logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్‌లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్‌లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది. అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ రెండు ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన భవనాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. అనివాష్, డాక్టర్లు హర్షవర్ధన్, అరుణ్ కుమార్, అరుణ పాల్గొన్నారు.

3 hrs ago
user_Krishna
Krishna
ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
3 hrs ago

కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్‌లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్‌లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది. అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ రెండు ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన భవనాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. అనివాష్, డాక్టర్లు హర్షవర్ధన్, అరుణ్ కుమార్, అరుణ పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్‌లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్‌లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది. అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ రెండు ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన భవనాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. అనివాష్, డాక్టర్లు హర్షవర్ధన్, అరుణ్ కుమార్, అరుణ పాల్గొన్నారు.
    2
    కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్‌లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్‌లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది.
అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ రెండు ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన భవనాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు.
కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. అనివాష్, డాక్టర్లు హర్షవర్ధన్, అరుణ్ కుమార్, అరుణ పాల్గొన్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం
జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    1 hr ago
  • స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు బాగు చేసిన 28వ వార్డు యువకులు రోడ్లు అధ్వానంగా మారి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా, అటు హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం, స్వచ్ఛంద సంస్థలు పట్టించుకోకపోవడంతో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డ్, పోలీస్ స్టేషన్ ను అనుకొని ఉన్న రహదారి గత కొంతకాలంగా గుంతలు పడి అద్వానంగా మారింది. దీంతో ఈదారి గుండా ప్రయాణించాలంటే 28వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలలో వాహనాలు ప్రయాణించడం వల్ల వాహనాలు వారానికి ఒకసారి రిపేర్లు వచ్చి ఆర్థికంగా జేబులకు చిల్లు పడుతుందని ప్రజలు వాపోయారు. రహదారి దుస్థితిని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో 28వ వార్డుకు చెందిన యువకులు మూడెత్తుల శివశంకర్, రాళ్లబండి శ్రీనాథ్, మూడేత్తుల సాయిరాంలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిమెంట్, కంకరతో రోడ్డుకు మరమ్మతులు చేశారు. ప్రమాదాలను నివారించేందుకు యువకులు తమ సొంత డబ్బుతో గుంతలను పూడ్చి రోడ్లను బాగు చేయడం పట్ల వార్డ్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
    1
    స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు బాగు చేసిన 28వ వార్డు యువకులు 
రోడ్లు అధ్వానంగా మారి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా, అటు హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం, స్వచ్ఛంద సంస్థలు పట్టించుకోకపోవడంతో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డ్, పోలీస్ స్టేషన్ ను అనుకొని ఉన్న రహదారి గత కొంతకాలంగా గుంతలు పడి అద్వానంగా మారింది. దీంతో ఈదారి గుండా ప్రయాణించాలంటే 28వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలలో వాహనాలు ప్రయాణించడం వల్ల వాహనాలు వారానికి ఒకసారి రిపేర్లు వచ్చి ఆర్థికంగా జేబులకు చిల్లు పడుతుందని ప్రజలు వాపోయారు. రహదారి దుస్థితిని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో 28వ వార్డుకు చెందిన యువకులు మూడెత్తుల శివశంకర్, రాళ్లబండి శ్రీనాథ్, మూడేత్తుల సాయిరాంలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిమెంట్, కంకరతో రోడ్డుకు మరమ్మతులు చేశారు. ప్రమాదాలను నివారించేందుకు యువకులు తమ సొంత డబ్బుతో గుంతలను పూడ్చి రోడ్లను బాగు చేయడం పట్ల వార్డ్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
    user_Bellampalli news
    Bellampalli news
    Local News Reporter బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    17 hrs ago
  • బహిరంగ మద్యం సేవనంపై నిషేధాజ్ఞలు : రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ప్రజలు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బహిరంగ మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు సిపి తెలిపారు.
    1
    బహిరంగ మద్యం సేవనంపై నిషేధాజ్ఞలు : రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా
ప్రజలు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బహిరంగ మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు సిపి తెలిపారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    11 hrs ago
  • సరైన ధ్రువపత్రాలను కలిగి ఉండాలి: ఎస్ఐ మహేందర్ రెడ్డి.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చౌక్ లో ట్రాఫిక్ ఎస్ఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తో పాటు అన్ని ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
    1
    సరైన ధ్రువపత్రాలను కలిగి ఉండాలి: ఎస్ఐ మహేందర్ రెడ్డి..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చౌక్ లో ట్రాఫిక్ ఎస్ఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తో పాటు అన్ని ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    22 min ago
  • బంబారాలో కుల దూషణల ఆరోపణలు.. దళితుల నిరసన........... కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బంబారా గ్రామంలో కుల దూషణలు జరిగాయంటూ దళితులు ఆందోళన చేపట్టారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు పొన్నాల నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు, చిన్నారులతో కలిసి గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి డప్పులతో నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
    2
    బంబారాలో కుల దూషణల ఆరోపణలు.. 

దళితుల నిరసన...........
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బంబారా గ్రామంలో కుల దూషణలు జరిగాయంటూ దళితులు ఆందోళన చేపట్టారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు పొన్నాల నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు, చిన్నారులతో కలిసి గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి డప్పులతో నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • *మందమర్రి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్* వార్షిక తనిఖీలలో భాగంగా శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ బెల్లంపల్లి సబ్‌డివిజన్‌లోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తనిఖీ చేశారు స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, స్టేషన్‌లోని వివిధ రకాల కీలక రికార్డులు, శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిర్యాదులు,కేసులను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని, సీసీటీఎన్‌ఎస్‌లో నమోదులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. కోర్టులతో సమన్వయంతో పనిచేసి ఎక్కువ కేసుల్లో శిక్షలు అమలయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు రక్షణ, భద్రత కల్పించడం పోలీసుల ప్రాథమిక విధి,బాధ్యత అని పేర్కొన్నారు.సిబ్బంది విధులను నిరంతరం పర్యవేక్షిస్తూ,వారు సమర్థవంతంగా పనిచేసేలా వారి నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై నేరాల నివారణకు కృషి చేయాలని అన్నారు.ఈ తనిఖీలో మందమర్రి సీఐ పి. రమేష్, మందమర్రి ఎస్‌ఐ నరేష్, police station staff పాల్గొన్నారు.
    4
    *మందమర్రి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన బెల్లంపల్లి ఏసీపీ  కిరణ్ కుమార్*
వార్షిక తనిఖీలలో భాగంగా శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ బెల్లంపల్లి సబ్‌డివిజన్‌లోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తనిఖీ చేశారు స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, స్టేషన్‌లోని వివిధ రకాల కీలక రికార్డులు, శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఫిర్యాదులు,కేసులను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని, సీసీటీఎన్‌ఎస్‌లో నమోదులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. కోర్టులతో సమన్వయంతో పనిచేసి ఎక్కువ కేసుల్లో శిక్షలు అమలయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు రక్షణ, భద్రత కల్పించడం పోలీసుల ప్రాథమిక విధి,బాధ్యత అని పేర్కొన్నారు.సిబ్బంది విధులను నిరంతరం పర్యవేక్షిస్తూ,వారు సమర్థవంతంగా పనిచేసేలా వారి నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై నేరాల నివారణకు కృషి చేయాలని అన్నారు.ఈ తనిఖీలో మందమర్రి సీఐ పి. రమేష్, మందమర్రి ఎస్‌ఐ నరేష్, police station staff పాల్గొన్నారు.
    user_పవన్ చారి
    పవన్ చారి
    బెల్లంపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.