Shuru
Apke Nagar Ki App…
ఖమ్మంలో దంచి కొట్టిన వాన.వర్షంతో హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. ఖమ్మం నగరం 26 డివిజన్ బ్రాహ్మణ బజార్ లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుండి వాన దంచికొట్టింది. ఈ సీజన్లో అత్యధిక వర్షం రెండవసారి కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ వర్షం వల్ల రోజువారీ పనులకు ఆటంకం కలిగినా ప్రజలందరూ వర్షం రాకతో ఉత్సాహంగా ఉన్నారు.
మాంధాత సత్య
ఖమ్మంలో దంచి కొట్టిన వాన.వర్షంతో హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. ఖమ్మం నగరం 26 డివిజన్ బ్రాహ్మణ బజార్ లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుండి వాన దంచికొట్టింది. ఈ సీజన్లో అత్యధిక వర్షం రెండవసారి కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ వర్షం వల్ల రోజువారీ పనులకు ఆటంకం కలిగినా ప్రజలందరూ వర్షం రాకతో ఉత్సాహంగా ఉన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు...ఎంతంటే! ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,900, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,800, అటు క్వింటా పత్తి ధర రూ.9,250గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 25 మంగళవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.75, పత్తి రూ.50 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.1
- ఖమ్మంలో దంచి కొట్టిన వాన.వర్షంతో హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. ఖమ్మం నగరం 26 డివిజన్ బ్రాహ్మణ బజార్ లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుండి వాన దంచికొట్టింది. ఈ సీజన్లో అత్యధిక వర్షం రెండవసారి కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ వర్షం వల్ల రోజువారీ పనులకు ఆటంకం కలిగినా ప్రజలందరూ వర్షం రాకతో ఉత్సాహంగా ఉన్నారు.1
- మున్నేరు నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు ను పట్టుకున్న ముదిగొండ ఎస్సై హరిత సిబ్బంది. ఖమ్మం జిల్లా ముదిగొండ ఎస్సై హరిత తన సిబ్బందితో పాటు 5 గంటల సమయంలో మున్నేరు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న సుమారుగా 12 ట్రాక్టర్లను వివి కృష్ణాపురం సమీపంలో సీజ్ చేయడం జరిగింది. ఈ ఉదయం ఏడు గంటల సమయంలో లక్ష్మీపురం సమీపంలోనే ఐదు ఇసుక ట్రాక్టర్లను మొత్తం 17 ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవర్లను ఓనరులను మీద కేసులు నమోదు చేసినట్లు ఇసుక ట్రాక్టర్లు పెద్దమండవ గంధసిరికి చెందినవిగా గుర్తించడం జరిగింది. ఇన్స్పెక్టర్ మురళి ఆదేశాల మేరకు మొత్తంగా 24 మంది పై కేసులు నమోదు చేసి ఇసుకతో ఉన్న ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ లో ఎస్సై హరిత, పిసిలు లక్ష్మణ్, శ్రీను,వెంకట్, కృష్ణ, రాజులు పాల్గొన్నారు.1
- తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో పాఠశాల భవన నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో పాఠశాల భవన నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య,వైద్యానికి పెద్దపీట వేశామన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో టెక్నీకల్ విద్య కోసం ఒక ATC ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.ఇందిరమ్మ ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందిస్తుందని ఆయన తెలిపారు.రెండున్నర సంవత్సరాల్లో డ్వాక్రా మహిళలకు 63 వేల కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు.వచ్చే నెల నుంచి అర్హులైన వారికి పెన్షన్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు..1
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు రక్షా బంధన్ పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బ్రహ్మకుమారి సోదరీమణులు ప్రేమాభిమానాలతో రాఖీలు కట్టారు. రఘునాథపాలెంలో స్వామి నారాయణ గురుకులానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఆయనను బ్రహ్మకుమారీలు కలిసి సోదరభావాన్ని చాటుకున్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవం మరియు సోదరభావాన్ని పెంపొందించే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.1
- పాడే పైనే రాఖీ కట్టి కన్నీరు మున్నీరుగా విలపించిన సోదరి మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో రాఖీ పండుగకు రెండు రోజుల ముందు కంటతడి పెట్టించిన హృదయ విధారక ఘటన... కురవి మండల కేంద్రానికి చెందిన మోటపోతుల రమేష్ అనే ముప్పై ఆరు సంవత్సరాల యువకుడు అనారోగ్యంతో మృతిచెందాడు.. అంతిమయాత్ర సాగుతున్న క్రమంలో దింపుడుకల్లం వద్ద అతని మృతదేహాన్ని చూసి రమేష్ అక్క గుండెలు అవిసేలా రోదించింది.., రెండు రోజులయితే రాఖీ కడుదాం అనుకున్న తమ్ముడా.., ఇంతలోనే మమ్మల్ని వదిలి వెల్లిపోయావా అంటూ గుండెలు బాదుకుని రోదించింది.. ఆనందంగా జరుపుకోవాల్సిన రక్షాబంధనం వేడుక అంతిమయాత్రలో జరగడం.., తమ్ముడి మృతదేహానికి రాఖీ కడుతూ ఆ..అక్క బోరున విలపించడం అక్కడ ఉన్నవారందరినీ కంటతడి పెట్టించింది.. మోటపోతుల రమేష్ తండ్రి పదిరోజులు క్రితం మరణించగా అతని దశదినకర్మ ఈ..రోజు చేయాల్సి ఉండగా నిన్న రమేష్ మరణించాడు.., గతంలో ఇతని తమ్ముడు కూడా అనారోగ్యంతోనే మృతి చెందడంతో ఆ.. కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయని అంతిమయాత్రలో పాల్గొన్న బందువులు, ప్రజలు కన్నీటితో గుర్తు చేసుకున్నారు..1
- *చేతులు లేకపోతేనేం.. అన్నపై ప్రేమ ఉందిగా!* *- అందరినీ ఆకర్షిస్తున్న వీడియో. *సూర్యాపేట సిటీ ఆగస్టు 26: అన్నాచెల్లెళ్ల ప్రేమకు అవధులు ఉండవు. తోబుట్టువుల మధ్య ఉండే పవిత్ర బంధం అమూల్యమైనది. ఆ ఆప్యాయతను గుర్తుచేస్తూ ఓ చిట్టితల్లి అన్నపై చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోదరుడికి రాఖీ కట్టాలనే తపన ముందు ఆమె అంగవైకల్యం ఓడిపోయింది. చేతులు లేకపోయినా రాఖీ కట్టడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఆపై కాలితోనే అతనికి బొట్టు పెట్టి, స్వీట్ తినిపించింది. అన్న ఇచ్చిన డబ్బు తీసుకొని ఆశీర్వాదం అందుకుంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.1
- నేలకొండపల్లిలో మాజీ పిడిఎస్ యు మిత్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఒకప్పుడు పీడీఎస్ పార్టీలో కలిసి పనిచేసిన కార్యకర్తలు ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి వచ్చారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మాజీ పిడిఎస్ యు మిత్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఒకప్పుడు పీడీఎస్ పార్టీలో కలిసి పనిచేసిన కార్యకర్తలు ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి వచ్చారు. ఈ సమావేశంలో ప్రస్తుతం వివిధ పార్టీలలో ఉన్న వారు వివిధ రంగాల్లో ఉన్న వారు పాల్గొన్నారు.ఒకప్పుడు పార్టీలో పనిచేసినప్పుడు చేసిన ఉద్యమాలు, పోరాటాలు, ప్రజల కోసం చేసిన పనులను నెమరు వేసుకున్నారు. తమ గత స్మృతులను ఒకరికొకరు పంచుకున్నారు. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. ఆనాటి స్నేహం, ఆత్మీయత ఇంకా అలాగే ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి కలయికలు మరిన్ని జరగాలని కోరుకున్నారు.1