పైన BRS నాయకులు వరి నాట్లు వేస్తున్నారు అభివృద్ధి ఎక్కడ ఉంది గిరివెల్లి రోడ్డు సమస్యపై BRS నిరసన ఈ రోజు దహిగాం మండలం గిరివెల్లి గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి పూర్తిగా బురదమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ BRS నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బురదమయమైన రోడ్డులోనే వరి నాట్లు వేసి తమ నిరసనను వినూత్నంగా వ్యక్తం చేశారు. గేర్రె–గిరివెల్లి నుంచి మొట్లగూడ–రాంపూర్ వరకు రహదారిని వెంటనే మంజూరు చేసి, శాశ్వతంగా నిర్మించాలని MLA గారు, MLC గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని BRS నాయకులు డిమాండ్ చేశారు. ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిన ఈ రహదారి సమస్యను ఇకనైనా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో BRS మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    2
    ఆనాడు ఓట్ల కోసమే వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే పాల్వాయి 
ఎమ్మెల్యే గెలిచాక అభివృద్ధికి తూట్లు....
అభివృద్ధి పట్టించుకోని సిర్పూర్ ఎమ్మెల్యే
ఆనాడు ఓట్ల కోసమే వారి నాట్లు వేసిన పాల్వాయి 
ఎమ్మెల్యే కాకముందు వరి నాట్లు ఎమ్మెల్యే గెలిచాక అభివృద్ధికి తూట్లు ....
ఎమ్మెల్యే గెలవక ముందు  హరీష్ బాబు మీరు ఎక్కడ బురద ఉంటే అక్కడ వరి నాట్లు వేశారు,,మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత పరిస్థితి మారుతుంది అనుకుంటే 
గిరివెల్లి ప్రధాన రోడ్డు పైన BRS నాయకులు వరి నాట్లు వేస్తున్నారు అభివృద్ధి ఎక్కడ ఉంది 
గిరివెల్లి రోడ్డు సమస్యపై BRS నిరసన
ఈ రోజు దహిగాం మండలం గిరివెల్లి గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి పూర్తిగా బురదమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ BRS నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బురదమయమైన రోడ్డులోనే వరి నాట్లు వేసి తమ నిరసనను వినూత్నంగా వ్యక్తం చేశారు.
గేర్రె–గిరివెల్లి నుంచి మొట్లగూడ–రాంపూర్ వరకు రహదారిని వెంటనే మంజూరు చేసి, శాశ్వతంగా నిర్మించాలని MLA గారు, MLC గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని BRS నాయకులు డిమాండ్ చేశారు.
ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిన ఈ రహదారి సమస్యను ఇకనైనా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో BRS మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Golem Venkatesham Patel
    Golem Venkatesham Patel
    Salesperson కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • పర్యావరణ పరిరక్షణ బాధ్యత భావి తరాలదే కంపా సీసీఎఫ్ క్షితిజ సిర్పూర్(టి)లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో నిర్వహించిన "వనమహోత్సవం" కార్యక్రమంలో కంపా సీసీఎఫ్ క్షితిజ ఐ.ఎఫ్.ఎస్ పాల్గొన్నారు. అడవులను, వన్యప్రాణులను సంరక్షించి విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించి గొప్ప స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఎఫ్డీపీటీ శాంతారాం ఐ.ఎఫ్.ఎస్, ఎఫ్డివో భార్గవ్ కుమార్ ఐ.ఎఫ్.ఎస్, డా. అప్పయ్య ఏసీఎఫ్, వేణుబాబు ఏసీఎఫ్, ఎఫ్ఆర్ఓలు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సిర్పూర్(టి) సర్పంచ్ నాగమణి నానయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు
    4
    పర్యావరణ పరిరక్షణ బాధ్యత భావి తరాలదే

కంపా సీసీఎఫ్ క్షితిజ
సిర్పూర్(టి)లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో నిర్వహించిన "వనమహోత్సవం" కార్యక్రమంలో కంపా సీసీఎఫ్ క్షితిజ ఐ.ఎఫ్.ఎస్ పాల్గొన్నారు. అడవులను, వన్యప్రాణులను సంరక్షించి విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించి గొప్ప స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఎఫ్డీపీటీ శాంతారాం ఐ.ఎఫ్.ఎస్, ఎఫ్డివో భార్గవ్ కుమార్ ఐ.ఎఫ్.ఎస్, డా. అప్పయ్య ఏసీఎఫ్, వేణుబాబు ఏసీఎఫ్, ఎఫ్ఆర్ఓలు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సిర్పూర్(టి) సర్పంచ్ నాగమణి నానయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • దౌడేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమం మనిషి భవిష్యత్తుకు ఆధారం మొక్కలేనని, వాటిని కాపాడుకోవాలని లక్షెట్టిపేట అటవీశాఖ డిఆర్ఓ సునీత అన్నారు. మంగళవారం మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ అల్తాఫ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
    1
    దౌడేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమం
మనిషి భవిష్యత్తుకు ఆధారం మొక్కలేనని, వాటిని కాపాడుకోవాలని లక్షెట్టిపేట అటవీశాఖ డిఆర్ఓ సునీత అన్నారు. మంగళవారం మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వన మహోత్సవం నిర్వహించారు. 
ఈ సందర్భంగా అటవీ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ అల్తాఫ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • సింగరేణి అంటే కేవలం బొగ్గు గనులు కాదు — తెలంగాణ అభివృద్ధికి వెన్నెముక. సింగరేణి కార్మికులకు రాఖీ లు కట్టిన BJP నాయకురాలు కందుల సంధ్యారాణి మండే ఎండలో, చీకటి గనుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న సింగరేణి కార్మికుల త్యాగాలకు మనందరం సెల్యూట్ చేయాలి. - రాఖీ అంటే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. అదే విధంగా కార్మికులు–కుటుంబాలు–సమాజం మధ్య అనుబంధాన్ని మరింత బలపరచాలి. - దేశానికి విద్యుత్ అందించడానికి, పరిశ్రమలు నడవడానికి సింగరేణి కార్మికుల శ్రమ ఎంతో కీలకం. - కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, ఆరోగ్యం, వారి పిల్లల భవిష్యత్తు మనందరి బాధ్యత. - విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సింగరేణి కార్మిక కుటుంబాలను ఎప్పటికీ మర్చిపోకూడదు. - ప్రతి కార్మికుడి ఇంట్లో ఆనందం ఉండాలి; ప్రతి కార్మిక కుటుంబానికి మెరుగైన విద్య, వైద్యం, గౌరవప్రదమైన జీవితం అందాలి. - సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వం మరియు యాజమాన్యం సానుకూలంగా పరిష్కరించాలి. - కార్మికుడి చెమట చుక్కలోనే సింగరేణి భవిష్యత్తు ఉంది. - ఈ రాఖీ సందర్భంగా సింగరేణి కార్మిక సోదరులందరికీ మనం ఒక మాట ఇవ్వాలి — వారి హక్కులు, సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటాం. - చివరగా: “సింగరేణి కార్మికుడు బలంగా ఉంటే సింగరేణి బలంగా ఉంటుంది… సింగరేణి బలంగా ఉంటే తెలంగాణ బలంగా ఉంటుంది!”
    1
    సింగరేణి అంటే కేవలం బొగ్గు గనులు కాదు — తెలంగాణ అభివృద్ధికి వెన్నెముక.
సింగరేణి కార్మికులకు రాఖీ లు కట్టిన BJP నాయకురాలు కందుల సంధ్యారాణి
మండే ఎండలో, చీకటి గనుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న సింగరేణి కార్మికుల త్యాగాలకు మనందరం సెల్యూట్ చేయాలి.
- రాఖీ అంటే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. అదే విధంగా కార్మికులు–కుటుంబాలు–సమాజం మధ్య అనుబంధాన్ని మరింత బలపరచాలి.
- దేశానికి విద్యుత్ అందించడానికి, పరిశ్రమలు నడవడానికి సింగరేణి కార్మికుల శ్రమ ఎంతో కీలకం.
- కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, ఆరోగ్యం, వారి పిల్లల భవిష్యత్తు మనందరి బాధ్యత.
- విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సింగరేణి కార్మిక కుటుంబాలను ఎప్పటికీ మర్చిపోకూడదు.
- ప్రతి కార్మికుడి ఇంట్లో ఆనందం ఉండాలి; ప్రతి కార్మిక కుటుంబానికి మెరుగైన విద్య, వైద్యం, గౌరవప్రదమైన జీవితం అందాలి.
- సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వం మరియు యాజమాన్యం సానుకూలంగా పరిష్కరించాలి.
- కార్మికుడి చెమట చుక్కలోనే సింగరేణి భవిష్యత్తు ఉంది.
- ఈ రాఖీ సందర్భంగా సింగరేణి కార్మిక సోదరులందరికీ మనం ఒక మాట ఇవ్వాలి — వారి హక్కులు, సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటాం.
- చివరగా: “సింగరేణి కార్మికుడు బలంగా ఉంటే సింగరేణి బలంగా ఉంటుంది… సింగరేణి బలంగా ఉంటే తెలంగాణ బలంగా ఉంటుంది!”
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.