ఆగస్టు 27, 2026_ఆదిలాబాదు: *గుంజాలలో వాటర్ షెడ్ ప్రాజెక్టు పనులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా* పత్రిక ప్రకటన భూగర్భ జలాలను పెంపొందించడం ద్వారా రైతులకు రెండో పంట సాగు అవకాశాలు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం నార్నూర్ మండలం గుంజాల గ్రామంలో నిర్వహించిన వాటర్ షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై గ్రామసభ, అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని న్యూట్రిగార్డెన్ నిర్వహణను పరిశీలించి అభినందించిన కలెక్టర్, అనంతరం వన మహోత్సవంలో భాగంగా స్వయంగా మొక్కనాటి నీరు పోశారు. ఈ మొక్కకు గ్రామస్తులు కలెక్టర్ పేరుతో నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో ముసాయిదా ఓటరు జాబితా, ఏఎస్‌డీ జాబితాలను బిఎల్ఓ లక్ష్మీ చదివి వినిపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గుంజాల గ్రామం నుండి ప్రారంభమైన ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ భవిష్యత్తులో మండలంలోని మిగతా 11 గ్రామాలకు దశలవారీగా విస్తరించబడుతుందని తెలిపారు. భూగర్భ జలాలను పెంపొందించడం, వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా రైతులు రెండు పంటలు వేసుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని, కేరళ తరహాలో నాబార్డ్ సహకారంతో జియో ట్యాగింగ్ (GPS, GIS) పద్ధతుల్లో పారదర్శకతతో ఈ పనులు చేపట్టడం జరుగుతోందని స్పష్టం చేశారు. అలాగే రైతుల విద్యుత్ సౌకర్యం కొరకు 1 కిలోమీటర్ పరిధిలో 20 పోల్స్ వరకు ఎలాంటి అదనపు డెవలప్‌మెంట్ చార్జీలు లేకుండా కేవలం రూ.9,150/- చెల్లిస్తే విద్యుత్ శాఖ ద్వారా ఉచితంగా పోల్స్, లైన్లు వేయబడతాయని తెలిపారు. చివరి ఇళ్లకు సైతం తక్కువ ఖర్చుతో విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయించుకోవచ్చని వెల్లడించారు. హస్తాపూర్ - నార్నూర్ రహదారి పనులతో పాటు పెండింగ్‌లో ఉన్న రోడ్లకు త్వరలో నిధులు మంజూరు చేయడం, గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో సిఆర్‌టి ఉపాధ్యాయుల కొరతను తీర్చడం, పాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయడం, వృద్ధులు, దివ్యాంగుల పింఛన్ల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డిడిఎం అబ్దుల్ రౌఫ్, ధాన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు నీలేష్, పంచాయతీ రాజ్ ఈఈ శివరాం, ఎంపీడీవో పుల్లరావు, ఏంఆర్ఓ రాజలింగు, ఏంఈఓ మనోహర్, డిఎల్పిఓ ప్రభాకర్, సర్పంచ్ జ్ఞానేశ్వర్, పాఠశాల ఉపాధ్యాయులు రామారావు, పంచాయతీ కార్యదర్శి రాధిక, బిఎల్ఓ లక్ష్మీ, గ్రామస్తులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి: TGEJAC ADB: ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకై TGEJAC ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట గురువారం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. సంఘం నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు PRC అమలు, పెండింగ్ DA, బకాయిల చెల్లింపు, CPS రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడి డిమాండ్లను సాధించుకోవాలని నేతలు పిలుపునిచ్చారు.1
- కొమ్మావార్ ట్రేడర్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్‌రెడ్డి బేల ప్రధాన రహదారిపై కొమ్మావార్ సంకేత్ నూతనంగా ఏర్పాటు చేసిన కొమ్మావార్ ట్రేడర్స్‌ను ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి ప్రారంభోత్సవానికి హాజరై అభినందించారు. వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గుండావార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్‌రావు వాంఖడే, కిసాన్ కాంగ్రెస్ బేల అధ్యక్షుడు గునశ్యామ్, బిక్కి గంగన్న, అలీమ్ తదితరులు పాల్గొన్నారు.1
- Kamaraddy distik banswada me miladun nabi juloos police bhari bandubast,1
- ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజ, దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట పరిధిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో పడిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. కేరళలో జరిగే ఓనం పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవాలయంలో అయ్యప్ప స్వామి భక్తి పాటలు పాడుతూ భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అయ్యప్ప స్వామి దేవాలయం, పరిసరాలలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.1
- చింతామని గణపతి ఆలయం లో దాత దావు సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.. అన్నదానం... బాసర లోని చింతామని గణపతి ఆలయం లో బాసర కు చెందిన దాత దావు సంతోష్ ఆధ్వర్యంలో శ్రావణమాసం పౌర్ణమి ని పురస్కరించుకొని అన్నదానం నిర్వహించారు. స్థానికులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అన్నదానం స్వీకరించారు. ప్రతి పౌర్ణమి నాడు బాసర కు చెందిన దాతల సహకారం తో అన్నదానం నిర్వహిస్తామని, ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని వేసుకున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు.1
- కస్తూర్బా పాఠశాలలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు...... ......... చిన్నచింతకుంట: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను మదీనా మసీదు కమిటీ, మైనారిటీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు స్వీట్లు, నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, ప్రేమ మార్గంలో నడవాలని, చదువుతో పాటు మంచి విలువలను పెంపొందించుకోవాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో జాకీర్, జాంగీర్, మైముద్, ఫారూక్, ఎండీ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.1
- *రేపటి గ్రామ సభల్లో అర్హులైన ఓటర్లను గుర్తించాలి* *ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ బీఎల్‌ఏ–2లు, కార్యకర్తలదే – డీసీసీ అధ్యక్షులు* *డా. నరేష్ జాదవ్ గారు * రేపు జరగబోయే గ్రామ సభల్లో అర్హులైన ప్రతి ఒక్క ఓటరును గుర్తించి, వారు తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏ–2లు, మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈరోజు మండల కాంగ్రెస్ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారి నాయకత్వంలో సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావడంతో పాటు, SIR ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారు మాట్లాడుతూ, రేపు జరగబోయే గ్రామ సభలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా పర్యవేక్షించాలని సూచించారు. అర్హత కలిగిన ఏ ఒక్కరి ఓటు హక్కు కూడా కోల్పోకుండా చూడాలని, ఓటరు జాబితాలో తమ పేరు ఉందా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ పరిశీలించుకునేలా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. SIR ప్రక్రియలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త తన బాధ్యతను గుర్తించి పనిచేయాలని డా. నరేష్ జాదవ్ గారు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది వంటిదని, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండేలా చూడటం ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమైన అంశమని అన్నారు. ముఖ్యంగా దళితులు, మైనారిటీలు, పేదలు, అణగారిన వర్గాలకు చెందిన అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అర్హత కలిగిన ఓటర్లు అవసరమైన పత్రాలను సమర్పించుకోవడం, ఓటరు జాబితాలో తమ పేర్లను పరిశీలించుకోవడం వంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు పూర్తిస్థాయిలో సహకరిస్తారని డా. నరేష్ జాదవ్ గారు తెలిపారు. ఏదైనా కారణంతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడినట్లయితే, సంబంధిత నిబంధనల ప్రకారం వారు తమ అభ్యంతరాలు, దరఖాస్తులు సమర్పించుకునేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహకరించాలని అన్నారు. అర్హులైన ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగించే కుట్రలకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ సహించబోదని డా. నరేష్ జాదవ్ గారు హెచ్చరించారు. ఓటు హక్కు విషయంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం, సంస్థాగత బలోపేతంలో భాగంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులతో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు డా. నరేష్ జాదవ్ గారు తెలిపారు. పార్టీ అగ్రనేత, గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.ప్రజా సమస్యలపై రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటం, ఆయన ఆశయాలను ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి చేరేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని డా. నరేష్ జాదవ్ గారు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. రాబోయే కాలంలో గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఖిజార్ పాషా గారు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి గారు, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు అంబకంటి అశోక్ గారు, జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు సయ్యద్ షాహిద్ గారు, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు పరమేశ్వర్ గారు, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు మోతీరామ్ గారు, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగల నర్సింగ్ గారు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మంగేష్ దేవతడే గారు, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి అన్నపూర్ణ గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా జనరల్ సెక్రటరీలు, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీలు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు3
- ఎస్టీయూటీఎస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి ఆదిలాబాద్: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూటీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన 80 వసంతాల వైభవోత్సవం ఆదిలాబాద్‌లో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యారంగ అభివృద్ధికి ఎస్టీయూటీఎస్ చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సదానందం,ప్రధాన కార్యదర్శి జి.గజేందర్,ఆర్థిక కార్యదర్శి సయ్యద్ సాహెబ్ అలీ,జిల్లా అధ్యక్షుడు మురళీ శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి జాధవ్ రవికుమార్,ఆర్థిక కార్యదర్శి బూత్కూరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా నాయకులు,ఉపాధ్యాయులు,ఉపాధ్యాయినులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.1
- వీధి కుక్కల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు మరోసారి ఫిర్యాదు – తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ బోధన్: బోధన్ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు జునైద్ అహ్మద్ ఖలీల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈరోజు జునైద్ అహ్మద్ ఖలీల్ ఆధ్వర్యంలో రాకాసిపేట్‌లోని వివిధ వార్డులకు చెందిన బాధ్యత వహిస్తున్న కుటుంబ సభ్యులు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి మరోసారి లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. వీధి కుక్కల సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు మున్సిపల్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా జునైద్ అహ్మద్ ఖలీల్ మీడియాతో మాట్లాడుతూ.. బోధన్‌లోని 38 మంది కౌన్సిలర్లను ప్రజలు ఓటు వేసి గెలిపించారని, అయితే వార్డుల్లోని ప్రజలు వీధి కుక్కల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రత్యేకంగా చిన్నారులు, వృద్ధులు వీధి కుక్కల కారణంగా భయాందోళనలకు గురవుతున్నారని, ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీధి కుక్కలపై చర్యలు తీసుకోకపోతే బోధన్‌లోని వీధి కుక్కలను పట్టుకుని బోధన్ మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చి వదిలిపెట్టాల్సి వస్తుందని జునైద్ అహ్మద్ ఖలీల్ హెచ్చరించారు. అలాగే బోధన్ ప్రజలు, ముఖ్యంగా చిన్నారుల భద్రత కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా స్పందించాలని జునైద్ అహ్మద్ ఖలీల్ మీడియా ద్వారా కోరారు. ప్రజలు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించారని, ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు. వీధి కుక్కల సమస్యపై వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.1