logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణలో అధికారులకు షాక్ ఇచ్చిన సర్పంచ్... చెప్పిందే చెబుతున్నారని, గ్రామానికి ఏం నిధులు ఇస్తారో చెప్పండి అంటూ నిలదీసిన సర్పంచ్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై సర్పంచులకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సర్పంచ్ అధికారులకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పారు. తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలో ఏర్పాటు చేసిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన కోసం సర్పంచ్ లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన సమావేశంలో అధికారులు 10 అంశాలపై సవివరంగా వివరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు చెప్పిందే చెబుతున్నారని తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామ సర్పంచ్ మూర నిర్మల అధికారులను నిలదీశారు. ప్రభుత్వ అధికారులు నాలుగు గంటలు పనిచేసినా 8 గంటలు పనిచేసిన నెల జీతం వస్తుందని, కానీ సర్పంచ్లు 24 గంటలు పనిచేసిన గ్రామపంచాయతీలో ఏ పని చేయాలన్న నిధులు లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. సర్పంచిగా ఎన్నికై పెద్దిరికానికి వచ్చామా?.. పనిచేయడానికి వచ్చామా అని ప్రశ్నించారు. పంది చచ్చిన, కుక్క చచ్చిన ఎలుక చచ్చిన సర్పంచ్ అని గ్రామస్తులు అంటున్నారని, ఏ పని చేయాలన్నా నిధులు లేక కొట్టుమిట్టాడుతుంటే అధికారులు చెప్పిందే చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ గ్రామాలకు ఏమిస్తారో చెబితే తాము గ్రామాల్లో అన్ని పనులు చేస్తామని తెలిపారు. సర్పంచ్ ఆవేదనతో అధికారులు అవాక్కయ్యారు. సర్పంచులు చెప్పింది అధికారులు విని త్వరలోనే సమస్యలన్నింటికీ పరిష్కారం చూపేందుకే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమం చేపట్టడం జరిగిందని అధికారులు వివరించారు.

2 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
2 hrs ago

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణలో అధికారులకు షాక్ ఇచ్చిన సర్పంచ్... చెప్పిందే చెబుతున్నారని, గ్రామానికి ఏం నిధులు ఇస్తారో చెప్పండి అంటూ నిలదీసిన సర్పంచ్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై సర్పంచులకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సర్పంచ్ అధికారులకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పారు. తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలో ఏర్పాటు చేసిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన కోసం సర్పంచ్ లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన సమావేశంలో అధికారులు 10 అంశాలపై సవివరంగా వివరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు చెప్పిందే చెబుతున్నారని తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామ సర్పంచ్ మూర నిర్మల అధికారులను నిలదీశారు. ప్రభుత్వ అధికారులు నాలుగు గంటలు పనిచేసినా 8 గంటలు పనిచేసిన నెల జీతం వస్తుందని, కానీ సర్పంచ్లు 24 గంటలు పనిచేసిన గ్రామపంచాయతీలో ఏ పని చేయాలన్న నిధులు లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. సర్పంచిగా ఎన్నికై పెద్దిరికానికి వచ్చామా?.. పనిచేయడానికి వచ్చామా అని ప్రశ్నించారు. పంది చచ్చిన, కుక్క చచ్చిన ఎలుక చచ్చిన సర్పంచ్ అని గ్రామస్తులు అంటున్నారని, ఏ పని చేయాలన్నా నిధులు లేక కొట్టుమిట్టాడుతుంటే అధికారులు చెప్పిందే చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ గ్రామాలకు ఏమిస్తారో చెబితే తాము గ్రామాల్లో అన్ని పనులు చేస్తామని తెలిపారు. సర్పంచ్ ఆవేదనతో అధికారులు అవాక్కయ్యారు. సర్పంచులు చెప్పింది అధికారులు విని త్వరలోనే సమస్యలన్నింటికీ పరిష్కారం చూపేందుకే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమం చేపట్టడం జరిగిందని అధికారులు వివరించారు.

More news from తెలంగాణ and nearby areas
  • మండేపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18,19వ తేదీల్లో నిర్వహించనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షిల కళ్యాణం మహోత్సవంలో సిద్ధోగం లో భాగంగా శ్రీ ఎల్లమ్మ తల్లి వారి ఉత్సవ విగ్రహం మరియు గడపవనం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ఇంటికి రాగా వారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహానికి ఘన స్వాగతం పలుకుతూ వారి ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, ముదిరాజ్ సంఘం సిరిసిల్ల అధ్యక్షులు వంకాయల కార్తీక్ గారు, మండపల్లి గ్రామం పెద్దలు బండి భూమయ్య, గుర్రపు మల్లేశం, వెంకట నరసయ్య మొదలగు వారు పాల్గొన్నారు.
    1
    మండేపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18,19వ తేదీల్లో నిర్వహించనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షిల కళ్యాణం  మహోత్సవంలో సిద్ధోగం లో భాగంగా శ్రీ ఎల్లమ్మ తల్లి వారి ఉత్సవ విగ్రహం మరియు గడపవనం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ఇంటికి రాగా వారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహానికి ఘన స్వాగతం పలుకుతూ వారి ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల  బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, ముదిరాజ్ సంఘం సిరిసిల్ల అధ్యక్షులు వంకాయల కార్తీక్ గారు, మండపల్లి గ్రామం పెద్దలు బండి భూమయ్య, గుర్రపు మల్లేశం, వెంకట నరసయ్య మొదలగు వారు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    7 hrs ago
  • వరంగల్ జిల్లా: ఖిలావరంగల్ మండలం మామునూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం స్కూటీ పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఎదురుగా వచ్చిన టాటా ఏసీ వాహనం ఢీ కొడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులను శ్రీపతి వంశీ మరియు శ్రీపతి రాజుగా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మద్యం మత్తులో ఉన్న టాటా ఏసీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
    1
    వరంగల్ జిల్లా: ఖిలావరంగల్ మండలం మామునూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం స్కూటీ పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఎదురుగా వచ్చిన టాటా ఏసీ వాహనం ఢీ కొడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులను శ్రీపతి వంశీ మరియు శ్రీపతి రాజుగా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మద్యం మత్తులో ఉన్న టాటా ఏసీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. శనివారం నియోజకవర్గంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. 67వ డివిజన్‌లో సిద్ధార్థ నగర్ కమ్యూనిటీ హాల్‌లో డైనింగ్ హాల్ నిర్మాణానికి రూ.13 లక్షలు, డాక్టర్స్ కాలనీలో పార్క్ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.65 లక్షలతో పనులు ప్రారంభించారు. అలాగే 57వ డివిజన్‌లో అశోక కాలనీ, గోకుల్ నగర్ ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు, ఇంజనీర్స్ కాలనీ–ఎస్‌పీఆర్ పాఠశాల వద్ద బ్రిడ్జి నిర్మాణానికి కలిపి రూ.2.14 కోట్ల వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు. ప్రారంభించిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావు ఉండదని, ప్రజల అవసరాలే తమకు ప్రధానమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
    2
    వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. శనివారం నియోజకవర్గంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.
67వ డివిజన్‌లో సిద్ధార్థ నగర్ కమ్యూనిటీ హాల్‌లో డైనింగ్ హాల్ నిర్మాణానికి రూ.13 లక్షలు, డాక్టర్స్ కాలనీలో పార్క్ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.65 లక్షలతో పనులు ప్రారంభించారు. అలాగే 57వ డివిజన్‌లో అశోక కాలనీ, గోకుల్ నగర్ ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు, ఇంజనీర్స్ కాలనీ–ఎస్‌పీఆర్ పాఠశాల వద్ద బ్రిడ్జి నిర్మాణానికి కలిపి రూ.2.14 కోట్ల వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు.
ప్రారంభించిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావు ఉండదని, ప్రజల అవసరాలే తమకు ప్రధానమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    33 min ago
  • నర్సంపేట పట్టణంలోని పలు పదో తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారద శనివారం సందర్శించారు. పరీక్షలు ప్రశాంతంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలన్న ఉద్దేశంతో కేంద్రాల్లో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు వంటి అంశాలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
    1
    నర్సంపేట పట్టణంలోని పలు పదో తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారద శనివారం సందర్శించారు. పరీక్షలు ప్రశాంతంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలన్న ఉద్దేశంతో కేంద్రాల్లో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.
విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు వంటి అంశాలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • కవ్వాల్ టైగర్ జోన్.. వన్యప్రాణుల రక్షణ కోసం ప్రభుత్వం కోట్లు కుమ్మరిస్తున్న ప్రాంతం. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే 'వేటగాళ్లకు అడ్డాగా' మారుతోంది. తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలో ఓ చిరుత పులిని అతి కిరాతకంగా చంపి, దాని గోళ్లను పీకేసిన ఘటన అటవీ అధికారుల వైఫల్యాన్ని ఎండగడుతోంది. ​ఘటన వెనుక విస్తుపోయే నిజాలు: ​ఊట్ల గ్రామానికి చెందిన మొత్తే వెంకటేష్, మొత్తే శ్రీనివాస్, మరియు పాతమామిడిపల్లికి చెందిన వనపర్తి శ్రీకాంత్ అనే ముగ్గురు నిందితులు పక్కా ప్లాన్‌తో చిరుతను హతమార్చారు. కేవలం క్లచ్ వైరుతో ఉచ్చు వేసి, ఒక క్రూర మృగాన్ని హతమార్చగలిగారంటే.. ఆ ప్రాంతంలో అటవీ శాఖ నిఘా ఎంత 'ఘనం'గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ​వసూళ్లపై ఉన్న శ్రద్ధ.. వన్యప్రాణులపై లేదా? ​లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న బీట్ ఆఫీసర్ల నుంచి ఎఫ్.డి.ఓ, వరకు అందరిపై ఇప్పుడు విమర్శల జడివాన కురుస్తోంది. ​నాలుగు రోజుల మౌనం: చిరుత చనిపోయి నాలుగు రోజులు గడుస్తున్నా, నిందితులు దాని అవయవాలను అమ్ముకోవడానికి బయలుదేరే వరకు అధికారులకు ఉలుకూ లేదు.. పలుకూ లేదు. ​ఫోన్లకు నో ఆన్సర్: వివరణ కోసం మీడియా ప్రతినిధులు ఫోన్ చేస్తే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారులు స్పందించకపోవడం దేనికి సంకేతం? ​అవినీతి ఆరోపణలు: స్మగ్లర్లు, అక్రమ ఇసుక రవాణా చేసే వారితో చేతులు కలిపి, సామాన్య ప్రజలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారాయి. ​"అధికారులు కేవలం నామమాత్రపు తనిఖీలతో కాలక్షేపం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వేటగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతుంటే వీరు ఏసీ గదుల్లో ఏం చేస్తున్నారు?" అని మండల వాసులు, ప్రజా సంఘాల నేతలు నిలదీస్తున్నారు. ​తక్షణ డిమాండ్: సస్పెన్షన్ వేటు పడాల్సిందే! ​విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన బీట్ ఆఫీసర్లు, ఎఫ్.ఆర్.ఓ, మరియు ఎఫ్.డి.ఓ, లను తక్షణమే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తూ, వన్యప్రాణుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆక్రోశిస్తున్నారు.
    2
    కవ్వాల్ టైగర్ జోన్.. వన్యప్రాణుల రక్షణ కోసం ప్రభుత్వం కోట్లు కుమ్మరిస్తున్న ప్రాంతం. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే 'వేటగాళ్లకు అడ్డాగా' మారుతోంది. తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలో ఓ చిరుత పులిని అతి కిరాతకంగా చంపి, దాని గోళ్లను పీకేసిన ఘటన అటవీ అధికారుల వైఫల్యాన్ని ఎండగడుతోంది.
​ఘటన వెనుక విస్తుపోయే నిజాలు:
​ఊట్ల గ్రామానికి చెందిన మొత్తే వెంకటేష్, మొత్తే శ్రీనివాస్, మరియు పాతమామిడిపల్లికి చెందిన వనపర్తి శ్రీకాంత్ అనే ముగ్గురు నిందితులు పక్కా ప్లాన్‌తో చిరుతను హతమార్చారు. కేవలం క్లచ్ వైరుతో ఉచ్చు వేసి, ఒక క్రూర మృగాన్ని హతమార్చగలిగారంటే.. ఆ ప్రాంతంలో అటవీ శాఖ నిఘా ఎంత 'ఘనం'గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
​వసూళ్లపై ఉన్న శ్రద్ధ.. వన్యప్రాణులపై లేదా?
​లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న బీట్ ఆఫీసర్ల నుంచి ఎఫ్.డి.ఓ, వరకు అందరిపై ఇప్పుడు విమర్శల జడివాన కురుస్తోంది.
​నాలుగు రోజుల మౌనం: చిరుత చనిపోయి నాలుగు రోజులు గడుస్తున్నా, నిందితులు దాని అవయవాలను అమ్ముకోవడానికి బయలుదేరే వరకు అధికారులకు ఉలుకూ లేదు.. పలుకూ లేదు.
​ఫోన్లకు నో ఆన్సర్: వివరణ కోసం మీడియా ప్రతినిధులు ఫోన్ చేస్తే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారులు స్పందించకపోవడం దేనికి సంకేతం?
​అవినీతి ఆరోపణలు: స్మగ్లర్లు, అక్రమ ఇసుక రవాణా చేసే వారితో చేతులు కలిపి, సామాన్య ప్రజలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారాయి.
​"అధికారులు కేవలం నామమాత్రపు తనిఖీలతో కాలక్షేపం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వేటగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతుంటే వీరు ఏసీ గదుల్లో ఏం చేస్తున్నారు?" అని మండల వాసులు, ప్రజా సంఘాల నేతలు నిలదీస్తున్నారు.
​తక్షణ డిమాండ్: సస్పెన్షన్ వేటు పడాల్సిందే!
​విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన బీట్ ఆఫీసర్లు, ఎఫ్.ఆర్.ఓ, మరియు ఎఫ్.డి.ఓ, లను తక్షణమే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తూ, వన్యప్రాణుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆక్రోశిస్తున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    1 hr ago
  • village road 🛣️ Pasthala Nagaram madalam village Pasthala 54
    1
    village road 🛣️  Pasthala Nagaram madalam village Pasthala 
54
    user_Sandeep sunny Sunny
    Sandeep sunny Sunny
    నాగారం, సూర్యాపేట, తెలంగాణ•
    1 hr ago
  • పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 217 కేంద్రాల్లో 40 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. శనివారం ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 13 వరకు కొనసాగుతాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి. నిమిషం ఆలస్యం నిబంధనను తొలగించడంతో నిర్దేశించిన సమయానికంటే అరగంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40662 మంది పదవ తరగతి విద్యార్థులు ఉండగా వారి కోసం 217 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి కాకుండా అధికారులు పగడ్బందీ చర్యలు చేపట్టారు. వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థుల అస్వస్థతకు గురి కాకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని అందుబాటులో ఇచ్చారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పరీక్షా కేంద్రానికి వంద మీటర్ల దూరంలో జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. కరీంనగర్ జిల్లాలో 73 పరీక్ష కేంద్రాల ద్వారా 13 వేల మంది విద్యార్థులు తొలిరోజు పరీక్షలకు హాజరయ్యారు. జగిత్యాల జిల్లాలో 69 పరీక్ష కేంద్రాల్లో 12,693 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 34 పరీక్షా కేంద్రాల్లో 7300 మంది పెద్దపెల్లి జిల్లాలో 41 పరీక్ష కేంద్రాల్లో 7,400 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని అధికారులు ప్రకటించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది.
    4
    పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 217 కేంద్రాల్లో 40 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. శనివారం ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 13 వరకు కొనసాగుతాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి. నిమిషం ఆలస్యం నిబంధనను తొలగించడంతో నిర్దేశించిన సమయానికంటే అరగంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరారు. 
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40662 మంది పదవ తరగతి విద్యార్థులు ఉండగా వారి కోసం 217 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి కాకుండా అధికారులు పగడ్బందీ చర్యలు చేపట్టారు. వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థుల అస్వస్థతకు గురి కాకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని అందుబాటులో ఇచ్చారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పరీక్షా కేంద్రానికి వంద మీటర్ల దూరంలో జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. కరీంనగర్ జిల్లాలో 73 పరీక్ష కేంద్రాల ద్వారా 13 వేల మంది విద్యార్థులు తొలిరోజు పరీక్షలకు హాజరయ్యారు. జగిత్యాల జిల్లాలో 69 పరీక్ష కేంద్రాల్లో 12,693 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 34 పరీక్షా కేంద్రాల్లో 7300 మంది పెద్దపెల్లి జిల్లాలో 41 పరీక్ష కేంద్రాల్లో 7,400 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని అధికారులు ప్రకటించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    9 hrs ago
  • పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే. పదవ తరగతి పరీక్షల సందర్భంగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని గీతనగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కుసుమరయ్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలన్ని జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించి,పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడుతున్న తీరును సమీక్షించి, కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 34 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పరీక్షలు సజావుగా,అవాంఛనీయ ఘటనలు లేకుండా జరగడానికి 163 BNSS (సెక్షన్ 144) అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.పరీక్షల సమయంలో కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడ కుండా చూడలన్నారు.పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలోని (100 మీటర్ల పరిధిలో) అన్ని ఫోటోకాపీ (జిరాక్స్) మరియు ఇంటర్నెట్ సెంటర్లను పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఈ కేంద్రాలు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమించి పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడినా లేదా అనుమతి లేకుండా జిరాక్స్ సెంటర్లు తెరిచినా సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట,డిఎస్పీ నాగేంద్రచారి, పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సిబ్బంది ఉన్నారు.
    1
    పదవ తరగతి పరీక్ష కేంద్రాలను
క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.
పదవ తరగతి పరీక్షల సందర్భంగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని గీతనగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కుసుమరయ్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలన్ని జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించి,పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడుతున్న తీరును సమీక్షించి, కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 34 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పరీక్షలు సజావుగా,అవాంఛనీయ ఘటనలు లేకుండా జరగడానికి 163 BNSS (సెక్షన్ 144) అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.పరీక్షల సమయంలో కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడ కుండా చూడలన్నారు.పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలోని (100 మీటర్ల పరిధిలో) అన్ని ఫోటోకాపీ (జిరాక్స్) మరియు ఇంటర్నెట్ సెంటర్లను పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఈ కేంద్రాలు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమించి పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడినా లేదా అనుమతి లేకుండా జిరాక్స్ సెంటర్లు తెరిచినా సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట,డిఎస్పీ నాగేంద్రచారి, పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సిబ్బంది ఉన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    7 hrs ago
  • జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామంలో యశస్విని రెడ్డి నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి భవన భూమిపూజ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాఠశాల క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన భూమిలో భవనం నిర్మాణం ఎలా చేస్తారని స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఘటనను వీడియో తీస్తుండగా ఎమ్మెల్యే పీఏ రాజేష్ గౌడ్ ఫోన్ లాక్కున్నారని స్థానికులు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించగా అక్కడే ఉన్న ఎస్ఐ దూలం పవన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ “మీ మీద రౌడీషీట్ ఓపెన్ చేస్తా” అంటూ బెదిరించారని తెలిపారు. మంచి కోసం ప్రశ్నించిన తమను బెదిరించిన ఎస్ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామంలో యశస్విని రెడ్డి నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి భవన భూమిపూజ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాఠశాల క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన భూమిలో భవనం నిర్మాణం ఎలా చేస్తారని స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఘటనను వీడియో తీస్తుండగా ఎమ్మెల్యే పీఏ రాజేష్ గౌడ్ ఫోన్ లాక్కున్నారని స్థానికులు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించగా అక్కడే ఉన్న ఎస్ఐ దూలం పవన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ “మీ మీద రౌడీషీట్ ఓపెన్ చేస్తా” అంటూ బెదిరించారని తెలిపారు.
మంచి కోసం ప్రశ్నించిన తమను బెదిరించిన ఎస్ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.