Shuru
Apke Nagar Ki App…
వరంగల్ పరిసర గ్రామాల్లో వర్షం: చిగురించిన పత్తి రైతుల ఆశలు పంతిని , ఆగస్టు 24: వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఆందోళనలో ఉన్న పత్తి రైతులకు నేడు కురిసిన వర్షం ఎంతో ఊరటనిచ్చింది. ఉదయం నుంచి వాతావరణం చల్లబడి విస్తారంగా వర్షం కురవడంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసిన పత్తి పంట ఎదుగుదల లోపించి ఎండిపోయే ప్రమాదం ఏర్పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం కురిసిన ఈ వర్షం పత్తి మొక్కల ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షంతో పంటకు ప్రాణం వచ్చినట్లయిందని, రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా అనుకూలమైన వర్షాలు పడితే మంచి దిగుబడులు సాధిస్తామని స్థానిక రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆడెపు రాంకిషన్
వరంగల్ పరిసర గ్రామాల్లో వర్షం: చిగురించిన పత్తి రైతుల ఆశలు పంతిని , ఆగస్టు 24: వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఆందోళనలో ఉన్న పత్తి రైతులకు నేడు కురిసిన వర్షం ఎంతో ఊరటనిచ్చింది. ఉదయం నుంచి వాతావరణం చల్లబడి విస్తారంగా వర్షం కురవడంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసిన పత్తి పంట ఎదుగుదల లోపించి ఎండిపోయే ప్రమాదం ఏర్పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం కురిసిన ఈ వర్షం పత్తి మొక్కల ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షంతో పంటకు ప్రాణం వచ్చినట్లయిందని, రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా అనుకూలమైన వర్షాలు పడితే మంచి దిగుబడులు సాధిస్తామని స్థానిక రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- ఎల్కతుర్తి కారు డిక్కీలో మహిళ మృతదేహం కేసులో బిగ్ ట్విస్ట్.. హత్య వెనుక తండ్రి కుట్ర: ఏసీపీ ప్రశాంత్ రెడ్డి హనుమకొండ: ఎల్కతుర్తి మండల హనుమకొండ: ఎల్కతుర్తి మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన కారు డిక్కీలో మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. మృతురాలు గోదావరిఖనికి చెందిన అంకతి మానసగా గుర్తించగా, నిందితుడు వినోద్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఏసీపీ వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం ఎల్కతుర్తి బస్‌స్టాండ్ వెనుక పార్క్ చేసి వదిలివేసిన కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గ్రామ కార్యదర్శికి సమాచారం ఇచ్చారు. కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారులోని డిక్కీలో మహిళ మృతదేహాన్ని గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో కారును వినోద్ కుమార్ అక్కడ ఉంచినట్లు తేలిందన్నారు. మృతురాలు మానస, నిందితుడు వినోద్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి పరిచయస్తులు, సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు చెందిన వారని చెప్పారు. మానస ప్రవర్తన వల్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆమెను ఎలాగైనా హత్య చేయాలని మృతురాలి తండ్రి రాజేశం వినోద్ కుమార్‌ను కోరినట్లు విచారణలో వెల్లడైందన్నారు.3
- వరంగల్ పరిసర గ్రామాల్లో వర్షం: చిగురించిన పత్తి రైతుల ఆశలు పంతిని , ఆగస్టు 24: వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఆందోళనలో ఉన్న పత్తి రైతులకు నేడు కురిసిన వర్షం ఎంతో ఊరటనిచ్చింది. ఉదయం నుంచి వాతావరణం చల్లబడి విస్తారంగా వర్షం కురవడంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసిన పత్తి పంట ఎదుగుదల లోపించి ఎండిపోయే ప్రమాదం ఏర్పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం కురిసిన ఈ వర్షం పత్తి మొక్కల ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షంతో పంటకు ప్రాణం వచ్చినట్లయిందని, రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా అనుకూలమైన వర్షాలు పడితే మంచి దిగుబడులు సాధిస్తామని స్థానిక రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.2
- తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుండే పోటీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజవర్గం నుండి పోటీ చేస్తున్నా అని సంచలన ప్రకటన చేసిన తీన్మార్ మల్లన్న.1
- 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏 𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌[𝐌𝐀𝐋𝐄][𝐁𝐀 3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑][𝐇𝐈𝐍𝐃𝐇𝐔;𝐑𝐄𝐋𝐈𝐆𝐈𝐎𝐍][☆𝐎𝐖𝐍:𝐇𝐎𝐔𝐒𝐄;𝐍𝐎.3-9-592##𝐑𝐄𝐃𝐃𝐘 𝐂𝐎𝐋𝐎𝐍𝐘#𝐑𝐎𝐀𝐃 𝐍𝐎.1#𝐇𝐀𝐍𝐀𝐌 𝐊𝐎𝐍𝐃𝐀 -𝐂𝐈𝐓𝐘&𝐃𝐈𝐒𝐓𝐑𝐈𝐂#][☆𝐓𝐇𝐄𝐋𝐀𝐍𝐆𝐀𝐀𝐍𝐀 :𝐓𝐇𝐄𝐋𝐔𝐆𝐔-𝐋𝐀𝐍𝐆𝐔𝐀𝐆𝐄-𝐒𝐓𝐀𝐓𝐄*#☆☆𝐈𝐍𝐃𝐈𝐀-𝐊𝐍𝐓𝐑𝐈#𝐀𝐒𝐈𝐀#☆☆☆𝐖𝐎𝐑𝐋𝐃#]1
- ప్రియా దేవుని బిడ్డలకు ప్రభువు యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు దేవుడు మిమ్మల్ని దీవించును గాక1
- ఆటపాటలతో సంస్కృతిని చాటిన లంబాడీలు:బంజారా సంస్కృతికి ప్రతీక ‘తీజ్’: జనగామలో ఘనంగా శోభాయాత్ర జనగామ: జిల్లా కేంద్రంలో మాజీ కౌన్సిలర్ వాంకుడోత్ అనిత నివాసం వద్ద తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన బంజారా తీజ్ ఉత్సవాలు నిమజ్జన వేడుకతో ఘనంగా ముగిశాయి. అనిత నివాసం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర అంబేద్కర్ చౌరస్తా మీదుగా బతుకమ్మ కుంట వరకు సాగింది. బంజారా మహిళలు, యువత, ఉద్యోగులు, ప్రజలు సంప్రదాయ వేషధారణలతో ఆటపాటలు, నృత్యాలు చేస్తూ పెద్ద ఎత్తున తరలిరావడంతో జనగామ పురవీధులు బంజారా జనసంద్రంగా మారాయి. ఈ కార్యక్రమంలో కుసుంబాయి తండా సర్పంచ్ కొర్ర స్వరూప రాజేందర్ నాయక్‌తో పాటు పలువురు బంజారా నాయకులు, ప్రజాప్రతినిధులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలు, సంస్కృతిని కాపాడుకోవాలని, మేరామాయాడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.1
- వరంగల్‌లో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. రూ.12 లక్షల చోరీ సొత్తు స్వాధీనం వరంగల్: వరంగల్ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు, సీసీఎస్ బృందం సంయుక్తంగా అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత తెలిపారు. నిందితుడి నుంచి రూ.12 లక్షల విలువైన 70.19 గ్రాముల బంగారు ఆభరణాలు, 527.9 గ్రాముల వెండి, రూ.29,875 నగదు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం, పెద్దపల్లికి చెందిన ఆశిష్ శ్రీనివాస్ రెడ్డిమల్ల (27) ప్రస్తుతం మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో నివసిస్తున్నాడు. పగటి సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, రాత్రివేళల్లో చోరీలకు పాల్పడేవాడని విచారణలో వెల్లడైంది. ఈ ఏడాది మిల్స్ కాలనీ పరిధిలోని శివనగర్, ఎస్‌ఆర్‌ఆర్ నగర్ ప్రాంతాల్లో జరిగిన వరుస చోరీలను నిందితుడే చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో మహారాష్ట్రలో నాలుగు చోరీ కేసుల్లో అరెస్టై బెయిల్‌పై విడుదలైన అనంతరం మళ్లీ నేరాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అభినందించారు.1
- ఐఫోన్ 15 కోసం విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి.... సంభాజీనగర్: ఐఫోన్ 15 కొనివ్వాలని కోరుతూ తల్లిదండ్రులతో జరిగిన గొడవ విషాదానికి దారితీసింది. 18 ఏళ్ల యువకుడు ఖవ్‌ద్యా కొండపై తల్లిదండ్రులతో గొడవపడి కొండపై నుంచి దూకుతానని బెదిరించినట్లు సమాచారం. దాదాపు మూడు గంటల పాటు తల్లిదండ్రులు అతడిని బతిమిలాడినా వినలేదని తెలుస్తోంది. చివరకు తండ్రిని తనతో పాటు లాగడంతో ఇద్దరూ కొండపై నుంచి కిందపడి మృతి చెందారు. ఈ ఘటనతో తీవ్ర విషాదానికి గురైన తల్లి కూడా కొండపై నుంచి దూకినట్లు సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో సంభాజీనగర్‌లో విషాదం నెలకొంది.1