నిండు ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్ దిలీప్ మహబూబాద్ జిల్లాలో నిండు ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ దిలీప్ ఎపూర్ గ్రామంలో మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎపూర్ గ్రామంలో ఓ దివ్యాంగ యువతి ప్రమాదవశాత్తు చేతిబావిలో పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ దిలీప్ ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బావిలోకి దిగారు. బావిలో లోతుగా ఉన్న యువతిని ఎంతో ధైర్యసాహసాలతో చేరుకుని, తాళ్ల సహాయంతో ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సకాలంలో స్పందించి చాకచక్యంగా వ్యవహరించడంతో ఓ నిండు ప్రాణాన్ని కాపాడగలిగారు. కానిస్టేబుల్ దిలీప్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, మానవత్వాన్ని గ్రామస్థులు అభినందించారు. ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకు వచ్చిన దిలీప్‌ను పలువురు ప్రశంసించారు. “పోలీసు అంటే కేవలం విధులు నిర్వర్తించడమే కాదు.. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే నిజమైన మానవత్వం” అని గ్రామస్థులు కొనియాడారు....
నిండు ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్ దిలీప్ మహబూబాద్ జిల్లాలో నిండు ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ దిలీప్ ఎపూర్ గ్రామంలో మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎపూర్ గ్రామంలో ఓ దివ్యాంగ యువతి ప్రమాదవశాత్తు చేతిబావిలో పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ దిలీప్ ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బావిలోకి దిగారు. బావిలో లోతుగా ఉన్న యువతిని ఎంతో ధైర్యసాహసాలతో చేరుకుని, తాళ్ల సహాయంతో ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సకాలంలో స్పందించి చాకచక్యంగా వ్యవహరించడంతో ఓ నిండు ప్రాణాన్ని కాపాడగలిగారు. కానిస్టేబుల్ దిలీప్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, మానవత్వాన్ని గ్రామస్థులు అభినందించారు. ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకు వచ్చిన దిలీప్‌ను పలువురు ప్రశంసించారు. “పోలీసు అంటే కేవలం విధులు నిర్వర్తించడమే కాదు.. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే నిజమైన మానవత్వం” అని గ్రామస్థులు కొనియాడారు....
- ఎక్కడ తగ్గేది లే అంటున్న మహిళలు మద్యం మత్తులో హల్చల్ తో దాడి చేసిన ముగ్గురు అరెస్ట్ *_ఎక్కడ తగ్గేది లే అంటున్న మహిళలు: మద్యం మత్తులో హల్చల్.. బీరు బాటిళ్లతో దాడి చేసిన ముగ్గురి అరెస్ట్!_* రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం మహమ్మారి వీధివీధికీ పాకింది. ప్రశాంతతకు మారుపేరైన రాజమండ్రి నగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆలయం వద్ద సోమవారం అర్ధరాత్రి తీవ్ర కలకలం రేగింది. మద్యం మత్తులో ముగ్గురు మహిళలు రోడ్డుపై తీవ్రంగా ప్రవర్తించడమే కాకుండా, అటుగా వెళ్తున్న ఇద్దరు యువకులపై బీరు బాటిళ్లతో దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. *సంఘటన వివరాలు:* సోమవారం అర్ధరాత్రి సమయంలో వన్ టౌన్ పరిధిలోని ఒక స్థానిక ఆలయం సమీపంలో ముగ్గురు మహిళలు మద్యం తాగి గొడవ సృష్టిస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఇద్దరు యువకులు వారి ప్రవర్తనను ప్రశ్నించగా, తీవ్ర ఆవేశానికి లోనైన మహిళలు యువకులతో వాగ్వాదానికి దిగారు. 'ఎక్కడా తగ్గేది లేదు' అన్నట్లుగా ప్రవర్తిస్తూ, తమ వద్ద ఉన్న బీరు బాటిళ్లతో వారిపై దాడికి దిగారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్: దాడికి గురైన యువకులు వెంటనే రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు1
- జనగామ స్టేషన్ మీదుగా జేసీబీ లను రవాణా చేస్తున్న క్యారియర్ రైలు జేసీబీ వాహనాలను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెద్ద ఎత్తున రవాణా చేయడానికి ఉపయోగించే ప్రత్యేక రైలు ఆటోమొబైల్ క్యారియర్ రైలు(న్యూ మాడిఫైడ్ గూడ్స్) కాజీపేట జంక్షన్ మీదుగా వస్తూ జిల్లా కేంద్రమైన జనగామ రైల్వే స్టేషన్ లో ఆగడంతో వివిధ రైళ్ల కోసం వేచి ఉన్న ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు.బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రజా రవాణా రైళ్ల కోసం జనగామ స్టేషన్ వద్ద క్రాసింగ్ ఇవ్వడంతో ఈ గూడ్స్ ను నిలిపివేసినట్లు రైల్వే సిబ్బంది వివరించారు.ఆటోమొబైల్ కొరియర్ ట్రైన్ గా పిలువబడే ఈ గూడ్స్ రైలు కు 33 రేక్స్ ఉండగా ఒక రేక్స్ లో మూడు జెసిబి వాహనాలతో మొత్తంగా దాదాపు ఒక వంద జేసీబీ వాహనాలను సరఫరా చేసే ఈ రైలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మౌలాలి స్టేషన్ వరకు తీసుకువెళ్ళి అన్ లోడ్ చేయనున్నట్లు రైల్వే సిబ్బంది వెల్లడించారు.1
- గ్రానెట్ లారీ బోల్తా మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం చెరువు మూలమలుపు వద్ద గ్రానెట్ లారీ బోల్తా పడటంతో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ కావడం వలన కొడకండ్ల పెద్దవంగర మండలాల్లోని పలు గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో గ్రామ పంచాయతీలు గ్రామ ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోగలరని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.1
- కరీంనగర్ లో రోడ్డెక్కిన ఉద్యోగ ఉపాధ్యాయులు...కలెక్టరేట్ ఎదుట మహాధర్నా... ప్రభుత్వ స్పందించకుంటే నిరవధిక సమ్మె చేస్తామని ఎంప్లాయిస్ జేఏసీ హెచ్చరిక ఉద్యోగ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు మహా ధర్నా చేపట్టారు. ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ లో ఉద్యోగ ఉపాధ్యాయులు కధం తొక్కారు. కలెక్టరేట్ రోడ్డు ను దిగ్బంధం చేసి మహాధర్నా నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తు ఆందోళన వ్యక్తం చేశారు. అడగకుంటే హక్కులు అసాధ్యమని, పోరాటాలతోనే అవి సాధ్యమని స్పష్టం చేశారు. న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వానికి గత రెండున్నర ఏళ్ళుగా పలుమార్లు విన్నవించినా, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమవి గొంతెమ్మ కోర్కెలు కావని, పెండింగ్ లో ఉన్న 6 DAలు, రెండు PRCలు ఇవ్వాలని, 10 వేల కోట్ల ఉద్యోగుల పెండిగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. CPS రద్దు చేసి OPS అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే సెప్టెంబరు 1న విద్రోహ దినంగా పాటిస్తామని, సెప్టెంబర్ 10 హైదరాబాద్ లో మహాధర్నా చేపడుతామని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే తెలంగాణ ఉద్యమ తరహాలో నిరవధిక సమ్మె చేపడతామని ఎంప్లాయిస్ జేఏసీ ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ధర్నా అనంతరం కలెక్టర్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.2
- మర్రి చెట్టుకు ‘మర్రి కల్లు’.. వేరు నుంచి జాలువారుతున్న కల్లు! మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని చిన్నాలకుంట చెరువు వద్ద మర్రి చెట్టు వేరు నుంచి కల్లు జాలువారడం వింతగా మారింది. నాలుగైదు రోజులుగా దీనిని గమనించిన గీత కార్మికుడు ఆకుల శ్రీను, వేరుకు గీతలు పెట్టి లొట్టి కట్టారు. లొట్టిలో కల్లు పడటంతో పలువురు ఆసక్తిగా అక్కడికి చేరుకుంటున్నారు. మర్రి చెట్టు పక్కనే ఉన్న వ్యవసాయ బావి పూడికతీత పనుల్లో చెట్టు ప్రధాన వేరు తెగిపోవడంతో మూడు, నాలుగు రోజులుగా కల్లు జాలువారుతున్నట్లు శ్రీను తెలిపారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చెట్టును చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. గీత కార్మికుడు కల్లును సేకరించి విక్రయిస్తున్నట్లు తెలిపారు.1
- నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. దాహంగా ఉందని నీళ్లు అడిగిన బాధితుడిపై ఎస్సై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపించాడు. ఈ ఘటనపై బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డికి డీఎస్పీ ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు.1
- ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు పరచాలని డిమాండ్ చేస్తూ నిరసన రాష్ట్రంలో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు నాయకులు నిరసన తెలిపారు. ఈనెల 31న మాలమహానాడు ఆధ్వర్యంలో తలపెట్టిన చలో సెక్రటేరియట్ వాల్ పోస్టర్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. గతంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసిన పార్ట్ 1, 2, 3, 4 విధానంతో మాలలకు తీవ్ర నష్టం జరుగుతోందని మాల మహానాడు నాయకులు ఆరోపించారు. 46% రోస్టర్ విధానంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోస్టర్ విధానాన్ని రద్దుచేసి వాళ్లకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 31న లక్షలాదిమంది మాలలు మాల మహానాడు ఆధ్వర్యంలో హైదరాబాద్ ను దిగ్బంధనం చేసి సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.2
- నిండు ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్ దిలీప్ మహబూబాద్ జిల్లాలో నిండు ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ దిలీప్ ఎపూర్ గ్రామంలో మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎపూర్ గ్రామంలో ఓ దివ్యాంగ యువతి ప్రమాదవశాత్తు చేతిబావిలో పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ దిలీప్ ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బావిలోకి దిగారు. బావిలో లోతుగా ఉన్న యువతిని ఎంతో ధైర్యసాహసాలతో చేరుకుని, తాళ్ల సహాయంతో ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సకాలంలో స్పందించి చాకచక్యంగా వ్యవహరించడంతో ఓ నిండు ప్రాణాన్ని కాపాడగలిగారు. కానిస్టేబుల్ దిలీప్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, మానవత్వాన్ని గ్రామస్థులు అభినందించారు. ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకు వచ్చిన దిలీప్‌ను పలువురు ప్రశంసించారు. “పోలీసు అంటే కేవలం విధులు నిర్వర్తించడమే కాదు.. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే నిజమైన మానవత్వం” అని గ్రామస్థులు కొనియాడారు....1