logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బీర్కూర్ మండలంలో ప్రెస్ మీట్ ఫోరం అధ్యక్షుడి ఎన్నికపై వివాదం. బీర్కూర్ మండల ఫోరం అధ్యక్షుడి ఎన్నిక విషయంలో వివాదం నెలకొంది. బీర్కూర్ మండల కేంద్రంలో నిన్న బోయిన శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌పై మండల ఫోరం ఉపాధ్యక్షుడు రేంజర్ల అనిల్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీర్కూర్ మండలంలో మొత్తం 13 గ్రామాలు ఉన్నాయని, మండల ఫోరం అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే మెజారిటీగా ఏడుగురు సర్పంచుల మద్దతు అవసరమని తెలిపారు. అయితే ఐదుగురు సర్పంచులతో అధ్యక్షుడిని ఎన్నుకోవడం సరికాదని పేర్కొన్నారు.తాము ఆరుగురు సర్పంచుల బలంతో అరిగే ధర్మతేజను మండల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని, తమ ఎన్నికే చెల్లుబాటు అవుతుందని రేంజర్ల అనిల్ కుమార్ అన్నారు. ఐదుగురు సర్పంచులతో నిర్వహించిన ఎన్నికపై శంకర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

1 hr ago
user_Reporter Khaseem
Reporter Khaseem
బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
1 hr ago

బీర్కూర్ మండలంలో ప్రెస్ మీట్ ఫోరం అధ్యక్షుడి ఎన్నికపై వివాదం. బీర్కూర్ మండల ఫోరం అధ్యక్షుడి ఎన్నిక విషయంలో వివాదం నెలకొంది. బీర్కూర్ మండల కేంద్రంలో నిన్న బోయిన శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌పై మండల ఫోరం ఉపాధ్యక్షుడు రేంజర్ల అనిల్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీర్కూర్ మండలంలో మొత్తం 13 గ్రామాలు ఉన్నాయని, మండల ఫోరం అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే మెజారిటీగా ఏడుగురు సర్పంచుల మద్దతు అవసరమని తెలిపారు. అయితే ఐదుగురు సర్పంచులతో అధ్యక్షుడిని ఎన్నుకోవడం సరికాదని పేర్కొన్నారు.తాము ఆరుగురు సర్పంచుల బలంతో అరిగే ధర్మతేజను మండల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని, తమ ఎన్నికే చెల్లుబాటు అవుతుందని రేంజర్ల అనిల్ కుమార్ అన్నారు. ఐదుగురు సర్పంచులతో నిర్వహించిన ఎన్నికపై శంకర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • బీర్కూర్ మండలంలో ప్రెస్ మీట్ ఫోరం అధ్యక్షుడి ఎన్నికపై వివాదం. బీర్కూర్ మండల ఫోరం అధ్యక్షుడి ఎన్నిక విషయంలో వివాదం నెలకొంది. బీర్కూర్ మండల కేంద్రంలో నిన్న బోయిన శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌పై మండల ఫోరం ఉపాధ్యక్షుడు రేంజర్ల అనిల్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీర్కూర్ మండలంలో మొత్తం 13 గ్రామాలు ఉన్నాయని, మండల ఫోరం అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే మెజారిటీగా ఏడుగురు సర్పంచుల మద్దతు అవసరమని తెలిపారు. అయితే ఐదుగురు సర్పంచులతో అధ్యక్షుడిని ఎన్నుకోవడం సరికాదని పేర్కొన్నారు.తాము ఆరుగురు సర్పంచుల బలంతో అరిగే ధర్మతేజను మండల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని, తమ ఎన్నికే చెల్లుబాటు అవుతుందని రేంజర్ల అనిల్ కుమార్ అన్నారు. ఐదుగురు సర్పంచులతో నిర్వహించిన ఎన్నికపై శంకర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
    1
    బీర్కూర్ మండలంలో ప్రెస్ మీట్ ఫోరం అధ్యక్షుడి ఎన్నికపై వివాదం.
బీర్కూర్ మండల ఫోరం అధ్యక్షుడి ఎన్నిక విషయంలో వివాదం నెలకొంది. బీర్కూర్ మండల కేంద్రంలో నిన్న బోయిన శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌పై మండల ఫోరం ఉపాధ్యక్షుడు రేంజర్ల అనిల్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీర్కూర్ మండలంలో మొత్తం 13 గ్రామాలు ఉన్నాయని, మండల ఫోరం అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే మెజారిటీగా ఏడుగురు సర్పంచుల మద్దతు అవసరమని తెలిపారు. అయితే ఐదుగురు సర్పంచులతో అధ్యక్షుడిని ఎన్నుకోవడం సరికాదని పేర్కొన్నారు.తాము ఆరుగురు సర్పంచుల బలంతో అరిగే ధర్మతేజను మండల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని, తమ ఎన్నికే చెల్లుబాటు అవుతుందని రేంజర్ల అనిల్ కుమార్ అన్నారు. ఐదుగురు సర్పంచులతో నిర్వహించిన ఎన్నికపై శంకర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
    user_Reporter Khaseem
    Reporter Khaseem
    బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • NPRD INDIA ఖేడ్ అధ్యక్షుడిగా. బుక్క ఇస్మాయిల్ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా మన్నూరు మండలం, బోరంచ గ్రామానికి చెందిన బుక్క ఇస్మాయిల్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని NPRD INDIA రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ నాయకులు ఆయనకు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్, స్కైటు (SKITU) రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ షఫీ, NPRD జాతీయ అధ్యక్షులు గజ్జె పైడి కుమార్, మరియు గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ శబరి చావ్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని అభినందిస్తూ, నియోజకవర్గ పరిధిలోని వికలాంగుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి బాధ్యతాయుతంగా కృషి చేయాలని జాతీయ, రాష్ట్ర నాయకులు ఆకాంక్షించారు.
    1
    NPRD INDIA ఖేడ్ అధ్యక్షుడిగా.         
బుక్క ఇస్మాయిల్  
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా మన్నూరు మండలం, బోరంచ గ్రామానికి చెందిన బుక్క ఇస్మాయిల్ నియమితులయ్యారు.
హైదరాబాద్‌లోని NPRD INDIA రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ నాయకులు ఆయనకు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్, స్కైటు (SKITU) రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ షఫీ, NPRD జాతీయ అధ్యక్షులు గజ్జె పైడి కుమార్, మరియు గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ శబరి చావ్లా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని అభినందిస్తూ, నియోజకవర్గ పరిధిలోని వికలాంగుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి బాధ్యతాయుతంగా కృషి చేయాలని జాతీయ, రాష్ట్ర నాయకులు ఆకాంక్షించారు.
    user_JALEEL RUSTUM REPORTER
    JALEEL RUSTUM REPORTER
    కంగ్టి మండలం మన సాక్షి రిపోర్టర్ జలిల్ ర కంగ్టి, సంగారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
  • బాసర అమ్మవారికి ఒక్కరోజే 11లక్షల 79 వేల 350 రూపాయల ఆదాయం... *బాసర: ఒక్కరోజే రూ.11.79 లక్షల ఆదాయం* ఆదివారం సెలవు దినం, శ్రావణ మాసం ఏకాదశి సందర్భంగా బాసర అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి పూజలు నిర్వహించారు. అక్షరాభ్యాసం, కుంకుమార్చన, చండీహోమం, సత్యనారాయణ వ్రతం తదితర అర్జిత సేవల ద్వారా ఒక్కరోజే రూ.11,79,350 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ అంజనాదేవి తెలిపారు.
    1
    బాసర అమ్మవారికి ఒక్కరోజే 11లక్షల 79 వేల 350 రూపాయల ఆదాయం...
*బాసర: ఒక్కరోజే రూ.11.79 లక్షల ఆదాయం*
ఆదివారం సెలవు దినం, శ్రావణ మాసం ఏకాదశి సందర్భంగా బాసర అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి  భారీగా తరలివచ్చి పూజలు నిర్వహించారు. 
అక్షరాభ్యాసం, కుంకుమార్చన, చండీహోమం, సత్యనారాయణ వ్రతం తదితర అర్జిత సేవల ద్వారా ఒక్కరోజే రూ.11,79,350 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ అంజనాదేవి తెలిపారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    12 hrs ago
  • గిరిజనుల ఇండ్ల నిర్మాణాలకు ఫారెస్ట్ అధికారులు సహకరించాలి రాజంపేట మండలంలోని షేర్ శంకర్ తండా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడం సిగ్గుచేటని, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొత్త నరసింహులు ఆరోపించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన అటవీ శాఖ అధికారుల వేధింపుల వల్ల లబ్ధిదారులు ఇండ్లు నిర్మించుకోలేకపోతున్నారని, గిరిజనులను వేధింపులకు గురి చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
    1
    గిరిజనుల ఇండ్ల నిర్మాణాలకు ఫారెస్ట్ అధికారులు సహకరించాలి
రాజంపేట మండలంలోని షేర్ శంకర్ తండా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడం సిగ్గుచేటని, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొత్త నరసింహులు ఆరోపించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన అటవీ శాఖ అధికారుల వేధింపుల వల్ల లబ్ధిదారులు ఇండ్లు నిర్మించుకోలేకపోతున్నారని, గిరిజనులను వేధింపులకు గురి చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
    user_Mahesh Nakka
    Mahesh Nakka
    Kamareddy, Hyderabad•
    1 hr ago
  • *పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెట్ వెంటనే విడుదల చేయాలి* *పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెట్ వెంటనే విడుదల చేయాలి* రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని విద్యా సంవత్సరాలుగా విద్యార్థులకు బాకీ ఉన్న ఫీజు రీయంబర్స్ మెట్ బాకీలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ *బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రాంచందర్ రావు* గారు చేపడుతున్న 48 గంటల నిరహార దీక్షకు మద్దతుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో *ఫీజుల బకాయి - బీజేపీ లడాయి* మీద నిరసన కార్యక్రమం మున్సిపల్ కార్యాలయం ముందు గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ BR అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జి లతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ గత TRS, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని, పెండింగ్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వానికి కాలేజీలకు మధ్య విద్యార్థుల భవిష్యత్తు నలిగిపోతుంది అని అన్నారు. వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమం ఉదృతం అవుతుందని అన్నారు.
    1
    *పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెట్ వెంటనే విడుదల చేయాలి*

*పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెట్ వెంటనే విడుదల చేయాలి*
రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని విద్యా సంవత్సరాలుగా విద్యార్థులకు బాకీ ఉన్న ఫీజు రీయంబర్స్ మెట్ బాకీలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ *బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రాంచందర్ రావు* గారు చేపడుతున్న 48 గంటల నిరహార దీక్షకు మద్దతుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో *ఫీజుల బకాయి  - బీజేపీ లడాయి* మీద నిరసన కార్యక్రమం మున్సిపల్ కార్యాలయం ముందు గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ BR అంబేద్కర్  విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జి లతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ గత TRS, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు  విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని, పెండింగ్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వానికి కాలేజీలకు మధ్య విద్యార్థుల భవిష్యత్తు నలిగిపోతుంది అని అన్నారు. వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమం ఉదృతం అవుతుందని అన్నారు.
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • NPRD INDIA నారాయణ ఖేడ్ నియోజకవర్గం అధ్యక్షుడిగా బుక్క ఇస్మాయిల్ నియామకం పత్రికా ప్రకటన తేదీ: ఆగస్టు 23, 2026 హైదరాబాద్ NPRD INDIA నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షుడిగా బుక్క ఇస్మాయిల్ నియామకం ✊🏻✊🏻♿️♿️✊🏻✊🏻 వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా మన్నూరు మండలం, బోరంచ గ్రామానికి చెందిన బుక్క ఇస్మాయిల్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని NPRD INDIA రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ నాయకులు ఆయనకు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్, స్కైటు (SKITU) రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ షఫీ, NPRD జాతీయ అధ్యక్షులు గజ్జె పైడి కుమార్, మరియు గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ శబరి చావ్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని అభినందిస్తూ, నియోజకవర్గ పరిధిలోని వికలాంగుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి బాధ్యతాయుతంగా కృషి చేయాలని జాతీయ, రాష్ట్ర నాయకులు ఆకాంక్షించారు. *దివ్యాంగుల హక్కుల సాధనకు నిరంతరం శ్రమిస్తా: బుక్క ఇస్మాయిల్* 🙏🏼🙏🏼♿️♿️🙏🏼🙏🏼 తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించిన జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీలకు నూతన అధ్యక్షుడు బుక్క ఇస్మాయిల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ— "నారాయణఖేడ్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి, వారి న్యాయమైన హక్కుల సాధనకు నిరంతరం శ్రమిస్తాను. సంస్థ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను" అని స్పష్టం చేశారు.
    1
    NPRD INDIA నారాయణ ఖేడ్ నియోజకవర్గం అధ్యక్షుడిగా బుక్క ఇస్మాయిల్  నియామకం 
పత్రికా ప్రకటన
తేదీ: ఆగస్టు 23, 2026
హైదరాబాద్ 
NPRD INDIA నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షుడిగా 
బుక్క ఇస్మాయిల్ నియామకం
✊🏻✊🏻♿️♿️✊🏻✊🏻
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా మన్నూరు మండలం, బోరంచ గ్రామానికి చెందిన బుక్క ఇస్మాయిల్ నియమితులయ్యారు.
హైదరాబాద్‌లోని NPRD INDIA రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ నాయకులు ఆయనకు అధికారిక నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు తుడుం రాజేందర్, స్కైటు (SKITU) రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ షఫీ, NPRD జాతీయ అధ్యక్షులు గజ్జె పైడి కుమార్, మరియు గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ శబరి చావ్లా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని అభినందిస్తూ, నియోజకవర్గ పరిధిలోని వికలాంగుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి బాధ్యతాయుతంగా కృషి చేయాలని జాతీయ, రాష్ట్ర నాయకులు ఆకాంక్షించారు.
*దివ్యాంగుల హక్కుల సాధనకు నిరంతరం శ్రమిస్తా: బుక్క ఇస్మాయిల్*
🙏🏼🙏🏼♿️♿️🙏🏼🙏🏼
తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించిన జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీలకు నూతన అధ్యక్షుడు బుక్క ఇస్మాయిల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ— "నారాయణఖేడ్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి, వారి న్యాయమైన హక్కుల సాధనకు నిరంతరం శ్రమిస్తాను. సంస్థ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను" అని స్పష్టం చేశారు.
    user_Bukka Ismail
    Bukka Ismail
    మనూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    23 hrs ago
  • పదవి విరమణ పొందిన వీఆర్వో వీఆర్ఏలకు పెన్షన్ మంజూరు చేయాలి ప్రజావాణిలో వినతి సమర్పించిన వీఆర్వో వీఆర్ఏలు పదవీ విరమణ పొందిన వీఏఓలు, వీఆర్‌ఓలకు పెన్షన్ మంజూరు చేయాలి రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన వీఏఓలు, వీఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు, సహాయ పంచాయతీ కార్యదర్శులకు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. మెదక్ జిల్లాలోని పలు మండలాల్లో 1965 నుంచి 1984 వరకు పటేల్‌–పట్వారీలుగా, 1992 నుంచి 2002 వరకు వీఏఓలుగా, 2002 నుంచి 2007 వరకు పంచాయతీ కార్యదర్శులు, సహాయ పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందినప్పటికీ తమకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పదవీ విరమణ పెన్షన్ అందడం లేదని వారు తెలిపారు. ఈ సమస్యపై పలుమార్లు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు విన్నవించినప్పటికీ పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తమ సమస్యపై స్పందించి, సంబంధిత సర్వీస్ రికార్డులను పరిశీలించి నివేదిక పంపాలని భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌ (CCLA)కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.CCLA ఆదేశాల మేరకు జిల్లాలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల వివరాలతో జాబితా రూపొందించి నివేదిక పంపాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తమకు తెలిసిందన్నారు. కావున జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని CCLA ఆదేశాల మేరకు జిల్లాలో పదవీ విరమణ పొందిన వీఏఓలు, వీఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు, సహాయ పంచాయతీ కార్యదర్శుల వివరాలతో జాబితా రూపొందించి CCLAకు పంపించాలని కోరారు. తమకు రావాల్సిన పదవీ విరమణ పెన్షన్ మంజూరయ్యేలా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
    1
    పదవి విరమణ పొందిన వీఆర్వో వీఆర్ఏలకు పెన్షన్ మంజూరు చేయాలి ప్రజావాణిలో వినతి సమర్పించిన వీఆర్వో వీఆర్ఏలు 
పదవీ విరమణ పొందిన వీఏఓలు, వీఆర్‌ఓలకు పెన్షన్ మంజూరు చేయాలి
రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన వీఏఓలు, వీఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు, సహాయ పంచాయతీ కార్యదర్శులకు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
మెదక్ జిల్లాలోని పలు మండలాల్లో 1965 నుంచి 1984 వరకు పటేల్‌–పట్వారీలుగా, 1992 నుంచి 2002 వరకు వీఏఓలుగా, 2002 నుంచి 2007 వరకు పంచాయతీ కార్యదర్శులు, సహాయ పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందినప్పటికీ తమకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పదవీ విరమణ పెన్షన్ అందడం లేదని వారు తెలిపారు.
ఈ సమస్యపై పలుమార్లు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు విన్నవించినప్పటికీ పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తమ సమస్యపై స్పందించి, సంబంధిత సర్వీస్ రికార్డులను పరిశీలించి నివేదిక పంపాలని భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌ (CCLA)కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.CCLA ఆదేశాల మేరకు జిల్లాలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల వివరాలతో జాబితా రూపొందించి నివేదిక పంపాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తమకు తెలిసిందన్నారు.
కావున జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని CCLA ఆదేశాల మేరకు జిల్లాలో పదవీ విరమణ పొందిన వీఏఓలు, వీఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు, సహాయ పంచాయతీ కార్యదర్శుల వివరాలతో జాబితా రూపొందించి CCLAకు పంపించాలని కోరారు. తమకు రావాల్సిన పదవీ విరమణ పెన్షన్ మంజూరయ్యేలా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    3 hrs ago
  • ఫీజు బకాయిలు చెల్లించాలని బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన.... కామారెడ్డి ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట జిల్లా బిజెపి అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వానికి విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు
    1
    ఫీజు బకాయిలు చెల్లించాలని బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన....
కామారెడ్డి ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట జిల్లా బిజెపి అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వానికి విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు
    user_Mahesh Nakka
    Mahesh Nakka
    Kamareddy, Hyderabad•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.