Shuru
Apke Nagar Ki App…
100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం స్థల పరిశీలన..... వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టౌన్ సమీపంలో ఆస్పత్రికి అవసరమైన స్థలాన్ని పరిశీలించి సేకరించినట్లు తెలిపారు.
Chetty:Ramesh
100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం స్థల పరిశీలన..... వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టౌన్ సమీపంలో ఆస్పత్రికి అవసరమైన స్థలాన్ని పరిశీలించి సేకరించినట్లు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- హన్మకొండ:నడికుడ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.వారు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సేవలు సులభంగా, సమయానుకూలంగా అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.1
- జగిత్యాల జిల్లా కొండగట్టులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.83,12,000 చెక్కులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. బాధితుల పునరావాసానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. టెంపుల్ సిటీ కారిడార్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. కలెక్టర్ సత్య ప్రసాద్, ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం, అధికారులు పాల్గొన్నారు.2
- యాదాద్రి భువనగిరి జిల్లాలో 6000 లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడ్డ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరణ ప్రకారం తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ ఇంటి నిర్మాణ బిల్లులు విడుదల చేసేందుకు 6000 రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితులు తమను ఆశ్రయించినట్లు తెలిపారు. దీంతో 6000 రూపాయలు కృష్ణకు అందిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. దీంతో కృష్ణ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు.1
- 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవీ రవీందర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళినటువంటి సమయంలో కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి రాజేష్ గారికి వార్డులను పెంచాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.1
- జై హొ సనాతన ధర్మం ఓం నమః శివాయ హర హర మహాదేవ్ 🔱 భారత్ మాత కి జై 🇮🇳1
- పులి సంచరిస్తోంది..జర పైలం జన్నారం మండలంలోని చింతగూడ, మొహమ్మదాబాద్ అడవిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం చింతగూడ అటవీలో పెద్దపులి అరుపులను అధికారులు గుర్తించారు. అలాగే మహమ్మదాబాద్ అడవిలో పులి సంచరిస్తుందని ఎఫ్డిఓ రామ్మోహన్ తెలిపారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో చింతగూడ, మొహమదాబాద్, తపాలాపూర్ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అడవి వైపు ఎవరూ వెళ్లొద్దన్నారు. విద్యుత్ వైర్లు పెడితే వన్యప్రాణులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. పులి సంచారం దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎఫ్డిఓ రామ్మోహన్ కోరారు.1
- *బాగున్నరా.. అమ్మ.. బాగున్నాము.. బాపు* కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు ఇంటికి వచ్చిన ఆడ బిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారం గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ గారిని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు..1
- జనగామ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు ఆందోళనకు దిగారు. నిన్న యూత్ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ కటౌట్‌కు ఉరి తీయడాన్ని ఖండిస్తూ, నేడు ఆర్టీసీ చౌరస్తాలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కటౌట్లను ఉరి తీశారు. అనంతరం వాటిని బాత్రూమ్ క్లీనర్ హార్పిక్‌తో కడిగి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా “సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు.1
- కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కప్ రెండవ ఎడిషన్ పోటీలను కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే సుడా ఛైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గార్లతో కలసి క్రీడా జ్వాలను వెలిగించి క్రీడలను ప్రారంభించిన చొప్పదండి శాసనసభ్యులు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం1