Shuru
Apke Nagar Ki App…
మైన్స్ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు..ఆదాయానికి మించిన ఆస్తులపై తనిఖీలు 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ దాడులు జయశంకర్ భూపాలపల్లి: జిల్లా మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో భూపాలపల్లి, హైదరాబాద్ బోడుప్పల్ ప్రాంతాల్లోని ఆయన ఇళ్లలో గురువారం ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. భూపాలపల్లి ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాదారులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. సూర్యాపేట, తాండూరు సహా సుమారు 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.
M D Azizuddin
మైన్స్ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు..ఆదాయానికి మించిన ఆస్తులపై తనిఖీలు 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ దాడులు జయశంకర్ భూపాలపల్లి: జిల్లా మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో భూపాలపల్లి, హైదరాబాద్ బోడుప్పల్ ప్రాంతాల్లోని ఆయన ఇళ్లలో గురువారం ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. భూపాలపల్లి ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాదారులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. సూర్యాపేట, తాండూరు సహా సుమారు 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.
More news from తెలంగాణ and nearby areas
- మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హౌస్ అరెస్ట్ వరంగల్ జిల్లాలో జీవో 97 రద్దు చేయాలని నిరసనలు తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు గురువారం వరంగల్ కి వెళ్తున్న హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.1
- మల్యాల గ్రామ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన. సమస్యలు పరిష్కరించని ఎడల పోరాటాలు ఉదృతం చేస్తాం. స్థానిక సమస్యలపై నిరసన సిపిఎం మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలో విద్యుత్ దీపాలు వెలుగులు లేకపోవడంతో స్థానిక ప్రజలతో కలిసి స్థానిక వీధుల్లో సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది తక్షణమే గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రజలకు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల ప్రజలతో మమేకమై స్థానిక పోరాటాలు నిర్వహిస్తామని మండల అధికారులను హెచ్చరించారు.1
- నిండు ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్ దిలీప్ మహబూబాద్ జిల్లాలో నిండు ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ దిలీప్ ఎపూర్ గ్రామంలో మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎపూర్ గ్రామంలో ఓ దివ్యాంగ యువతి ప్రమాదవశాత్తు చేతిబావిలో పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ దిలీప్ ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బావిలోకి దిగారు. బావిలో లోతుగా ఉన్న యువతిని ఎంతో ధైర్యసాహసాలతో చేరుకుని, తాళ్ల సహాయంతో ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సకాలంలో స్పందించి చాకచక్యంగా వ్యవహరించడంతో ఓ నిండు ప్రాణాన్ని కాపాడగలిగారు. కానిస్టేబుల్ దిలీప్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, మానవత్వాన్ని గ్రామస్థులు అభినందించారు. ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకు వచ్చిన దిలీప్‌ను పలువురు ప్రశంసించారు. “పోలీసు అంటే కేవలం విధులు నిర్వర్తించడమే కాదు.. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే నిజమైన మానవత్వం” అని గ్రామస్థులు కొనియాడారు....1
- పాడే పైనే రాఖీ కట్టి కన్నీరు మున్నీరుగా విలపించిన సోదరి మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో రాఖీ పండుగకు రెండు రోజుల ముందు కంటతడి పెట్టించిన హృదయ విధారక ఘటన... కురవి మండల కేంద్రానికి చెందిన మోటపోతుల రమేష్ అనే ముప్పై ఆరు సంవత్సరాల యువకుడు అనారోగ్యంతో మృతిచెందాడు.. అంతిమయాత్ర సాగుతున్న క్రమంలో దింపుడుకల్లం వద్ద అతని మృతదేహాన్ని చూసి రమేష్ అక్క గుండెలు అవిసేలా రోదించింది.., రెండు రోజులయితే రాఖీ కడుదాం అనుకున్న తమ్ముడా.., ఇంతలోనే మమ్మల్ని వదిలి వెల్లిపోయావా అంటూ గుండెలు బాదుకుని రోదించింది.. ఆనందంగా జరుపుకోవాల్సిన రక్షాబంధనం వేడుక అంతిమయాత్రలో జరగడం.., తమ్ముడి మృతదేహానికి రాఖీ కడుతూ ఆ..అక్క బోరున విలపించడం అక్కడ ఉన్నవారందరినీ కంటతడి పెట్టించింది.. మోటపోతుల రమేష్ తండ్రి పదిరోజులు క్రితం మరణించగా అతని దశదినకర్మ ఈ..రోజు చేయాల్సి ఉండగా నిన్న రమేష్ మరణించాడు.., గతంలో ఇతని తమ్ముడు కూడా అనారోగ్యంతోనే మృతి చెందడంతో ఆ.. కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయని అంతిమయాత్రలో పాల్గొన్న బందువులు, ప్రజలు కన్నీటితో గుర్తు చేసుకున్నారు..1
- వేములవాడలో రంగు నీళ్ళ డబ్బాలతో కుక్కల బెడదకు చెక్...గాంధీనగర్ వాసుల వినూత్న ఆలోచన భేష్ కుక్కల బెడదతో విసిగిపోయిన వేములవాడ గాంధీనగర్ వాసులు రంగు నీళ్ళ డబ్బాలతో చెక్ పెట్టారు. వినూత్న ఆలోచనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. వేములవాడలో లో గాంధీ నగర్ వీధిలో ఏ ఇంటి ముందు చూసినా రంగు నీళ్ల డబ్బాలే కనిపిస్తున్నాయి. ఇదేమిటని చూసిన వారంతా ఆశ్చర్యపోతుండగా, వీధి కుక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు కాలనీవాసులు వినూత్నంగా ప్రయోగం చేశారని స్థానికులు తెలిపారు. కాలనీలో వీధి కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ చిన్నారులు, వృద్ధులపై దాడి చేసి గాయపరుస్తున్నాయని, విధులు అపశుభ్రంగా చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని కుక్కలు ఇళ్లలోకి కూడా చొరబడుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రతి ఇంటి ముందు రంగు నీళ్లతో నింపిన డబ్బాలను ఏర్పాటు చేశారు. రంగు నీళ్ల డబ్బాలు పెట్టిన తర్వాత కుక్కలు ఇళ్ల వైపు రావడం తగ్గిందని, ప్రస్తుతం ప్రశాంతంగా ఉంటున్నామని కాలనీవాసులు చెబుతున్నారు. వీధి కుక్కల సమస్య నుంచి రక్షణ పొందేందుకు రంగు నీళ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో, ప్రస్తుతం గాంధీ నగర్ వీధిలోని ప్రతి ఇంటి ముందు రంగు నీళ్ల డబ్బాలు దర్శనమిస్తుండడం ఆశ్చర్యాన్ని అంతకు మించి వినూత్న ఆలోచనలకు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.1
- పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గం: నార్కెట్‌పల్లి మండలం చౌడంపల్లి గ్రామానికి చెందిన చెరుకుపల్లి మారయ్య గారి కుమారుడి వివాహ వేడుకకు నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే నార్కెట్‌పల్లి పట్టణానికి చెందిన జక్కంపూడి సత్యనారాయణ గారి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నార్కెట్‌పల్లి పట్టణానికి చెందిన బైరగొని రవి గౌడ్ గారి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వివాహ బంధంతో ఒక్కటైన నూతన వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని చిరుమర్తి లింగయ్య గారు ఆకాంక్షించారు.4
- పాడెపైనే తమ్ముడికి రాఖీ కట్టిన సోదరి.. కన్నీరు మున్నీరుగా విలాపం మహబూబాబాద్: రాఖీ పండుగకు రెండు రోజుల ముందే మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కురవికి చెందిన మోటపోతుల రమేష్ (36) అనారోగ్యంతో మృతి చెందాడు. అంతిమయాత్రలో దింపుడుకల్లం వద్ద రమేష్ మృతదేహాన్ని చూసిన అతడి సోదరి గుండెలవిసేలా రోదించింది. రెండు రోజుల్లో రాఖీ కడతాననుకున్న తమ్ముడు ఇంతలోనే తమను వదిలి వెళ్లిపోయాడంటూ కన్నీరుమున్నీరైంది. అనంతరం పాడెపైనే తమ్ముడి చేతికి రాఖీ కట్టి బోరున విలపించడంతో అక్కడున్న బంధువులు, స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు. ఇటీవలే రమేష్ తండ్రి మృతి చెందగా, ఆయన దశదినకర్మ రోజే రమేష్ మృతి చెందడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గతంలో రమేష్ తమ్ముడు కూడా అనారోగ్యంతో మృతి చెందడంతో వరుస విషాదాలతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.1
- అభివృద్ధి కోసం అర్ధరాత్రి అయిన ముందుండే నాయకుడు.. ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్... డోర్నకల్ మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 26... నా ప్రాంతం అభివృద్ధి కోసం అర్ధరాత్రి అయినా ఆలోచించే, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించే వ్యక్తిత్వం ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్... పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావిస్తూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నాయకుడు రామచంద్రునాయక్.. బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులకు ఒక్కటే ప్రశ్న.. అభివృద్ధి కోసం కష్టపడుతున్న నాయకుడిపై విమర్శలు చేయడం కాదు… మీ హయాంలో ప్రజలకు ఏం చేశారు? నేడు జరుగుతున్న అభివృద్ధిలో మీ పాత్ర ఏమిటో ప్రజలకు చెప్పండి. అసత్య ప్రచారాలతో అభివృద్ధిని అడ్డుకోలేరు. ప్రజల కోసం పనిచేసే నాయకుడికి ప్రజలే అండగా ఉంటారు. డోర్నకల్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ నాయకత్వానికి మా పూర్తి మద్దతు. ✊🏽 అభివృద్ధి మాట్లాడుతుంది… అసత్య ప్రచారాలు మౌనమవుతాయి!1
- మా కూతురు వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం..? కొండా మురళీ స్పష్టం భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు.మా కూతురు వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామన్నారు.మా కూతురు వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు.1