కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గంజాయి వినియోగాన్ని అరికట్టడం పై ప్రత్యేక దృష్టి సారించిన కర్నూలు పోలీసులు మరియు ఈగల్ సిబ్బంది. ఇద్దరు యువకులను తమిళనాడులోని కాట్పాడి వద్ద ఉన్న న్యూ లైఫ్ కేర్ డీ-అడిక్షన్ సెంటర్ కు తరలింపు. డ్రగ్స్‌కు బానిసైనట్లు ఎవరైనా కనిపించినట్లయితే డయల్ 112 లేదా ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం ఇవ్వాలి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి వినియోగాన్ని అరికట్టే దిశగా గట్టి చర్యలు చేపట్టారు. గంజాయి సేవిస్తూ బానిసలైన ఇద్దరు యువకులను కర్నూలు, కల్లూరు మండలంలోని కస్తూరినగర్ , వినాయక్ ఘాట్ దగ్గర ఉన్న సెంట్రల్ ప్లాజా వద్ద ఈగల్ సిబ్బంది గుర్తించారు. కర్నూలు నాలుగో పట్టణ సీఐ విక్రమ సింహ ఆధ్వర్యంలో, ఈగల్ టీం ఎస్సై సుజన్ కుమార్, హెచ్‌సీ ఎలీసా సంయుక్తంగా స్పందించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు వచ్చిన సమాచారం పై వెంటనే స్పందించిన పోలీసులు, యువకుల ఆరోగ్యం మరియు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారి తల్లిదండ్రుల అనుమతి మరియు సహకారంతో శిక్షాత్మక చర్యల కంటే సరిదిద్దే దిశగా ముందడుగు వేసి, వారిని తమిళనాడులోని కాట్పాడి వద్ద ఉన్న న్యూ లైఫ్ కేర్ డీ-అడిక్షన్ సెంటర్ కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ విక్రమ సింహ గారు మాట్లాడుతూ... యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం పోలీసుల ముఖ్య బాధ్యత అని తెలిపారు. గంజాయి వంటి డ్రగ్స్ వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతోందని, ఒకసారి NDPS చట్టంలో కేసు నమోదైతే ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గంజాయి పీల్చినా, పెంచినా, పంపిణీ చేసినా కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పిల్లలు ఒంటరిగా ఉండటం, ఇంటికి ఆలస్యంగా రావడం, కళ్లలో ఎర్రదనం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు అప్రమత్తంగా ఉండి, వారితో సమయం గడపాలని, సానుభూతితో మాట్లాడాలని తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే కుటుంబాలకు తీవ్ర నష్టం కలగవచ్చని హెచ్చరించారు. డ్రగ్స్‌కు బానిసైన వారు ఎవరైనా కనిపించినట్లయితే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మత్తు మాదక ద్రవ్యాల వినియోగం నుండి యువతను దూరంగా ఉంచి, మంచి మార్గంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కలిసికట్టుగా కర్నూలు జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని కర్నూలు ప్రజలను కర్నూలు నాల్గవ పట్టణ సిఐ విక్రమ సింహా కోరారు.

- ధరూర్: మండలంలోని జంపల్లి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కెనాల్ సమీపాన అంతర్ రాష్ట్ర రహదారిపై బ్రిడ్జి నిర్మించాలని ప్రయాణికులు తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే 4 ఫీట్ల వరకు రోడ్డుపై నీరు నిలిచిపోయి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారుతుంది అన్నారు. అక్కడ గుంతలు ఏర్పడిన కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలియజేశారు. సంబంధిత అధికారులు స్పందించాలని ప్రజలు కోరారు.1
- బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలోని రామాలయం టెంపుల్ దగ్గర ఉన్న ఖాళీ స్థలం మురుగు కుంటలా మారింది. ఇందులో ఏడాదంతా మురుగునీరు నిల్వ ఉంటోంది. అక్కడే చెత్తా చెదారం వేస్తూ ఉండడంతో దుర్వాసన, దోమల బెడదతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెత్తా చెదారం ను తొలగించాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.1
- నందికొట్కూరు పట్టణంలో మండల కేంద్రాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జయ సూర్య పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాటం చేశాడని పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని యువత అంబేద్కర్ బాటలో నడవాలని సూచించారు. బజార సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక నివాళులర్పించారు.1
- మంత్రాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు1
- బిజినేపల్లి మండలం మంగనూరులో నిర్వహించిన పూలే-అంబేద్కర్ స్మారక క్రీడా టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల విజేతలకు గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్వరం నాగయ్య, ఉపసర్పంచ్ బోట్క చంద్రశేఖర్ , జిల్లా, మండల నేతలు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. బీసీ ఎస్సీ ఎస్టీ జాకు గ్రామ అధ్యక్షులు అల్వాల శ్రీకాంత్ గౌడ్,ఉపాధ్యక్షులు బందెల కృష్ణ,తిమ్మగల్లు ఆంజనేయులు జాలం శ్రీను, ప్రధాన కార్యదర్శి ఆవుల కృష్ణ,కోశాధికారి అప్పల తిరుపతయ్య,మరియు తిమ్మగల గోపీనాథ్,అప్పల పులేందర్ మంగనూరు విజ్ఞాన వేదిక ఫౌండర్ బోట్క కొండయ్య,బోట్క రాజు, మండల బీసీ సంఘం అధ్యక్షులు సత్యశీల సాగర్, గ్రామ బీసీ సంఘం అధ్యక్షులు మేకల యాదయ్య, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు చిన్నగాల పరశురాములు మరియు గౌడ సంఘం నాయకులు కురుమూర్తి గౌడ్, జాలం,తిరుపతయ్య, వెంకటయ్య మహనీయుల స్మారక టోర్నమెంట్ ఫిజికల్ డైరెక్టర్లు వ్యవహరించిన మేకల మాసయ్య, తిమ్మగళ్ల మల్లికార్జున్,రవి పులిందర్ మరియు గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.l1
- భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఘన నివాళి అర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషివల్లే నిమ్నజాతి వర్గాలు స్వేచ్ఛగా ఉంటూ తమ హక్కులను రాజ్యాంగంతో సాధించుకుంటున్నారని పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అన్ని దేశ భక్తులను నేతలను ఆకట్టుకుందని గుర్తు చేశారు1
- కర్నూలు జిల్లా ఆలూరు లో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు , కార్యకర్తలు అంబేద్కర్ సర్కిల్ చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలను అనుసరిస్తూ సామాజిక న్యాయ సాధనలో ముందుకు సాగాలని వైకుంఠం జ్యోతి పిలుపునిచ్చారు. సమాజంలో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదని అందరూ సమానమే అని చాటిచెప్పారన్నారు . మన రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తిని ప్రపంచమే మన రాజ్యాంగం వైపు చూసేలా ఆయన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు.అంబేడ్కర్ జీవించే హక్కు కల్పించారని ఆమె స్పష్టం చేశారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం విజయవంతం1