Shuru
Apke Nagar Ki App…
గిరిజనుల ఇండ్ల నిర్మాణాలకు ఫారెస్ట్ అధికారులు సహకరించాలి రాజంపేట మండలంలోని షేర్ శంకర్ తండా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడం సిగ్గుచేటని, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొత్త నరసింహులు ఆరోపించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన అటవీ శాఖ అధికారుల వేధింపుల వల్ల లబ్ధిదారులు ఇండ్లు నిర్మించుకోలేకపోతున్నారని, గిరిజనులను వేధింపులకు గురి చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
Mahesh Nakka
గిరిజనుల ఇండ్ల నిర్మాణాలకు ఫారెస్ట్ అధికారులు సహకరించాలి రాజంపేట మండలంలోని షేర్ శంకర్ తండా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడం సిగ్గుచేటని, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొత్త నరసింహులు ఆరోపించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన అటవీ శాఖ అధికారుల వేధింపుల వల్ల లబ్ధిదారులు ఇండ్లు నిర్మించుకోలేకపోతున్నారని, గిరిజనులను వేధింపులకు గురి చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
More news from Hyderabad and nearby areas
- గిరిజనుల ఇండ్ల నిర్మాణాలకు ఫారెస్ట్ అధికారులు సహకరించాలి రాజంపేట మండలంలోని షేర్ శంకర్ తండా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడం సిగ్గుచేటని, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొత్త నరసింహులు ఆరోపించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన అటవీ శాఖ అధికారుల వేధింపుల వల్ల లబ్ధిదారులు ఇండ్లు నిర్మించుకోలేకపోతున్నారని, గిరిజనులను వేధింపులకు గురి చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.1
- *పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెట్ వెంటనే విడుదల చేయాలి* *పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెట్ వెంటనే విడుదల చేయాలి* రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని విద్యా సంవత్సరాలుగా విద్యార్థులకు బాకీ ఉన్న ఫీజు రీయంబర్స్ మెట్ బాకీలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ *బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రాంచందర్ రావు* గారు చేపడుతున్న 48 గంటల నిరహార దీక్షకు మద్దతుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో *ఫీజుల బకాయి - బీజేపీ లడాయి* మీద నిరసన కార్యక్రమం మున్సిపల్ కార్యాలయం ముందు గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ BR అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జి లతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ గత TRS, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని, పెండింగ్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వానికి కాలేజీలకు మధ్య విద్యార్థుల భవిష్యత్తు నలిగిపోతుంది అని అన్నారు. వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమం ఉదృతం అవుతుందని అన్నారు.1
- ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా ఆటో డ్రైవర్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ నర్సింలు కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సూచించారు .లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు ఉన్నారు.1
- యాప్ ఉంటేనే.. ఎరువులా? రూ.30 వేల ఫోన్ ఉంటేనే బుకింగ్.. రెండు బస్తాల కోసం పొరుగు మండలాలకు పరుగులు వారం రోజుల రాష్ట్రవ్యాప్త ఆందోళనకు బీఆర్‌ఎస్ పిలుపు మెదక్ జిల్లా, నిజాంపేట: యూరియా, డీఏపీ కోసం రైతులు అల్లాడుతుంటే యాప్‌ల పేరుతో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ఇబ్బందులు పెడుతోందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారెడ్డి మండిపడ్డారు. నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రూ.30 వేల 5జీ ఫోన్ ఉంటేనే ఎరువులు బుక్ చేసుకోవాలనడం పేద రైతులపై భారం మోపడమేనన్నారు. ఎరువుల పంపిణీని జిల్లా యూనిట్‌గా మార్చడంతో రెండు బస్తాల కోసం రాయ్‌కోడ్, అల్లాదుర్గ్ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, ఇందుకు రూ.వెయ్యి వరకు ఆటో చార్జీలు ఖర్చవుతున్నాయని తెలిపారు. రైతు సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వారం రోజుల రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, బాపురెడ్డి, అబ్దుల్ అజీజ్, దయాకర్, రంజిత్ గౌడ్, శ్రీకాంత్, సంపత్ తదితరులు ఉన్నారు.2
- పదవి విరమణ పొందిన వీఆర్వో వీఆర్ఏలకు పెన్షన్ మంజూరు చేయాలి ప్రజావాణిలో వినతి సమర్పించిన వీఆర్వో వీఆర్ఏలు పదవీ విరమణ పొందిన వీఏఓలు, వీఆర్‌ఓలకు పెన్షన్ మంజూరు చేయాలి రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన వీఏఓలు, వీఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు, సహాయ పంచాయతీ కార్యదర్శులకు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. మెదక్ జిల్లాలోని పలు మండలాల్లో 1965 నుంచి 1984 వరకు పటేల్–పట్వారీలుగా, 1992 నుంచి 2002 వరకు వీఏఓలుగా, 2002 నుంచి 2007 వరకు పంచాయతీ కార్యదర్శులు, సహాయ పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందినప్పటికీ తమకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పదవీ విరమణ పెన్షన్ అందడం లేదని వారు తెలిపారు. ఈ సమస్యపై పలుమార్లు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు విన్నవించినప్పటికీ పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తమ సమస్యపై స్పందించి, సంబంధిత సర్వీస్ రికార్డులను పరిశీలించి నివేదిక పంపాలని భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ (CCLA)కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.CCLA ఆదేశాల మేరకు జిల్లాలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల వివరాలతో జాబితా రూపొందించి నివేదిక పంపాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తమకు తెలిసిందన్నారు. కావున జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని CCLA ఆదేశాల మేరకు జిల్లాలో పదవీ విరమణ పొందిన వీఏఓలు, వీఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు, సహాయ పంచాయతీ కార్యదర్శుల వివరాలతో జాబితా రూపొందించి CCLAకు పంపించాలని కోరారు. తమకు రావాల్సిన పదవీ విరమణ పెన్షన్ మంజూరయ్యేలా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.1
- మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం తో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం తో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- బీర్కూర్ మండలంలో ప్రెస్ మీట్ ఫోరం అధ్యక్షుడి ఎన్నికపై వివాదం. బీర్కూర్ మండల ఫోరం అధ్యక్షుడి ఎన్నిక విషయంలో వివాదం నెలకొంది. బీర్కూర్ మండల కేంద్రంలో నిన్న బోయిన శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌పై మండల ఫోరం ఉపాధ్యక్షుడు రేంజర్ల అనిల్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీర్కూర్ మండలంలో మొత్తం 13 గ్రామాలు ఉన్నాయని, మండల ఫోరం అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే మెజారిటీగా ఏడుగురు సర్పంచుల మద్దతు అవసరమని తెలిపారు. అయితే ఐదుగురు సర్పంచులతో అధ్యక్షుడిని ఎన్నుకోవడం సరికాదని పేర్కొన్నారు.తాము ఆరుగురు సర్పంచుల బలంతో అరిగే ధర్మతేజను మండల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని, తమ ఎన్నికే చెల్లుబాటు అవుతుందని రేంజర్ల అనిల్ కుమార్ అన్నారు. ఐదుగురు సర్పంచులతో నిర్వహించిన ఎన్నికపై శంకర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.1
- ఫీజు బకాయిలు చెల్లించాలని బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన.... కామారెడ్డి ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట జిల్లా బిజెపి అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వానికి విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు1