కరీంనగర్ లో కేడీసీసీ బ్యాంకు ఉద్యోగుల నిరసన ఆందోళన.... ఇన్సెంటివ్ రికవరీ చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్...మే 2న సమ్మె నోటీస్. తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేడీసీసీ బ్యాంకు ఉద్యోగుల ఆందోళనకు దిగారు. లంచ్ అవర్స్ లో రెడ్ బ్యాడ్జిలు ధరించి బ్యాంకు ముందు ధర్నా చేశారు. డి.సి.సి.బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చిన ఇన్సెంటివ్/ఎక్స్రేషియా రికవరీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రికవరీ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో మే రెండు నుంచి సమ్మె చేపడతామని సమ్మె నోటిస్ తెచ్చారు. ఈనెల 24న వరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికి స్పందించకుంటే 23, 24న అధికారులకు మెమోరండం సమర్పిస్తామని, 27న డి.సి.సి. బ్యాంకుల ప్రధానకార్యాలయము ముందు ధర్నా చేస్తామన్నారు. 29న ధర్నా, సామూహిక శెలవు, 30న రాష్ట్ర సహకార బ్యాంకు ప్రధానకార్యాలయము హైదరాబాద్ ముందు 9 జిల్లాల సహకార బ్యాంకు ఉద్యోగులచే ధర్నా నిరసన కార్యక్రమాలు. ఉంటాయని తెలిపారు. అప్పటికి స్పందించకుంటే మే 2న సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
కరీంనగర్ లో కేడీసీసీ బ్యాంకు ఉద్యోగుల నిరసన ఆందోళన.... ఇన్సెంటివ్ రికవరీ చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్...మే 2న సమ్మె నోటీస్. తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేడీసీసీ బ్యాంకు ఉద్యోగుల ఆందోళనకు దిగారు. లంచ్ అవర్స్ లో రెడ్ బ్యాడ్జిలు ధరించి బ్యాంకు ముందు ధర్నా చేశారు. డి.సి.సి.బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చిన ఇన్సెంటివ్/ఎక్స్రేషియా రికవరీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రికవరీ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో మే రెండు నుంచి సమ్మె చేపడతామని
సమ్మె నోటిస్ తెచ్చారు. ఈనెల 24న వరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికి స్పందించకుంటే 23, 24న అధికారులకు మెమోరండం సమర్పిస్తామని, 27న డి.సి.సి. బ్యాంకుల ప్రధానకార్యాలయము ముందు ధర్నా చేస్తామన్నారు. 29న ధర్నా, సామూహిక శెలవు, 30న రాష్ట్ర సహకార బ్యాంకు ప్రధానకార్యాలయము హైదరాబాద్ ముందు 9 జిల్లాల సహకార బ్యాంకు ఉద్యోగులచే ధర్నా నిరసన కార్యక్రమాలు. ఉంటాయని తెలిపారు. అప్పటికి స్పందించకుంటే మే 2న సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
- జీతం పెంచాలని కోరినందుకు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ రాంప్రసాద్పై యజమానులు అనిల్రెడ్డి, బాలరాజు దాడికి పాల్పడ్డారు. దీనిని నిరసిస్తూ తోటి డ్రైవర్లు బస్సులు నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్పై దాడిని సీపీఐ నేత గడిపే మల్లేశం ఖండించారు. కార్మికులపై ఇలాంటి దాడులు సరికాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో హుస్నాబాద్ డిపో వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.1
- గన్నేరువరం : ఉపాధి కూలీల లో ఉత్సాహం నింపడానికి మండల ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ఉపాధి కూలీలతో కలిసి కొంత సమయం పని చేశారు. గుణపంతో మట్టిని తవ్వి కూలీలతో పనులు చేపట్టారు. మండలంలోని గునుకుల కొండాపూర్ లో పటేల్ చెరువులోకి నీరు వచ్చే ఫీడర్ కాలువ పనులు సర్పంచ్ అజయ్ వర్మ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబు కార్డు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధిని పొందాలని సూచించారు. ఈ ఫీడర్ కాలువ పనికి 7 లక్షల రూపాయల నిధులు మంజూరు ఇప్పించడం జరిగిందని, గ్రామాన్ని జిల్లాస్థాయిలో ముందు వరుసులో నిలపాలని ఫీల్డ్ అసిస్టెంట్ హనుమాన్ల యాదగిరికి సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ సంపత్, ఫీల్డ్ అసిస్టెంట్ హనుమన్ల యాదగిరి ఉపాధి కూలీలు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక విద్యానగర్ గీతా నగర్ చౌరస్తాలో నిర్వహించిన విరాట్ హిందూ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి హాజరయ్యారు.1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్‌డివిజన్‌లో ఈ నెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఐదు జిల్లాల నుంచి సుమారు లక్ష మందిని సమీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదికల కోసం కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులతో కలిసి కాటారం, మహాదేవపూర్, కాళేశ్వరం ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు.1
- Post by Rajitha Antharpula9
- విద్యార్థుల వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం రేపాయి నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా ఏర్పడి ప్రయాణికులకు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. “హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడండి”, “సీట్ బెల్ట్ తప్పనిసరి”, “జాగ్రత్తగా నడిపితేనే సురక్షిత ప్రయాణం” వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు విద్యార్థులు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని వినూత్నంగా తెలియజేశారు. అలాగే కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని కోరడం అక్కడి ప్రజలను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. రామకృష్ణ గారు మాట్లాడుతూ, “రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఈ అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయి” అని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.3
- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ ఏఈ 50 వేలు లంచం తీసుకుంటూ ఏసిబి కి చిక్కారు. హుజురాబాద్ ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద సివిల్ వర్క్ సంబంధించి ఎంబి రికార్డు చేసేందుకు కాంట్రాక్టర్ కు నుంచి 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం డబ్బులను సీజ్ చేసి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఏఈ సుధాకర్ రెడ్డిని అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. లంచం ఇవ్వడం తీసుకోవడం నేరమని, ఎవరైన లంచం అడిగితే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు2
- అగ్నిమాపక వారోత్సవాల్లో బాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేతన్న చౌక్ వద్ద అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిమాన్స్టెస్టసన్ కార్యక్రమాన్ని నిర్వహించగా నీటితో పాలు రకాల విన్యాసాలను చేశారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ అధికారి నరేందర్ మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అలాగే విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వారిని స్మరించుకుంటూ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు.3
- వరంగల్: దేశంలో పార్లమెంట్ నియోజకవర్గాల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, 2011 జనాభా లెక్కల ఆధారంగా రాజ్యాంగ ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ప్రాంతీయ విభేదాలను కాంగ్రెస్ రెచ్చగొట్టి రాజకీయ లాభం పొందాలని చూస్తోందని ఆయన విమర్శించారు.1