logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మల్లారెడ్డి మరణం పేద ప్రజలకు, రైతాంగ ఉద్యమాలకు తీరని లోటు సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి సిపిఎం పార్టీ సీనియర్ నేత,రైతు ఉద్యమ నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు, కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి మరణం పేద ప్రజలకు, దేశ రైతాంగ ఉద్యమాలకు తీరని లోటు అని, సిపిఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయం ఎదుట పార్టీ జెండాను అవనతం చేసి మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారూ ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ..... హైదరాబాదు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మూడు గంటలకు సారంపల్లి మల్లారెడ్డి ( 88) తుది శ్వాస విడిచారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంఘం స్థాపనలో కీలక పాత్ర పోషించారని వ్యవసాయ రంగ నిపుణుడిగా నీటిపారుదల రంగంలో నిష్ణాతుడిగా అపార అనుభవం కలిగిన నాయకుడని, అనేకమంది రాజకీయ నాయకులు, అధికారులు కూడా మల్లారెడ్డి దగ్గర సలహాలు, సూచనలు తీసుకునే వారిని అలాంటి వ్యక్తి మరణించడం బాధాకరమని మల్లారెడ్డి మృతికి సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ తరఫున సంతాపం తెలుపుతూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కరీంనగర్ జిల్లాలో రైతు ఉద్యమాలలో సారంపల్లి మల్లారెడ్డి గారు ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు. పేద ప్రజల ఇళ్ల స్థలాల పోరాటంలో, భూ నిర్వాసితుల ఆందోళన పోరాటాల్లో, ప్రాజెక్టుల సాధనలో, పాదయాత్రలో పాల్గొన్నారు గుర్తు చేశారు. జిల్లాతో మూడు దశాబ్దాల కాలం పాటు పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు అన్నారు. వరంగల్ జిల్లాలో పుట్టిన మల్లారెడ్డి ఆ జిల్లాలో సిపిఎం పార్టీ నిర్మాణంలో రైతు సంగం నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా, కంట్రోల్ కమిషన్ చైర్మన్ గా, బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. కమ్యూనిస్టు నాయకునిగా నిరాడంబరమైన జీవితం గడిపారని అన్నారు. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమన్నారు. వారి స్ఫూర్తితో జిల్లాలో బలమైన ప్రజా పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుంద రెడ్డి,గుడికందుల సత్యం, కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, సుంకరి సంపత్, ఎడ్ల రమేష్, డి నరేష్, కొప్పుల శంకర్, నాయకులు గజ్జల శ్రీకాంత్, అరవింద్, సంధ్య, రజిత, ఇసాక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
1 hr ago

మల్లారెడ్డి మరణం పేద ప్రజలకు, రైతాంగ ఉద్యమాలకు తీరని లోటు సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి సిపిఎం పార్టీ సీనియర్ నేత,రైతు ఉద్యమ నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు, కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి మరణం పేద ప్రజలకు, దేశ రైతాంగ ఉద్యమాలకు తీరని లోటు అని, సిపిఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయం ఎదుట పార్టీ జెండాను అవనతం చేసి మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారూ ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ..... హైదరాబాదు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మూడు గంటలకు సారంపల్లి మల్లారెడ్డి ( 88) తుది

శ్వాస విడిచారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంఘం స్థాపనలో కీలక పాత్ర పోషించారని వ్యవసాయ రంగ నిపుణుడిగా నీటిపారుదల రంగంలో నిష్ణాతుడిగా అపార అనుభవం కలిగిన నాయకుడని, అనేకమంది రాజకీయ నాయకులు, అధికారులు కూడా మల్లారెడ్డి దగ్గర సలహాలు, సూచనలు తీసుకునే వారిని అలాంటి వ్యక్తి మరణించడం బాధాకరమని మల్లారెడ్డి మృతికి సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ తరఫున సంతాపం తెలుపుతూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కరీంనగర్ జిల్లాలో రైతు ఉద్యమాలలో సారంపల్లి మల్లారెడ్డి గారు ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు. పేద ప్రజల ఇళ్ల స్థలాల పోరాటంలో, భూ నిర్వాసితుల ఆందోళన పోరాటాల్లో, ప్రాజెక్టుల సాధనలో, పాదయాత్రలో పాల్గొన్నారు గుర్తు చేశారు. జిల్లాతో మూడు దశాబ్దాల కాలం పాటు పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర

పోషించారు అన్నారు. వరంగల్ జిల్లాలో పుట్టిన మల్లారెడ్డి ఆ జిల్లాలో సిపిఎం పార్టీ నిర్మాణంలో రైతు సంగం నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా, కంట్రోల్ కమిషన్ చైర్మన్ గా, బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. కమ్యూనిస్టు నాయకునిగా నిరాడంబరమైన జీవితం గడిపారని అన్నారు. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమన్నారు. వారి స్ఫూర్తితో జిల్లాలో బలమైన ప్రజా పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుంద రెడ్డి,గుడికందుల సత్యం, కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, సుంకరి సంపత్, ఎడ్ల రమేష్, డి నరేష్, కొప్పుల శంకర్, నాయకులు గజ్జల శ్రీకాంత్, అరవింద్, సంధ్య, రజిత, ఇసాక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • *మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి* *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* *ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ* *చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన* అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    4
    *మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి*

*జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*

*ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో  ప్రజావాణి ఆకస్మిక తనిఖీ*

*చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన*
అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. 
చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. 
ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    7 hrs ago
  • లింగంపేట గ్రామ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు చందుర్తి మండలం లింగంపేట గ్రామ పరిధిలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీమహేష్ బి. గితే అధికారులతో కలిసి సోమవారం క్షేత్రస్థాయి లో పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ప్రమాదం ఎలా జరిగింది, రహదారి పరిస్థితులు, ఇతర సాంకేతిక అంశాలపై అధికారులను అడిగి తెలుసుకుని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను అన్ని కోణాల్లో విచారించి, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వాహనదారులు అధిక వేగంతో వాహనాలను నడపడం వల్ల, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎస్పీ వెంట డిఎస్పీ శ్రీనివాసులు, సి.ఐ రవీందర్,
    1
    లింగంపేట గ్రామ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ.
ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు
చందుర్తి మండలం లింగంపేట గ్రామ పరిధిలో శనివారం రాత్రి జరిగిన  రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీమహేష్ బి. గితే అధికారులతో కలిసి సోమవారం  క్షేత్రస్థాయి లో పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ప్రమాదం ఎలా జరిగింది, రహదారి పరిస్థితులు, ఇతర సాంకేతిక అంశాలపై అధికారులను అడిగి తెలుసుకుని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను అన్ని కోణాల్లో విచారించి, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వాహనదారులు అధిక వేగంతో వాహనాలను నడపడం వల్ల, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల  ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎస్పీ వెంట డిఎస్పీ శ్రీనివాసులు, సి.ఐ రవీందర్,
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    52 min ago
  • కాలేశ్వరం ప్రాజెక్టు నాసిరకంగా నిర్మించడానికి కల్వకుంట్ల కుటుంబ అవినీతే కారణం: జువ్వాడి కృష్ణారావు జగిత్యాల జిల్లా కోరుట్ల: కాలేశ్వరం ప్రాజెక్టు నాసిరకంగా నిర్మించడానికి కల్వకుంట్ల కుటుంబ అవినీతే ప్రధాన కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆరోపించారు. ఆదివారం కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం ప్రమాదకరమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కృష్ణారావు అన్నారు. ప్రాజెక్టులోని పిల్లర్లు కుంగిపోయిన నేపథ్యంలో నీటిని నిల్వ చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలకు నీటిని విజయవంతంగా సరఫరా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మేడిగడ్డ ప్రాజెక్టుపై మాట్లాడే ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమాధానం చెప్పాలని కృష్ణారావు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బినామీల ద్వారా నాసిరకం పనులు చేయించారంటూ ఆయన ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కాంక్రీట్ నాణ్యతకు సంబంధించి 54 శాతం నాణ్యత మాత్రమే ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. అవినీతి, ప్రజల సొమ్ము దుర్వినియోగం వంటి అంశాల్లో కల్వకుంట్ల కుటుంబంపై అనేక ఆరోపణలు ఉన్నాయని కృష్ణారావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి గత ప్రభుత్వ నిర్ణయాలే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన పనిచేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ, రైతులకు ఉచిత విద్యుత్‌తో పాటు పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. గత పదేళ్లలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శిస్తూ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించడం మానుకోవాలని సంజయ్‌కు కృష్ణారావు సూచించారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ఈ అంశంపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఈ సమావేశంలో కోరుట్ల మున్సిపల్ వైస్ చైర్మన్, కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కొంతం రాజం, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎంఏ నయీమ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బెజ్జారపు శ్రీనివాస్, మసీద్ ముజ్బిత్, పిజర్ ఖయ్యూం, చుమ్ము హర్షత్ తదితరులు పాల్గొన్నారు.
    1
    కాలేశ్వరం ప్రాజెక్టు నాసిరకంగా నిర్మించడానికి కల్వకుంట్ల కుటుంబ అవినీతే కారణం: జువ్వాడి కృష్ణారావు

జగిత్యాల జిల్లా కోరుట్ల: కాలేశ్వరం ప్రాజెక్టు నాసిరకంగా నిర్మించడానికి కల్వకుంట్ల కుటుంబ అవినీతే ప్రధాన కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆరోపించారు. ఆదివారం కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం ప్రమాదకరమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కృష్ణారావు అన్నారు. ప్రాజెక్టులోని పిల్లర్లు కుంగిపోయిన నేపథ్యంలో నీటిని నిల్వ చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలకు నీటిని విజయవంతంగా సరఫరా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మేడిగడ్డ ప్రాజెక్టుపై మాట్లాడే ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమాధానం చెప్పాలని కృష్ణారావు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బినామీల ద్వారా నాసిరకం పనులు చేయించారంటూ ఆయన ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కాంక్రీట్ నాణ్యతకు సంబంధించి 54 శాతం నాణ్యత మాత్రమే ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారని తెలిపారు.
అవినీతి, ప్రజల సొమ్ము దుర్వినియోగం వంటి అంశాల్లో కల్వకుంట్ల కుటుంబంపై అనేక ఆరోపణలు ఉన్నాయని కృష్ణారావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి గత ప్రభుత్వ నిర్ణయాలే కారణమని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన పనిచేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ, రైతులకు ఉచిత విద్యుత్‌తో పాటు పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. గత పదేళ్లలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శిస్తూ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తోందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించడం మానుకోవాలని సంజయ్‌కు కృష్ణారావు సూచించారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ఈ అంశంపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
ఈ సమావేశంలో కోరుట్ల మున్సిపల్ వైస్ చైర్మన్, కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కొంతం రాజం, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎంఏ నయీమ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బెజ్జారపు శ్రీనివాస్, మసీద్ ముజ్బిత్, పిజర్ ఖయ్యూం, చుమ్ము హర్షత్ తదితరులు పాల్గొన్నారు.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    Insurance Agent జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* *జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* పెద్దపల్లి, ఆగస్టు 24: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ మరియు తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ గార్ల అధ్యక్షతన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గార్కి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీల జనాభా, సామాజిక–ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా నమోదు చేసేందుకు జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్, తెలంగాణ రక్షణ సేన నాయకులు సిరవేన స్వప్న, బొల్లబత్తుల భూమయ్య,బొడిగె మహేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కన్న రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లక్ష్మణ్, జిల్లా అధికార ప్రతినిధి కంకటి శ్రీనివాస్, యువజన అధ్యక్షుడు నోమూరి శ్రీధర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం మరియు ఇతర రంగాల్లో తగిన న్యాయం జరగాలంటే సమగ్ర కుల గణన ఎంతో అవసరమని నాయకులు పేర్కొన్నారు. బీసీల న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు.
    1
    జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* 
*జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* 
పెద్దపల్లి, ఆగస్టు 24: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ మరియు తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ గార్ల అధ్యక్షతన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గార్కి మెమోరాండం సమర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా బీసీల జనాభా, సామాజిక–ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా నమోదు చేసేందుకు జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్, తెలంగాణ రక్షణ సేన  నాయకులు సిరవేన స్వప్న, బొల్లబత్తుల భూమయ్య,బొడిగె మహేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కన్న రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లక్ష్మణ్, జిల్లా అధికార ప్రతినిధి కంకటి శ్రీనివాస్, యువజన అధ్యక్షుడు నోమూరి శ్రీధర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం మరియు ఇతర రంగాల్లో తగిన న్యాయం జరగాలంటే సమగ్ర కుల గణన ఎంతో అవసరమని నాయకులు పేర్కొన్నారు. బీసీల న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • ఆటో స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పాన్ షాప్ తొలగించాలి బెల్లంపల్లి కాంట చౌరస్తాలో కాంట చౌరస్తా వద్ద ఆటో స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పాన్ షాప్ తొలగించాలని ఆటో యూనియన్ అధ్యక్షులు కట్ల రాంకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం మాట్లాడుతూ ఆటో స్టాండ్ ఏర్పాటు చేయుట నిమిత్తంలో వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు చూపించిన స్థలంలో ఆటోలు నిలుపుకుంటున్నామని ఈ క్రమంలో అదే స్థలంలో కాంట రాత్రికి రాత్రే అక్రమంగా పాన్ షాప్ ఏర్పాటు చేశారన్నారు. దింతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయించి ఆటో స్టాండ్ ఏర్పాటు చేయించాలని కోరారు
    1
    ఆటో స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పాన్ షాప్ తొలగించాలి 
బెల్లంపల్లి కాంట చౌరస్తాలో కాంట చౌరస్తా వద్ద ఆటో స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పాన్ షాప్ తొలగించాలని ఆటో యూనియన్ అధ్యక్షులు కట్ల రాంకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం మాట్లాడుతూ ఆటో స్టాండ్ ఏర్పాటు చేయుట నిమిత్తంలో వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు చూపించిన స్థలంలో ఆటోలు నిలుపుకుంటున్నామని ఈ క్రమంలో అదే స్థలంలో కాంట రాత్రికి రాత్రే అక్రమంగా పాన్ షాప్  ఏర్పాటు చేశారన్నారు. దింతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయించి ఆటో స్టాండ్ ఏర్పాటు చేయించాలని కోరారు
    user_Bellampalli news
    Bellampalli news
    Local News Reporter బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ఫీజు దీక్ష పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్...గ్రూప్ రాజకీయాలతో ఉనికి కాపాడుకోవడానికే రాంచందర్ రావు ఫీజు దీక్షల డ్రామా ఆడుతున్నారని విమర్శ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాగానే పార్టీలో లొల్లులు ఎక్కువయ్యాయని, తన ఉనికి కాపాడుకోవడానికే రాంచందర్ రావు ఫీజు రీయింబర్స్ మెంట్ దీక్షల డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ​చేతనైతే ఢిల్లీ నుంచి పైసలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం నవాబుపేటలో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బిజేపి కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఫీజు బకాయిలు పెండింగ్ పెట్టినప్పుడు కిమ్మనకుండా కూర్చున్న బీజేపీ నేతలు, ఇప్పుడు ప్రజా ప్రభుత్వంపై గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకుల ద్వారా అడ్వాన్స్‌గా ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లిస్తున్నామని, సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇస్తున్నామని తెలిపారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నారా? కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా తెచ్చారా? అని ప్రశ్నించారు. ​సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టళ్ల నిర్మాణం చేపడుతూ, అధికారంలోకి రాగానే మెస్ చార్జీలు పెంచి విద్యార్థుల కడుపు నింపుతున్నామని తెలిపారు. మొసలి కన్నీళ్లు ఆపి, ఢిల్లీ పెద్దలకు జ్ఞానోదయం చేసి బీజేపీ రాష్ట్రాల్లో కూడా ఈ పథకం అమలు చేయించాలని, అభివృద్ధి పథంలో సాగుతున్న సర్కారుపై అనవసరంగా అడ్డు పడద్దని హితవు పలికారు.
    1
    బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ఫీజు దీక్ష పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్...గ్రూప్ రాజకీయాలతో ఉనికి కాపాడుకోవడానికే రాంచందర్ రావు ఫీజు దీక్షల డ్రామా ఆడుతున్నారని విమర్శ
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాగానే పార్టీలో లొల్లులు ఎక్కువయ్యాయని, తన ఉనికి కాపాడుకోవడానికే రాంచందర్ రావు ఫీజు రీయింబర్స్ మెంట్ దీక్షల డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ​చేతనైతే ఢిల్లీ నుంచి పైసలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం నవాబుపేటలో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బిజేపి కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఫీజు బకాయిలు పెండింగ్ పెట్టినప్పుడు కిమ్మనకుండా కూర్చున్న బీజేపీ నేతలు, ఇప్పుడు ప్రజా ప్రభుత్వంపై గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకుల ద్వారా అడ్వాన్స్‌గా ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లిస్తున్నామని, సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇస్తున్నామని తెలిపారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నారా? కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా తెచ్చారా? అని ప్రశ్నించారు.
​సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టళ్ల నిర్మాణం చేపడుతూ, అధికారంలోకి రాగానే మెస్ చార్జీలు పెంచి విద్యార్థుల కడుపు నింపుతున్నామని తెలిపారు. మొసలి కన్నీళ్లు ఆపి, ఢిల్లీ పెద్దలకు జ్ఞానోదయం చేసి బీజేపీ రాష్ట్రాల్లో కూడా ఈ పథకం అమలు చేయించాలని, అభివృద్ధి పథంలో సాగుతున్న సర్కారుపై అనవసరంగా అడ్డు పడద్దని హితవు పలికారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం తో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం తో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    1
    మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో  ప్రజావాణి ఆకస్మిక తనిఖీ
చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన
అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం తో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం తో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • కాంగ్రేస్ పార్టీ ఎన్నికల్లో కార్మిక వర్గానికి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి లేదంటే పోరాటాలు తప్పవు. ___ఎస్.వీరయ్య, CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు. CITU పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్, CITU కార్యాలయం, గోదావరిఖని లో నిర్వహిస్తున్న క్యాడర్ క్లాసులు రెండవ రోజు క్లాసుకు ముఖ్యఅతిథిగా CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య గారు హాజరై CITU నిర్మాణం - కర్తవ్యాలు. అంశం పై క్లాసు బోదించారు. క్యాడర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ ఎన్నికల్లో కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలి పోయాయాని అన్నారు. కాంగ్రేస్ పార్టీ అధికారం లోకి వచ్చింది 3 సంవత్సరాలు దగ్గర పడుతుందని అన్నారు ఇప్పటికి హామీలు వేరవేర్చకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎం చేస్తుందని ప్రశ్నించారు. ఇంకా కాంగ్రేస్ ప్రభుత్వం కు రెండేళ్లు మాత్రమే అధికారం మిగిలి ఉందని అన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పోరాటలు తప్పవని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ను హెచ్చరించారి. యూనియన్ గవర్నమెంట్ (మోడీ గవర్నమెంట్) కనీస వేతనాలను నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. ఈ ప్రాంతం లో ఉన్న సింగరేణి, ఆర్ ఎఫ్ సి ఎల్, ఎన్ టి పి సి లాంటి కంపెనిల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు లేకుండా బానిస సాకిరీ చేయాల్సి వస్తుందని అన్నారు. ముఖ్యంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఫిక్స్డ్ టర్మ్ లాంటి పేర్ల తో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు లేవు అన్నారు.మోడీ గవర్నమెంట్ 2017లో చేసిన కనీస వేతనాల చట్టం 2022 జనవరితో దాని పని అయిపొయింది అన్నారు.ఇప్పుడు నాలుగేండ్లు గడిచింది మోడీ దాని ఊసే మర్చిపోయారని ఇది అత్యంత దారుణం అన్నారు.ఇప్పటికైనా కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిదంగా గోదావరిఖని ప్రాంతం లో ఇప్పటికే సూపర్ స్పెషాలిటీ ESI వంద పడకల హాస్పిటల్ ఏర్పాటుకు స్థలం సేకరించారు ఇంత జరిగాక కూడా హాస్పిటల్ నిర్మాణం ప్రారంభించలేదు అన్నారు. ఈ విషయం లో కేంద్ర గవర్నమెంట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉందొ చెప్పాలని అన్నారు.ప్రతి నెల ESI హాస్పిటల్ కు రెండు కోట్ల నలభై లక్షల ఆదాయం వస్తుంది. వంద పడకల హాస్పిటల్ ను నిర్మించడంలో కేంద్రం నిర్లక్ష్యం తాగదన్నారు. వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని లేని పక్షం లో రానున్న రోజుల్లో కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఈ క్లాసులకు ప్రిన్సిపాల్ గా వేల్పుల కుమారస్వామి CITU జిల్లా అధ్యక్షులు వ్యవహరించగ జిల్లా కార్యదర్శి ఎ. ముత్యం రావు, కోశాధికారి ఎం. రామాచారీ, ఉపాధ్యక్షులు బిక్షపతి,కొమురయ్య, సహాయ కార్యదర్శులు జ్యోతి, రవీందర్,వనజా రాణి, ప్రవీణ్, జిల్లా కమిటీ సభ్యులు గణేష్,లక్ష్మారెడ్డి, శివ రామ్ రెడ్డి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
    1
    కాంగ్రేస్ పార్టీ ఎన్నికల్లో కార్మిక వర్గానికి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి లేదంటే పోరాటాలు తప్పవు.
___ఎస్.వీరయ్య,
CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు.
CITU పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్, CITU కార్యాలయం, గోదావరిఖని లో నిర్వహిస్తున్న క్యాడర్ క్లాసులు రెండవ రోజు క్లాసుకు ముఖ్యఅతిథిగా CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య గారు హాజరై CITU నిర్మాణం - కర్తవ్యాలు. అంశం పై క్లాసు బోదించారు. క్యాడర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ ఎన్నికల్లో కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలి పోయాయాని అన్నారు. కాంగ్రేస్ పార్టీ అధికారం లోకి వచ్చింది 3 సంవత్సరాలు దగ్గర పడుతుందని అన్నారు ఇప్పటికి హామీలు వేరవేర్చకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 
ఎం చేస్తుందని ప్రశ్నించారు. ఇంకా కాంగ్రేస్ ప్రభుత్వం కు రెండేళ్లు మాత్రమే అధికారం మిగిలి ఉందని అన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పోరాటలు తప్పవని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ను   హెచ్చరించారి.
యూనియన్ గవర్నమెంట్ (మోడీ గవర్నమెంట్)
కనీస వేతనాలను నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు.
ఈ ప్రాంతం లో ఉన్న సింగరేణి, ఆర్ ఎఫ్ సి ఎల్, ఎన్ టి పి సి లాంటి కంపెనిల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు లేకుండా బానిస సాకిరీ చేయాల్సి వస్తుందని అన్నారు. ముఖ్యంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఫిక్స్డ్  టర్మ్ లాంటి పేర్ల తో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు లేవు అన్నారు.మోడీ గవర్నమెంట్ 2017లో చేసిన కనీస వేతనాల చట్టం 2022 జనవరితో దాని పని అయిపొయింది అన్నారు.ఇప్పుడు నాలుగేండ్లు గడిచింది మోడీ దాని ఊసే మర్చిపోయారని ఇది అత్యంత దారుణం అన్నారు.ఇప్పటికైనా కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
అదేవిదంగా గోదావరిఖని ప్రాంతం లో ఇప్పటికే సూపర్ స్పెషాలిటీ  ESI వంద పడకల హాస్పిటల్ ఏర్పాటుకు స్థలం సేకరించారు ఇంత జరిగాక కూడా హాస్పిటల్ నిర్మాణం ప్రారంభించలేదు అన్నారు.
ఈ విషయం లో కేంద్ర గవర్నమెంట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉందొ చెప్పాలని అన్నారు.ప్రతి నెల ESI హాస్పిటల్ కు రెండు కోట్ల నలభై లక్షల ఆదాయం వస్తుంది. వంద  పడకల హాస్పిటల్ ను నిర్మించడంలో కేంద్రం నిర్లక్ష్యం తాగదన్నారు.
వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని లేని పక్షం లో రానున్న రోజుల్లో కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు.
ఈ క్లాసులకు ప్రిన్సిపాల్ గా వేల్పుల కుమారస్వామి CITU జిల్లా అధ్యక్షులు వ్యవహరించగ జిల్లా కార్యదర్శి ఎ. ముత్యం రావు, కోశాధికారి ఎం. రామాచారీ, ఉపాధ్యక్షులు బిక్షపతి,కొమురయ్య,
సహాయ కార్యదర్శులు జ్యోతి, రవీందర్,వనజా రాణి, ప్రవీణ్, జిల్లా కమిటీ సభ్యులు గణేష్,లక్ష్మారెడ్డి, శివ రామ్ రెడ్డి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    23 hrs ago
  • *కరీంనగర్ జిల్లా ఎలబోతారంలో కన్నతల్లిని బావిలో పడేసి హత్య చేసి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకులు ఇద్దరు అరెస్ట్ కరీంనగర్ జిల్లాలో కన్నతల్లి పట్ల ఇద్దరు కొడుకులు కసాయిలా ప్రవర్తించారు. తల్లిని బావిలో పడేసి హత్య చేసి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి చివరకు నిందితులుగా దొరికిపోయారు. సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన నూనె వెంకటమ్మ దారుణ హత్యకు గురయ్యారు. వెంకటమ్మకు నలుగురు కొడుకులు ఉండగా ఇటీవల పక్షవాతం బారిన పడి మంచానికి పరిమితమైంది. నలుగురు కొడుకులు వంతుల వారిగా తల్లి కి సపరియాలు చేయాల్సి ఉండగా ఇద్దరు కొడుకులు తల్లి ఇంట్లో చనిపోతే ఇల్లు వదిలి పెట్టాల్సి వస్తుందని అరిష్టంగా భావించి మంచం పట్టిన తల్లిని నాలుగు మాసాల క్రితం బావిలో పడేసి తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి బావిలో ఉన్న శవాన్ని వెలికి తీశారు. పక్షపాతంతో కదలలేని స్థితిలో ఉన్న వృద్దురాలు బావిలో ఎలా పడిందనే విషయంపై పోలీసులు ఆరా తీయగా విస్తుపోయే విషయాలు తెలుపులోకి వచ్చాయి. పెద్దకొడుకు సమ్మయ్య చిన్నకొడుకు శ్రీనివాస్ హత్యకు పాల్పడినట్లు నిర్థారించి అరెస్ట్ చేశారు‌. తల్లిని బావిలో పడేసి ప్రాణం తీసి కనిపించడం లేదని తప్పుడు సమాచారం ఇచ్చిన ఇద్దరు కొడుకులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని సిఐ శ్రీనివాస్ తెలిపారు.
    1
    *కరీంనగర్ జిల్లా ఎలబోతారంలో కన్నతల్లిని బావిలో పడేసి హత్య చేసి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకులు ఇద్దరు అరెస్ట్

కరీంనగర్ జిల్లాలో కన్నతల్లి పట్ల ఇద్దరు కొడుకులు కసాయిలా  ప్రవర్తించారు. తల్లిని బావిలో పడేసి హత్య చేసి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి చివరకు నిందితులుగా దొరికిపోయారు. సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన నూనె వెంకటమ్మ దారుణ హత్యకు గురయ్యారు. వెంకటమ్మకు నలుగురు కొడుకులు ఉండగా ఇటీవల పక్షవాతం బారిన పడి మంచానికి పరిమితమైంది. నలుగురు కొడుకులు వంతుల వారిగా తల్లి కి సపరియాలు చేయాల్సి ఉండగా ఇద్దరు కొడుకులు తల్లి ఇంట్లో చనిపోతే ఇల్లు వదిలి పెట్టాల్సి వస్తుందని అరిష్టంగా భావించి  మంచం పట్టిన  తల్లిని నాలుగు మాసాల క్రితం బావిలో పడేసి తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి బావిలో ఉన్న శవాన్ని వెలికి తీశారు. పక్షపాతంతో కదలలేని స్థితిలో ఉన్న వృద్దురాలు బావిలో ఎలా పడిందనే విషయంపై పోలీసులు ఆరా తీయగా విస్తుపోయే విషయాలు తెలుపులోకి వచ్చాయి. పెద్దకొడుకు సమ్మయ్య చిన్నకొడుకు శ్రీనివాస్ హత్యకు పాల్పడినట్లు నిర్థారించి అరెస్ట్ చేశారు‌. తల్లిని బావిలో పడేసి ప్రాణం తీసి కనిపించడం లేదని తప్పుడు సమాచారం ఇచ్చిన ఇద్దరు కొడుకులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని సిఐ శ్రీనివాస్ తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.