Shuru
Apke Nagar Ki App…
ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీసులు 17 ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీసులు 17 ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నారు.పెద్దమండవ,గందసిరి గ్రామాల్లోని మున్నేరు నుంచి కొంతమంది అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు.ఇసుక ట్రాక్టర్ లను పోలీసులు తనిఖీ చేయగా వాటికి ఎలాంటి అనుమతి లేనట్లు గుర్తించి స్టేషన్ కు తరలించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల యజమానులపై ముదిగొండ పోలీసులు కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా సిఐ మురళి మాట్లాడుతూ అనుమతి లేకుండా ఎవరైనా ఇసుక రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ARUNKUMAR
ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీసులు 17 ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీసులు 17 ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నారు.పెద్దమండవ,గందసిరి గ్రామాల్లోని మున్నేరు నుంచి కొంతమంది అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు.ఇసుక ట్రాక్టర్ లను పోలీసులు తనిఖీ చేయగా వాటికి ఎలాంటి అనుమతి లేనట్లు గుర్తించి స్టేషన్ కు తరలించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల యజమానులపై ముదిగొండ పోలీసులు కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా సిఐ మురళి మాట్లాడుతూ అనుమతి లేకుండా ఎవరైనా ఇసుక రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
More news from తెలంగాణ and nearby areas
- ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీసులు 17 ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీసులు 17 ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నారు.పెద్దమండవ,గందసిరి గ్రామాల్లోని మున్నేరు నుంచి కొంతమంది అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు.ఇసుక ట్రాక్టర్ లను పోలీసులు తనిఖీ చేయగా వాటికి ఎలాంటి అనుమతి లేనట్లు గుర్తించి స్టేషన్ కు తరలించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల యజమానులపై ముదిగొండ పోలీసులు కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా సిఐ మురళి మాట్లాడుతూ అనుమతి లేకుండా ఎవరైనా ఇసుక రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.1
- ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు...ఎంతంటే! ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,900, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,800, అటు క్వింటా పత్తి ధర రూ.9,250గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 25 మంగళవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.75, పత్తి రూ.50 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.1
- ఖమ్మంలో దంచి కొట్టిన వాన.వర్షంతో హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. ఖమ్మం నగరం 26 డివిజన్ బ్రాహ్మణ బజార్ లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుండి వాన దంచికొట్టింది. ఈ సీజన్లో అత్యధిక వర్షం రెండవసారి కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ వర్షం వల్ల రోజువారీ పనులకు ఆటంకం కలిగినా ప్రజలందరూ వర్షం రాకతో ఉత్సాహంగా ఉన్నారు.1
- తిరుమలాయపాలెం మండలం గోపాలపురం గ్రామంలో ప్రైమరీ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామపంచాయతీ గోపాలపురంలో ఈరోజు రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని గత కొంతకాలంగా శిధిలావస్థలో ఉన్న మంజూరు చేయించి ఆ నూతన భవనానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంగా నిర్వహించినారు.1
- పాడే పైనే రాఖీ కట్టి కన్నీరు మున్నీరుగా విలపించిన సోదరి మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో రాఖీ పండుగకు రెండు రోజుల ముందు కంటతడి పెట్టించిన హృదయ విధారక ఘటన... కురవి మండల కేంద్రానికి చెందిన మోటపోతుల రమేష్ అనే ముప్పై ఆరు సంవత్సరాల యువకుడు అనారోగ్యంతో మృతిచెందాడు.. అంతిమయాత్ర సాగుతున్న క్రమంలో దింపుడుకల్లం వద్ద అతని మృతదేహాన్ని చూసి రమేష్ అక్క గుండెలు అవిసేలా రోదించింది.., రెండు రోజులయితే రాఖీ కడుదాం అనుకున్న తమ్ముడా.., ఇంతలోనే మమ్మల్ని వదిలి వెల్లిపోయావా అంటూ గుండెలు బాదుకుని రోదించింది.. ఆనందంగా జరుపుకోవాల్సిన రక్షాబంధనం వేడుక అంతిమయాత్రలో జరగడం.., తమ్ముడి మృతదేహానికి రాఖీ కడుతూ ఆ..అక్క బోరున విలపించడం అక్కడ ఉన్నవారందరినీ కంటతడి పెట్టించింది.. మోటపోతుల రమేష్ తండ్రి పదిరోజులు క్రితం మరణించగా అతని దశదినకర్మ ఈ..రోజు చేయాల్సి ఉండగా నిన్న రమేష్ మరణించాడు.., గతంలో ఇతని తమ్ముడు కూడా అనారోగ్యంతోనే మృతి చెందడంతో ఆ.. కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయని అంతిమయాత్రలో పాల్గొన్న బందువులు, ప్రజలు కన్నీటితో గుర్తు చేసుకున్నారు..1
- *చేతులు లేకపోతేనేం.. అన్నపై ప్రేమ ఉందిగా!* *- అందరినీ ఆకర్షిస్తున్న వీడియో. *సూర్యాపేట సిటీ ఆగస్టు 26: అన్నాచెల్లెళ్ల ప్రేమకు అవధులు ఉండవు. తోబుట్టువుల మధ్య ఉండే పవిత్ర బంధం అమూల్యమైనది. ఆ ఆప్యాయతను గుర్తుచేస్తూ ఓ చిట్టితల్లి అన్నపై చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోదరుడికి రాఖీ కట్టాలనే తపన ముందు ఆమె అంగవైకల్యం ఓడిపోయింది. చేతులు లేకపోయినా రాఖీ కట్టడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఆపై కాలితోనే అతనికి బొట్టు పెట్టి, స్వీట్ తినిపించింది. అన్న ఇచ్చిన డబ్బు తీసుకొని ఆశీర్వాదం అందుకుంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.1
- *వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు* తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, వారి తరపు బంధువులు ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఆమె తరపు మహిళ *వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు* తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, వారి తరపు బంధువులు ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఆమె తరపు మహిళ స్టాండ్లు లేక సెలైన్ బాటిల్ గోడకు వేలాడదీసిన పరిస్థితి ఫ్యాన్లు లేక ఇంటి దగ్గర నుంచి ఛార్జింగ్ ఫ్యాన్లు తెచ్చుకుంటున్న రోగుల బంధువులు1
- తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో పాఠశాల భవన నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో పాఠశాల భవన నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య,వైద్యానికి పెద్దపీట వేశామన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో టెక్నీకల్ విద్య కోసం ఒక ATC ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.ఇందిరమ్మ ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందిస్తుందని ఆయన తెలిపారు.రెండున్నర సంవత్సరాల్లో డ్వాక్రా మహిళలకు 63 వేల కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు.వచ్చే నెల నుంచి అర్హులైన వారికి పెన్షన్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు..1