ఉపాధి కూలీలతో పని చేసి ఉత్సాహపరిచిన ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి.... గన్నేరువరం : ఉపాధి కూలీల లో ఉత్సాహం నింపడానికి మండల ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ఉపాధి కూలీలతో కలిసి కొంత సమయం పని చేశారు. గుణపంతో మట్టిని తవ్వి కూలీలతో పనులు చేపట్టారు. మండలంలోని గునుకుల కొండాపూర్ లో పటేల్ చెరువులోకి నీరు వచ్చే ఫీడర్ కాలువ పనులు సర్పంచ్ అజయ్ వర్మ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబు కార్డు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధిని పొందాలని సూచించారు. ఈ ఫీడర్ కాలువ పనికి 7 లక్షల రూపాయల నిధులు మంజూరు ఇప్పించడం జరిగిందని, గ్రామాన్ని జిల్లాస్థాయిలో ముందు వరుసులో నిలపాలని ఫీల్డ్ అసిస్టెంట్ హనుమాన్ల యాదగిరికి సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ సంపత్, ఫీల్డ్ అసిస్టెంట్ హనుమన్ల యాదగిరి ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
ఉపాధి కూలీలతో పని చేసి ఉత్సాహపరిచిన ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి.... గన్నేరువరం : ఉపాధి కూలీల లో ఉత్సాహం నింపడానికి మండల ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ఉపాధి కూలీలతో కలిసి కొంత సమయం పని చేశారు. గుణపంతో మట్టిని తవ్వి కూలీలతో పనులు చేపట్టారు. మండలంలోని గునుకుల కొండాపూర్ లో పటేల్ చెరువులోకి నీరు వచ్చే ఫీడర్ కాలువ పనులు సర్పంచ్ అజయ్ వర్మ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబు కార్డు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధిని పొందాలని సూచించారు. ఈ ఫీడర్ కాలువ పనికి 7 లక్షల రూపాయల నిధులు మంజూరు ఇప్పించడం జరిగిందని, గ్రామాన్ని జిల్లాస్థాయిలో ముందు వరుసులో నిలపాలని ఫీల్డ్ అసిస్టెంట్ హనుమాన్ల యాదగిరికి సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ సంపత్, ఫీల్డ్ అసిస్టెంట్ హనుమన్ల యాదగిరి ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
- సోమవారం పాలిస్టర్ కూలి పెంచాలని పవర్లూమ్ వార్పిన్ వైపని కార్మికులు మరియు అసాముల ఒక్కరోజు సమ్మె పాలిస్టర్ వస్త్రవ్యాపార సంఘం ముందు దీక్ష అమృతలాల్ శుక్ల కార్మిక భవనములో జరిగిన విలేకరుల సమావేశంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడుతూ పాలిస్టర్ కూలి పెంచాలని ఏప్రిల్ 20వ తేదీన వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఒకరోజు సమ్మె పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం జరిగే దీక్ష లో పాల్గొని విజయవంతం చేయాలని కార్మికులను ఆసాములను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోడం రమణ జిల్లా నాయకులు సిరిమల్లె సత్యం ఒగ్గు గణేష్. ఉడుత రవి దూస అశోక్. ఆడెపు మోహన్. వెజిగం సురేష్. స్వర్గం శేఖర్. బింగి సంపత్. గడ్డం రాజశేఖర్. శ్రీపతి రమేష్. సందు పట్ల పోచ మల్లు తదితరులు.పాల్గొన్నారు1
- వేసవి ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. బానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడుతున్నారు. ఎండ వేడి వడగాడ్పులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. పగటిపూట వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తుంది. మరో వారం రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడంతో రోహిణి కార్తీ వరకు ఎలా ఉంటుందోనని జనం భయపడుతున్నారు. ఎండ వేడి నుండి ఉపశమనం పొందేందుకు చలువ పందిళ్ళను ఆశ్రయించి చల్లని పానీయాలను సేవిస్తున్నారు జనం. మరి పశువులు పక్షులు మాత్రం నీటి వనరుల వద్ద సేద తీరుతున్నాయి. ఎండ వేడికి వృద్ధులు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే వడదెబ్బకు గురై ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప అనవసరంగా ఎవరు బయటికి వెళ్లొద్దని, పగటిపూట బయటికి వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు కోరుతున్నారు. హీటెక్కిన వాతావరణంతో ఉదయం 9 గంటలకే ప్రధాన రహదారులు జనసంచారం లేక బంద్ తలపిస్తున్నాయి. ఎండ తీవ్రతతో కూరగాయల మార్కెట్లు…హోటల్లు…జనం లేక వేలవేల పోతున్నాయి. జనం ఇండ్లలో తల దాచుకుంటున్నారు. పశుపక్షాదులు చెట్ల నీడన…నీటి గుంటలో సేద తీరుతున్నాయి. ఎండాకాలం ఎట్లా గడుస్తుందోనని జనం భయాందోళన చెందుతున్నారు.1
- జీతం పెంచాలని కోరినందుకు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ రాంప్రసాద్పై యజమానులు అనిల్రెడ్డి, బాలరాజు దాడికి పాల్పడ్డారు. దీనిని నిరసిస్తూ తోటి డ్రైవర్లు బస్సులు నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్పై దాడిని సీపీఐ నేత గడిపే మల్లేశం ఖండించారు. కార్మికులపై ఇలాంటి దాడులు సరికాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో హుస్నాబాద్ డిపో వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.1
- జగిత్యాల జిల్లా… జగిత్యాల పట్టణంలోని నిజామాబాద్ హైవేపై మంచినీళ్ల బావి వద్ద వంతెన నిర్మాణ పనులు జరుగుతున ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలను నివారించేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ప్రత్యక్షంగా సందర్శించరు. పనుల సమయంలో వాహన రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తో పాటు , ట్రాఫిక్ సజావుగా నడిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వంతెన నిర్మాణం జరుగుతున్న ప్రాంతం ముఖ్య రహదారిపై ఉండటంతో రోజువారీ వాహన రాకపోకలు అధికంగా ఉంటాయి కావున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ వారు తెలిపిన ప్రత్యామ్నాయ మార్గాలను ప్రజలు, వాహన దారులు అనుసరించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో తాత్కాలిక మార్పులు ఉండటంతో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వంతెన నిర్మాణ పనులు జరుగుతున ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు, రాత్రి సమయంలో రిఫ్లెక్టివ్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.1
- Post by Rajitha Antharpula1
- గత కొంతకాలంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వ్యాపారవేత్తలను చంపుతానని బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న విత్తనాల నాగరాజు అను రౌడీ షీటర్ ని , జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారి ఆదేశాల మేరకు, మెట్టుపల్లి డి.ఎస్.పి ఏ రాములు గారి ఆధ్వర్యంలో, ఈరోజు కోరుట్ల పట్టణంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది గతంలో కూడా విత్తనాలు నాగరాజు పై రెండు మర్డర్ కేసులు మరియు ఎక్స్ట్రాక్షన్ కేసులు నమోదు కాబడినవి అలాగే ఇతనిపై గతంలో PD Act కూడా నమోదు చేసి జైలుకు పంపించనైనది. అలాగే ఈరోజు అరెస్టు చేసిన కేసులో విత్తనాల నాగరాజు తో పాటు మరొక నిందితుడు కూడా ఉన్నట్లు ఆ దర్యాప్తులో తెలిసినది ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు తొందర్లోనే అతని పట్టుకుని అరెస్టు చేస్తాం వీరిద్దరే కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే కూడా వారిని కూడా రిమాండ్ చేస్తాం ఈ కేసుని చాలా మైనేట్గా దర్యాప్తు చేస్తున్నాం, అదేవిధంగా విత్తనాల నాగరాజు అనే రౌడీషీటర్ తో కానీ ఇతని సహచరులతో కానీ ఎవరైనా సంబంధాలు కలిగి ఉండి వారితో తిరిగిన ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిగా పెట్టి వారి పైన కూడా కఠిన చర్యలు తీసుకోబడును, అలాగే ఎవరైనా ఎవరినైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడి బలవంతపు వసూలు చేస్తే వారిపై చట్టపరంగా చాలా కఠిన చర్యలు తీసుకోబడును. ముఖ్యంగా కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ పోలీస్ తరఫున విన్నపం ఏమనగా ఎవరు కూడా ఇలాంటి భయాలకు ఆందోళనలకు గురికావాల్సిన పనిలేదు మిమ్మల్ని ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసిన బెదిరించిన నిర్భయంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వవచ్చు అదేవిధంగా మీ వివరాలు చాలా రహస్యంగా ఉంచబడతాయి.1
- గన్నేరువరం: ఈనెల 23వ తేదీన గన్నేరువరంలో జరుగు హిందూ సమ్మేళన సభలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో జై హనుమాన్ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో తిమ్మాపూర్ ఖండ గన్నేరువరం ఉప మండలంలో జరుగు హిందూ సమ్మేళనానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి గన్నేరువరం సర్పంచ్ రంగన్న వేణి లచ్చినరుసు ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందువులు కులాలకతీతంగా సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ఈనెల 23వ తేదీన గన్నేరువరం లో జరుగు హిందూ సమ్మేళనంలో ప్రతి ఒక్క హిందువు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ముత్యాల జగన్ రెడ్డి, తిప్పర్తి నికేష్, విలాసాగరం రామచంద్రం, కాంతాల అంజిరెడ్డి సర్పంచ్ రంగన్న వేణి లచ్చినరుసు ఉప సర్పంచ్ రామంచ స్వామి అధిక సంఖ్యలో హిందూ సమ్మేళన సమితి సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.1
- రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మండలం దుర్శేడ్ వద్ద రాజీవ్ రహదారిపై మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. కరీంనగర్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీబ్రా క్రాసింగ్ లైన్స్ ని పునరుద్ధరించి, రోడ్డు ను ఎలా క్రాస్ చేయాలో చూపించారు. ఈ కార్యక్రమంలో సిఐ నిరంజన్ రెడ్డి ఎస్ఐ లక్ష్మారెడ్డి, పలువురు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమని, హెల్మెట్ , సీట్ బెల్ట్ ధరించకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్ , మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం , అపసవ్య మార్గాల్లో ప్రయాణించడం , ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం ముఖ్య కారణాలుగా తెలిపారు. జిల్లాలో గతేడాది 200 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని, అందులో ద్విచక్ర వాహనదారులే ఎక్కువని తెలిపారు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకపోవడం మరణాలకు ప్రధాన కారణాలన్నారు. పోలీసుల చర్యల వల్ల ప్రమాదాల రేటు 17 శాతం తగ్గిందని, ప్రమాదం జరిగిన ‘గోల్డెన్ అవర్’లో బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారికి ప్రభుత్వం 25 వేల బహుమతి ఇస్తుందని తెలిపారు.4
- భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో బిజెపి జిల్లా శాఖ అధ్యక్షుడు రెడ్డి పైన గోపి మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలను సమర్పించి నివాళులను అర్పించారు.1