Shuru
Apke Nagar Ki App…
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వరద నీరు., 5గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు అంతర్గం మండలం లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.
Telangana reporter
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వరద నీరు., 5గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు అంతర్గం మండలం లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.
More news from Telangana and nearby areas
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరుపుతూ , అభిషేక్ సింగ్వి లాంటి మంచి న్యాయవాదులను నియమించి సుప్రీంకోర్టు లో న్యాయపరంగా సమర్థవంతంగా పోరాడిన ఫలితంగానే ఈ తీర్పు వచ్చిందన్నారు. గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులకు ఈ తీర్పు కొత్త ఊపునిస్తుందని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి అవసరాలు కూడా తీరనున్నాయని, రైతులకు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇవి ఎంతో దోహదపడతాయని మంత్రి తెలిపారు.తెలంగాణ హక్కులను పరిరక్షించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చొరవ, ప్రభుత్వం చేసిన న్యాయపోరాటం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.2
- మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.1
- హుస్నాబాద్ లో పూర్తిస్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత ఆందోళన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పూర్తి స్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేశారు. ఈ మేరకు హుస్నాబాద్ పట్టణంలోని నూతన గ్రంథాలయం ఎదుట నిరసన తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో శాశ్వత గ్రంథాలయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిరుద్యోగ యువత వాపోయారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం నుండి వెళ్లిపోవాలని అక్కడ ఉన్నవారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ లో కట్టించిన నూతన గ్రంథాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు కేటాయించడం తగదన్నారు. హుస్నాబాద్ చుట్టుపక్కల 24 గ్రామాల నిరుద్యోగ యువతకు హుస్నాబాద్ లో శాశ్వత గ్రంథాలయం అత్య అవసరం ఉందన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి అన్ని వసతులతో కూడిన శాశ్వత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.2
- కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్‌లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్‌లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది. అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ రెండు ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన భవనాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. అనివాష్, డాక్టర్లు హర్షవర్ధన్, అరుణ్ కుమార్, అరుణ పాల్గొన్నారు.2
- నిరపుత్రి పూజ కోసం శబరిమల కు వెళ్ళిన తెలంగాణ అయ్యప్ప స్వాములు కేరళలోని పందలం శబరిమలలో ఆగస్టు 3వ తేదీన జరిగే నీరపుత్రి పూజకు తెలంగాణ రాష్ట్రంలోని అయ్యప్ప స్వాములు శబరిమల కు ప్రయాణమయ్యారు.1
- తప్పుడు కూతలు కూసే వారికి చెంప చెళ్లుమనేలా చర్యలుండాలి మేయర్, డిప్యూటీ మేయర్లకు బండి సంజయ్ ఆదేశం బట్టకాల్చి మీద వేస్తానంటే ఊరుకునే ప్రసక్తే లేదు అవినీతికి తావులేకుండా ప్రజలకు సేవలందిస్తున్నాం*తప్పుడు కూతలు కూసే వారికి చెంప చెళ్లుమనేలా చర్యలుండాలి మేయర్, డిప్యూటీ మేయర్లకు బండి సంజయ్ ఆదేశం యూఐడీఎఫ్ నిధుల టెండర్లతో మాకు సంబంధమే లేదు టెండర్ల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది *అవినీతి బురదలో కూరుకుపోయిన వాళ్లే బురద చల్లుతుంటే చూస్తూ ఊరుకోవాలా?* *అట్లాంటి వారికి లీగల్ నోటీసులు ఇవ్వండి* క్షమాపణ చెప్పకపోతే కోర్టుకీడ్చండి* తప్పుడు కూతలు కూసే వారికి చెంప చెళ్లుమనేలా చర్యలుండాలి మేయర్, డిప్యూటీ మేయర్లకు బండి సంజయ్ ఆదేశం ‘‘గత పదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు, అరాచకాలతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను భ్రష్టు పట్టించిన నాయకులే మనకు అవినీతి మరకలు అంటించాలని చూస్తున్నారు. మనకు సంబంధం లేని విషయంలోనూ బట్ట కాల్చి మీదేస్తున్నారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదు. అట్లాంటి వాళ్లను ఉపేక్షించాల్సిన అవసరమే లేదు. వెంటనే లీగల్ నోటీసులు పంపండి. క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకోండి’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంగనర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులను ఆదేశించారు. యూఐడీఎఫ్ నిధులకు సంబంధించిన టెండర్ల వ్యవహారంలో తమకు ఏ మాత్రం సంబంధం లేదని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెప్పారు. అయినప్పటికీ కొందరు బీఆర్ఎస్ నేతలు కావాలనే తమపై అవినీతి బురద చల్లాలని చూస్తున్నారని చెప్పారు. అట్లాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈరోజు కరీంనగర్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ నగరంలో పలు అభివ్రుద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో యూఐడీఎఫ్ నిధుల అంశం, టెండర్ల వ్యవహారంపై చర్చించారు. ఈ విషయంలో తమకు సంబంధం లేనప్పటికీ పదేపదే బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తూ కావాలని బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని కొలగాని, సునీల్ రావు బండిసంజయ్ ద్రుష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్పందిస్తూ ‘‘యూఐడీఎఫ్ నిధుల టెండర్ల వ్యవహారం మనకు ఏమాత్రం సంబంధం లేదు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. ఆ టెండర్లో మనకు సంబంధమేంటి? కావాలనే బట్టకాల్చి మీదేయాలనుకుంటున్నారు. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ను ఏలిన వాళ్లు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి, ప్రతి పనికీ లంచాలకు అలవాటుపడ్డారు. ఇతరుల మీద కూడా అట్లాంటి బురద చల్లాలనుకుంటున్నారు. వాళ్లను ఉపేక్షించొద్దు. వెంటనే లీగల్ నోటీసులివ్వండి. క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలకు సిద్ధం కండి’’అని సూచించారు. బీఆర్ఎస్ అవినీతి, అరాచక పాలనతో విసిగిపోయిన కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలు బీజేపీని గెలిపించారని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అవినీతికి తావులేని విధంగా ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుంటే ఓర్వలేకపోతున్నారని తెలిపారు. ‘‘తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడకూదన్నదే మా విధానం. అదే సమయంలో నోటికి వచ్చినట్లు వాగుతూ అబద్దాలను ప్రచారం చేస్తూ ఏ తప్పు చేయకపోయినా మాపై అవినీతి బురద చల్లేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అట్లాంటి వారిపై చట్ట, న్యాయపరమైన చర్యలకూ వెనుకాడబోం. యూఐడీఎఫ్ నిధులకు సంబంధించి నిర్వహించిన టెండర్లతో మాకు సంబంధమే లేదు. ఇందులో ఏనాడూ ఇన్ వాల్వ్ కాలేదు. అయినా మాపై అవినీతి ఆరోపణలు చేస్తూ మా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు. తక్షణమే వారికి లీగల్ నోటీసులివ్వండి. క్షమాపణ చెప్పకపోతే న్యాయమైన చర్యలకు సిద్ధం కండి.’’అని మేయర్, డిప్యూటీ మేయర్ లకు స్పష్టం చేశారు.1
- కరీంనగర్ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొస్తా...విమర్శించే వారికి అభివృద్ధి పనులతో సమాధానం చెప్పాలి- కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని గల్లీగల్లీని అభివృద్ధి చేస్తానని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. గతంలో తప్పులు చేసి ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న వారిని విమర్శించే వారిపై చర్యలు తీసుకునేలా కృషి చేయాలని మేయర్ డిప్యూటీ మేయర్ ను ఆదేశించారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పరామర్శలతో బిజీబిజీగా గడిపారు. ఉదయం తన నివాసం వద్దకు వచ్చిన సందర్శకులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్పొరేటర్లు, బీజేపీ నాయకులతో కలిసి పలు అభివ్రుద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 48వ డివిజన్ లోని విద్యానగర్ కురుమవాడలో కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తోపాటు స్థానిక కార్పొరేటర్ కర్ర పద్మ అనిల్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ నిధుల్లో 80 లక్షలు యూఐడీఎఫ్ నిధులు కాగా, మిగిలిన రూ.20 లక్షలు మున్సిపల్ సాధారణ ఫండ్ కు సంబంధించినవని తెలిపారు. 19వ డివిజన్ లోని రేకుర్తి ముదిరాజ్ కాలనీకి వెళ్లిన కేంద్ర మంత్రి 40 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. లక్ష్మీ నరసింహ కాలనీలో 57 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడి నుండి మొగ్దుంపూర్ వెళ్లిన కేంద్ర మంత్రి 10 లక్షల జాతీయ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన మహిళాశక్తి ధరణి గ్రామైఖ్య సంఘ భవనాన్ని స్థానిక సర్పంచ్ శివకుమార్ తో కలిసి ప్రారంభించారు. 15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రెయిన్ ను ప్రారంభించారు. చింతకుంట వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అంబేద్కర్ భవన్ సమీపంలో నిర్వహించిన ‘‘వన మహోత్సవం-2026’’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కు అధికారులతోపాటు మహిళలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి స్వయంగా మొక్కలను నాటారు. కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు తన పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తానని స్పష్టం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 22 వేల కోట్లు నిధులు ఖర్చు పెట్టామని త్వరలోనే వివిధ కేంద్ర పథకాల కింద మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు.1
- కరీంనగర్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం... పలువురు బిజేవైఎం నాయకుల అరెస్ట్ విద్యార్థుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ కరీంనగర్ లో బీజేవైఎం కార్యకర్తల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులను సీఎం క్రిమినల్స్ అన్నాడని బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ చౌక్ లో ధర్నాకు దిగి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుని స్వల్ప ఉద్రిక్తకు దారి తీసింది. పోలీసులు కళ్ళుగప్పి బీజేవైఎం కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో పోలీసులు దగ్ధమవుతున్న దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకొని , బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.2