కరీంనగర్ లో రోడ్డెక్కిన ఉద్యోగ ఉపాధ్యాయులు...కలెక్టరేట్ ఎదుట మహాధర్నా... ప్రభుత్వ స్పందించకుంటే నిరవధిక సమ్మె చేస్తామని ఎంప్లాయిస్ జేఏసీ హెచ్చరిక ఉద్యోగ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు మహా ధర్నా చేపట్టారు. ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ లో ఉద్యోగ ఉపాధ్యాయులు కధం తొక్కారు. కలెక్టరేట్ రోడ్డు ను దిగ్బంధం చేసి మహాధర్నా నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తు ఆందోళన వ్యక్తం చేశారు. అడగకుంటే హక్కులు అసాధ్యమని, పోరాటాలతోనే అవి సాధ్యమని స్పష్టం చేశారు. న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వానికి గత రెండున్నర ఏళ్ళుగా పలుమార్లు విన్నవించినా, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమవి గొంతెమ్మ కోర్కెలు కావని, పెండింగ్ లో ఉన్న 6 DAలు, రెండు PRCలు ఇవ్వాలని, 10 వేల కోట్ల ఉద్యోగుల పెండిగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. CPS రద్దు చేసి OPS అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే సెప్టెంబరు 1న విద్రోహ దినంగా పాటిస్తామని, సెప్టెంబర్ 10 హైదరాబాద్ లో మహాధర్నా చేపడుతామని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే తెలంగాణ ఉద్యమ తరహాలో నిరవధిక సమ్మె చేపడతామని ఎంప్లాయిస్ జేఏసీ ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ధర్నా అనంతరం కలెక్టర్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.
కరీంనగర్ లో రోడ్డెక్కిన ఉద్యోగ ఉపాధ్యాయులు...కలెక్టరేట్ ఎదుట మహాధర్నా... ప్రభుత్వ స్పందించకుంటే నిరవధిక సమ్మె చేస్తామని ఎంప్లాయిస్ జేఏసీ హెచ్చరిక ఉద్యోగ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు మహా ధర్నా చేపట్టారు. ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ లో ఉద్యోగ ఉపాధ్యాయులు కధం తొక్కారు. కలెక్టరేట్ రోడ్డు ను దిగ్బంధం చేసి మహాధర్నా నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తు ఆందోళన వ్యక్తం చేశారు. అడగకుంటే హక్కులు అసాధ్యమని, పోరాటాలతోనే అవి సాధ్యమని స్పష్టం చేశారు. న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వానికి గత రెండున్నర ఏళ్ళుగా పలుమార్లు విన్నవించినా, పట్టించుకోవడం లేదని ఆవేదన
వ్యక్తం చేశారు. తమవి గొంతెమ్మ కోర్కెలు కావని, పెండింగ్ లో ఉన్న 6 DAలు, రెండు PRCలు ఇవ్వాలని, 10 వేల కోట్ల ఉద్యోగుల పెండిగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. CPS రద్దు చేసి OPS అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే సెప్టెంబరు 1న విద్రోహ దినంగా పాటిస్తామని, సెప్టెంబర్ 10 హైదరాబాద్ లో మహాధర్నా చేపడుతామని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే తెలంగాణ ఉద్యమ తరహాలో నిరవధిక సమ్మె చేపడతామని ఎంప్లాయిస్ జేఏసీ ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ధర్నా అనంతరం కలెక్టర్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.
- జగిత్యాల జిల్లా గంభీర్ పూర్ లో భారీ మొత్తంలో అక్రమ మద్యం పట్టివేత...ముగ్గురు అరెస్ట్, 6 లక్షల 98 వేల రూ.ల మద్యం సీజ్ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్ పూర్ లో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో ఎక్సైజ్ అధికారులు మద్యం పట్టుకున్నారు. మహారాష్ట్రలోని దాద్రా, హవేలి, దయ్యూధామన్ నుంచి అక్రమంగా కథలాపూర్ మండలం గంభీర్పూర్ కు రవాణా చేస్తున్న మద్యంపై ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టారు. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మద్యం ను పట్టుకున్నారు. వాటి విలువ మహారాష్ట్రలో 2లక్షల 80వేలు ఉంటే, తెలంగాణలో 6 లక్షల 98 వేల వరకు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి సెల్ఫోన్ ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సుంకం ఎగ్గొట్టి అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుకున్నామని ఎక్సైజ్ జిల్లా అధికారి తిరుపతి తెలిపారు.2
- ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు పరచాలని డిమాండ్ చేస్తూ నిరసన రాష్ట్రంలో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు నాయకులు నిరసన తెలిపారు. ఈనెల 31న మాలమహానాడు ఆధ్వర్యంలో తలపెట్టిన చలో సెక్రటేరియట్ వాల్ పోస్టర్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. గతంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసిన పార్ట్ 1, 2, 3, 4 విధానంతో మాలలకు తీవ్ర నష్టం జరుగుతోందని మాల మహానాడు నాయకులు ఆరోపించారు. 46% రోస్టర్ విధానంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోస్టర్ విధానాన్ని రద్దుచేసి వాళ్లకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 31న లక్షలాదిమంది మాలలు మాల మహానాడు ఆధ్వర్యంలో హైదరాబాద్ ను దిగ్బంధనం చేసి సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.2
- *శిశు మందిర్ పాఠశాలలో రాఖీ పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి హోమం మరియు రాఖీ ఉత్సవం* శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని పౌర్ణమి యజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు యజ్ఞంలో పాల్గొని వేద మంత్రోచ్ఛారణల మధ్య హవన కార్యక్రమాన్ని నిర్వహించారు. రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు, పరస్పర ప్రేమకు, రక్షణ భావానికి ప్రతీక అని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సోదరభావం, దేశభక్తి వంటి విలువలను విద్యార్థుల్లో పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పాఠశాల ప్రధానాచార్యులు మోర రణధీర్ తెలిపారు. యజ్ఞం అనంతరం విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకుని రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పాఠశాల ఆవరణం భక్తి, ఆనందోత్సాహాలతో కళకళలాడింది. కార్యక్రమంలో కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, ఎలగందుల సత్యనారాయణ, డా. ఎలగందుల శ్రీనివాస్, కొణిజర్ల మహేష్, శిరీష, పులాల శ్యామ్, అల్లాడి ఆనంద్ కుమార్, ముసుకుల విద్యాసాగర్ రెడ్డి, పండుగ నాగరాజు, టి రాజేశ్వర్ రావు, అప్పిడి వకుళా దేవి తదితరులు పాల్గొన్నారు.2
- గన్నేరువరం మండలం డబుల్ రోడ్డు కోసం 30న నిరాహార దీక్ష.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30న 24 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో డబుల్ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చినా, రెండున్నరేళ్లు గడిచినా పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు. రోడ్డు సమస్యపై ప్రజలు, యువజన సంఘాలు పలుమార్లు ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చిత్తశుద్ధి ఉంటే 30న లక్ష్మీనరసింహస్వామి కాంప్లెక్స్ ఎదుట జరిగే నిరాహార దీక్షకు హాజరై తమతో కలిసి కూర్చోవాలని కోరారు. రోడ్డు సమస్య పరిష్కారం కోసం పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు దీక్షకు మద్దతుగా తరలిరావాలని పిలుపునిచ్చారు. యువజన సంఘాల ఐక్యతతో డబుల్ రోడ్డు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని నాయకులు స్పష్టం చేశారు.1
- మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహణ : సహకరించినందుకు వారికి ధన్యవాదాలు సిపి గౌస్ ఆలం కరీంనగర్‌లో మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఊరేగింపు ప్రశాంతంగా, వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. సీపీ గౌష్ ఆలం స్థానిక పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు. నాఖా చౌరస్తా, తెలంగాణ చౌక్ వద్ద ముస్లిం మత పెద్దలను పూలమాలలతో సత్కరించి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపును ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ శాంతిభద్రతలు, పరమత సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, నగరంలోని గంగా–జమునా తెహజీబ్‌కు ఈ వేడుకలు నిదర్శనమని సీపీ పేర్కొన్నారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.1
- గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనాలు 26 వేల రూపాయలు అందించి ఉద్యోగ భద్రత కల్పించాలని , మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని , హెల్త్ కార్డులు అందించి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని , ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ప్రతి నెల ఒకటో తేదీన కార్మికుల బ్యాంకు ఖాతాలలో జీతాలు జమ చేయాలని , 60 సంవత్సరాలు పైబడిన మరియు చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోవాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు CITU - తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి సమస్యలపై అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ , యూనియన్ జిల్లా అధ్యక్షులు బూర శ్రీనివాస్ లు మాట్లాడుతూ గ్రామాలను పచ్చదనం , పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా ఎండనక , వాననక , చలనక అహర్నిశలు కష్టపడి పని చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జిల్లాలో కూడా స్థానిక అధికారులు , పాలకవర్గాలు కార్మికులను తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని బడ్జెట్ లేదని సాకుతో కొన్ని గ్రామాలలో నెలల తరబడి కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని స్థానిక సమస్యలపై జిల్లా అధికారులను కలిసిన సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై సంబంధిత అధికారులు , జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకుంటే కార్మికులందరూ నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి సిఐటియు జిల్లా కోశాధికారి అన్నల్దాస్ గణేష్ , యూనియన్ జిల్లా కార్యదర్శి మల్యాల నర్సయ్య యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు లోకిని శ్రీనివాస్ , కంసాని రవీందర్ , నారపురం నర్సయ్య , మహేష్ , శేఖర్ , అనిల్ , కాంతయ్య , లక్ష్మి , పద్మ గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు3
- నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. దాహంగా ఉందని నీళ్లు అడిగిన బాధితుడిపై ఎస్సై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపించాడు. ఈ ఘటనపై బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డికి డీఎస్పీ ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు.1
- కరీంనగర్ లో రోడ్డెక్కిన ఉద్యోగ ఉపాధ్యాయులు...కలెక్టరేట్ ఎదుట మహాధర్నా... ప్రభుత్వ స్పందించకుంటే నిరవధిక సమ్మె చేస్తామని ఎంప్లాయిస్ జేఏసీ హెచ్చరిక ఉద్యోగ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు మహా ధర్నా చేపట్టారు. ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ లో ఉద్యోగ ఉపాధ్యాయులు కధం తొక్కారు. కలెక్టరేట్ రోడ్డు ను దిగ్బంధం చేసి మహాధర్నా నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తు ఆందోళన వ్యక్తం చేశారు. అడగకుంటే హక్కులు అసాధ్యమని, పోరాటాలతోనే అవి సాధ్యమని స్పష్టం చేశారు. న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వానికి గత రెండున్నర ఏళ్ళుగా పలుమార్లు విన్నవించినా, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమవి గొంతెమ్మ కోర్కెలు కావని, పెండింగ్ లో ఉన్న 6 DAలు, రెండు PRCలు ఇవ్వాలని, 10 వేల కోట్ల ఉద్యోగుల పెండిగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. CPS రద్దు చేసి OPS అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే సెప్టెంబరు 1న విద్రోహ దినంగా పాటిస్తామని, సెప్టెంబర్ 10 హైదరాబాద్ లో మహాధర్నా చేపడుతామని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే తెలంగాణ ఉద్యమ తరహాలో నిరవధిక సమ్మె చేపడతామని ఎంప్లాయిస్ జేఏసీ ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ధర్నా అనంతరం కలెక్టర్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.2