*కరీంనగర్ జిల్లా ఎలబోతారంలో కన్నతల్లిని బావిలో పడేసి హత్య చేసి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకులు ఇద్దరు అరెస్ట్ కరీంనగర్ జిల్లాలో కన్నతల్లి పట్ల ఇద్దరు కొడుకులు కసాయిలా ప్రవర్తించారు. తల్లిని బావిలో పడేసి హత్య చేసి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి చివరకు నిందితులుగా దొరికిపోయారు. సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన నూనె వెంకటమ్మ దారుణ హత్యకు గురయ్యారు. వెంకటమ్మకు నలుగురు కొడుకులు ఉండగా ఇటీవల పక్షవాతం బారిన పడి మంచానికి పరిమితమైంది. నలుగురు కొడుకులు వంతుల వారిగా తల్లి కి సపరియాలు చేయాల్సి ఉండగా ఇద్దరు కొడుకులు తల్లి ఇంట్లో చనిపోతే ఇల్లు వదిలి పెట్టాల్సి వస్తుందని అరిష్టంగా భావించి మంచం పట్టిన తల్లిని నాలుగు మాసాల క్రితం బావిలో పడేసి తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి బావిలో ఉన్న శవాన్ని వెలికి తీశారు. పక్షపాతంతో కదలలేని స్థితిలో ఉన్న వృద్దురాలు బావిలో ఎలా పడిందనే విషయంపై పోలీసులు ఆరా తీయగా విస్తుపోయే విషయాలు తెలుపులోకి వచ్చాయి. పెద్దకొడుకు సమ్మయ్య చిన్నకొడుకు శ్రీనివాస్ హత్యకు పాల్పడినట్లు నిర్థారించి అరెస్ట్ చేశారు. తల్లిని బావిలో పడేసి ప్రాణం తీసి కనిపించడం లేదని తప్పుడు సమాచారం ఇచ్చిన ఇద్దరు కొడుకులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని సిఐ శ్రీనివాస్ తెలిపారు.
*కరీంనగర్ జిల్లా ఎలబోతారంలో కన్నతల్లిని బావిలో పడేసి హత్య చేసి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకులు ఇద్దరు అరెస్ట్ కరీంనగర్ జిల్లాలో కన్నతల్లి పట్ల ఇద్దరు కొడుకులు కసాయిలా ప్రవర్తించారు. తల్లిని బావిలో పడేసి హత్య చేసి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి చివరకు నిందితులుగా దొరికిపోయారు. సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన నూనె వెంకటమ్మ దారుణ హత్యకు గురయ్యారు. వెంకటమ్మకు నలుగురు కొడుకులు ఉండగా ఇటీవల పక్షవాతం బారిన పడి మంచానికి పరిమితమైంది. నలుగురు కొడుకులు వంతుల వారిగా తల్లి కి సపరియాలు చేయాల్సి ఉండగా ఇద్దరు కొడుకులు తల్లి ఇంట్లో చనిపోతే ఇల్లు వదిలి పెట్టాల్సి వస్తుందని అరిష్టంగా భావించి మంచం పట్టిన తల్లిని నాలుగు మాసాల క్రితం బావిలో పడేసి తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి బావిలో ఉన్న శవాన్ని వెలికి తీశారు. పక్షపాతంతో కదలలేని స్థితిలో ఉన్న వృద్దురాలు బావిలో ఎలా పడిందనే విషయంపై పోలీసులు ఆరా తీయగా విస్తుపోయే విషయాలు తెలుపులోకి వచ్చాయి. పెద్దకొడుకు సమ్మయ్య చిన్నకొడుకు శ్రీనివాస్ హత్యకు పాల్పడినట్లు నిర్థారించి అరెస్ట్ చేశారు. తల్లిని బావిలో పడేసి ప్రాణం తీసి కనిపించడం లేదని తప్పుడు సమాచారం ఇచ్చిన ఇద్దరు కొడుకులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని సిఐ శ్రీనివాస్ తెలిపారు.
- మల్లారెడ్డి మరణం పేద ప్రజలకు, రైతాంగ ఉద్యమాలకు తీరని లోటు సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి సిపిఎం పార్టీ సీనియర్ నేత,రైతు ఉద్యమ నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు, కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి మరణం పేద ప్రజలకు, దేశ రైతాంగ ఉద్యమాలకు తీరని లోటు అని, సిపిఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయం ఎదుట పార్టీ జెండాను అవనతం చేసి మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారూ ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ..... హైదరాబాదు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మూడు గంటలకు సారంపల్లి మల్లారెడ్డి ( 88) తుది శ్వాస విడిచారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంఘం స్థాపనలో కీలక పాత్ర పోషించారని వ్యవసాయ రంగ నిపుణుడిగా నీటిపారుదల రంగంలో నిష్ణాతుడిగా అపార అనుభవం కలిగిన నాయకుడని, అనేకమంది రాజకీయ నాయకులు, అధికారులు కూడా మల్లారెడ్డి దగ్గర సలహాలు, సూచనలు తీసుకునే వారిని అలాంటి వ్యక్తి మరణించడం బాధాకరమని మల్లారెడ్డి మృతికి సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ తరఫున సంతాపం తెలుపుతూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కరీంనగర్ జిల్లాలో రైతు ఉద్యమాలలో సారంపల్లి మల్లారెడ్డి గారు ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు. పేద ప్రజల ఇళ్ల స్థలాల పోరాటంలో, భూ నిర్వాసితుల ఆందోళన పోరాటాల్లో, ప్రాజెక్టుల సాధనలో, పాదయాత్రలో పాల్గొన్నారు గుర్తు చేశారు. జిల్లాతో మూడు దశాబ్దాల కాలం పాటు పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు అన్నారు. వరంగల్ జిల్లాలో పుట్టిన మల్లారెడ్డి ఆ జిల్లాలో సిపిఎం పార్టీ నిర్మాణంలో రైతు సంగం నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా, కంట్రోల్ కమిషన్ చైర్మన్ గా, బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. కమ్యూనిస్టు నాయకునిగా నిరాడంబరమైన జీవితం గడిపారని అన్నారు. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమన్నారు. వారి స్ఫూర్తితో జిల్లాలో బలమైన ప్రజా పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుంద రెడ్డి,గుడికందుల సత్యం, కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, సుంకరి సంపత్, ఎడ్ల రమేష్, డి నరేష్, కొప్పుల శంకర్, నాయకులు గజ్జల శ్రీకాంత్, అరవింద్, సంధ్య, రజిత, ఇసాక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.3
- లింగంపేట గ్రామ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు చందుర్తి మండలం లింగంపేట గ్రామ పరిధిలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీమహేష్ బి. గితే అధికారులతో కలిసి సోమవారం క్షేత్రస్థాయి లో పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ప్రమాదం ఎలా జరిగింది, రహదారి పరిస్థితులు, ఇతర సాంకేతిక అంశాలపై అధికారులను అడిగి తెలుసుకుని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను అన్ని కోణాల్లో విచారించి, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వాహనదారులు అధిక వేగంతో వాహనాలను నడపడం వల్ల, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎస్పీ వెంట డిఎస్పీ శ్రీనివాసులు, సి.ఐ రవీందర్,1
- *మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి* *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* *ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ* *చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన* అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.4
- 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏 𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌[𝐌𝐀𝐋𝐄][𝐁𝐀 3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑][𝐇𝐈𝐍𝐃𝐇𝐔;𝐑𝐄𝐋𝐈𝐆𝐈𝐎𝐍][☆𝐎𝐖𝐍:𝐇𝐎𝐔𝐒𝐄;𝐍𝐎.3-9-592##𝐑𝐄𝐃𝐃𝐘 𝐂𝐎𝐋𝐎𝐍𝐘#𝐑𝐎𝐀𝐃 𝐍𝐎.1#𝐇𝐀𝐍𝐀𝐌 𝐊𝐎𝐍𝐃𝐀 -𝐂𝐈𝐓𝐘&𝐃𝐈𝐒𝐓𝐑𝐈𝐂#][☆𝐓𝐇𝐄𝐋𝐀𝐍𝐆𝐀𝐀𝐍𝐀 :𝐓𝐇𝐄𝐋𝐔𝐆𝐔-𝐋𝐀𝐍𝐆𝐔𝐀𝐆𝐄-𝐒𝐓𝐀𝐓𝐄*#☆☆𝐈𝐍𝐃𝐈𝐀-𝐊𝐍𝐓𝐑𝐈#𝐀𝐒𝐈𝐀#☆☆☆𝐖𝐎𝐑𝐋𝐃#]1
- నా పేద ప్రజల భవిష్యత్తు కోసం... ఎంతటి త్యాగానికైనా, ఏ పోరాటానికైనా సిద్ధం.! తీన్మార్ మల్లన్న *నా పేద ప్రజల భవిష్యత్తు కోసం... ఎంతటి త్యాగానికైనా, ఏ పోరాటానికైనా సిద్ధం.!* గాడిదలు, పందులను లెక్కపెట్టే ఈ ప్రభుత్వానికి... గంజి లేక చస్తున్న పేదోడి లెక్క అడిగితే ఒంటికి వణుకు పుట్టింది.! ఆ పిరికి సస్పెన్షన్ కాగితాలను కుర్చీలో కూర్చున్న పాలకుల ముందే ముక్కలు ముక్కలుగా చింపి పారేశా.! నా రాజకీయం మీ లగ్జరీ కుర్చీల కోసం కాదురా... గుడిసెల్లో మగ్గుతున్న పేద ప్రజల బతుకుల కోసం.! ఏం పీక్కుంటావో పీక్కో... జనం వైపు నిలబడి చెప్తున్నా..! *దట్ ఈజ్ తీన్మార్ మల్లన్న.!*1
- ఆటపాటలతో సంస్కృతిని చాటిన లంబాడీలు:బంజారా సంస్కృతికి ప్రతీక ‘తీజ్’: జనగామలో ఘనంగా శోభాయాత్ర జనగామ: జిల్లా కేంద్రంలో మాజీ కౌన్సిలర్ వాంకుడోత్ అనిత నివాసం వద్ద తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన బంజారా తీజ్ ఉత్సవాలు నిమజ్జన వేడుకతో ఘనంగా ముగిశాయి. అనిత నివాసం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర అంబేద్కర్ చౌరస్తా మీదుగా బతుకమ్మ కుంట వరకు సాగింది. బంజారా మహిళలు, యువత, ఉద్యోగులు, ప్రజలు సంప్రదాయ వేషధారణలతో ఆటపాటలు, నృత్యాలు చేస్తూ పెద్ద ఎత్తున తరలిరావడంతో జనగామ పురవీధులు బంజారా జనసంద్రంగా మారాయి. ఈ కార్యక్రమంలో కుసుంబాయి తండా సర్పంచ్ కొర్ర స్వరూప రాజేందర్ నాయక్‌తో పాటు పలువురు బంజారా నాయకులు, ప్రజాప్రతినిధులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలు, సంస్కృతిని కాపాడుకోవాలని, మేరామాయాడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.1
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ఫీజు దీక్ష పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్...గ్రూప్ రాజకీయాలతో ఉనికి కాపాడుకోవడానికే రాంచందర్ రావు ఫీజు దీక్షల డ్రామా ఆడుతున్నారని విమర్శ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాగానే పార్టీలో లొల్లులు ఎక్కువయ్యాయని, తన ఉనికి కాపాడుకోవడానికే రాంచందర్ రావు ఫీజు రీయింబర్స్ మెంట్ దీక్షల డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. చేతనైతే ఢిల్లీ నుంచి పైసలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం నవాబుపేటలో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బిజేపి కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఫీజు బకాయిలు పెండింగ్ పెట్టినప్పుడు కిమ్మనకుండా కూర్చున్న బీజేపీ నేతలు, ఇప్పుడు ప్రజా ప్రభుత్వంపై గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకుల ద్వారా అడ్వాన్స్‌గా ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లిస్తున్నామని, సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇస్తున్నామని తెలిపారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నారా? కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా తెచ్చారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టళ్ల నిర్మాణం చేపడుతూ, అధికారంలోకి రాగానే మెస్ చార్జీలు పెంచి విద్యార్థుల కడుపు నింపుతున్నామని తెలిపారు. మొసలి కన్నీళ్లు ఆపి, ఢిల్లీ పెద్దలకు జ్ఞానోదయం చేసి బీజేపీ రాష్ట్రాల్లో కూడా ఈ పథకం అమలు చేయించాలని, అభివృద్ధి పథంలో సాగుతున్న సర్కారుపై అనవసరంగా అడ్డు పడద్దని హితవు పలికారు.1
- మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం తో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం తో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- రక్తం వచ్చేటట్లుగా లారీ డ్రైవర్ పిడుగులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్స్పెక్టర్ పార్వతి డ్రైవర్ *లారీ డ్రైవర్‌పై దాడి చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్టర్ డ్రైవర్* గాజువాకలో రవాణా శాఖ అధికారి డ్రైవర్ దురహంకారం రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్స్పెక్టర్ పార్వతి డ్రైవర్ షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆపలేదని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్‌స్పెక్టర్ పార్వతి ఇన్‌స్పెక్టర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్‌పై పిడుగులతో దాడి విచక్షణ రహితంగా దాడి చేయడంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం1