Shuru
Apke Nagar Ki App…
80 ఏండ్ల స్వతంత్ర దేశంలో ఇలా నిలదీసిన నాయకుడు ఇంకొకరు లేరు👆🏻 ఆయన టార్గెట్ పదవి కాదు ప్రజలు💯 మల్లన్న గురించి ఈ సోదరుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి🙏 80 ఏండ్ల స్వతంత్ర దేశంలో ఇలా నిలదీసిన నాయకుడు ఇంకొకరు లేరు👆🏻 ఆయన టార్గెట్ పదవి కాదు ప్రజలు💯 మల్లన్న గురించి ఈ సోదరుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి🙏
NIMMANAGANTI ANIL BABU
80 ఏండ్ల స్వతంత్ర దేశంలో ఇలా నిలదీసిన నాయకుడు ఇంకొకరు లేరు👆🏻 ఆయన టార్గెట్ పదవి కాదు ప్రజలు💯 మల్లన్న గురించి ఈ సోదరుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి🙏 80 ఏండ్ల స్వతంత్ర దేశంలో ఇలా నిలదీసిన నాయకుడు ఇంకొకరు లేరు👆🏻 ఆయన టార్గెట్ పదవి కాదు ప్రజలు💯 మల్లన్న గురించి ఈ సోదరుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి🙏
More news from తెలంగాణ and nearby areas
- ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు.. గడిచిన రాత్రి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది ఖమ్మం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది..గడిచిన రాత్రి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులన్నీ జలమయంగా మారి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటివరకు ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైన ఖమ్మం జిల్లా ప్రజలకు.. ఈ వర్షాలు కాస్త ఊరటనిస్తున్నాయి. చల్లటి వాతావరణంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.మరోవైపు.. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులు, కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.అయితే ఈ వర్షాలు రైతులకు మాత్రం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. వ్యవసాయ పనులకు వర్షాలు అనుకూలంగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు అవసరమైన నీరు అందడంతో సాగుకు మరింత ఊతం లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇక జిల్లాలోని పలు మండలాల్లో కూడా వర్షం ప్రభావం కొనసాగుతోంది. ఎక్కడ చూసినా వర్షపు నీటితో రహదారులు తడిసి ముద్దవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో ఒకవైపు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. మరోవైపు రైతులకు మాత్రం ఈ వర్షాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి.1
- ఖమ్మం జిల్లా లో ఉదయం నుంచి భారీ వర్షం దంచిపోతుందివర్షం రాకతో రైతులు, వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు ఖమ్మం జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షం దంచిపోతుంది. రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, బోనకల్, నేలకొండపల్లి, కల్లూరు, ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వర్షం రాకతో రైతులు, వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తూ.. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.1
- అంగరంగ వైభవంగా తీస్ సంబరాలు బంజారా సాంప్రదాయ లో భాగంగా అత్యంత వైభవంగా వేడుక... అంగరంగం వైభవంగా తీజ్ వేడుకలు నేలకొండపల్లి మండలం లోని శంకర్ గిరి తండా లో ఆదివారం తీజ్ పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. డీజే ఆటా, పాటలతో గిరిజన సాంప్రాదాయ వస్త్రాలతో నృత్యాలు చేశారు. మేళతాళాలతో డప్పు వాయిద్యాలతో ఘనంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ..... గ్రామంలో, అక్కా చెల్లెలు ఆడబిడ్డలు అన్నదమ్ములు సంస్కృతి సాంప్రదాయాల పండగ గతంలో లేని విధంగా ఎంతో ఆనందంగా ముగింపు సందర్భంగా దేవాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. పంచాయతీ సర్పంచ్ ధరావత్ దీప్లా సరోజిని దంపతులు అమ్మవారికి వస్త్రాలు సమర్పించి, మొక్కులు చెల్లించగానే..అదే సమయంలో వర్షం పడటంతో గిరిజనుల సంబురాలు అంబరాన్నింటాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.1
- ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు జెడ్పీహెచ్‌ఎస్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. పాఠశాలలో ఉప్మా తిన్న అనంతరం 8 మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని వేంసూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే.. విద్యార్థుల అస్వస్థతకు అసలు కారణమేంటి? ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు పథకాలు అమలు చేస్తున్నా.. ఆహారం నాణ్యత విషయంలో ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి? హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనంపై అధికారుల పర్యవేక్షణ ఏ మేరకు ఉంది? వంట సిబ్బంది నిర్లక్ష్యమా? వంటకు ఉపయోగించే సరుకుల నాణ్యత లోపమా? లేక పథకాల అమలులోనే లోపాలున్నాయా? విద్యార్థుల భోజనం విషయంలో కక్కుర్తికి తావులేకుండా.. నాణ్యమైన ఆహారం అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం వద్దని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.4
- ఎల్కతుర్తి కారు డిక్కీలో మహిళ మృతదేహం కేసులో బిగ్ ట్విస్ట్.. హత్య వెనుక తండ్రి కుట్ర: ఏసీపీ ప్రశాంత్ రెడ్డి హనుమకొండ: ఎల్కతుర్తి మండల హనుమకొండ: ఎల్కతుర్తి మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన కారు డిక్కీలో మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. మృతురాలు గోదావరిఖనికి చెందిన అంకతి మానసగా గుర్తించగా, నిందితుడు వినోద్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఏసీపీ వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం ఎల్కతుర్తి బస్‌స్టాండ్ వెనుక పార్క్ చేసి వదిలివేసిన కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గ్రామ కార్యదర్శికి సమాచారం ఇచ్చారు. కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారులోని డిక్కీలో మహిళ మృతదేహాన్ని గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో కారును వినోద్ కుమార్ అక్కడ ఉంచినట్లు తేలిందన్నారు. మృతురాలు మానస, నిందితుడు వినోద్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి పరిచయస్తులు, సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు చెందిన వారని చెప్పారు. మానస ప్రవర్తన వల్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆమెను ఎలాగైనా హత్య చేయాలని మృతురాలి తండ్రి రాజేశం వినోద్ కుమార్‌ను కోరినట్లు విచారణలో వెల్లడైందన్నారు.3
- సొంత నియోజకవర్గం నుంచే వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన మల్లన్న... *సొంతగడ్డపై సమర శంఖం.. ఆలేరు బరిలో తీన్మార్ మల్లన్న..!* సొంత నియోజకవర్గం నుంచే వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన మల్లన్న... *తగ్గేదే లే అంటున్న టీఆర్పీ సైన్యం..🔥*1
- ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ........... నర్సంపేట: మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ కాంపెళ్లి వీణ విజేందర్ రెడ్డి రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.2
- వరంగల్ పరిసర గ్రామాల్లో వర్షం: చిగురించిన పత్తి రైతుల ఆశలు పంతిని , ఆగస్టు 24: వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఆందోళనలో ఉన్న పత్తి రైతులకు నేడు కురిసిన వర్షం ఎంతో ఊరటనిచ్చింది. ఉదయం నుంచి వాతావరణం చల్లబడి విస్తారంగా వర్షం కురవడంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసిన పత్తి పంట ఎదుగుదల లోపించి ఎండిపోయే ప్రమాదం ఏర్పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం కురిసిన ఈ వర్షం పత్తి మొక్కల ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షంతో పంటకు ప్రాణం వచ్చినట్లయిందని, రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా అనుకూలమైన వర్షాలు పడితే మంచి దిగుబడులు సాధిస్తామని స్థానిక రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.2
- ఐఫోన్ 15 కోసం విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి.... సంభాజీనగర్: ఐఫోన్ 15 కొనివ్వాలని కోరుతూ తల్లిదండ్రులతో జరిగిన గొడవ విషాదానికి దారితీసింది. 18 ఏళ్ల యువకుడు ఖవ్‌ద్యా కొండపై తల్లిదండ్రులతో గొడవపడి కొండపై నుంచి దూకుతానని బెదిరించినట్లు సమాచారం. దాదాపు మూడు గంటల పాటు తల్లిదండ్రులు అతడిని బతిమిలాడినా వినలేదని తెలుస్తోంది. చివరకు తండ్రిని తనతో పాటు లాగడంతో ఇద్దరూ కొండపై నుంచి కిందపడి మృతి చెందారు. ఈ ఘటనతో తీవ్ర విషాదానికి గురైన తల్లి కూడా కొండపై నుంచి దూకినట్లు సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో సంభాజీనగర్‌లో విషాదం నెలకొంది.1