logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఢిల్లీలో గృహ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశం న్యూఢిల్లీ: పార్లమెంట్ భవనంలోని మెయిన్ కమిటీ హాల్‌లో గృహ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ​ఈ సమావేశంలో కమిటీకి చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు (ఎంపీలు), సంబంధిత మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు మరియు అధికార ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా గృహ నిర్మాణ పథకాలు, పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి మరియు వాటి అమలు తీరుపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించారు. ​పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, నివాస వసతుల విస్తరణకు సంబంధించి పలు కీలక అంశాలను సమీక్షించడంతో పాటు, అధికారులకు కమిటీ తరఫున పలు సూచనలు చేశారు. పథకాల సత్వర అమలుకు సమన్వయంతో కృషి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

1 hr ago
user_ఆడెపు రాంకిషన్
ఆడెపు రాంకిషన్
Content Creator (YouTuber) వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
1 hr ago

ఢిల్లీలో గృహ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశం న్యూఢిల్లీ: పార్లమెంట్ భవనంలోని మెయిన్ కమిటీ హాల్‌లో గృహ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ​ఈ సమావేశంలో కమిటీకి చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు (ఎంపీలు), సంబంధిత మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు మరియు అధికార ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా గృహ నిర్మాణ పథకాలు, పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి మరియు వాటి అమలు తీరుపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించారు. ​పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, నివాస వసతుల విస్తరణకు సంబంధించి పలు కీలక అంశాలను సమీక్షించడంతో పాటు, అధికారులకు కమిటీ తరఫున పలు సూచనలు చేశారు. పథకాల సత్వర అమలుకు సమన్వయంతో కృషి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

More news from తెలంగాణ and nearby areas
  • కాలనీల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత.. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే నాయిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం 4వ డివిజన్ పరిధిలోని జ్యోతిబాస్ నగర్, పెద్దమ్మగడ్డ, అక్షర కాలనీ తదితర ప్రాంతాల్లో రూ.1.19 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ తదితర మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ప్రారంభించిన పనులకు నిర్దిష్ట కాలపరిమితి విధించి నెల రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు. జ్యోతిబాస్ నగర్‌లో ఇప్పటికే ప్రధాన రహదారులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని, మిగిలిన రెండు చిన్న గల్లీల్లోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వ్యవస్థలో సమస్యలు లేకుండా సమగ్ర అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు పేదల సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నాయిని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు, పెన్షన్లు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా స్లమ్ ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.
    1
    కాలనీల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత.. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే నాయిని
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం 4వ డివిజన్ పరిధిలోని జ్యోతిబాస్ నగర్, పెద్దమ్మగడ్డ, అక్షర కాలనీ తదితర ప్రాంతాల్లో రూ.1.19 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ తదితర మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ప్రారంభించిన పనులకు నిర్దిష్ట కాలపరిమితి విధించి నెల రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు.
జ్యోతిబాస్ నగర్‌లో ఇప్పటికే ప్రధాన రహదారులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని, మిగిలిన రెండు చిన్న గల్లీల్లోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వ్యవస్థలో సమస్యలు లేకుండా సమగ్ర అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.
మౌలిక వసతుల కల్పనతో పాటు పేదల సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నాయిని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు, పెన్షన్లు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా స్లమ్ ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ........... నర్సంపేట: మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ కాంపెళ్లి వీణ విజేందర్ రెడ్డి రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
    2
    ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ...........
నర్సంపేట: మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ కాంపెళ్లి వీణ విజేందర్ రెడ్డి రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • రక్తం వచ్చేటట్లుగా లారీ డ్రైవర్ పిడుగులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్స్పెక్టర్ పార్వతి డ్రైవర్ *లారీ డ్రైవర్‌పై దాడి చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్ట‌ర్ డ్రైవర్* గాజువాక‌లో ర‌వాణా శాఖ అధికారి డ్రైవ‌ర్ దుర‌హంకారం రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి డ్రైవర్ షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆప‌లేద‌ని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్‌పై పిడుగులతో దాడి విచక్షణ రహితంగా దాడి చేయ‌డంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం
    1
    రక్తం వచ్చేటట్లుగా లారీ డ్రైవర్ పిడుగులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్స్పెక్టర్ పార్వతి డ్రైవర్ 
*లారీ డ్రైవర్‌పై దాడి చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్ట‌ర్ డ్రైవర్*
గాజువాక‌లో ర‌వాణా శాఖ అధికారి డ్రైవ‌ర్ దుర‌హంకారం 
రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి డ్రైవర్
షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆప‌లేద‌ని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి
ఇన్‌స్పెక్ట‌ర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్‌పై పిడుగులతో దాడి
విచక్షణ రహితంగా దాడి చేయ‌డంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    33 min ago
  • పాలంపేట రామప్ప నల్ల కాలువలో ఎదురెక్కుతున్న చేపలు..! గత రెండురోజులుగా కురుస్తున్న వర్షం..!
    1
    పాలంపేట రామప్ప నల్ల కాలువలో ఎదురెక్కుతున్న చేపలు..! గత రెండురోజులుగా కురుస్తున్న వర్షం..!
    user_Swathi
    Swathi
    గ్రాఫిక్ డిజైనర్ ములుగు, ములుగు, తెలంగాణ•
    52 min ago
  • కరీంనగర్ లో రోడ్డెక్కిన 22ఏ బాధితులు...కలెక్టరేట్ ఎదుట మహాధర్నా....వారంరోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే కలెక్టరేట్ నుంచి సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టి ఆందోళన ఉదృతం చేస్తాం- ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరిక ఏళ్ల తరబడి పట్టాలు ఉండి నివాసాలు ఏర్పరచుకొని ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న భూములను సైతం నిషేధిత 22ఏ జాబితాలో చేర్చడంపై కరీంనగర్ లో బాధితులు ఆందోళనకు దిగారు. బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రేకుర్తి, విద్యానగర్ బాధితులు ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి మహా ధర్నా చేపట్టారు. ధర్నాలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ లు రవీందర్ రెడ్డి, అనిల్ గౌడ్, నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్ తోపాటు కార్పోరేట్మర్ లు పాల్గొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని రేకుర్తి, విద్యానగర్, హిందూపురి కాలనీ, కొత్తపల్లి, ఆరేపల్లి తో పాటు పలు కాలనీలకు చెందిన దాదాపు 1000 ఎకరాల పట్టా భూమిని నిషేధిత 22ఏ జాబితాలో చేర్చారని ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 వరకు ఎలాంటి ప్రాబ్లమ్ లేని పట్టా భూములను 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని కోరారు. 22ఏపై పొంతన లేని సమాధానం చెబుతున్న రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పట్టాలున్న భూములను 22a జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించనిచో కలెక్టరేట్ నుంచి సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టి ఆందోళన ఉదృతం చేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు.
    3
    కరీంనగర్ లో రోడ్డెక్కిన 22ఏ బాధితులు...కలెక్టరేట్ ఎదుట మహాధర్నా....వారంరోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే కలెక్టరేట్ నుంచి సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టి ఆందోళన ఉదృతం చేస్తాం- ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరిక

ఏళ్ల తరబడి పట్టాలు ఉండి నివాసాలు ఏర్పరచుకొని ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న భూములను సైతం నిషేధిత 22ఏ జాబితాలో చేర్చడంపై కరీంనగర్ లో బాధితులు ఆందోళనకు దిగారు. బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రేకుర్తి, విద్యానగర్ బాధితులు ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి మహా ధర్నా చేపట్టారు. ధర్నాలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ లు రవీందర్ రెడ్డి, అనిల్ గౌడ్, నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్ తోపాటు కార్పోరేట్మర్ లు  పాల్గొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని రేకుర్తి, విద్యానగర్, హిందూపురి కాలనీ, కొత్తపల్లి, ఆరేపల్లి తో పాటు పలు కాలనీలకు చెందిన దాదాపు 1000 ఎకరాల పట్టా భూమిని నిషేధిత 22ఏ జాబితాలో చేర్చారని ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 వరకు ఎలాంటి ప్రాబ్లమ్ లేని పట్టా  భూములను 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు.  ప్రభుత్వం వెంటనే స్పందించి నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని కోరారు. 22ఏపై పొంతన లేని సమాధానం చెబుతున్న రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పట్టాలున్న భూములను 22a జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించనిచో కలెక్టరేట్ నుంచి సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టి ఆందోళన ఉదృతం చేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • 80 ఏండ్ల స్వతంత్ర దేశంలో ఇలా నిలదీసిన నాయకుడు ఇంకొకరు లేరు👆🏻 ఆయన టార్గెట్ పదవి కాదు ప్రజలు💯 మల్లన్న గురించి ఈ సోదరుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి🙏 80 ఏండ్ల స్వతంత్ర దేశంలో ఇలా నిలదీసిన నాయకుడు ఇంకొకరు లేరు👆🏻 ఆయన టార్గెట్ పదవి కాదు ప్రజలు💯 మల్లన్న గురించి ఈ సోదరుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి🙏
    1
    80 ఏండ్ల స్వతంత్ర దేశంలో ఇలా నిలదీసిన నాయకుడు ఇంకొకరు లేరు👆🏻

ఆయన టార్గెట్ పదవి కాదు ప్రజలు💯

మల్లన్న గురించి ఈ సోదరుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి🙏
80 ఏండ్ల స్వతంత్ర దేశంలో ఇలా నిలదీసిన నాయకుడు ఇంకొకరు లేరు👆🏻
ఆయన టార్గెట్ పదవి కాదు ప్రజలు💯
మల్లన్న గురించి ఈ సోదరుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి🙏
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    56 min ago
  • పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలిపై దారుణ దాడి: బెంగాల్‌లో కలకలం మాల్దా (పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఉపాధ్యాయురాలిపై కొందరు వ్యక్తులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. విద్యార్థి బదిలీ ధ్రువీకరణ పత్రం (టీసీ) జారీ చేసే విషయంలో తలెత్తిన వివాదమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.వివాదం: పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థి టీసీ జారీ వ్యవహారంలో ఉపాధ్యాయురాలితో కొందరు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. ​దాడి: నిబంధనల ప్రకారం వెంటనే టీసీ ఇచ్చేందుకు సదరు టీచర్ నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన వారు ఆమెపై భౌతిక దాడికి దిగారు. ​వైరల్ వీడియో: పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో స్థానికంగా తీవ్ర దుమారం రేగింది. ​ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. విద్యాబుద్ధులు నేర్పే పాఠశాలలోనే ఉపాధ్యాయురాలిపై దాడి జరగడంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
    1
    పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలిపై దారుణ దాడి: బెంగాల్‌లో కలకలం


మాల్దా (పశ్చిమ బెంగాల్):
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఉపాధ్యాయురాలిపై కొందరు వ్యక్తులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. విద్యార్థి బదిలీ ధ్రువీకరణ పత్రం (టీసీ) జారీ చేసే విషయంలో తలెత్తిన వివాదమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.వివాదం: పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థి టీసీ జారీ వ్యవహారంలో ఉపాధ్యాయురాలితో కొందరు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు.
​దాడి: నిబంధనల ప్రకారం వెంటనే టీసీ ఇచ్చేందుకు సదరు టీచర్ నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన వారు ఆమెపై భౌతిక దాడికి దిగారు.
​వైరల్ వీడియో: పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో స్థానికంగా తీవ్ర దుమారం రేగింది.
​ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. విద్యాబుద్ధులు నేర్పే పాఠశాలలోనే ఉపాధ్యాయురాలిపై దాడి జరగడంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
    user_ఆడెపు రాంకిషన్
    ఆడెపు రాంకిషన్
    Content Creator (YouTuber) వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష.. దాస్యం వినయ్ భాస్కర్.. హనుమకొండ: హనుమకొండ నగరంలోని వైఎస్సార్ నగర్ కాలనీని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించిన ఆయన స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, మౌలిక సదుపాయాల లోపాలు, అభివృద్ధి అవసరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన దాస్యం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై నిరంతరం నిలదీస్తామని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని దాస్యం వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు.
    1
    కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష.. దాస్యం వినయ్ భాస్కర్..
హనుమకొండ: హనుమకొండ నగరంలోని వైఎస్సార్ నగర్ కాలనీని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించిన ఆయన స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, మౌలిక సదుపాయాల లోపాలు, అభివృద్ధి అవసరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కాలనీవాసులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన దాస్యం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.
అలాగే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై నిరంతరం నిలదీస్తామని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని దాస్యం వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
  • హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో నిర్వహించిన తీజ్ పండుగ హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు.
    1
    హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో నిర్వహించిన తీజ్ పండుగ
హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.