బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ఫీజు దీక్ష పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్...గ్రూప్ రాజకీయాలతో ఉనికి కాపాడుకోవడానికే రాంచందర్ రావు ఫీజు దీక్షల డ్రామా ఆడుతున్నారని విమర్శ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాగానే పార్టీలో లొల్లులు ఎక్కువయ్యాయని, తన ఉనికి కాపాడుకోవడానికే రాంచందర్ రావు ఫీజు రీయింబర్స్ మెంట్ దీక్షల డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. చేతనైతే ఢిల్లీ నుంచి పైసలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం నవాబుపేటలో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బిజేపి కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఫీజు బకాయిలు పెండింగ్ పెట్టినప్పుడు కిమ్మనకుండా కూర్చున్న బీజేపీ నేతలు, ఇప్పుడు ప్రజా ప్రభుత్వంపై గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకుల ద్వారా అడ్వాన్స్‌గా ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లిస్తున్నామని, సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇస్తున్నామని తెలిపారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నారా? కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా తెచ్చారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టళ్ల నిర్మాణం చేపడుతూ, అధికారంలోకి రాగానే మెస్ చార్జీలు పెంచి విద్యార్థుల కడుపు నింపుతున్నామని తెలిపారు. మొసలి కన్నీళ్లు ఆపి, ఢిల్లీ పెద్దలకు జ్ఞానోదయం చేసి బీజేపీ రాష్ట్రాల్లో కూడా ఈ పథకం అమలు చేయించాలని, అభివృద్ధి పథంలో సాగుతున్న సర్కారుపై అనవసరంగా అడ్డు పడద్దని హితవు పలికారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ఫీజు దీక్ష పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్...గ్రూప్ రాజకీయాలతో ఉనికి కాపాడుకోవడానికే రాంచందర్ రావు ఫీజు దీక్షల డ్రామా ఆడుతున్నారని విమర్శ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాగానే పార్టీలో లొల్లులు ఎక్కువయ్యాయని, తన ఉనికి కాపాడుకోవడానికే రాంచందర్ రావు ఫీజు రీయింబర్స్ మెంట్ దీక్షల డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. చేతనైతే ఢిల్లీ నుంచి పైసలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం నవాబుపేటలో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బిజేపి కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఫీజు బకాయిలు పెండింగ్ పెట్టినప్పుడు కిమ్మనకుండా కూర్చున్న బీజేపీ నేతలు, ఇప్పుడు ప్రజా ప్రభుత్వంపై గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకుల ద్వారా అడ్వాన్స్‌గా ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లిస్తున్నామని, సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇస్తున్నామని తెలిపారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నారా? కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా తెచ్చారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టళ్ల నిర్మాణం చేపడుతూ, అధికారంలోకి రాగానే మెస్ చార్జీలు పెంచి విద్యార్థుల కడుపు నింపుతున్నామని తెలిపారు. మొసలి కన్నీళ్లు ఆపి, ఢిల్లీ పెద్దలకు జ్ఞానోదయం చేసి బీజేపీ రాష్ట్రాల్లో కూడా ఈ పథకం అమలు చేయించాలని, అభివృద్ధి పథంలో సాగుతున్న సర్కారుపై అనవసరంగా అడ్డు పడద్దని హితవు పలికారు.
- మంథనిలో హరే కృష్ణ హరే రామ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు.. మంథని లో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రారంభించారు. 19 మండలాల్లోని 40 వేల మంది విద్యార్థులకు ఉదయం పూట పోషకాలతో కూడిన అల్పాహారం అందించడం జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలోని 694 ప్రభుత్వ పాఠశాలలు, 17 జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు ప్రభుత్వం హరే కృష్ణ ట్రస్ట్ సంయుక్తంగా బలవర్ధకమైన పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ బాగా చదువుకుని తమ మేధాశక్తిని పెంపొందించుకోవాలని కోరారు. మొదట కొడంగల్ లో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు మంథని ప్రారంభం కాగా,త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వ పాఠశాలలో చదివి పేద విద్యార్థుల కోసం, వారి సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయని ప్రభుత్వ పాఠశాలలో చేరి బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హరే కృష్ణ ఫౌండేషన్ ప్రెసిడెంట్ శ్రీ సత్య గౌర చంద్ర దాస స్వామీజీ ,జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు.1
- ఆర్టీసీ ఈ-ఆటోలతో ఉపాధికి గండి: కరీంనగర్‌లో బంద్ సక్సెస్.. ఉచిత బస్సు పథకం, ఆన్‌లైన్ క్యాబ్‌లు, సీటీ బస్సుల వల్ల ఉపాధి కోల్పోతున్నామంటూ కరీంనగర్‌లో ఆటో కార్మికులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, ఆర్టీసీ ఈ-ఆటోలను నిలిపివేయాలని యూనియన్ నాయకుడు సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఛార్జీల పెంపు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.1
- సామాజిక,ప్రజా చైతన్యం కోసం కళాకారుల కలాలు, గళాలు ఉండాలి. కళాకారులు శిక్షణ ద్వారా కళా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి : సిపిఐ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి. సకల జనుల హితం కోసం,సామాజిక కోణంలో ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం కళాకారులు తమ కళాలకు, గళాలకు పనిచెప్పాలని,కళాకారులు శిక్షణ ద్వారా తమ నైపుణ్యం పెంపొందించుకోవాలని సిపిఐ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరంను చాడ వెంకట రెడ్డి ప్రారంభించారు. ఈ శిక్షణ శిబిరంకు హాజరైన కళాకారులను ఉద్దేశించి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రచయితలు,కవులు,కళాకారులు కార్మిక,కర్షక,ప్రజా సమస్యలపై,వారి జీవనవిధానాలపై నిరంతరం అధ్యయనం చేస్తూ రచనలు, పాటలు,వీధి నాటకాలు వ్రాయాలని,కళాకారులు ఎంతో మంది ఉంటారు కానీ ప్రజా కళాకారులు కొంత మంది మాత్రమే ఉంటారని అలాంటి కళాకారులు నిత్యం ప్రజల బాధలను చూసి వాటిని ప్రపంచానికి తెలిజేసేందుకు పాటలు పాడాలని,కళ కాసుల కోసం కాదు ప్రజల కోసమని పాడే కళాకారులే ప్రజానాట్య మండలి కళాకారులని, అలాంటి కళాకారులు నిత్య విద్యార్థులుగా ఎన్నో విషయాలు తెలుసుకొని,పాటలు నేర్చుకొని పాడాలని అందుకు ఇలాంటి శిక్షణా శిబిరాలు ఉపయోగపడతాయని వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్రజల కష్ట,సుఖాలను పాటల రూపంలో బయటకు తెచ్చి ఎంతో మందిని మెప్పించే అత్యంత బలమైన ఆయుధం పాట అని, ఏ పోరాటాలు,ఉద్యమాలు,బహిరంగ సభలు విజయవంతం కావాలన్నా కళాకారులు ఉండాల్సిందేనని, కరీంనగర్ లో సెప్టెంబర్ 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభల విజయవంతం కోసం కళాకారులు తమ వంతుగా కళారూపాలు ప్రదర్శించాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఈ శిక్షణా శిబిరం కార్యక్రమంలో సిపిఐ కరీంనగర్ ,పెద్దపల్లి జిల్లాల కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, తాండ్ర సదానందం,ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కురుమిద్ద శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కవ్వంపల్లి స్వామి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి కటిక రెడ్డి బుచన్న యాదవ్,టేకుమల్ల సమ్మయ్య, ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ,ఉప్పలయ్య,సహాయ కార్యదర్శి రేగుంట చంద్ర శేఖర్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గణేష్,వెంకటాచారి, రోంటాల శ్యామ్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు దుడ్డేల సమ్మయ్య, వరకోలు సదానందం, ఎజ్జ రాజయ్య,లక్ష్మీరాజం,ఆసాల రమ,ఇందిరా,లక్ష్మణ్,ఎర్రోజు శ్రీనివాస్,మోహన్,డప్పురాజు తదితరులు పాల్గొన్నారు.1
- ఎల్లారెడ్డిపేట కలెక్టర్ లో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ..చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- విద్యార్థుల ఫీజు బకాయిలపై బీజేపీ వైఖరి ఏమిటో చెప్పాలి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా: విద్యార్థుల ఫీజు బకాయిల అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేస్తున్న వ్యాఖ్యలను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఫీజు బకాయిలు పేరుకుపోతున్న సమయంలో బీజేపీ నాయకులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పేద విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అప్పట్లో బీజేపీ నాయకులు ఎలాంటి పోరాటాలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు విద్యార్థుల పక్షాన మాట్లాడుతున్నట్లు బీజేపీ నేతలు చెప్పుకోవడం రాజకీయ ప్రచారంలో భాగమేనని ఆది శ్రీనివాస్ విమర్శించారు. విద్యార్థుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే గతంలోనే ఫీజు బకాయిల కోసం పోరాడి ఉండేవారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న రాజకీయ సంబంధాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. విద్యార్థుల సమస్యలపై గతంలో ఆ రెండు పార్టీలు అనుసరించిన వైఖరి ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు బీజేపీ నాయకులు తమ గత వైఖరిపై సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.1
- సిరిసిల్ల పట్టణ పద్మశాలి యువజన సంఘం నూతన అధ్యక్షుడికి డైరెక్టర్లకు మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులచే ఘన సన్మానం ఆదివారం నిర్వహించిన సిరిసిల్ల పట్టణ పద్మశాలి యువజన సంఘం ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సబ్బని హరీష్ సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు నూతన అధ్యక్షుడు సబ్బని హరీష్ తో 3 వ, 4వ వార్డు డైరెక్టర్ లు కోడం హరీష్, మానాల అరుణ్ కుమార్ లను శాలువాలతో సత్కరించి అభినందిస్తూ నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ మార్కండేయ స్వామి ఆశీస్సులతో పద్మశాలి యువత ఐక్యతను మరింత బలోపితం చేస్తూ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. యువత ను వివిధ సామాజిక సేవా కార్యక్రమాలలో మరియు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తు వివిధ కార్యక్రమాలలో భాగస్వాములను చేస్తూ సమాజంలో మంచి పేరు సంపాదించడంతో పాటు, ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా పద్మశాలి యువజన సంఘం కార్యకలాపాలను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు.1
- *బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం* *-- రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* *మృతులకు నివాళు అర్పించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే* చందుర్తి మండలం లింగంపేట గ్రామ పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మృతి చెందిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన షాదుల్లా కుటుంబం వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన రక్తసంబంధీకులు నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో షాదుల్లాతో పాటు ఆయన భార్య హాసీనా, మరో హాసీనా, పదో తరగతి చదువుతున్న చిన్నారి మృతి చెందడం బాధాకరమని విప్ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఒక్కొక్కరుగా మృతి చెందారని తెలిపారు. వేములవాడ పట్టణంలోనీ ఏరియా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పరామర్శించి, ఓదార్చారు. మృతదేహాలకు నివాళి అర్పించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందజేస్తామని తెలిపారు.. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు ముందు, వెనుక సీట్లలో ఉన్నప్పటికీ సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. వాహనాలను అతివేగంగా నడపకుండా జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు. రాష్ట్ర పోలీసు శాఖ ప్రయాణికుల భద్రత పై అవగాహన కల్పించడానికి అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు...ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరూ తమ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకుని సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఒకే ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రక్తసంబంధీకులు మృతి చెందడం అత్యంత బాధాకరమైనoదన్నారు., మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవండుతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు... ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించి, వేగ నియంత్రణ పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలి అని విప్ విజ్ఞప్తి చేశారు..4
- *కరీంనగర్ జిల్లా ఎలబోతారంలో కన్నతల్లిని బావిలో పడేసి హత్య చేసి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకులు ఇద్దరు అరెస్ట్ కరీంనగర్ జిల్లాలో కన్నతల్లి పట్ల ఇద్దరు కొడుకులు కసాయిలా ప్రవర్తించారు. తల్లిని బావిలో పడేసి హత్య చేసి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి చివరకు నిందితులుగా దొరికిపోయారు. సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన నూనె వెంకటమ్మ దారుణ హత్యకు గురయ్యారు. వెంకటమ్మకు నలుగురు కొడుకులు ఉండగా ఇటీవల పక్షవాతం బారిన పడి మంచానికి పరిమితమైంది. నలుగురు కొడుకులు వంతుల వారిగా తల్లి కి సపరియాలు చేయాల్సి ఉండగా ఇద్దరు కొడుకులు తల్లి ఇంట్లో చనిపోతే ఇల్లు వదిలి పెట్టాల్సి వస్తుందని అరిష్టంగా భావించి మంచం పట్టిన తల్లిని నాలుగు మాసాల క్రితం బావిలో పడేసి తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి బావిలో ఉన్న శవాన్ని వెలికి తీశారు. పక్షపాతంతో కదలలేని స్థితిలో ఉన్న వృద్దురాలు బావిలో ఎలా పడిందనే విషయంపై పోలీసులు ఆరా తీయగా విస్తుపోయే విషయాలు తెలుపులోకి వచ్చాయి. పెద్దకొడుకు సమ్మయ్య చిన్నకొడుకు శ్రీనివాస్ హత్యకు పాల్పడినట్లు నిర్థారించి అరెస్ట్ చేశారు. తల్లిని బావిలో పడేసి ప్రాణం తీసి కనిపించడం లేదని తప్పుడు సమాచారం ఇచ్చిన ఇద్దరు కొడుకులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని సిఐ శ్రీనివాస్ తెలిపారు.1