ఎల్కతుర్తి కారు డిక్కీలో మహిళ మృతదేహం కేసులో బిగ్ ట్విస్ట్.. హత్య వెనుక తండ్రి కుట్ర: ఏసీపీ ప్రశాంత్ రెడ్డి హనుమకొండ: ఎల్కతుర్తి మండల హనుమకొండ: ఎల్కతుర్తి మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన కారు డిక్కీలో మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. మృతురాలు గోదావరిఖనికి చెందిన అంకతి మానసగా గుర్తించగా, నిందితుడు వినోద్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఏసీపీ వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం ఎల్కతుర్తి బస్‌స్టాండ్ వెనుక పార్క్ చేసి వదిలివేసిన కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గ్రామ కార్యదర్శికి సమాచారం ఇచ్చారు. కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారులోని డిక్కీలో మహిళ మృతదేహాన్ని గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో కారును వినోద్ కుమార్ అక్కడ ఉంచినట్లు తేలిందన్నారు. మృతురాలు మానస, నిందితుడు వినోద్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి పరిచయస్తులు, సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు చెందిన వారని చెప్పారు. మానస ప్రవర్తన వల్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆమెను ఎలాగైనా హత్య చేయాలని మృతురాలి తండ్రి రాజేశం వినోద్ కుమార్‌ను కోరినట్లు విచారణలో వెల్లడైందన్నారు.
ఎల్కతుర్తి కారు డిక్కీలో మహిళ మృతదేహం కేసులో బిగ్ ట్విస్ట్.. హత్య వెనుక తండ్రి కుట్ర: ఏసీపీ ప్రశాంత్ రెడ్డి హనుమకొండ: ఎల్కతుర్తి మండల హనుమకొండ: ఎల్కతుర్తి మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన కారు డిక్కీలో మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. మృతురాలు
గోదావరిఖనికి చెందిన అంకతి మానసగా గుర్తించగా, నిందితుడు వినోద్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఏసీపీ వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం ఎల్కతుర్తి బస్‌స్టాండ్ వెనుక పార్క్ చేసి వదిలివేసిన కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గ్రామ కార్యదర్శికి సమాచారం ఇచ్చారు. కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారులోని డిక్కీలో మహిళ మృతదేహాన్ని గుర్తించి కేసు నమోదు
చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో కారును వినోద్ కుమార్ అక్కడ ఉంచినట్లు తేలిందన్నారు. మృతురాలు మానస, నిందితుడు వినోద్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి పరిచయస్తులు, సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు చెందిన వారని చెప్పారు. మానస ప్రవర్తన వల్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆమెను ఎలాగైనా హత్య చేయాలని మృతురాలి తండ్రి రాజేశం వినోద్ కుమార్‌ను కోరినట్లు విచారణలో వెల్లడైందన్నారు.
- ఢిల్లీలో గృహ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశం న్యూఢిల్లీ: పార్లమెంట్ భవనంలోని మెయిన్ కమిటీ హాల్‌లో గృహ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీకి చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు (ఎంపీలు), సంబంధిత మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు మరియు అధికార ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా గృహ నిర్మాణ పథకాలు, పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి మరియు వాటి అమలు తీరుపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, నివాస వసతుల విస్తరణకు సంబంధించి పలు కీలక అంశాలను సమీక్షించడంతో పాటు, అధికారులకు కమిటీ తరఫున పలు సూచనలు చేశారు. పథకాల సత్వర అమలుకు సమన్వయంతో కృషి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.1
- ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ........... నర్సంపేట: మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ కాంపెళ్లి వీణ విజేందర్ రెడ్డి రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.2
- నా పేద ప్రజల భవిష్యత్తు కోసం... ఎంతటి త్యాగానికైనా, ఏ పోరాటానికైనా సిద్ధం.! తీన్మార్ మల్లన్న *నా పేద ప్రజల భవిష్యత్తు కోసం... ఎంతటి త్యాగానికైనా, ఏ పోరాటానికైనా సిద్ధం.!* గాడిదలు, పందులను లెక్కపెట్టే ఈ ప్రభుత్వానికి... గంజి లేక చస్తున్న పేదోడి లెక్క అడిగితే ఒంటికి వణుకు పుట్టింది.! ఆ పిరికి సస్పెన్షన్ కాగితాలను కుర్చీలో కూర్చున్న పాలకుల ముందే ముక్కలు ముక్కలుగా చింపి పారేశా.! నా రాజకీయం మీ లగ్జరీ కుర్చీల కోసం కాదురా... గుడిసెల్లో మగ్గుతున్న పేద ప్రజల బతుకుల కోసం.! ఏం పీక్కుంటావో పీక్కో... జనం వైపు నిలబడి చెప్తున్నా..! *దట్ ఈజ్ తీన్మార్ మల్లన్న.!*1
- పాలంపేట రామప్ప నల్ల కాలువలో ఎదురెక్కుతున్న చేపలు..! గత రెండురోజులుగా కురుస్తున్న వర్షం..!1
- హత్య కేసును చేదించిన పోలీసులు వివరాలను వెల్లడించిన డి.ఎస్.పి మధుసూదన్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలోని శనిగల గుట్ట వద్ద హత్యకు గురైన రావుల దానయ్య కేసును చేదించిన పోలీసులు. వివరాలు వెల్లడించిన చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి దానయ్య సొంత అన్న కొడుకు శివతో, భార్య శారద హత్య చేయించినట్టుగా నిర్ధారణ. మృతుడి భార్య తో శివకు గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. శారదకు ఇంకా కొద్ది మందితో అక్రమ సంబంధాలు ఉన్నట్లు వెల్లడి నిందితులు శివ, శారదను అరెస్ట్ చేసి,రిమాండ్ కు తరలింపు..1
- పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలిపై దారుణ దాడి: బెంగాల్‌లో కలకలం మాల్దా (పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఉపాధ్యాయురాలిపై కొందరు వ్యక్తులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. విద్యార్థి బదిలీ ధ్రువీకరణ పత్రం (టీసీ) జారీ చేసే విషయంలో తలెత్తిన వివాదమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.వివాదం: పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థి టీసీ జారీ వ్యవహారంలో ఉపాధ్యాయురాలితో కొందరు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. దాడి: నిబంధనల ప్రకారం వెంటనే టీసీ ఇచ్చేందుకు సదరు టీచర్ నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన వారు ఆమెపై భౌతిక దాడికి దిగారు. వైరల్ వీడియో: పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో స్థానికంగా తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. విద్యాబుద్ధులు నేర్పే పాఠశాలలోనే ఉపాధ్యాయురాలిపై దాడి జరగడంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.1
- కాలనీల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత.. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే నాయిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం 4వ డివిజన్ పరిధిలోని జ్యోతిబాస్ నగర్, పెద్దమ్మగడ్డ, అక్షర కాలనీ తదితర ప్రాంతాల్లో రూ.1.19 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ తదితర మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ప్రారంభించిన పనులకు నిర్దిష్ట కాలపరిమితి విధించి నెల రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు. జ్యోతిబాస్ నగర్‌లో ఇప్పటికే ప్రధాన రహదారులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని, మిగిలిన రెండు చిన్న గల్లీల్లోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వ్యవస్థలో సమస్యలు లేకుండా సమగ్ర అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు పేదల సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నాయిని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు, పెన్షన్లు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా స్లమ్ ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.1
- హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో నిర్వహించిన తీజ్ పండుగ హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు.1
- *కరీంనగర్ జిల్లా ఎలబోతారంలో కన్నతల్లిని బావిలో పడేసి హత్య చేసి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకులు ఇద్దరు అరెస్ట్ కరీంనగర్ జిల్లాలో కన్నతల్లి పట్ల ఇద్దరు కొడుకులు కసాయిలా ప్రవర్తించారు. తల్లిని బావిలో పడేసి హత్య చేసి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి చివరకు నిందితులుగా దొరికిపోయారు. సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన నూనె వెంకటమ్మ దారుణ హత్యకు గురయ్యారు. వెంకటమ్మకు నలుగురు కొడుకులు ఉండగా ఇటీవల పక్షవాతం బారిన పడి మంచానికి పరిమితమైంది. నలుగురు కొడుకులు వంతుల వారిగా తల్లి కి సపరియాలు చేయాల్సి ఉండగా ఇద్దరు కొడుకులు తల్లి ఇంట్లో చనిపోతే ఇల్లు వదిలి పెట్టాల్సి వస్తుందని అరిష్టంగా భావించి మంచం పట్టిన తల్లిని నాలుగు మాసాల క్రితం బావిలో పడేసి తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి బావిలో ఉన్న శవాన్ని వెలికి తీశారు. పక్షపాతంతో కదలలేని స్థితిలో ఉన్న వృద్దురాలు బావిలో ఎలా పడిందనే విషయంపై పోలీసులు ఆరా తీయగా విస్తుపోయే విషయాలు తెలుపులోకి వచ్చాయి. పెద్దకొడుకు సమ్మయ్య చిన్నకొడుకు శ్రీనివాస్ హత్యకు పాల్పడినట్లు నిర్థారించి అరెస్ట్ చేశారు. తల్లిని బావిలో పడేసి ప్రాణం తీసి కనిపించడం లేదని తప్పుడు సమాచారం ఇచ్చిన ఇద్దరు కొడుకులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని సిఐ శ్రీనివాస్ తెలిపారు.1