logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యం - వైఎస్సార్ సీపీ ఇంచార్జ్ వంగా గీత విశ్వనాథ్ - పిఠాపురంలో ఘనంగా డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 135వ జయంతి వేడుకలు పిఠాపురం: రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 135వ జయంతి వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ వంగా గీతా విశ్వనాధ్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించారు.ముందుగా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు. పట్టణ పరిధిలో రదాలపేట అంబేద్కర్‌ సెంటర్, జీవన్ నగర్, జై భీమ్ నగర్ మరియు కత్తుల గూడెంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగా గీత విశ్వనాథ్ మాట్లాడుతూ... సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమానత్వం కోసం అంబేద్కర్‌ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని, కులమతాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన ఆయన ఆశయ సాధనే మా ప్రభుత్వ లక్ష్యం అని కొనియాడారు. విద్యా, వైద్యం, సామాజిక సాధికారత ద్వారా ప్రతి పేదవాడి చెంతకు రాజ్యాంగ ఫలాలు అందించాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో కూడా సామాజిక న్యాయం అందించేందుకు మేమంతా నిరంతరం శ్రమిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు,గండేపల్లి బాబి, వర్దినీడి సుజాత, సోమరౌతు ఆశలత, తలిశెట్టి వెంకటేశ్వరరావు, ఉలవల భూషణం, బత్తుల సాయి, సందక శ్యామ్, ముమ్మడి శ్రీను, నల్లమిల్లి పవన్ కుమార్,ఖండవల్లి లోవరాజు, చెల్లూరు లోవరాజు, ఆలీ, వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

7 hrs ago
user_Prasanna kumar Rowthu
Prasanna kumar Rowthu
Local News Reporter Pithapuram, Kakinada•

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • సామాజిక సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత. సమానత్వం, విద్య, స్వాభిమానం మార్గంలో ముందుకు సాగుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన దారిలో కలిసి నడుద్దాం. జై భీమ్ ✊ జై భారత్ 🇮🇳
    1
    సామాజిక సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత.
సమానత్వం, విద్య, స్వాభిమానం మార్గంలో ముందుకు సాగుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన దారిలో కలిసి నడుద్దాం.
జై భీమ్ ✊
జై భారత్ 🇮🇳
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    16 hrs ago
  • భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు విజయనగరంలో ఘనంగా జరిగాయి. ​మంగళవారం స్థానిక బాలాజీ జంక్షన్‌లోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ఎంఎస్ఎమ్ఈ, సెర్ప్, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా ఇంచార్జి కలెక్టర్ సేధు మాధవన్, విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ ఛైర్పర్సన్ పాలవలస యశస్వి, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, మున్సిపల్ కమిషనర్ బాలాస్వామి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి ఎం.అన్నపూర్ణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడి వెంకటేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి దిశానిర్దేశం చేసే అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగంలోని రైట్ టు లివ్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు స్పీచ్ వంటి ప్రాథమిక హక్కుల వల్ల సమాజంలో ప్రతి వర్గానికి, ప్రతి కులానికి సమానత్వం మరియు గౌరవం లభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ​చిన్నతనంలో తాను ఎదుర్కొన్న వివక్షను మరెవరూ ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు. నేడు వెనుకబడిన వర్గాల కుటుంబాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయంటే అది ఆయన కల్పించిన రాజ్యాంగ ఫలాలేనని స్పష్టం చేశారు. ప్రతి ఏటా ప్రభుత్వం తరపున ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, భావితరాలకు ఆయన ఆశయాలను, గొప్పతనాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు.
    1
    భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు విజయనగరంలో  ఘనంగా జరిగాయి. ​మంగళవారం స్థానిక బాలాజీ జంక్షన్‌లోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ఎంఎస్ఎమ్ఈ, సెర్ప్, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా ఇంచార్జి కలెక్టర్ సేధు మాధవన్, విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ ఛైర్పర్సన్ పాలవలస యశస్వి, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, మున్సిపల్ కమిషనర్ బాలాస్వామి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి ఎం.అన్నపూర్ణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడి వెంకటేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 
ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి దిశానిర్దేశం చేసే అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగంలోని రైట్ టు లివ్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు స్పీచ్ వంటి ప్రాథమిక హక్కుల వల్ల సమాజంలో ప్రతి వర్గానికి, ప్రతి కులానికి సమానత్వం మరియు గౌరవం లభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ​చిన్నతనంలో తాను ఎదుర్కొన్న వివక్షను మరెవరూ ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు. నేడు వెనుకబడిన వర్గాల కుటుంబాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయంటే అది ఆయన కల్పించిన రాజ్యాంగ ఫలాలేనని స్పష్టం చేశారు. ప్రతి ఏటా ప్రభుత్వం తరపున ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, భావితరాలకు ఆయన ఆశయాలను, గొప్పతనాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు.
    user_Kumar
    Kumar
    Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    18 hrs ago
  • అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గండి కొట్టిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులను సహించరాదని ప్రయాణికులు హెచ్చరించారు.
    1
    అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గండి కొట్టిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులను సహించరాదని ప్రయాణికులు హెచ్చరించారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • Post by Veesachandu
    1
    Post by Veesachandu
    user_Veesachandu
    Veesachandu
    Plumber గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    56 min ago
  • Post by V Ramarao
    4
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    16 hrs ago
  • ఈ సందర్భంగా సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీ సండ్ర వెంకట వీరయ్య గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ కూసంపూడి మహేష్ అయ్యప్ప స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవాలయానికి విచ్చేసిన నాయకులకు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందిన నాయకులు ప్రజల సుఖశాంతి, ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమం ఘనంగా కొనసాగింది.
    1
    ఈ సందర్భంగా సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీ సండ్ర వెంకట వీరయ్య గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ కూసంపూడి మహేష్ అయ్యప్ప స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
దేవాలయానికి విచ్చేసిన నాయకులకు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందిన నాయకులు ప్రజల సుఖశాంతి, ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమం ఘనంగా కొనసాగింది.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    18 hrs ago
  • అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    1
    అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.