logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తలసేమియా బాధితులకు ఆసరా..దశాబ్దాల పోరాటానికి దక్కిన ఘన విజయం! మందమర్రి పట్టణనికి చెందిన తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ కృషికి ప్రతిఫలంగా ఆగస్టు 15 నుండి తలసేమియా వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు ఖరారు అయ్యాయని తెలిపారు. తలసేమియా బాధితుల హక్కుల సాధన కోసం, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు గత 28 సంవత్సరాలుగా సాగుతున్న అలుపెరుగని పోరాటంలో మరొక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. జులై 21న సమర్పించిన వినతిపత్రానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ఆగస్టు 15 నుండి తలసేమియా వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రకటించడం తలసేమియా వెల్ఫేర్ సొసైటీ సాధించిన అపారమైన ఘన విజయం! పోరాటాల స్ఫూర్తి – ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేలు & అధికారుల స్పందన గతంలో జులై 21, 2020 నాడు సాధించిన హక్కుల నుంచి మొదలుకొని, నేటి వరకు ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ఈ పోరాటంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆరోగ్య శాఖ మంత్రికి, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రికి సమర్పించిన వినతిపత్రం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ పరిస్థితిని మానవత్వంతో అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి, మంత్రులు, వారి పరిధిలోని ప్రిన్సిపల్ హెల్త్ సెక్రెటరీ, రాష్ట్ర హెల్త్ సెక్రెటరీ, వికలాంగుల శాఖ కార్యదర్శి వంటి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. జులై 30న ప్రెస్ రిలీజ్ మరియు టీవీ వార్తల ద్వారా ఆగస్టు 15 నుండి పెన్షన్లు అందజేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసి, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితుల పట్ల చూపిన ఈ సానుకూల వైఖరితో రాష్ట్ర ప్రభుత్వానికి, యంత్రాంగానికి ఎంతో మంచి పేరు సిద్ధించింది. మంచిర్యాల జిల్లా కేంద్ర బిందువుగా సాగిన ఐక్య పోరాటం! వికలాంగుల 'సదరం' సర్టిఫికేట్లు మరియు తలసేమియా బాధితుల చికిత్సల హక్కుల సాధనలో మంచిర్యాల జిల్లా కేంద్ర బిందువుగా నిలిచింది. మంచిర్యాల కేంద్రంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు జిల్లాలు (మంచిర్యాల, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్) మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల తలసేమియా వ్యాధిగ్రస్తులు ఐక్యమై చేసిన పోరాటాలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచాయి. బాధితుల ఐక్యతకు తోడు ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులు మరియు జిల్లా యంత్రాంగం అందించిన సహాయ సహకారాలతో తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ నాయకత్వంలో నడిచిన ఈ ఉద్యమం గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టింది. సరైన నాయకత్వం లేక రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ ప్రక్రియ మందగించినప్పటికీ, మంచిర్యాల కేంద్రంగా చూపిన చొరవ మరియు చేసిన పోరాట ఫలితంగానే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల సర్టిఫికేట్ల ప్రక్రియ సులభతరమవ్వడమే కాకుండా, పెన్షన్ల సాధన కూడా సాధ్యమైంది. తలసేమియా వెల్ఫేర్ సొసైటీకి దక్కిన గుర్తింపు ఈ చారిత్రాత్మక నిర్ణయం కేవలం ఒక ప్రభుత్వ ప్రకటన మాత్రమే కాదు; ఇది తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ నిరంతర శ్రమకు, ఉమ్మడి జిల్లాల బాధితుల ఐక్య పోరాటానికి, ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేలు మరియు అధికారుల సహకారానికి లభించిన ఘన విజయం. 28 ఏళ్ల ప్రతిపాదనలు, ఎన్నో ఏళ్ల నిరంతర అభ్యర్థనల సారాంశంగా ఈ రోజు వేలాది కుటుంబాల్లో ఆశల దీపాలు వెలిగాయి. మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్న ప్రజాప్రతినిధులకు, స్థానిక ఎమ్మెల్యేలకు, ఐఏఎస్ అధికారులకు, సహకరించిన సమస్త యంత్రాంగానికి ధన్యవాదాలు తెలుపుతూ... ఈ ఘన విజయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తలసేమియా బాధితులకు కొత్త ఊపిరి పోసిందని తలసేమియా వెల్ఫేర్ సొసైటీ సగర్వంగా ప్రకటిస్తోంది.

13 hrs ago
user_Bellampalli news
Bellampalli news
Local News Reporter బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
13 hrs ago
ac4eed46-bf3b-4180-a834-df9d90b29fbe

తలసేమియా బాధితులకు ఆసరా..దశాబ్దాల పోరాటానికి దక్కిన ఘన విజయం! మందమర్రి పట్టణనికి చెందిన తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ కృషికి ప్రతిఫలంగా ఆగస్టు 15 నుండి తలసేమియా వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు ఖరారు అయ్యాయని తెలిపారు. తలసేమియా బాధితుల హక్కుల సాధన కోసం, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు గత 28 సంవత్సరాలుగా సాగుతున్న అలుపెరుగని పోరాటంలో మరొక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. జులై 21న సమర్పించిన వినతిపత్రానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ఆగస్టు 15 నుండి తలసేమియా వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రకటించడం తలసేమియా వెల్ఫేర్ సొసైటీ సాధించిన అపారమైన ఘన విజయం! పోరాటాల స్ఫూర్తి – ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేలు & అధికారుల స్పందన గతంలో జులై 21, 2020 నాడు సాధించిన హక్కుల నుంచి మొదలుకొని, నేటి వరకు ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ఈ పోరాటంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆరోగ్య శాఖ మంత్రికి, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రికి సమర్పించిన వినతిపత్రం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ పరిస్థితిని మానవత్వంతో అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి, మంత్రులు, వారి పరిధిలోని ప్రిన్సిపల్ హెల్త్ సెక్రెటరీ, రాష్ట్ర హెల్త్ సెక్రెటరీ, వికలాంగుల శాఖ కార్యదర్శి వంటి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. జులై 30న ప్రెస్ రిలీజ్ మరియు టీవీ వార్తల ద్వారా ఆగస్టు 15 నుండి పెన్షన్లు అందజేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసి, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితుల పట్ల చూపిన ఈ సానుకూల వైఖరితో రాష్ట్ర ప్రభుత్వానికి, యంత్రాంగానికి ఎంతో మంచి పేరు సిద్ధించింది. మంచిర్యాల జిల్లా కేంద్ర బిందువుగా సాగిన ఐక్య పోరాటం! వికలాంగుల 'సదరం' సర్టిఫికేట్లు మరియు తలసేమియా బాధితుల చికిత్సల హక్కుల సాధనలో మంచిర్యాల జిల్లా కేంద్ర బిందువుగా నిలిచింది. మంచిర్యాల కేంద్రంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు జిల్లాలు (మంచిర్యాల, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్) మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల తలసేమియా వ్యాధిగ్రస్తులు ఐక్యమై చేసిన పోరాటాలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచాయి. బాధితుల ఐక్యతకు తోడు ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులు మరియు జిల్లా యంత్రాంగం అందించిన సహాయ సహకారాలతో తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ నాయకత్వంలో నడిచిన ఈ ఉద్యమం గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టింది. సరైన నాయకత్వం లేక రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ ప్రక్రియ మందగించినప్పటికీ, మంచిర్యాల కేంద్రంగా చూపిన చొరవ మరియు చేసిన పోరాట ఫలితంగానే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల సర్టిఫికేట్ల ప్రక్రియ సులభతరమవ్వడమే కాకుండా, పెన్షన్ల సాధన కూడా సాధ్యమైంది. తలసేమియా వెల్ఫేర్ సొసైటీకి దక్కిన గుర్తింపు ఈ చారిత్రాత్మక నిర్ణయం కేవలం ఒక ప్రభుత్వ ప్రకటన మాత్రమే కాదు; ఇది తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ నిరంతర శ్రమకు, ఉమ్మడి జిల్లాల బాధితుల ఐక్య పోరాటానికి, ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేలు మరియు అధికారుల సహకారానికి లభించిన ఘన విజయం. 28 ఏళ్ల ప్రతిపాదనలు, ఎన్నో ఏళ్ల నిరంతర అభ్యర్థనల సారాంశంగా ఈ రోజు వేలాది కుటుంబాల్లో ఆశల దీపాలు వెలిగాయి. మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్న ప్రజాప్రతినిధులకు, స్థానిక ఎమ్మెల్యేలకు, ఐఏఎస్ అధికారులకు, సహకరించిన సమస్త యంత్రాంగానికి ధన్యవాదాలు తెలుపుతూ... ఈ ఘన విజయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తలసేమియా బాధితులకు కొత్త ఊపిరి పోసిందని తలసేమియా వెల్ఫేర్ సొసైటీ సగర్వంగా ప్రకటిస్తోంది.

More news from తెలంగాణ and nearby areas
  • స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు బాగు చేసిన 28వ వార్డు యువకులు రోడ్లు అధ్వానంగా మారి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా, అటు హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం, స్వచ్ఛంద సంస్థలు పట్టించుకోకపోవడంతో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డ్, పోలీస్ స్టేషన్ ను అనుకొని ఉన్న రహదారి గత కొంతకాలంగా గుంతలు పడి అద్వానంగా మారింది. దీంతో ఈదారి గుండా ప్రయాణించాలంటే 28వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలలో వాహనాలు ప్రయాణించడం వల్ల వాహనాలు వారానికి ఒకసారి రిపేర్లు వచ్చి ఆర్థికంగా జేబులకు చిల్లు పడుతుందని ప్రజలు వాపోయారు. రహదారి దుస్థితిని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో 28వ వార్డుకు చెందిన యువకులు మూడెత్తుల శివశంకర్, రాళ్లబండి శ్రీనాథ్, మూడేత్తుల సాయిరాంలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిమెంట్, కంకరతో రోడ్డుకు మరమ్మతులు చేశారు. ప్రమాదాలను నివారించేందుకు యువకులు తమ సొంత డబ్బుతో గుంతలను పూడ్చి రోడ్లను బాగు చేయడం పట్ల వార్డ్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
    1
    స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు బాగు చేసిన 28వ వార్డు యువకులు 
రోడ్లు అధ్వానంగా మారి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా, అటు హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం, స్వచ్ఛంద సంస్థలు పట్టించుకోకపోవడంతో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డ్, పోలీస్ స్టేషన్ ను అనుకొని ఉన్న రహదారి గత కొంతకాలంగా గుంతలు పడి అద్వానంగా మారింది. దీంతో ఈదారి గుండా ప్రయాణించాలంటే 28వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలలో వాహనాలు ప్రయాణించడం వల్ల వాహనాలు వారానికి ఒకసారి రిపేర్లు వచ్చి ఆర్థికంగా జేబులకు చిల్లు పడుతుందని ప్రజలు వాపోయారు. రహదారి దుస్థితిని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో 28వ వార్డుకు చెందిన యువకులు మూడెత్తుల శివశంకర్, రాళ్లబండి శ్రీనాథ్, మూడేత్తుల సాయిరాంలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిమెంట్, కంకరతో రోడ్డుకు మరమ్మతులు చేశారు. ప్రమాదాలను నివారించేందుకు యువకులు తమ సొంత డబ్బుతో గుంతలను పూడ్చి రోడ్లను బాగు చేయడం పట్ల వార్డ్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
    user_Bellampalli news
    Bellampalli news
    Local News Reporter బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    14 hrs ago
  • బహిరంగ మద్యం సేవనంపై నిషేధాజ్ఞలు : రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ప్రజలు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బహిరంగ మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు సిపి తెలిపారు.
    1
    బహిరంగ మద్యం సేవనంపై నిషేధాజ్ఞలు : రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా
ప్రజలు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బహిరంగ మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు సిపి తెలిపారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    8 hrs ago
  • కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్‌లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్‌లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది. అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ రెండు ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన భవనాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. అనివాష్, డాక్టర్లు హర్షవర్ధన్, అరుణ్ కుమార్, అరుణ పాల్గొన్నారు.
    2
    కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్‌లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్‌లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది.
అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ రెండు ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన భవనాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు.
కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. అనివాష్, డాక్టర్లు హర్షవర్ధన్, అరుణ్ కుమార్, అరుణ పాల్గొన్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    48 min ago
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బిసి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించాం. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని, విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా, విదేశీ ఉన్నత విద్యకు ఎంపికైనా, సర్టిఫికెట్లు లేక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరచూ జీవోలు జారీ చేస్తూ విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం సరైన విధానం కాదని, గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బిసి సంఘం ఆధ్వర్యంలో  కలెక్టరేట్ ముట్టడి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించాం.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని, విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా, విదేశీ ఉన్నత విద్యకు ఎంపికైనా, సర్టిఫికెట్లు లేక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తరచూ జీవోలు జారీ చేస్తూ విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం సరైన విధానం కాదని, గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    10 hrs ago
  • అమాయకుడిపై దారుణ కుట్ర: గంజాయి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్ సివిల్ తగాదాలో ప్రత్యర్థిని జైలుకు పంపేందుకు పగతో రగిలిపోయిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తీరు కరీంనగర్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..ఈగల్ టీమ్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు, తన మిత్రుడైన తోడేటి శ్రీనివాస్‌కు చెందిన భూ వివాదంలో జోక్యం చేసుకున్నాడు. ఎలాగైనా ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని క్రిమినల్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి ఫెర్టిలైజర్ షాపులో పెట్టించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదయ్యేలా చేశాడు. అయితే తెప్పించిన గంజాయిలో మిగిలిన 370 గ్రాములను నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లో దాచుకున్నాడు. పక్కా సమాచారంతో కొత్తపల్లి పోలీసులు దాడి చేసి,గంజాయితో పాటు 4 ఫోన్లను స్వాధీనం చేసుకుని కానిస్టేబుల్ నాగరాజును అరెస్ట్ చేసినట్లు ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు.
    2
    అమాయకుడిపై దారుణ కుట్ర: గంజాయి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్
సివిల్ తగాదాలో ప్రత్యర్థిని జైలుకు పంపేందుకు పగతో రగిలిపోయిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తీరు కరీంనగర్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..ఈగల్ టీమ్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు, తన మిత్రుడైన తోడేటి శ్రీనివాస్‌కు చెందిన భూ వివాదంలో జోక్యం చేసుకున్నాడు.
ఎలాగైనా ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని క్రిమినల్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి ఫెర్టిలైజర్ షాపులో పెట్టించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదయ్యేలా చేశాడు. అయితే తెప్పించిన గంజాయిలో మిగిలిన 370 గ్రాములను నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లో దాచుకున్నాడు. పక్కా సమాచారంతో కొత్తపల్లి పోలీసులు దాడి చేసి,గంజాయితో పాటు 4 ఫోన్లను స్వాధీనం చేసుకుని కానిస్టేబుల్ నాగరాజును అరెస్ట్ చేసినట్లు ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు.
    user_P S REDDY
    P S REDDY
    Food Processing Company కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    12 hrs ago
  • 22వ డివిజన్‌లో మహాశక్తి స్టీల్ బ్యాంక్ ప్రారంభించిన నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్లాస్టిక్‌కు బదులుగా స్టీల్ వినియోగాన్ని ప్రోత్సహించాలి – మేయర్ కరీంనగర్ నగరంలోని 22వ డివిజన్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన *మహాశక్తి స్టీల్ బ్యాంక్* ను నగర మేయర్ *కొలగాని శ్రీనివాస్* ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, అందువల్ల ప్రజలు ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా స్టీల్ పాత్రలను వినియోగించే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. సమాజంలో పర్యావరణహిత జీవన విధానాన్ని ప్రోత్సహించేందుకు మహాశక్తి స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. 22వ డివిజన్‌లో జరిగే వివాహాలు, శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాల్లో ప్లాస్టిక్ పాత్రల వినియోగాన్ని పూర్తిగా నివారించే ఉద్దేశంతో *1000 స్టీల్ ప్లేట్లు, 200 స్టీల్ గ్లాసులతో కూడిన స్టీల్ బ్యాంక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని* తెలిపారు. ఈ స్టీల్ పాత్రలను డివిజన్‌లోని ప్రజలకు శుభకార్యాల సందర్భాల్లో ఉచితంగా అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచి ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని మేయర్ అన్నారు. నగరంలో స్వచ్ఛతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ *బండ రమణారెడ్డి*, బొడ్ల కృష్ణ, పెద్ది శ్రీనివాస్, తిరుమల్ రెడ్డి, శ్రీకాంత్, వేణుగోపాల్, రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి, కొండలరావు, ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్, రవి, సంతోష్ రెడ్డి, మధు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
    4
    22వ డివిజన్‌లో మహాశక్తి స్టీల్ బ్యాంక్ ప్రారంభించిన నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్లాస్టిక్‌కు బదులుగా స్టీల్ వినియోగాన్ని ప్రోత్సహించాలి – మేయర్
కరీంనగర్ నగరంలోని 22వ డివిజన్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన *మహాశక్తి స్టీల్ బ్యాంక్* ను నగర మేయర్ *కొలగాని శ్రీనివాస్* ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, అందువల్ల ప్రజలు ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా స్టీల్ పాత్రలను వినియోగించే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. సమాజంలో పర్యావరణహిత జీవన విధానాన్ని ప్రోత్సహించేందుకు మహాశక్తి స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
22వ డివిజన్‌లో జరిగే వివాహాలు, శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాల్లో ప్లాస్టిక్ పాత్రల వినియోగాన్ని పూర్తిగా నివారించే ఉద్దేశంతో *1000 స్టీల్ ప్లేట్లు, 200 స్టీల్ గ్లాసులతో కూడిన స్టీల్ బ్యాంక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని* తెలిపారు. ఈ స్టీల్ పాత్రలను డివిజన్‌లోని ప్రజలకు శుభకార్యాల సందర్భాల్లో ఉచితంగా అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రజల్లో అవగాహన పెంచి ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని మేయర్ అన్నారు. నగరంలో స్వచ్ఛతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ *బండ రమణారెడ్డి*, బొడ్ల కృష్ణ, పెద్ది శ్రీనివాస్, తిరుమల్ రెడ్డి, శ్రీకాంత్, వేణుగోపాల్, రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి, కొండలరావు, ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్, రవి, సంతోష్ రెడ్డి, మధు  స్థానిక నాయకులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    13 hrs ago
  • సింగరేణి పరిరక్షణకు కార్మికులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం :BMS గత BRS ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి లో జోక్యం కారణంగా నష్ట పోతుందని bms నాయకులు ఆరోపించారు.
    1
    సింగరేణి పరిరక్షణకు కార్మికులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం :BMS 
గత BRS ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి లో జోక్యం కారణంగా నష్ట పోతుందని bms నాయకులు ఆరోపించారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    8 hrs ago
  • *మందమర్రి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్* వార్షిక తనిఖీలలో భాగంగా శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ బెల్లంపల్లి సబ్‌డివిజన్‌లోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తనిఖీ చేశారు స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, స్టేషన్‌లోని వివిధ రకాల కీలక రికార్డులు, శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిర్యాదులు,కేసులను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని, సీసీటీఎన్‌ఎస్‌లో నమోదులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. కోర్టులతో సమన్వయంతో పనిచేసి ఎక్కువ కేసుల్లో శిక్షలు అమలయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు రక్షణ, భద్రత కల్పించడం పోలీసుల ప్రాథమిక విధి,బాధ్యత అని పేర్కొన్నారు.సిబ్బంది విధులను నిరంతరం పర్యవేక్షిస్తూ,వారు సమర్థవంతంగా పనిచేసేలా వారి నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై నేరాల నివారణకు కృషి చేయాలని అన్నారు.ఈ తనిఖీలో మందమర్రి సీఐ పి. రమేష్, మందమర్రి ఎస్‌ఐ నరేష్, police station staff పాల్గొన్నారు.
    4
    *మందమర్రి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన బెల్లంపల్లి ఏసీపీ  కిరణ్ కుమార్*
వార్షిక తనిఖీలలో భాగంగా శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ బెల్లంపల్లి సబ్‌డివిజన్‌లోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తనిఖీ చేశారు స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, స్టేషన్‌లోని వివిధ రకాల కీలక రికార్డులు, శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఫిర్యాదులు,కేసులను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని, సీసీటీఎన్‌ఎస్‌లో నమోదులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. కోర్టులతో సమన్వయంతో పనిచేసి ఎక్కువ కేసుల్లో శిక్షలు అమలయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు రక్షణ, భద్రత కల్పించడం పోలీసుల ప్రాథమిక విధి,బాధ్యత అని పేర్కొన్నారు.సిబ్బంది విధులను నిరంతరం పర్యవేక్షిస్తూ,వారు సమర్థవంతంగా పనిచేసేలా వారి నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై నేరాల నివారణకు కృషి చేయాలని అన్నారు.ఈ తనిఖీలో మందమర్రి సీఐ పి. రమేష్, మందమర్రి ఎస్‌ఐ నరేష్, police station staff పాల్గొన్నారు.
    user_పవన్ చారి
    పవన్ చారి
    బెల్లంపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.