ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో భానుడి భగభగలు... మండుతున్న ఎండలతో విలవిలలాడుతున్న జనం, పశువులు పక్షులు వేసవి ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. బానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడుతున్నారు. ఎండ వేడి వడగాడ్పులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. పగటిపూట వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తుంది. మరో వారం రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడంతో రోహిణి కార్తీ వరకు ఎలా ఉంటుందోనని జనం భయపడుతున్నారు. ఎండ వేడి నుండి ఉపశమనం పొందేందుకు చలువ పందిళ్ళను ఆశ్రయించి చల్లని పానీయాలను సేవిస్తున్నారు జనం. మరి పశువులు పక్షులు మాత్రం నీటి వనరుల వద్ద సేద తీరుతున్నాయి. ఎండ వేడికి వృద్ధులు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే వడదెబ్బకు గురై ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప అనవసరంగా ఎవరు బయటికి వెళ్లొద్దని, పగటిపూట బయటికి వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు కోరుతున్నారు. హీటెక్కిన వాతావరణంతో ఉదయం 9 గంటలకే ప్రధాన రహదారులు జనసంచారం లేక బంద్ తలపిస్తున్నాయి. ఎండ తీవ్రతతో కూరగాయల మార్కెట్లు…హోటల్లు…జనం లేక వేలవేల పోతున్నాయి. జనం ఇండ్లలో తల దాచుకుంటున్నారు. పశుపక్షాదులు చెట్ల నీడన…నీటి గుంటలో సేద తీరుతున్నాయి. ఎండాకాలం ఎట్లా గడుస్తుందోనని జనం భయాందోళన చెందుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో భానుడి భగభగలు... మండుతున్న ఎండలతో విలవిలలాడుతున్న జనం, పశువులు పక్షులు వేసవి ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. బానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడుతున్నారు. ఎండ వేడి వడగాడ్పులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. పగటిపూట వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తుంది. మరో వారం రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడంతో రోహిణి కార్తీ వరకు ఎలా ఉంటుందోనని జనం భయపడుతున్నారు. ఎండ వేడి నుండి ఉపశమనం పొందేందుకు చలువ పందిళ్ళను ఆశ్రయించి చల్లని పానీయాలను సేవిస్తున్నారు జనం. మరి పశువులు పక్షులు మాత్రం నీటి వనరుల వద్ద సేద తీరుతున్నాయి. ఎండ వేడికి వృద్ధులు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే వడదెబ్బకు గురై ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప అనవసరంగా ఎవరు బయటికి వెళ్లొద్దని, పగటిపూట బయటికి వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు కోరుతున్నారు. హీటెక్కిన వాతావరణంతో ఉదయం 9 గంటలకే ప్రధాన రహదారులు జనసంచారం లేక బంద్ తలపిస్తున్నాయి. ఎండ తీవ్రతతో కూరగాయల మార్కెట్లు…హోటల్లు…జనం లేక వేలవేల పోతున్నాయి. జనం ఇండ్లలో తల దాచుకుంటున్నారు. పశుపక్షాదులు చెట్ల నీడన…నీటి గుంటలో సేద తీరుతున్నాయి. ఎండాకాలం ఎట్లా గడుస్తుందోనని జనం భయాందోళన చెందుతున్నారు.
- సీఎం రేవంత్ రెడ్డి పై మాజీమంత్రి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని, బ్యాండ్ వాగన్ గా కోనసాగలేనని బయటకు వచ్చానని స్పష్టం చేశారు. జగిత్యాలలో మీడియాతో జీవన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి సూచనల మేరకే కాంగ్రెస్ అధిష్టానం నడుస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో తాను చేయడం ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ను దోషిగా చూపే ప్రయత్నం చేశారని విమర్శించారు.పదవులు కావాలి అనుకుంటే నీ దగ్గర పడిగాపులు కాసేవాన్ని....కానీ పదవులు శాశ్వతం కాదనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి సూచించారు. ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు చూశానని, రేవంత్ నువ్వు ఎమ్ చూసావో నాకు తెలియదన్నారు. కెసిఆర్ నా వయసును గౌరవిస్తాడని, నన్ను అన్న అని పిలుస్తాడని, కెసిఆర్ కు ప్రజలంటే గౌరవం, నీలాగా కాదని అన్నారు. కేసీఆర్ పై విధానపరమైన విమర్శ చేశానే తప్ప వ్యక్తిగతంగా తాను ఏనాడు ఎవ్వరిని విమర్శించలేదన్నారు. పార్టీ సూచన తో ప్రభుత్వం నడువాలి కానీ, తెలంగాణ లో ప్రభుత్వ సూచన తో కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని విమర్శించారు. పిల్లిని లోపల వేసి కొడితే తిరుగపడుద్దని జీవన్ రెడ్డి అన్నారు.1
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమ పై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపి వేసి వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచుమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పైన ఓనర్లు రాళ్ళతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రావాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేట్ బస్ ఓనర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.1
- ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మకు బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు నెలల దూడపై చిరుత దాడి చేసి చంపినట్లుగా చిరుత అడుగుల ఆధారంగా వేటాడిన తీరుతో నిర్ధారించారు.మండలంలోని శివారు ప్రాంత రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శివారు ప్రాంతాల్లో పశువులను కట్టేయరాదని అటవీ ప్రాంతంలోకి వెళ్లినప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారి మోహన్ లాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.1
- అగ్నిమాపక వారోత్సవాల్లో బాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేతన్న చౌక్ వద్ద అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిమాన్స్టెస్టసన్ కార్యక్రమాన్ని నిర్వహించగా నీటితో పాలు రకాల విన్యాసాలను చేశారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ అధికారి నరేందర్ మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అలాగే విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వారిని స్మరించుకుంటూ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు.3
- వరంగల్: దేశాయిపేటకు చెందిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన భర్తను 12 రోజుల క్రితం తీసుకెళ్లినప్పటి నుంచి ఆచూకీ తెలియజేయలేదని ఆరోపిస్తూ సూసైడ్ నోట్ రాసింది. మామునూరు ఏసీపీ, ఎనుమాముల సీఐ, ఎస్సై తన ఆత్మహత్యాయత్నానికి కారణమని నోట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనను, తన బిడ్డను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అలాగే భర్తపై కేసు నమోదు చేయడం, తన కుటుంబంపై కేసులు పెట్టడం వెనుక మార్కెట్ వ్యాపారుల పాత్ర ఉందని బాధిత మహిళ ఆరోపించింది.1
- జగిత్యాల : జగిత్యాల నుండే కెసిఆర్ జైత్ర యాత్ర మొదలుకానుంది, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బీఆర్ఎస్ అధికారంలోకి రావడమొక్కటే మార్గం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి పోవాలి.. కెసిఆర్ రావాలి.. కెసిఆర్ పాలనే బాగుండే అనే భావన ప్రజల్లోనుండి వచ్చిందనీ, కేసీఆర్ తో ప్రయాణం కొత్త అనుభూతి అన్నారు. జగిత్యాల పట్టణంలోని జెడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ హరిచరన్ రావు స్వగృహం విద్యానగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి...మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావా వసంత, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ శ్రీమతి విజయలక్ష్మి, రాయికల్ మున్సిపల్ చైర్మన్ కే. రవీందర్, స్థానిక నాయకులు వి. పురుషోతం రావు, వెంకట రావు, ధర్మాజిపేట్ వెంకటేశ్వర్ రావు, పట్టణ బి ఆర్ ఎస్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు తదితర బీ ఆర్ ఎస్ నాయకులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీ ఆర్ ఎస్ పార్టీ లోకి రావడం అదృష్టమనీ, మనస్పూర్తిగా పార్టీలోకి స్వాగతిస్తున్నామన్నారు. నిస్వార్ధంగా సేవ చేసే నాయకులు, నిబద్ధతగల నాయకులు జీవన్ రెడ్డి కి అందరం సహకరిస్తాంమనీ,..పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఆయనకు తోడుంటామన్నారు.. జీవన్ రెడ్డి రాకతో బీ ఆర్ ఎస్ కు కొండంత అండగా దొరికింది. ప్రజల పక్షాన నిలబడే నాయకుడు జీవన్ రెడ్డి అని అన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్ తో ప్రయాణం రాజకీయంగా నూతన అధ్యాయం అనీ..అభిమానులు, నాయకులు, కార్యకర్తలందరి సహకారంతో ముందుకు సాగుదాం అన్నారు. కేసీఆర్ తో అనుబంధం ఈనాటిది కాదు.. తెలంగాణ ఉద్యమ సారధిగా పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం కెసిఆర్ దశాబ్దకాలం కృషిచేశారు. రైతు బిడ్డగా రైతు సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టారు. గోదావరి నదీ జలాలను సద్వినియోగం చేసుకోవాలని దిగువన మేడిగడ్డ వద్ద 300 టీ ఎం సి ల నీటి లభ్యత ఉంటుందని బ్యారేజీల నిర్మాణం చేపట్టారు.నీటి వనరులతో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల్లో పంజాబ్, హర్యానాతో పోటీ పడుతున్నాం. ఎస్ ఎల్ బి సి నిర్మాణ దశలో కుంగి పోయి కార్మికులు మృతి చెందినా, వారిశవాలుసైతం వెలికి తీయకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారు....కానీ, మేడిగడ్డ పునర్నిర్మాణం చేపట్టకుండా కేసీఆర్ ను దోషిగా చూపే ప్రయత్నంలో భాగంగా బ్యారేజ్ ల మరమతులు చేపట్ట లేదని విమర్శించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరవడం సంతోషం.. కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలనేది ప్రజల్లో వచ్చిన ఆలోచన.. కెసిఆర్ ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మీ 50 వేల నుండి లక్షకు పెంచారు. కేసీఆర్ 10 వేలు పెట్టుబడి సాయం ఇచ్చారు. కాంగ్రెస్ 15 వేలు అని చెప్పి అసలుకే మోసం వచ్చింది. కరువు వస్తె రేవంత్ రెడ్డి బాధ్యులు అవుతారు. బోర్నపల్లి వంతెన కు కేసీఆర్ 70 కోట్లు మంజూరు చేశారు.కేసీఆర్ కు రుణపడి ఉంటా..2
- వేసవి ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. బానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడుతున్నారు. ఎండ వేడి వడగాడ్పులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. పగటిపూట వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తుంది. మరో వారం రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడంతో రోహిణి కార్తీ వరకు ఎలా ఉంటుందోనని జనం భయపడుతున్నారు. ఎండ వేడి నుండి ఉపశమనం పొందేందుకు చలువ పందిళ్ళను ఆశ్రయించి చల్లని పానీయాలను సేవిస్తున్నారు జనం. మరి పశువులు పక్షులు మాత్రం నీటి వనరుల వద్ద సేద తీరుతున్నాయి. ఎండ వేడికి వృద్ధులు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే వడదెబ్బకు గురై ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప అనవసరంగా ఎవరు బయటికి వెళ్లొద్దని, పగటిపూట బయటికి వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు కోరుతున్నారు. హీటెక్కిన వాతావరణంతో ఉదయం 9 గంటలకే ప్రధాన రహదారులు జనసంచారం లేక బంద్ తలపిస్తున్నాయి. ఎండ తీవ్రతతో కూరగాయల మార్కెట్లు…హోటల్లు…జనం లేక వేలవేల పోతున్నాయి. జనం ఇండ్లలో తల దాచుకుంటున్నారు. పశుపక్షాదులు చెట్ల నీడన…నీటి గుంటలో సేద తీరుతున్నాయి. ఎండాకాలం ఎట్లా గడుస్తుందోనని జనం భయాందోళన చెందుతున్నారు.1