logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పెద్దపల్లి: కలెక్టరేట్ ఆవరణంలో ముగ్గుల పోటీలు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో జిల్లా TNGO అధ్యక్షులు బొంకూరి శంకర్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బహుమతులు అందజేశారు. మహిళలు-యువత ఉత్సాహంగా పాల్గొనడం సాంప్రదాయ సంస్కృతికి ప్రతీక అని కలెక్టర్ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు.

23 hrs ago
user_AJAY DODDI
AJAY DODDI
Reporter ధర్మారం, పెద్దపల్లి, తెలంగాణ•
23 hrs ago
2c150f1d-ad78-4b45-afc5-cc87c55c9fe2

పెద్దపల్లి: కలెక్టరేట్ ఆవరణంలో ముగ్గుల పోటీలు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో జిల్లా TNGO అధ్యక్షులు బొంకూరి శంకర్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బహుమతులు అందజేశారు. మహిళలు-యువత ఉత్సాహంగా పాల్గొనడం సాంప్రదాయ సంస్కృతికి ప్రతీక అని కలెక్టర్ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • హన్మకొండ:నడికుడ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.వారు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సేవలు సులభంగా, సమయానుకూలంగా అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
    1
    హన్మకొండ:నడికుడ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.వారు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సేవలు సులభంగా, సమయానుకూలంగా అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    Journalist వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • *బాగున్నరా.. అమ్మ.. బాగున్నాము.. బాపు* కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు ఇంటికి వచ్చిన ఆడ బిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారం గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ గారిని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు..
    1
    *బాగున్నరా.. అమ్మ.. బాగున్నాము.. బాపు*  
కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు
ఇంటికి వచ్చిన ఆడ బిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారం
గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క 
మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను  సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ గారిని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు..
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
  • 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ కొంపముంచిన అ*క్రమ సంబంధం.. | : కట్టుకున్నవాడిని కాదని కట్టుకథలు చెప్పే కాలయముడిని నమ్మినట్లుగా అయ్యింది ఓ వివాహిత జీవితం. పరిచయమైన నెల రోజుల్లోనే నమ్మిన ప్రియుడే డిసెంబర్ 31వ రోజు వేడుకల పేరిట నమ్మించి గొంతు నుమిలి చంపాడు వివాహిత కల్పన అనే మహిళను. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామ శివారులో ఈ నెల 1వ తేదీన అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. విచారణ జరుపగా చేగుంట మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన మంతూరు కల్పన(26) గా పోలీసులు గుర్తించారు. అయితే కల్పనకు గత కొద్ది నెలల కిందట కుటుంబీకులు నిచ్చయించిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే కుటుంబంలో నెలకొన్న గొడవల కారణంగా తల్లివారి ఇంటి వద్దే కల్పన నివసిస్తుంది. ఈ క్రమంలో చేగుంటలోని ఓ కళ్ళు దుకాణంలో మాసాయి పేట మండలం కొప్పుల పల్లి గ్రామానికి చెందిన పెంటయ్య(30) తో కల్పనకు నెల రోజుల కిందట పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ ఫోన్ లు మాట్లాడుతుండటంతో ఇరువురి బంధం బలపడింది. కాగా ఈ నెల 31 వ తేదీన కల్పన హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షల పేరిట వెళ్లి నాచారం బ్రిడ్జ్ వద్ద శవమై తేలింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా తన ప్రియుడు పెంటయ్య హత్య చేసినట్లుగా గుర్తించామని ఏసిపి నర్సింలు తెలిపారు. ప్రియుడి బొలెరో వాహనంలో నాచారం బ్రిడ్జ్ వద్ద ఇరువురు చేరుకుని మద్యం సేవించి, తమ వెంట తెచ్చుకున్న బిర్యానీనీ తిన్నారు. ఇక తనకు పదివేల రూపాయలు కావాలని లేదంటే నీ పై మానభంగం కేసు పెడతానని తనను కల్పన బెదిరించిందని పెంటయ్య పోలీసుల విచారణలో తెలిపాడు. కాగా తన వద్ద అంత డబ్బు లేదని,నా పై ఇప్పటికే పలు చోరీ కేసులు ఉన్నాయనే భయాందోళనలో కల్పనను మెడకు త్రాడు వేసి బలంగా లాగి హత్య చేశాడు ఆయన అన్నారు. విచారణ అనంతరం నిందితుడు పెంటయ్యను రిమాండ్ చేసినట్లుగా ఏసిపి పేర్కొన్నారు. B.నర్సింలు(గజ్వేల్) మీడియా సమావేశంలో
    1
    👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9
ప్రజా తెలంగాణ న్యూస్/
కొంపముంచిన అ*క్రమ సంబంధం.. |  : కట్టుకున్నవాడిని కాదని కట్టుకథలు చెప్పే కాలయముడిని నమ్మినట్లుగా అయ్యింది ఓ వివాహిత జీవితం. పరిచయమైన నెల రోజుల్లోనే నమ్మిన ప్రియుడే డిసెంబర్ 31వ రోజు వేడుకల పేరిట నమ్మించి గొంతు నుమిలి చంపాడు వివాహిత కల్పన అనే మహిళను. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామ శివారులో ఈ నెల 1వ తేదీన అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. విచారణ జరుపగా చేగుంట మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన మంతూరు కల్పన(26) గా పోలీసులు గుర్తించారు. అయితే కల్పనకు గత కొద్ది నెలల కిందట కుటుంబీకులు నిచ్చయించిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే కుటుంబంలో నెలకొన్న గొడవల కారణంగా తల్లివారి ఇంటి వద్దే కల్పన నివసిస్తుంది. ఈ క్రమంలో చేగుంటలోని ఓ కళ్ళు దుకాణంలో మాసాయి పేట మండలం కొప్పుల పల్లి గ్రామానికి చెందిన పెంటయ్య(30) తో కల్పనకు నెల రోజుల కిందట పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ ఫోన్ లు మాట్లాడుతుండటంతో ఇరువురి బంధం బలపడింది. కాగా ఈ నెల 31 వ తేదీన కల్పన హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షల పేరిట వెళ్లి నాచారం బ్రిడ్జ్ వద్ద శవమై తేలింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా తన ప్రియుడు పెంటయ్య హత్య చేసినట్లుగా గుర్తించామని ఏసిపి నర్సింలు తెలిపారు. ప్రియుడి బొలెరో వాహనంలో నాచారం బ్రిడ్జ్ వద్ద ఇరువురు చేరుకుని మద్యం సేవించి, తమ వెంట తెచ్చుకున్న బిర్యానీనీ తిన్నారు. ఇక తనకు పదివేల రూపాయలు కావాలని లేదంటే నీ పై మానభంగం కేసు పెడతానని తనను కల్పన బెదిరించిందని పెంటయ్య పోలీసుల విచారణలో తెలిపాడు. కాగా తన వద్ద అంత డబ్బు లేదని,నా పై ఇప్పటికే పలు చోరీ కేసులు ఉన్నాయనే భయాందోళనలో కల్పనను మెడకు త్రాడు వేసి బలంగా లాగి హత్య చేశాడు ఆయన అన్నారు. విచారణ అనంతరం నిందితుడు పెంటయ్యను రిమాండ్ చేసినట్లుగా ఏసిపి పేర్కొన్నారు.
B.నర్సింలు(గజ్వేల్) మీడియా సమావేశంలో
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    Reporter వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    6 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳
    1
    భారత్ మాత కి జై 🇮🇳
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    19 hrs ago
  • మేడారం జాతరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావుకు ఆత్మీయ ఆహ్వానం పలికిన రాష్ట్ర మహిళా మంత్రులు.. రాష్ట్ర మహిళా మంత్రులకు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు.ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాదర ఆహ్వానం అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం రాష్ట్ర దేవదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. పంచాయతీ రాజ్ & మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా, శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ కి మేడారం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా... తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా.. తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, సాదర ఆహ్వానం పలికారు.
    1
    మేడారం జాతరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావుకు ఆత్మీయ ఆహ్వానం పలికిన రాష్ట్ర మహిళా మంత్రులు..
రాష్ట్ర మహిళా మంత్రులకు..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు.ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాదర ఆహ్వానం
అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం
రాష్ట్ర దేవదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. పంచాయతీ రాజ్ & మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. 
మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా, శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ కి మేడారం ప్రసాదం అందజేశారు.
ఈ సందర్భంగా... తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు.
కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు.
కాగా.. తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, సాదర ఆహ్వానం పలికారు.
    user_Journalist Madhu
    Journalist Madhu
    Journalist కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    20 hrs ago
  • మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీగా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి అభినందనలు అందుకుంటున్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న మరియు దొంగిలించబడిన మొబైల్ ఫోన్ల రికవరీలో పోలీసులు కీలక విజయం సాధించారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ – CEIR పోర్టల్ సహాయంతో మొత్తం 1039 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా, వీటి విలువ రూ. 2 కోట్ల 8 లక్షలుగా అధికారులు తెలిపారు.పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఐపిఎస్ ఆదేశాల మేరకు, సీసీఎస్ ఎల్బీ నగర్, మల్కాజిగిరి యూనిట్లు, ఐటి సెల్ కలిసి ప్రత్యేక బృందాలుగా పనిచేసి ఆరు నెలల వ్యవధిలో ఈ ఫోన్లను గుర్తించారు. ఎల్బీ నగర్ పరిధిలో 739, మల్కాజిగిరి పరిధిలో 300 మొబైల్ ఫోన్లు రికవరీ అయ్యాయి. గురువారం రోజు జనవరి 8న రికవరీ చేసిన ఫోన్లను అసలైన యజమానులకు అందజేయగా, బాధితులు మల్కాజిగిరి పోలీసుల పనితీరును ప్రశంసించారు. మొబైల్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, దొంగిలించిన ఫోన్ల కొనుగోలు నేరమని పోలీసులు హెచ్చరించారు.
    2
    మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీగా  దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి  అభినందనలు అందుకుంటున్నారు. 
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న మరియు దొంగిలించబడిన మొబైల్ ఫోన్ల రికవరీలో పోలీసులు కీలక విజయం సాధించారు.
సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ – CEIR పోర్టల్ సహాయంతో మొత్తం 1039 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా, వీటి విలువ రూ. 2 కోట్ల 8 లక్షలుగా అధికారులు తెలిపారు.పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఐపిఎస్ ఆదేశాల మేరకు, సీసీఎస్ ఎల్బీ నగర్, మల్కాజిగిరి యూనిట్లు, ఐటి సెల్ కలిసి ప్రత్యేక బృందాలుగా పనిచేసి ఆరు నెలల వ్యవధిలో ఈ ఫోన్లను గుర్తించారు.
ఎల్బీ నగర్ పరిధిలో 739, మల్కాజిగిరి పరిధిలో 300 మొబైల్ ఫోన్లు రికవరీ అయ్యాయి.
గురువారం రోజు జనవరి 8న రికవరీ చేసిన ఫోన్లను అసలైన యజమానులకు అందజేయగా, బాధితులు మల్కాజిగిరి పోలీసుల పనితీరును ప్రశంసించారు.
మొబైల్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, దొంగిలించిన ఫోన్ల కొనుగోలు నేరమని పోలీసులు హెచ్చరించారు.
    user_Sagar mukunda
    Sagar mukunda
    Sagar Mukunda YouTube channel కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    22 hrs ago
  • కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కప్ రెండవ ఎడిషన్ పోటీలను కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే సుడా ఛైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గార్లతో కలసి క్రీడా జ్వాలను వెలిగించి క్రీడలను ప్రారంభించిన చొప్పదండి శాసనసభ్యులు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం
    1
    కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కప్ రెండవ ఎడిషన్ పోటీలను కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే  సుడా ఛైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గార్లతో కలసి క్రీడా జ్వాలను వెలిగించి క్రీడలను ప్రారంభించిన చొప్పదండి శాసనసభ్యులు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    Reporter Karimnagar, Telangana•
    6 hrs ago
  • జనగామ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు ఆందోళనకు దిగారు. నిన్న యూత్ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ కటౌట్‌కు ఉరి తీయడాన్ని ఖండిస్తూ, నేడు ఆర్టీసీ చౌరస్తాలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కటౌట్లను ఉరి తీశారు. అనంతరం వాటిని బాత్రూమ్ క్లీనర్ హార్పిక్‌తో కడిగి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా “సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు.
    1
    జనగామ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు ఆందోళనకు దిగారు. నిన్న యూత్ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ కటౌట్‌కు ఉరి తీయడాన్ని ఖండిస్తూ, నేడు ఆర్టీసీ చౌరస్తాలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కటౌట్లను ఉరి తీశారు. అనంతరం వాటిని బాత్రూమ్ క్లీనర్ హార్పిక్‌తో కడిగి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా “సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    Journalist వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం స్థల పరిశీలన..... వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టౌన్ సమీపంలో ఆస్పత్రికి అవసరమైన స్థలాన్ని పరిశీలించి సేకరించినట్లు తెలిపారు.
    1
    100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం స్థల పరిశీలన.....
వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టౌన్ సమీపంలో ఆస్పత్రికి అవసరమైన స్థలాన్ని పరిశీలించి సేకరించినట్లు తెలిపారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.