Shuru
Apke Nagar Ki App…
బాసర అమ్మవారికి ఒక్కరోజే 11లక్షల 79 వేల 350 రూపాయల ఆదాయం... *బాసర: ఒక్కరోజే రూ.11.79 లక్షల ఆదాయం* ఆదివారం సెలవు దినం, శ్రావణ మాసం ఏకాదశి సందర్భంగా బాసర అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి పూజలు నిర్వహించారు. అక్షరాభ్యాసం, కుంకుమార్చన, చండీహోమం, సత్యనారాయణ వ్రతం తదితర అర్జిత సేవల ద్వారా ఒక్కరోజే రూ.11,79,350 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ అంజనాదేవి తెలిపారు.
RP
బాసర అమ్మవారికి ఒక్కరోజే 11లక్షల 79 వేల 350 రూపాయల ఆదాయం... *బాసర: ఒక్కరోజే రూ.11.79 లక్షల ఆదాయం* ఆదివారం సెలవు దినం, శ్రావణ మాసం ఏకాదశి సందర్భంగా బాసర అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి పూజలు నిర్వహించారు. అక్షరాభ్యాసం, కుంకుమార్చన, చండీహోమం, సత్యనారాయణ వ్రతం తదితర అర్జిత సేవల ద్వారా ఒక్కరోజే రూ.11,79,350 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ అంజనాదేవి తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- కోరుట్ల 17 వ వార్డు లో అంగన్వాడీ పిల్లలకు ఉచిత డ్రెస్సుల పంపిణి చేసిన జువ్వాడి కృష్ణారావు1
- ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా ఆటో డ్రైవర్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ నర్సింలు కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సూచించారు .లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు ఉన్నారు.1
- మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం తో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం తో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- 𝐀 𝐝𝐚𝐲 𝐥𝐚𝐭𝐞, 𝐛𝐮𝐭 𝐭𝐡𝐞 𝐡𝐲𝐩𝐞 𝐢𝐬 𝐚𝐛𝐬𝐨𝐥𝐮𝐭𝐞𝐥𝐲 𝐰𝐨𝐫𝐭𝐡 𝐢𝐭. 🚀 From becoming the first country to land near the Moon’s South Pole to reaching Mars on our very first attempt, India’s space journey is rewriting history. AND THE BEST PART? 𝐖𝐞’𝐫𝐞 𝐨𝐧𝐥𝐲 𝐠𝐞𝐭𝐭𝐢𝐧𝐠 𝐬𝐭𝐚𝐫𝐭𝐞𝐝. 😎 📈1
- ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షం................. ఆదిలాబాద్ రూరల్ మండలంలో సోమవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. రూరల్ మండలంతో పాటు పోచ్చర, రాంపూర్, చందా గ్రామాల్లో వర్షం కురియడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఇటీవల కురిసిన వర్షాలు పంటలకు ఎంతగానో మేలు చేకూరుస్తాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.1
- ఇప్పటిదాకా అబద్దాలు చెబుతావు సంజయ్, జువ్వాడి కృష్ణారావు1
- *మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి* *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* *ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ* *చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన* అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.4
- ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి: కలెక్టర్ రాజర్షి షా ADB: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యతోపాటు మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. సోమవారం తాంసి మండలంలోని కప్పర్ల పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని గ్రామస్తులకు కలెక్టర్ సూచించారు.1
- *బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం* *-- రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* *మృతులకు నివాళు అర్పించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే* చందుర్తి మండలం లింగంపేట గ్రామ పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మృతి చెందిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన షాదుల్లా కుటుంబం వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన రక్తసంబంధీకులు నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో షాదుల్లాతో పాటు ఆయన భార్య హాసీనా, మరో హాసీనా, పదో తరగతి చదువుతున్న చిన్నారి మృతి చెందడం బాధాకరమని విప్ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఒక్కొక్కరుగా మృతి చెందారని తెలిపారు. వేములవాడ పట్టణంలోనీ ఏరియా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పరామర్శించి, ఓదార్చారు. మృతదేహాలకు నివాళి అర్పించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందజేస్తామని తెలిపారు.. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు ముందు, వెనుక సీట్లలో ఉన్నప్పటికీ సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. వాహనాలను అతివేగంగా నడపకుండా జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు. రాష్ట్ర పోలీసు శాఖ ప్రయాణికుల భద్రత పై అవగాహన కల్పించడానికి అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు...ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరూ తమ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకుని సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఒకే ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రక్తసంబంధీకులు మృతి చెందడం అత్యంత బాధాకరమైనoదన్నారు., మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవండుతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు... ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించి, వేగ నియంత్రణ పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలి అని విప్ విజ్ఞప్తి చేశారు..4