ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి : జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష పెద్దపల్లి జిల్లాలో ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి అని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* తెలిపారు. జిల్లాలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, నిర్మాణం పూర్తయిన 2బీహెచ్‌కే ఇళ్ల కేటాయింపు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో* కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* జిల్లాలో నిర్మాణం పూర్తయి ఇంకా కేటాయించని 2బీహెచ్‌కే ఇళ్లను వెంటనే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు కేటాయించేలా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లు ఖాళీగా ఉండకుండా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి ఇళ్లను కేటాయించే ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందుకోసం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అవసరమైన పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పొందేందుకు అవసరమైన లబ్ధిదారుల వివరాలన్నింటినీ సెప్టెంబర్ 5, 2026లోగా ఎంఐఎస్ పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారుల వివరాల నమోదు, డేటా అప్‌లోడ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకం ద్వారా ప్రయోజనం అందేలా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, అర్హులైన వారిని పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన పథకాల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు త్వరితగతిన అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పీడీ హౌసింగ్ పి. పవన్ కుమార్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి : జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష పెద్దపల్లి జిల్లాలో ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి అని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* తెలిపారు. జిల్లాలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, నిర్మాణం పూర్తయిన 2బీహెచ్‌కే ఇళ్ల కేటాయింపు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో* కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* జిల్లాలో నిర్మాణం పూర్తయి ఇంకా కేటాయించని 2బీహెచ్‌కే ఇళ్లను వెంటనే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 2బీహెచ్‌కే ఇళ్లను పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు కేటాయించేలా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లు ఖాళీగా ఉండకుండా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి ఇళ్లను కేటాయించే ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందుకోసం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అవసరమైన పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పొందేందుకు అవసరమైన లబ్ధిదారుల వివరాలన్నింటినీ సెప్టెంబర్ 5, 2026లోగా ఎంఐఎస్ పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారుల వివరాల నమోదు, డేటా అప్‌లోడ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకం ద్వారా ప్రయోజనం అందేలా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, అర్హులైన వారిని పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన పథకాల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు త్వరితగతిన అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పీడీ హౌసింగ్ పి. పవన్ కుమార్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- ఆధ్యాత్మిక సదస్సుకు దారుస్సలాం తరలివెళ్లిన ఎంఐఎం శ్రేణులు.. జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించిన ఎంఐఎం అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్.. ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ దారుసలాంలో నిర్వహించ తలపెట్టిన జల్సా రహమతుల్-లీల్-ఆలమీన్ ఆధ్యాత్మిక బహిరంగ సభకు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు ఆదివారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి వందలాదిగా ఎంఐఎం శ్రేణులు, పార్టీ కరీంనగర్ సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో మంగళవారం తరలివెళ్లారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ .. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి 100 వాహనాలలో 500 మంది, కరీంనగర్ పట్టణం నుంచి 35 డివిజన్లలో ప్రతి డివిజన్ నుంచి 4కార్ల చొప్పున 125 వాహనాలలో దాదాపు 500 మంది ఎంఐఎం పార్టీ నాయకులు, డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, క్రియాశీలక కార్యకర్తలు హైదరాబాద్ తరలివెళ్లినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా భారీ ఎత్తున క్రియాశీలక కార్యకర్తలను కూడగట్టి ఎక్కువ సంఖ్యలో వెళ్లినట్లు చెప్పారు. ర్యాలీకి ముందు హాఫిజ్ అస్గర్ అలీ దువా ప్రార్థన చేశారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్లు సయ్యద్ ఇబ్రహీం, మాజిద్ హుస్సేన్, మాజీ కార్పొరేటర్ ఆరిఫ్ అహ్మద్, మాజీ కోఆప్షన్ సభ్యులు అహ్మద్ మొహియుద్దీన్ బాబుజానీ, నాయకులు ఫసియుద్దీన్ ఖాలీద్, ఎంఏ సలీమ్, అబ్దుల్ గఫ్ఫార్, ఖాజా మజారోద్దీన్, వాజిద్ అలీఖాన్, మేరాజ్, అబ్దుల్లా ఖాన్, ఆమెర్, హాఫిజ్ అబ్దుల్ జబ్బార్, యునూస్, యాసర్, అల్మాస్, ఇమ్రాన్, జాకీర్, బాబా ఖాలీద్ తదితరులున్నారు.3
- ఉనికి కోసమే బిజేపి ఫీజు లడాయి చేస్తుంది...బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది- మంత్రి పొన్నం ప్రభాకర్ ఫీజులు, స్కాలర్ షిప్ లు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంటే బిజెపి తన ఉనికిని చాటు కోవడానికి లడాయి పేరుతో ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన పల్లెపల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెలో ప్రజా పాలన ఏడో రోజు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట, పెరుకపల్లి, గొల్లగూడెం, ఆకునూరు, వెంకటేశ్వర్ల పల్లి ఘనపూర్ గ్రామాల్లో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వనమహోత్సవంలో మొక్కలు నాటారు. గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షించడంతో పాటు ప్రజల నుంచి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా, గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి అనే అంశాలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకుని పరిష్కరించడానికే పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రామస్థులకు సూచించారు. మొక్క నాటడం సులభం కానీ, దానిని పెంచి పెద్ద చెట్టుగా మార్చడం మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు జీవితంలో కనీసం ఒక మొక్క నాటి, కుటుంబ సభ్యుడిలా భావించి సంరక్షించాలని సూచించారు. నవంబర్ 14లోపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ అధికారులను మంత్రి సూచించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించి జీరో డెత్ లక్ష్యాన్ని సాధించడమే తమ లక్ష్యమన్నారు. ప్రజల వద్దకే ప్రజాపాలనను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పల్లెపల్లెలో ప్రజాపాలన నిర్వహిస్తున్నామని ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం అధికారులు, ప్రజాప్రతినిధుల కర్తవ్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమ రెండు కలల ముందుకు తీసుకు వెళ్తుంటే బిజెపి తమ ఉనికిని చాటుకోవడానికి ఆందోళన చేయడం అర్ధరహితమన్నారు.1
- జన్నారంలో ముందస్తు రక్షాబంధన్, రాఖీలు కట్టిన అక్క చెల్లెళ్లు జన్నారం మండల కేంద్రంలో హనుమాన్ భక్త బృందం సభ్యులు ముందస్తు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రావణమాసం మంగళవారం సందర్భంగా వారు జన్నారం పట్టణంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం హనుమాన్ భక్త బృందం సభ్యులు, భక్తులు ముందస్తు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమ సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సోదరులకు స్వీట్లను తినిపించి పండుగను ఘనంగా నిర్వహించారు.1
- కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన బెజ్జంకి మండలం నేతలు బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం సిద్దిపేట జిల్లాకు విచ్చేసిన సందర్భంగా దేవక్కపల్లి స్టేజి వద్ద బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండల బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కరివేద మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య పరిష్కారం కోసం హైదరాబాద్ నగర నడిబొడ్డున జరిగే పోరాటానికి బీజేపీ శ్రేణులతో కలిసి తరలివెళ్తున్నామని ప్రకటించారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆడిచర్ల రాజు, బీజేవైఎం నాయకులు సంఘ నరేష్, విమల్ కుమార్, గుంజేటి శివకుమార్, రావుల రాజిరెడ్డి, బెజ్జంకి మండల బీజేపీ ఉపాధ్యక్షులు గైని రాజుతో పాటు బెజ్జంకి మండల ముఖ్య నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థుల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.1
- ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నేత్రదానం చేయండి.. మరొకరికి చూపు ఇవ్వండి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ నేత్రదానం ద్వారా చూపును కోల్పోయిన వారికి కొత్త జీవితాన్ని అందించవచ్చని, ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అన్నారు. జాతీయ అంధత్వం, దృష్టిలోపాల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహిస్తున్న 41వ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా మంగళవారం సిరిసిల్ల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి గాంధీ చౌక్ వరకు నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక వ్యక్తి మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా సాధారణంగా ఇద్దరు చూపు కోల్పోయిన వ్యక్తులకు చూపు పునరుద్ధరణకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. “ఒకరి జీవితం ముగిసిన చోట.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు ప్రారంభమయ్యేలా నేత్రదానం దోహదపడుతుంది” అని అన్నారు. వ్యక్తి మరణించిన అనంతరం సాధ్యమైనంత త్వరగా, సాధారణంగా 6 నుంచి 8 గంటలలోపు నేత్ర కణజాలాన్ని సేకరించే అవకాశం ఉంటుందని తెలిపారు. నేత్రదానం వల్ల మృతదేహం రూపంలో ఎలాంటి మార్పు ఉండదని, వైద్య నిపుణులు అవసరమైన నేత్ర కణజాలాన్ని గౌరవప్రదంగా సేకరిస్తారని స్పష్టం చేశారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. మరణానంతరం నేత్రదానానికి కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరారు. రక్తపోటు, క్షయవ్యాధి, ఉబ్బసం ఉన్నవారు, కళ్లద్దాలు ఉపయోగించేవారు, కంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారు కూడా కొన్ని సందర్భాల్లో నేత్రదానం చేయవచ్చని తెలిపారు. అయితే నేత్రదానానికి అర్హతను వైద్య నిపుణులు నిర్ధారిస్తారని పేర్కొన్నారు. నేత్రదానం ప్రతి కుటుంబ ఆచారంగా మారాలని, నేత్రదానం కేవలం దానం మాత్రమే కాదని, మరణానంతరం కూడా మానవత్వాన్ని కొనసాగించే గొప్ప సేవ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తేజస్విని, జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమ అధికారి డాక్టర్ నయం జహా, నేత్ర వైద్య సహాయకులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.2
- పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి కలెక్టర్ హేమంత్ బోర్కాడే. ములుగు జిల్లా. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి. మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పాటుపడాలని, మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. వన మహోత్సవం సందర్భంగా మంగళవారం గట్టమ్మ సమీపంలోని పంచాయతీరాజ్ పైలాన్ ఆవరణలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనాతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో మొక్కలు, అడవులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు పచ్చదనాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వన మహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా, ప్రకృతిని పరిరక్షించే సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, అవి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను కాపాడినప్పుడే వన మహోత్సవ లక్ష్యం నెరవేరుతుందని, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎఫ్‌డీఓ సత్తయ్య, జాకారం సర్పంచ్, అటవీ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- ఆలయ పౌండేషన్ ఆధ్వర్యంలో 45 మందికి ఉచిత కేటరాక్ట్ శస్త్రచికిత్స : IAS నరహరి బసంత్‌నగర్, ఆగస్టు 25: పేద, నిరుపేదలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పరికిపండ్ల నరహరి, ఐఏఎస్ సహకారంతో, ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర విజన్ సెంటర్, బసంత్‌నగర్ నుంచి 45 మందికి ఉచిత కేటరాక్ట్ శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌లోని శంకర ఐ హాస్పిటల్‌కు తరలించారు. ఈ సందర్భంగా శ్రీ పరికిపండ్ల నరహరి, ఐఏఎస్ స్వయంగా వారితో మాట్లాడి, వారికి ధైర్యం కల్పిస్తూ, శంకర ఐ హాస్పిటల్‌లో నాణ్యమైన వైద్య చికిత్స పొందిన అనంతరం సురక్షితంగా తిరిగి రావాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కంటి శస్త్రచికిత్స చేయించుకోలేని పేదలకు ఉచితంగా వైద్యం అందించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తు, పేదల కంటి ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని శంకర విజన్ సెంటర్ ఇన్‌చార్జ్ పరికిపండ్ల రామ్ తెలిపారు.1
- ప్రభుత్వం తన హామీలను నెరవేర్చకపోతే విద్యార్థులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.కసిరెడ్డి మణికంఠ రెడ్డి, AISF రాష్ట్ర అధ్యక్షుడు హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైతున్నా, విద్యార్థులకు ఇచ్చిన హామీలను (స్కూటీలు, లాప్‌టాప్‌లు, విద్యా భరోసా కార్డ్, ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు) అమలు చేయడంలో విఫలమైందని AISF రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి విమర్శించారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, మేము అధికారంలో రాగానే ఐదవ గ్యారెంటీ పేరు మీద యువవికాసం పేరిట విద్యార్థులకు ఇచ్చిన హామీని అమలు చేస్తాం అన్నాడు. ఇయ్యాల అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు కావస్తా ఉంది. 34 రోజులు కావస్తా ఉంది విద్యార్థులకు ఇస్తామన్న స్కూటీలు ఎందుకు ఇవ్వలేదు? విద్యార్థులకు ఇస్తామన్న లాప్‌టాప్‌లు ఎందుకు ఇవ్వలేదు? విద్యార్థులు ఉన్నత విద్య చదువుకోవడానికి 5 లక్షల విద్యా భరోసా కార్డ్ ఎందుకు ఇవ్వలేదు? ఒకటేసారి రీఎంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేస్తామన్న రేవంత్ రెడ్డి 34 కాలంలో ఫీజు బకాయిలు విడుదల చేయకుండా.. ఇయ్యాల రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలను విస్మరించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నీరుగారిస్తా ఉంది. ఇయ్యాల రీఎంబర్స్‌మెంట్ రాక రాష్ట్రంలో విద్యార్థుల పర్సులు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. మేనేజ్‌మెంట్ల ఫీజులు కట్టి.. ఇయ్యాల విద్యార్థులకు స్కూటీలు ఇవ్వకపోతే, విద్యార్థులకు లాప్‌టాప్‌లు ఇవ్వకపోతే.. ఇయ్యాల రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తన భుజాన విద్యారంగం పెట్టుకొని ఇయ్యాల విద్యాశాఖను పూర్తిగా భ్రష్టుపట్టిస్తా ఉన్నాడు. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి విద్యాశాఖకు కొత్త వాళ్ళనైనా ఇవ్వాలి.. లేకపోతే విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు కూడా AISF ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం. ఇయ్యాల అందాల పోటీలకు ఉన్న నిధులు, ఫుట్‌బాల్ పోటీలకు ఉన్న నిధులు, హెలికాప్టర్ తిరగడానికి ఉన్న నిధులు.. ఇయ్యాల విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలుకు ఎందుకు లేవు అని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇయ్యాల మనవడు అట కోసం మెస్సీని తీసుకొచ్చినమని.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సంక్షేమం కోసం లాప్‌టాప్‌లు, స్కూటీలు ఇవ్వకపోతే.. రానున్న రోజుల్లో విద్యార్థులందరినీ ఏకం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు3
- కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ వినూత్న నిరసన...రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మితే జేబులు ఖాళీ అయ్యాయని ఖాళీపర్సులు ప్రదర్శించిన విద్యార్థులు... విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిక విద్యారంగ సమస్యలపై కరీంనగర్ లో స్టూడెంట్స్ ఆందోళన ఉదృతం అవుతుంది. విద్యార్థులతో పాటు రాజకీయ పార్టీలు సైతం రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడింది. ఫీజు రియంబర్స్మెంట్ పై బిజెపి లడాయి పేరుతో దీక్షలు చేపట్టగా పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావంగా బిఆర్ఎస్ నిరసన ఆందోళన కొనసాగిస్తుంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి విద్యార్థులకు స్క్రూటిలు, లాఫ్ టాప్ లు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే జేబులు ఖాళీ అయ్యాయని ఖాళీపరుసులు, స్క్రూటీలు లాప్టాప్ ప్రదర్శిస్తు తెలంగాణ చౌక్ లో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకొని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిచో మంత్రుల ఇళ్ళతో పాటు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అసెంబ్లీని సైతం ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి హెచ్చరించారు.2