logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయికి అవకాశం *మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి* సత్తుపల్లి, ఆగస్టు 25: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మంగళవారం అసెంబ్లీలో ఆమె కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించారు. కమిటీ చైర్‌పర్సన్‌గా నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి గారు నియమితులయ్యారు. ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ గారికి కీలక బాధ్యతలు అప్పగించడంపై సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

10 hrs ago
user_Chalamala narasimharao
Chalamala narasimharao
Court reporter పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
10 hrs ago
c0d49f1c-d483-4d53-8f07-d1a21efa011d
20b61a6d-d46f-4fcb-85b7-7cd1f447878c

మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయికి అవకాశం *మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి* సత్తుపల్లి, ఆగస్టు 25: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మంగళవారం అసెంబ్లీలో ఆమె కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించారు. కమిటీ చైర్‌పర్సన్‌గా నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి గారు నియమితులయ్యారు. ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ గారికి కీలక బాధ్యతలు అప్పగించడంపై సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

More news from తెలంగాణ and nearby areas
  • గ్రీన్‌ఫీల్డ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ మృతి ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రాంతంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన నవనీత్ మరాటిగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    4
    గ్రీన్‌ఫీల్డ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ మృతి
ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రాంతంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన నవనీత్ మరాటిగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • మా కూతురు మాటలతో మాకు సంబంధం లేదు..భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళీ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఏం మాట్లాడను – భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళీ
    1
    మా కూతురు మాటలతో మాకు సంబంధం లేదు..భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళీ
కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు 
క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఏం మాట్లాడను 
– భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళీ
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    9 hrs ago
  • రేషన్‌ కార్డులపై మంత్రుల ఫొటోలేంటి? మంత్రుల ఫొటోలపై ఖమ్మం మహిళ ఫైర్‌ ఖమ్మం: రేషన్‌ కార్డులపై మంత్రుల ఫొటోలు ముద్రించడంపై ఓ మహిళ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేషన్‌ కార్డులపై మంత్రుల ఫొటోలు వేయడం ఎప్పుడైనా చూశామా? ఇదేం పద్ధతంటూ ప్రశ్నించారు. రేపు రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అయితే కరెన్సీ నోట్లపై ఆయన ఫొటోలు వేస్తారా? అని నిలదీశారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులందరి ఫొటోలు ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
    1
    రేషన్‌ కార్డులపై మంత్రుల ఫొటోలేంటి?

మంత్రుల ఫొటోలపై ఖమ్మం మహిళ ఫైర్‌
ఖమ్మం: రేషన్‌ కార్డులపై మంత్రుల ఫొటోలు ముద్రించడంపై ఓ మహిళ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేషన్‌ కార్డులపై మంత్రుల ఫొటోలు వేయడం ఎప్పుడైనా చూశామా? ఇదేం పద్ధతంటూ ప్రశ్నించారు. రేపు రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అయితే కరెన్సీ నోట్లపై ఆయన ఫొటోలు వేస్తారా? అని నిలదీశారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులందరి ఫొటోలు ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
    user_Velpula Manoj Kumar
    Velpula Manoj Kumar
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    14 hrs ago
  • ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు నది పరిసరాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రదేశం, నీటి మట్టం, రహదారి మార్గాలు, వాహనాల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు, ప్రకాష్‌నగర్ వద్ద నీటి మట్టాన్ని, గణేష్ నిమజ్జనానికి ఉన్న అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నిమజ్జనం ప్రదేశాలను సమగ్రంగా పర్యవేక్షించి ప్రజలకు అనువుగా తుది నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
    1
    ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను  నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు
ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను  నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు నది పరిసరాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రదేశం, నీటి మట్టం, రహదారి మార్గాలు, వాహనాల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు, ప్రకాష్‌నగర్ వద్ద నీటి మట్టాన్ని, గణేష్ నిమజ్జనానికి ఉన్న అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నిమజ్జనం ప్రదేశాలను సమగ్రంగా పర్యవేక్షించి ప్రజలకు అనువుగా తుది నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్ తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి
    1
    మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం
సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం
రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు
గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి
గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం
దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్
తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • సత్తుపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు సత్తుపల్లి పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. సత్తుపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని.. అశ్వారావుపేట వైపు వెళ్తున్న డిజైర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.క్షతగాత్రుడిని సత్తుపల్లికి చెందిన ఆకోజు రామకృష్ణ(48) గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు.
    2
    సత్తుపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు
సత్తుపల్లి పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. సత్తుపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని.. అశ్వారావుపేట వైపు వెళ్తున్న డిజైర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.క్షతగాత్రుడిని సత్తుపల్లికి చెందిన ఆకోజు రామకృష్ణ(48) గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు.
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    19 hrs ago
  • మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది.....
    1
    మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం
నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. 

భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది.....
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • Writing హైదరాబాద్‌–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్‌ రాడ్ల కంటైనర్‌ DCMను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.
    1
    Writing
హైదరాబాద్‌–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్‌ రాడ్ల కంటైనర్‌ DCMను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.