logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పిఠాపురంలో ఘనంగా జనసేన ఆవిర్భావ వేడుకలు ఉప్పాడ బస్టాండ్ లో భారీ కేక్ కటింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ పిఠాపురం మార్చి 14: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక ఉప్పాడ బస్టాండ్ లో భారీ వేదికను నిర్మించి వేడుకలను జనసేన శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గవ్యాప్తంగా జనసైనికులు, నాయకులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పట్టణం జనసేన జెండాలతో రెపరెపలాడింది. ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, "పవన్ కళ్యాణ్ పిఠాపురానికి శాశ్వత ఎమ్మెల్యేగా ఉంటారు. ఇక్కడి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు" అని పేర్కొన్నారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, "పిఠాపురంలో ఇప్పటికే 60,000 మందితో జనసేన ఒక పెద్ద కుటుంబంగా మారింది. త్వరలోనే లక్ష సభ్యత్వాల మార్కును చేరుకుంటాం. పవన్ కళ్యాణ్ కేవలం రాష్ట్ర స్థాయి నేత మాత్రమే కాదు, దేశ స్థాయి నాయకుడిగా ఎదిగారు" అని కొనియాడారు. స్థానిక ఉప్పాడ బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ వేదికపై జనసేన నేతలు ఆధ్వర్యంలో భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం పిఠాపురం నుండి గొల్లప్రోలు వరకు జనసైనికులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గొల్లప్రోలులో భారీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేసి జనసేన నాయకులు తమ సేవా నిరతిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు ఓదురి కిషోర్, వివిధ మండల, పట్టణ అధ్యక్షులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

on 14 March
user_MANIKANTA SUVARNAM
MANIKANTA SUVARNAM
Local News Reporter పిఠాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
on 14 March
3304228c-9cbc-4d42-988e-5a082b339864

పిఠాపురంలో ఘనంగా జనసేన ఆవిర్భావ వేడుకలు ఉప్పాడ బస్టాండ్ లో భారీ కేక్ కటింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ పిఠాపురం మార్చి 14: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక ఉప్పాడ బస్టాండ్ లో భారీ వేదికను నిర్మించి వేడుకలను జనసేన

ac66f1fa-4462-4b71-840c-022ad67dc8a2

శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గవ్యాప్తంగా జనసైనికులు, నాయకులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పట్టణం జనసేన జెండాలతో రెపరెపలాడింది. ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, "పవన్ కళ్యాణ్ పిఠాపురానికి శాశ్వత ఎమ్మెల్యేగా ఉంటారు. ఇక్కడి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు" అని పేర్కొన్నారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, "పిఠాపురంలో ఇప్పటికే

a5e96c0b-3b8e-4332-9c7b-62866c8f1010

60,000 మందితో జనసేన ఒక పెద్ద కుటుంబంగా మారింది. త్వరలోనే లక్ష సభ్యత్వాల మార్కును చేరుకుంటాం. పవన్ కళ్యాణ్ కేవలం రాష్ట్ర స్థాయి నేత మాత్రమే కాదు, దేశ స్థాయి నాయకుడిగా ఎదిగారు" అని కొనియాడారు. స్థానిక ఉప్పాడ బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ వేదికపై జనసేన నేతలు ఆధ్వర్యంలో భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం పిఠాపురం నుండి గొల్లప్రోలు వరకు జనసైనికులు భారీ

4784328d-ce41-4cc0-acd1-6b13a7673ce8

బైక్ ర్యాలీ నిర్వహించారు. గొల్లప్రోలులో భారీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేసి జనసేన నాయకులు తమ సేవా నిరతిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు ఓదురి కిషోర్, వివిధ మండల, పట్టణ అధ్యక్షులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

More news from Kakinada and nearby areas
  • పిఠాపురం: రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహించనున్న ఈ వారోత్సవాల్లో భాగంగా, ప్రజల్లో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించేందుకు అధికారులు విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు.​వారోత్సవాల ప్రారంభం సందర్భంగా స్థానిక పాఠశాల విద్యార్థులతో కలిసి అధికారులు జెండా ఊపి ప్రదర్శనను ప్రారంభించారు. మీ సేవయే మా కర్తవ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న అగ్నిమాపక శాఖ, మంగళవారం నాడు స్థానిక ఉప్పాడ బస్టాండ్ సెంటర్ వద్ద భారీ బహిరంగ ప్రదర్శనను నిర్వహించింది. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే విధానాలను, ఆధునిక పరికరాల పనితీరును ప్రత్యక్షంగా చేసి చూపారు. ​ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ ​ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు గురికాకుండా ప్రాథమిక జాగ్రత్తలు పాటించాలని, ​ప్రతి పౌరుడికి కనీస అగ్నిమాపక శిక్షణ ఉండాలని, తద్వారా ప్రాణ,ఆస్తి నష్టాలను తగ్గించవచ్చని తెలిపారు. ​అగ్ని నివారణ నియమాలను పాటించడం ద్వారా తమను తాము కాపాడుకోవడమే కాకుండా సమాజానికి మేలు చేసిన వారవుతారని పిలుపునిచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించేలా రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ​ఈ ప్రదర్శనకు స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభించింది. వారం రోజుల పాటు జరిగే ఈ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
    1
    పిఠాపురం: రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహించనున్న ఈ వారోత్సవాల్లో భాగంగా, ప్రజల్లో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించేందుకు అధికారులు విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు.​వారోత్సవాల ప్రారంభం సందర్భంగా స్థానిక పాఠశాల విద్యార్థులతో కలిసి అధికారులు జెండా ఊపి ప్రదర్శనను ప్రారంభించారు. మీ సేవయే మా కర్తవ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న అగ్నిమాపక శాఖ, మంగళవారం నాడు స్థానిక ఉప్పాడ బస్టాండ్ సెంటర్ వద్ద భారీ బహిరంగ ప్రదర్శనను నిర్వహించింది. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే విధానాలను, ఆధునిక పరికరాల పనితీరును ప్రత్యక్షంగా చేసి చూపారు. ​ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ ​ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు గురికాకుండా ప్రాథమిక జాగ్రత్తలు పాటించాలని, ​ప్రతి పౌరుడికి కనీస అగ్నిమాపక శిక్షణ ఉండాలని, తద్వారా ప్రాణ,ఆస్తి నష్టాలను తగ్గించవచ్చని తెలిపారు. ​అగ్ని నివారణ నియమాలను పాటించడం ద్వారా తమను తాము కాపాడుకోవడమే కాకుండా సమాజానికి మేలు చేసిన వారవుతారని పిలుపునిచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించేలా రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ​ఈ ప్రదర్శనకు స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభించింది. వారం రోజుల పాటు జరిగే ఈ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    14 hrs ago
  • భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నివాళులర్పించడం జరిగింది. #AmbedkarJayanti #StatueOfSocialJustice
    1
    భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నివాళులర్పించడం జరిగింది.
#AmbedkarJayanti
#StatueOfSocialJustice
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • నరసాపురం: పతాక శీర్షిక న్యూస్ *నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.* పట్టణంలో నెలకొన్న చెత్త నిర్వహణ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించామని, త్వరలోనే స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. మంగళవారం నరసాపురం రుస్తుంబాద శివారు మండవారి గరువు ప్రాంతంలో ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటనలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి స్థలాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు అధికారులు వివరాలను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పట్టణ పారిశుద్ధ్య సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని గుర్తించి, నిర్దేశిత విధానాల ప్రకారం పనులు వేగవంతం చేయాలని సూచించారు. మండవారి గరువులో డంపింగ్ యార్డ్ కోసం ఏర్పాటు చేసిన రహదారిని కూడా పరిశీలించారు. అనంతరం పట్టణంలోని టైలర్ హై స్కూల్ మరియు వలందర రేవు సమీప ప్రాంతాల్లో వీధుల్లో పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. ఇంటి చెత్తను రోడ్లపై పడేయడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే వీధుల్లోని చెత్తను తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రోజూ డోర్ టు డోర్ చెత్త సేకరణను కచ్చితంగా అమలు చేయాలని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అలాగే ఏటిగట్టు డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని కూడా పరిశీలించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందని తెలిపారు. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తగిన స్థలాల పరిశీలన పూర్తవుతోందని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, తహసీల్దార్ ఐతం సత్యనారాయణ, టిపిఓ వెంకటరమణ, మండల సర్వే అధికారి ధనరాజు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
    1
    నరసాపురం: పతాక శీర్షిక న్యూస్ 
*నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.*
పట్టణంలో నెలకొన్న చెత్త నిర్వహణ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించామని, త్వరలోనే స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. మంగళవారం నరసాపురం రుస్తుంబాద శివారు మండవారి గరువు ప్రాంతంలో ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటనలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి స్థలాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు అధికారులు వివరాలను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పట్టణ పారిశుద్ధ్య సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని గుర్తించి, నిర్దేశిత విధానాల ప్రకారం పనులు వేగవంతం చేయాలని సూచించారు. మండవారి గరువులో డంపింగ్ యార్డ్ కోసం ఏర్పాటు చేసిన రహదారిని కూడా పరిశీలించారు. అనంతరం పట్టణంలోని టైలర్ హై స్కూల్ మరియు వలందర రేవు సమీప ప్రాంతాల్లో వీధుల్లో పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. ఇంటి చెత్తను రోడ్లపై పడేయడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే వీధుల్లోని చెత్తను తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి రోజూ డోర్ టు డోర్ చెత్త సేకరణను కచ్చితంగా అమలు చేయాలని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అలాగే ఏటిగట్టు డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని కూడా పరిశీలించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందని తెలిపారు. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తగిన స్థలాల పరిశీలన పూర్తవుతోందని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, తహసీల్దార్ ఐతం సత్యనారాయణ, టిపిఓ వెంకటరమణ, మండల సర్వే అధికారి ధనరాజు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
    user_Sidanivenugopal
    Sidanivenugopal
    Paan shop నరసాపురం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • monthly Passive income Start Cheyandi
    1
    monthly Passive income 
Start Cheyandi
    user_Siddu
    Siddu
    Business Networking Company పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.
    1
    40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో  ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి.
నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు.
పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు.
ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నారు.
    1
    అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై 
ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని  పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద 
సిద్ధంగా ఉన్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    31 min ago
  • Post by Veesachandu
    1
    Post by Veesachandu
    user_Veesachandu
    Veesachandu
    Plumber గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • పిఠాపురం: రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 135వ జయంతి వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ వంగా గీతా విశ్వనాధ్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించారు.ముందుగా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు. పట్టణ పరిధిలో రదాలపేట అంబేద్కర్‌ సెంటర్, జీవన్ నగర్, జై భీమ్ నగర్ మరియు కత్తుల గూడెంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగా గీత విశ్వనాథ్ మాట్లాడుతూ... సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమానత్వం కోసం అంబేద్కర్‌ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని, కులమతాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన ఆయన ఆశయ సాధనే మా ప్రభుత్వ లక్ష్యం అని కొనియాడారు. విద్యా, వైద్యం, సామాజిక సాధికారత ద్వారా ప్రతి పేదవాడి చెంతకు రాజ్యాంగ ఫలాలు అందించాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో కూడా సామాజిక న్యాయం అందించేందుకు మేమంతా నిరంతరం శ్రమిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు,గండేపల్లి బాబి, వర్దినీడి సుజాత, సోమరౌతు ఆశలత, తలిశెట్టి వెంకటేశ్వరరావు, ఉలవల భూషణం, బత్తుల సాయి, సందక శ్యామ్, ముమ్మడి శ్రీను, నల్లమిల్లి పవన్ కుమార్,ఖండవల్లి లోవరాజు, చెల్లూరు లోవరాజు, ఆలీ, వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    పిఠాపురం: రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 135వ జయంతి వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ వంగా గీతా విశ్వనాధ్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించారు.ముందుగా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు.
పట్టణ పరిధిలో రదాలపేట అంబేద్కర్‌ సెంటర్, జీవన్ నగర్, జై భీమ్ నగర్ మరియు కత్తుల గూడెంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగా గీత విశ్వనాథ్ మాట్లాడుతూ... సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమానత్వం కోసం అంబేద్కర్‌ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని, కులమతాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన ఆయన ఆశయ సాధనే మా ప్రభుత్వ లక్ష్యం అని కొనియాడారు. విద్యా, వైద్యం, సామాజిక సాధికారత ద్వారా ప్రతి పేదవాడి చెంతకు రాజ్యాంగ ఫలాలు అందించాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో కూడా సామాజిక న్యాయం అందించేందుకు మేమంతా నిరంతరం శ్రమిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు,గండేపల్లి బాబి, వర్దినీడి సుజాత, సోమరౌతు ఆశలత, తలిశెట్టి వెంకటేశ్వరరావు, ఉలవల భూషణం, బత్తుల సాయి, సందక శ్యామ్, ముమ్మడి శ్రీను, నల్లమిల్లి పవన్ కుమార్,ఖండవల్లి లోవరాజు, చెల్లూరు లోవరాజు, ఆలీ, వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.