Shuru
Apke Nagar Ki App…
మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తుడుం జితేందర్
మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- చిన్న బ్రిడ్జితో ఇబ్బంది పడుతున్న ప్రజలు, పెద్ద బ్రిడ్జి నిర్మించాలని వినతి జన్నారం పట్టణంలోని రాంనగర్ వద్ద చిన్న బ్రిడ్జితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన రామ్ నగర్ కు వెళ్లే దారిలో చిన్న బ్రిడ్జి ఉంది.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి పైనుండి మూడు రోజుల పాటు వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయ. బ్రిడ్జి చిన్న ఉండటంతో నీరు పోయే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. అక్కడ పెద్ద బ్రిడ్జి నిర్మించాలని వారు కోరారు.1
- మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.1
- కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్‌లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్‌లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది. అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ రెండు ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన భవనాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. అనివాష్, డాక్టర్లు హర్షవర్ధన్, అరుణ్ కుమార్, అరుణ పాల్గొన్నారు.2
- వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టివేత రూ.2.15 లక్షల విలువైన అక్రమ మద్యం,టాటా సుమో స్వాధీనం.,డ్రైవర్ పరారీ వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టివేత రూ.2.15 లక్షల విలువైన అక్రమ మద్యం,టాటా సుమో స్వాధీనం.,డ్రైవర్ పరారీ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఎ.రాజేందర్ సిబ్బందితో కలిసి శనివారం మధ్యాహ్నం అవడం ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ MH-34 M 9927 గల టాటా సుమో గోల్డ్ వాహనం చెన్నూర్ వైపు నుంచి వస్తుండగా పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోవడంతో అనుమానం వచ్చి పోలీసులు వాహనాన్ని వెంబడించారు.ఈ క్రమంలో భీమారం మండలం పోలంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి-63పై బస్‌స్టాప్ సమీపంలో వాహనాన్ని రోడ్డుపక్కన వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.అనంతరం పంచుల సమక్షంలో వాహనాన్ని తనిఖీ చేయగా భారీ మొత్తంలో అక్రమ మద్యం లభించింది. అందులో ఆఫీసర్స్ ఛాయిస్ విస్కీ 120 సీసాలు,రాయల్ స్టాగ్ విస్కీ 108 సీసాలు, హేవర్డ్స్ 5000 బీర్ 216 టిన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం మొత్తం విలువ రూ.2,15,100గా నిర్ధారించారు. అనంతరం మద్యం, టాటా సుమో వాహనాన్ని భీమారం పోలీస్ స్టేషన్‌కు తరలించి,తెలంగాణ ఎక్సైజ్ చట్టం–1968లోని సెక్షన్ 34(ఎ) కింద సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పరారీలో ఉన్న వాహన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఎ.రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.1
- గోదావరి తల్లికి వాయనం సమర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లో వరద నీటిని పరిశీలించారు. అనంతరం గోదావరి తల్లికి వాయనం సమర్పించారు.1
- గ్రామీణ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి.. ఏఎంసీ చైర్మన్ మావల మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. స్పెషల్ ఆఫీసర్ మిల్కా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణతో కలిసి ఆయన సమావేశంలో పాల్గొన్నారు. మండల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై సమావేశంలో చర్చించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యవసాయం, వైద్య సేవలు, ప్రాథమిక విద్య, సంక్షేమ పథకాల అమలు తీరును సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో కృష్ణవేణి, మావల ప్రిన్సిపాల్ సరోజ, విద్యుత్ శాఖ ఏఈ జనార్దన్ రెడ్డి, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, బట్టిసవర్గాం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వాఘాపూర్ సర్పంచ్ దినేష్, వెటర్నరీ డాక్టర్ శ్రీనివాస్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.1
- పట్నం సోదరులను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ల మాతృమూర్తి పట్నం రుక్కమ్మ ఇటీవల పరమపదించిన నేపథ్యంలో, మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి షాబాద్‌లోని వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా దివంగత రుక్కమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దివంగత రుక్కమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్తించారు. అనంతరం పట్నం మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి మనుమడు పట్నం అవినాష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికీ మనో ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.1
- ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వరద నీరు., 5గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు అంతర్గం మండలం లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.1