Shuru
Apke Nagar Ki App…
Writing హైదరాబాద్–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్ రాడ్ల కంటైనర్ DCMను ఓవర్‌టేక్ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.
V Ramarao
Writing హైదరాబాద్–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్ రాడ్ల కంటైనర్ DCMను ఓవర్‌టేక్ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.
- Seenu Bhandariగుంతకల్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్😤3 hrs ago
More news from Khammam and nearby areas
- వరంగల్ లో కానిస్టేబుల్ తోపాటు స్థానికులు తాగుబోతును చితక్కొట్టారు వరంగల్ లో కానిస్టేబుల్ తోపాటు స్థానికులు తాగుబోతును చితక్కొట్టారు వరంగల్ లో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించిన మందు బాబును పోలీస్ తోపాటు స్థానికులు చితక్కొట్టారు. ఒళ్ళు హూనం అయ్యేలా లాఠీలతో చితకబాదారు. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళింగ బార్ ఆవరణంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి చొక్కా విప్పి వీరంగం సృష్టించాడు. చొక్కా వేసుకొమ్మని పలుమార్లు అతనితో వచ్చిన వ్యక్తి చెప్పినప్పటికి మైకంలో ఉన్న వ్యక్తి వినిపించుకోలేదు. దీంతో స్థానికులు డయల్ 100 కు కాల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని చొక్కొ వేసుకుని వెళ్ళిపోవాలని సూచించాడు. ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినిపించుకోలేని మైకంలో ఉన్న వ్యక్తిపై కోపంతో కానిస్టేబుల్ చెంప పై కొట్టాడు. దీంతో మద్యం మత్తులో కన్న వ్యక్తి ఆగ్రహంతో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించాడు. ఇక పోలీస్ తాగుబోతుపై తన ప్రతాపం చూపాడు. కానిస్టేబుల్ తోపాటు స్థానికులు లాఠీలతో తాగుబోతును చితక్కొట్టారు. తాగుబోతు పడిలేచి పరిగెత్తించేలా కొట్టారు. అడ్డుకోబోయిన తాగుబోతుతో వచ్చిన వ్యక్తి పై దాడికి యత్నించారు. అంతా అయిపోయాక పోలీసులు తాగుబోతు గురించి ఆరా తీస్తే అతను మామునూరు ఫోర్త్ బెటాలియన్ లో 2018 బ్యాచ్ కి చెందిన మనోజ్ గా గుర్తించారు. డయల్ 100 కాల్ తో వచ్చిన మిల్స్ కాలనీ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి పిర్యాదు తో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.1
- నోట్లో గోల్డ్ క్యాప్సూల్స్ ఎయిర్‌పోర్టులో చిక్కిన ప్యాసింజర్ దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు ఓ ప్రయాణికుడు అటు నుంచి ఘాజియాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా అతని ప్రవర్తన పట్ల అధికారులకు అనుమానం వచ్చింది దాంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేయగా!!!1
- వికలాంగుల రాజ్యాధికారమే లక్ష్యం 8వ ఆవిర్భావ దినోత్సవంలో రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ చివ్వెంల: వికలాంగుల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, రాజ్యాధికార సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ అన్నారు. గురువారం దురాజ్‌పల్లిలో సంఘం 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సంఘం జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి నిరుపేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ కేవలం సంక్షేమ పథకాలతో వికలాంగుల సమస్యలు పరిష్కారం కావని, నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలో వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వికలాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల కోసం గత ఎనిమిదేళ్లుగా పోరాటాలు కొనసాగిస్తున్నామని, గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఉద్యమాన్ని విస్తరిస్తామని తెలిపారు. ఎర్రకోట, గోల్కొండ కోటపై వికలాంగుడు జాతీయ జెండా ఎగురవేసే రోజు వచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- *నోట్లో గోల్డ్ క్యాప్సూల్స్ ఎయిర్‌పోర్టులో చిక్కిన ప్యాసింజర్.* దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు ఓ ప్రయాణికుడు అటు నుంచి ఘాజియాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా అతని ప్రవర్తన పట్ల అధికారులకు అనుమానం వచ్చింది దాంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేశారు.1
- ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు...ఎంతంటే! ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,900, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,800, అటు క్వింటా పత్తి ధర రూ.9,250గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 25 మంగళవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.75, పత్తి రూ.50 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.1
- ఖమ్మంలో దంచి కొట్టిన వాన.వర్షంతో హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. ఖమ్మం నగరం 26 డివిజన్ బ్రాహ్మణ బజార్ లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుండి వాన దంచికొట్టింది. ఈ సీజన్లో అత్యధిక వర్షం రెండవసారి కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ వర్షం వల్ల రోజువారీ పనులకు ఆటంకం కలిగినా ప్రజలందరూ వర్షం రాకతో ఉత్సాహంగా ఉన్నారు.1
- ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీసులు 17 ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీసులు 17 ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నారు.పెద్దమండవ,గందసిరి గ్రామాల్లోని మున్నేరు నుంచి కొంతమంది అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు.ఇసుక ట్రాక్టర్ లను పోలీసులు తనిఖీ చేయగా వాటికి ఎలాంటి అనుమతి లేనట్లు గుర్తించి స్టేషన్ కు తరలించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల యజమానులపై ముదిగొండ పోలీసులు కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా సిఐ మురళి మాట్లాడుతూ అనుమతి లేకుండా ఎవరైనా ఇసుక రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.1
- నేపాల్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 160 మంది మృతి.. వందలాది మంది గల్లంతు* కాఠ్మాండు, నేపాల్‌లో బుధవారం, ఆగస్టు 26న ఉదయం సంభవించిన ఆకస్మిక ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్ర బీభత్సం సృష్టించాయి. నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి ఒక్కసారిగా ఉద్ధృతంగా వచ్చిన వరద ప్రవాహం రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. నేపాల్‌లో 157 మంది మృతి చెందగా, టిబెట్‌లో మరో ముగ్గురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 160కి చేరింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం సుమారు 8:30 నుంచి 9 గంటల మధ్య భోటే కోసి నదిలో ఒక్కసారిగా భారీ వరద ప్రవాహం మొదలైంది. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన రాక్‌స్లైడ్, మంచు–రాళ్ల భారీ ప్రవాహం కారణంగా ల్హెండే నది ఉద్ధృతమై, ఆ నీరు భోటే కోసి నదిలోకి చేరినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. ఈ వరదలు భారీ వర్షాల కారణంగా సంభవించలేదని ప్రాథమికంగా అధికారులు పేర్కొన్నారు. వంతెనలు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసం వరద ప్రవాహం తీవ్రతకు అనేక ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రసువా జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. అనంతరం వరద ప్రవాహం నువాకోట్, ధాదింగ్, చిత్వాన్ తదితర జిల్లాల వైపు విస్తరించింది. *గల్లంతైన వారిలో భారతీయులు* నేపాల్ టూరిజం బోర్డు విడుదల చేసిన ప్రాథమిక సమాచారంలో 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ పౌరులు ఉన్నారు. గల్లంతైన విదేశీయుల్లో 105 మంది భారతీయులు, 37 మంది NRIలు ఉన్నట్లు తొలుత వెల్లడైంది. అనంతరం మరింత సమాచారం వెలువడటంతో గల్లంతైన భారతీయుల సంఖ్య 133కి చేరినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. వీరిలో పలువురు కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్తున్న యాత్రికులు ఉన్నారు. *కొనసాగుతున్న సహాయక చర్యలు* గల్లంతైన వారి కోసం నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఇతర భద్రతా బలగాలు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే కొండ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు ధ్వంసం కావడం, కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడటం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు భోటే కోసి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లో ఇంకా ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. భారత ప్రభుత్వం కూడా నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల రక్షణ, సహాయక చర్యలపై నేపాల్ ప్రభుత్వంతో సమన్వయం చేస్తోంది. మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్యపై రెస్క్యూ బృందాల గాలింపు పూర్తయ్యే కొద్దీ మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.1