మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం తో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం తో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం తో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం తో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం తో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం తో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- సామాజిక,ప్రజా చైతన్యం కోసం కళాకారుల కలాలు, గళాలు ఉండాలి. కళాకారులు శిక్షణ ద్వారా కళా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి : సిపిఐ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి. సకల జనుల హితం కోసం,సామాజిక కోణంలో ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం కళాకారులు తమ కళాలకు, గళాలకు పనిచెప్పాలని,కళాకారులు శిక్షణ ద్వారా తమ నైపుణ్యం పెంపొందించుకోవాలని సిపిఐ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరంను చాడ వెంకట రెడ్డి ప్రారంభించారు. ఈ శిక్షణ శిబిరంకు హాజరైన కళాకారులను ఉద్దేశించి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రచయితలు,కవులు,కళాకారులు కార్మిక,కర్షక,ప్రజా సమస్యలపై,వారి జీవనవిధానాలపై నిరంతరం అధ్యయనం చేస్తూ రచనలు, పాటలు,వీధి నాటకాలు వ్రాయాలని,కళాకారులు ఎంతో మంది ఉంటారు కానీ ప్రజా కళాకారులు కొంత మంది మాత్రమే ఉంటారని అలాంటి కళాకారులు నిత్యం ప్రజల బాధలను చూసి వాటిని ప్రపంచానికి తెలిజేసేందుకు పాటలు పాడాలని,కళ కాసుల కోసం కాదు ప్రజల కోసమని పాడే కళాకారులే ప్రజానాట్య మండలి కళాకారులని, అలాంటి కళాకారులు నిత్య విద్యార్థులుగా ఎన్నో విషయాలు తెలుసుకొని,పాటలు నేర్చుకొని పాడాలని అందుకు ఇలాంటి శిక్షణా శిబిరాలు ఉపయోగపడతాయని వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్రజల కష్ట,సుఖాలను పాటల రూపంలో బయటకు తెచ్చి ఎంతో మందిని మెప్పించే అత్యంత బలమైన ఆయుధం పాట అని, ఏ పోరాటాలు,ఉద్యమాలు,బహిరంగ సభలు విజయవంతం కావాలన్నా కళాకారులు ఉండాల్సిందేనని, కరీంనగర్ లో సెప్టెంబర్ 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభల విజయవంతం కోసం కళాకారులు తమ వంతుగా కళారూపాలు ప్రదర్శించాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఈ శిక్షణా శిబిరం కార్యక్రమంలో సిపిఐ కరీంనగర్ ,పెద్దపల్లి జిల్లాల కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, తాండ్ర సదానందం,ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కురుమిద్ద శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కవ్వంపల్లి స్వామి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి కటిక రెడ్డి బుచన్న యాదవ్,టేకుమల్ల సమ్మయ్య, ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ,ఉప్పలయ్య,సహాయ కార్యదర్శి రేగుంట చంద్ర శేఖర్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గణేష్,వెంకటాచారి, రోంటాల శ్యామ్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు దుడ్డేల సమ్మయ్య, వరకోలు సదానందం, ఎజ్జ రాజయ్య,లక్ష్మీరాజం,ఆసాల రమ,ఇందిరా,లక్ష్మణ్,ఎర్రోజు శ్రీనివాస్,మోహన్,డప్పురాజు తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ లో ఒరిగిన భారీ వృక్షం: భయాందోళనలో స్థానికులు.. కరీంనగర్ నగరంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో, మటన్ మార్కెట్ పక్కన ఉన్న ఒక భారీ వృక్షం ప్రమాదకరంగా కిందకు వంగిపోయింది. తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు.. రాకపోకలకు ఆటంకంగా ఉన్న కొమ్మలను నరికివేశారు. ఏ క్షణంలో చెట్టు కూలుతుందోనని ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, ఆ చెట్టును అక్కడి నుంచి పూర్తిగా తొలగించి ప్రమాదాన్ని తప్పించాలని కోరుతున్నారు.3
- గిరిజనుల ఇండ్ల నిర్మాణాలకు ఫారెస్ట్ అధికారులు సహకరించాలి రాజంపేట మండలంలోని షేర్ శంకర్ తండా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడం సిగ్గుచేటని, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొత్త నరసింహులు ఆరోపించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన అటవీ శాఖ అధికారుల వేధింపుల వల్ల లబ్ధిదారులు ఇండ్లు నిర్మించుకోలేకపోతున్నారని, గిరిజనులను వేధింపులకు గురి చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.1
- యాప్ ఉంటేనే.. ఎరువులా? రూ.30 వేల ఫోన్ ఉంటేనే బుకింగ్.. రెండు బస్తాల కోసం పొరుగు మండలాలకు పరుగులు వారం రోజుల రాష్ట్రవ్యాప్త ఆందోళనకు బీఆర్‌ఎస్ పిలుపు మెదక్ జిల్లా, నిజాంపేట: యూరియా, డీఏపీ కోసం రైతులు అల్లాడుతుంటే యాప్‌ల పేరుతో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ఇబ్బందులు పెడుతోందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారెడ్డి మండిపడ్డారు. నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రూ.30 వేల 5జీ ఫోన్ ఉంటేనే ఎరువులు బుక్ చేసుకోవాలనడం పేద రైతులపై భారం మోపడమేనన్నారు. ఎరువుల పంపిణీని జిల్లా యూనిట్‌గా మార్చడంతో రెండు బస్తాల కోసం రాయ్‌కోడ్, అల్లాదుర్గ్ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, ఇందుకు రూ.వెయ్యి వరకు ఆటో చార్జీలు ఖర్చవుతున్నాయని తెలిపారు. రైతు సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వారం రోజుల రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, బాపురెడ్డి, అబ్దుల్ అజీజ్, దయాకర్, రంజిత్ గౌడ్, శ్రీకాంత్, సంపత్ తదితరులు ఉన్నారు.2
- *పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెట్ వెంటనే విడుదల చేయాలి* *పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెట్ వెంటనే విడుదల చేయాలి* రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని విద్యా సంవత్సరాలుగా విద్యార్థులకు బాకీ ఉన్న ఫీజు రీయంబర్స్ మెట్ బాకీలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ *బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రాంచందర్ రావు* గారు చేపడుతున్న 48 గంటల నిరహార దీక్షకు మద్దతుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో *ఫీజుల బకాయి - బీజేపీ లడాయి* మీద నిరసన కార్యక్రమం మున్సిపల్ కార్యాలయం ముందు గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ BR అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జి లతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ గత TRS, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని, పెండింగ్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వానికి కాలేజీలకు మధ్య విద్యార్థుల భవిష్యత్తు నలిగిపోతుంది అని అన్నారు. వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమం ఉదృతం అవుతుందని అన్నారు.1
- తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో రోడ్డు ప్రమాదం లారీని ఢీకొన్న ఇన్నోవా రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఇన్నోవా కారు ఢీకొన్నట్లు సమాచారం.ఈ ప్రమాదంలో ఇన్నోవా కారులో ఉన్న ఒక వ్యక్తికి కాలు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- *బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం* *-- రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* *మృతులకు నివాళు అర్పించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే* చందుర్తి మండలం లింగంపేట గ్రామ పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మృతి చెందిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన షాదుల్లా కుటుంబం వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన రక్తసంబంధీకులు నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో షాదుల్లాతో పాటు ఆయన భార్య హాసీనా, మరో హాసీనా, పదో తరగతి చదువుతున్న చిన్నారి మృతి చెందడం బాధాకరమని విప్ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఒక్కొక్కరుగా మృతి చెందారని తెలిపారు. వేములవాడ పట్టణంలోనీ ఏరియా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పరామర్శించి, ఓదార్చారు. మృతదేహాలకు నివాళి అర్పించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందజేస్తామని తెలిపారు.. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు ముందు, వెనుక సీట్లలో ఉన్నప్పటికీ సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. వాహనాలను అతివేగంగా నడపకుండా జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు. రాష్ట్ర పోలీసు శాఖ ప్రయాణికుల భద్రత పై అవగాహన కల్పించడానికి అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు...ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరూ తమ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకుని సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఒకే ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రక్తసంబంధీకులు మృతి చెందడం అత్యంత బాధాకరమైనoదన్నారు., మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవండుతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు... ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించి, వేగ నియంత్రణ పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలి అని విప్ విజ్ఞప్తి చేశారు..4