logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తప్పుడు కూతలు కూసే వారికి చెంప చెళ్లుమనేలా చర్యలుండాలి మేయర్, డిప్యూటీ మేయర్లకు బండి సంజయ్ ఆదేశం బట్టకాల్చి మీద వేస్తానంటే ఊరుకునే ప్రసక్తే లేదు అవినీతికి తావులేకుండా ప్రజలకు సేవలందిస్తున్నాం*తప్పుడు కూతలు కూసే వారికి చెంప చెళ్లుమనేలా చర్యలుండాలి మేయర్, డిప్యూటీ మేయర్లకు బండి సంజయ్ ఆదేశం యూఐడీఎఫ్ నిధుల టెండర్లతో మాకు సంబంధమే లేదు టెండర్ల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది *అవినీతి బురదలో కూరుకుపోయిన వాళ్లే బురద చల్లుతుంటే చూస్తూ ఊరుకోవాలా?* *అట్లాంటి వారికి లీగల్ నోటీసులు ఇవ్వండి* క్షమాపణ చెప్పకపోతే కోర్టుకీడ్చండి* తప్పుడు కూతలు కూసే వారికి చెంప చెళ్లుమనేలా చర్యలుండాలి మేయర్, డిప్యూటీ మేయర్లకు బండి సంజయ్ ఆదేశం ‘‘గత పదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు, అరాచకాలతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను భ్రష్టు పట్టించిన నాయకులే మనకు అవినీతి మరకలు అంటించాలని చూస్తున్నారు. మనకు సంబంధం లేని విషయంలోనూ బట్ట కాల్చి మీదేస్తున్నారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదు. అట్లాంటి వాళ్లను ఉపేక్షించాల్సిన అవసరమే లేదు. వెంటనే లీగల్ నోటీసులు పంపండి. క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకోండి’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంగనర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులను ఆదేశించారు. యూఐడీఎఫ్ నిధులకు సంబంధించిన టెండర్ల వ్యవహారంలో తమకు ఏ మాత్రం సంబంధం లేదని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెప్పారు. అయినప్పటికీ కొందరు బీఆర్ఎస్ నేతలు కావాలనే తమపై అవినీతి బురద చల్లాలని చూస్తున్నారని చెప్పారు. అట్లాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈరోజు కరీంనగర్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ నగరంలో పలు అభివ్రుద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో యూఐడీఎఫ్ నిధుల అంశం, టెండర్ల వ్యవహారంపై చర్చించారు. ఈ విషయంలో తమకు సంబంధం లేనప్పటికీ పదేపదే బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తూ కావాలని బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని కొలగాని, సునీల్ రావు బండిసంజయ్ ద్రుష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్పందిస్తూ ‘‘యూఐడీఎఫ్ నిధుల టెండర్ల వ్యవహారం మనకు ఏమాత్రం సంబంధం లేదు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. ఆ టెండర్లో మనకు సంబంధమేంటి? కావాలనే బట్టకాల్చి మీదేయాలనుకుంటున్నారు. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ను ఏలిన వాళ్లు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి, ప్రతి పనికీ లంచాలకు అలవాటుపడ్డారు. ఇతరుల మీద కూడా అట్లాంటి బురద చల్లాలనుకుంటున్నారు. వాళ్లను ఉపేక్షించొద్దు. వెంటనే లీగల్ నోటీసులివ్వండి. క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలకు సిద్ధం కండి’’అని సూచించారు. బీఆర్ఎస్ అవినీతి, అరాచక పాలనతో విసిగిపోయిన కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలు బీజేపీని గెలిపించారని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అవినీతికి తావులేని విధంగా ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుంటే ఓర్వలేకపోతున్నారని తెలిపారు. ‘‘తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడకూదన్నదే మా విధానం. అదే సమయంలో నోటికి వచ్చినట్లు వాగుతూ అబద్దాలను ప్రచారం చేస్తూ ఏ తప్పు చేయకపోయినా మాపై అవినీతి బురద చల్లేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అట్లాంటి వారిపై చట్ట, న్యాయపరమైన చర్యలకూ వెనుకాడబోం. యూఐడీఎఫ్ నిధులకు సంబంధించి నిర్వహించిన టెండర్లతో మాకు సంబంధమే లేదు. ఇందులో ఏనాడూ ఇన్ వాల్వ్ కాలేదు. అయినా మాపై అవినీతి ఆరోపణలు చేస్తూ మా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు. తక్షణమే వారికి లీగల్ నోటీసులివ్వండి. క్షమాపణ చెప్పకపోతే న్యాయమైన చర్యలకు సిద్ధం కండి.’’అని మేయర్, డిప్యూటీ మేయర్ లకు స్పష్టం చేశారు.

2 hrs ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
2 hrs ago

తప్పుడు కూతలు కూసే వారికి చెంప చెళ్లుమనేలా చర్యలుండాలి మేయర్, డిప్యూటీ మేయర్లకు బండి సంజయ్ ఆదేశం బట్టకాల్చి మీద వేస్తానంటే ఊరుకునే ప్రసక్తే లేదు అవినీతికి తావులేకుండా ప్రజలకు సేవలందిస్తున్నాం*తప్పుడు కూతలు కూసే వారికి చెంప చెళ్లుమనేలా చర్యలుండాలి మేయర్, డిప్యూటీ మేయర్లకు బండి సంజయ్ ఆదేశం యూఐడీఎఫ్ నిధుల టెండర్లతో మాకు సంబంధమే లేదు టెండర్ల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది *అవినీతి బురదలో కూరుకుపోయిన వాళ్లే బురద చల్లుతుంటే చూస్తూ ఊరుకోవాలా?* *అట్లాంటి వారికి లీగల్ నోటీసులు ఇవ్వండి* క్షమాపణ చెప్పకపోతే కోర్టుకీడ్చండి* తప్పుడు కూతలు కూసే వారికి చెంప చెళ్లుమనేలా చర్యలుండాలి మేయర్, డిప్యూటీ మేయర్లకు బండి సంజయ్ ఆదేశం ‘‘గత పదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు, అరాచకాలతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను భ్రష్టు పట్టించిన నాయకులే మనకు అవినీతి మరకలు అంటించాలని చూస్తున్నారు. మనకు సంబంధం లేని విషయంలోనూ బట్ట కాల్చి మీదేస్తున్నారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదు. అట్లాంటి వాళ్లను ఉపేక్షించాల్సిన అవసరమే లేదు. వెంటనే లీగల్ నోటీసులు పంపండి. క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకోండి’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంగనర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులను ఆదేశించారు. యూఐడీఎఫ్ నిధులకు సంబంధించిన టెండర్ల వ్యవహారంలో తమకు ఏ మాత్రం సంబంధం లేదని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెప్పారు. అయినప్పటికీ కొందరు బీఆర్ఎస్ నేతలు కావాలనే తమపై అవినీతి బురద చల్లాలని చూస్తున్నారని చెప్పారు. అట్లాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈరోజు కరీంనగర్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ నగరంలో పలు అభివ్రుద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో యూఐడీఎఫ్ నిధుల అంశం, టెండర్ల వ్యవహారంపై చర్చించారు. ఈ విషయంలో తమకు సంబంధం లేనప్పటికీ పదేపదే బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తూ కావాలని బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని కొలగాని, సునీల్ రావు బండిసంజయ్ ద్రుష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్పందిస్తూ ‘‘యూఐడీఎఫ్ నిధుల టెండర్ల వ్యవహారం మనకు ఏమాత్రం సంబంధం లేదు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. ఆ టెండర్లో మనకు సంబంధమేంటి? కావాలనే బట్టకాల్చి మీదేయాలనుకుంటున్నారు. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ను ఏలిన వాళ్లు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి, ప్రతి పనికీ లంచాలకు అలవాటుపడ్డారు. ఇతరుల మీద కూడా అట్లాంటి బురద చల్లాలనుకుంటున్నారు. వాళ్లను ఉపేక్షించొద్దు. వెంటనే లీగల్ నోటీసులివ్వండి. క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలకు సిద్ధం కండి’’అని సూచించారు. బీఆర్ఎస్ అవినీతి, అరాచక పాలనతో విసిగిపోయిన కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలు బీజేపీని గెలిపించారని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అవినీతికి తావులేని విధంగా ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుంటే ఓర్వలేకపోతున్నారని తెలిపారు. ‘‘తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడకూదన్నదే మా విధానం. అదే సమయంలో నోటికి వచ్చినట్లు వాగుతూ అబద్దాలను ప్రచారం చేస్తూ ఏ తప్పు చేయకపోయినా మాపై అవినీతి బురద చల్లేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అట్లాంటి వారిపై చట్ట, న్యాయపరమైన చర్యలకూ వెనుకాడబోం. యూఐడీఎఫ్ నిధులకు సంబంధించి నిర్వహించిన టెండర్లతో మాకు సంబంధమే లేదు. ఇందులో ఏనాడూ ఇన్ వాల్వ్ కాలేదు. అయినా మాపై అవినీతి ఆరోపణలు చేస్తూ మా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు. తక్షణమే వారికి లీగల్ నోటీసులివ్వండి. క్షమాపణ చెప్పకపోతే న్యాయమైన చర్యలకు సిద్ధం కండి.’’అని మేయర్, డిప్యూటీ మేయర్ లకు స్పష్టం చేశారు.

More news from Telangana and nearby areas
  • సివిల్ ఇంజనీరింగ్ రంగానికి భవిష్యత్తులో భారీ డిమాండ్: మాజీ మంత్రి గంగుల కమలాకర్ అత్యాధునిక టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణాలు.. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని, నాణ్యతతో కూడిన తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా (ACCEI) కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 'బిల్డ్ ఎక్స్‌పో' 6వ ఎడిషన్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సివిల్ ఇంజనీర్లకు అపారమైన డిమాండ్ ఉంటుందని, విదేశాల్లో సివిల్ ఇంజనీర్ల లభ్యత కూడా కష్టంగా మారుతోందని తెలిపారు. హైదరాబాద్‌కు దీటుగా కరీంనగర్ అభివృద్ధి చెందుతోందని, నగరాల సర్వతోముఖాభివృద్ధిలో నిర్మాణ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కరీంనగర్ నగరం ఇప్పటికే స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంందని కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని, త్వరలో మానేరు రివర్ ఫ్రంట్ కూడా అందుబాటులోకి వస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ​ప్రస్తుతం నిర్మాణ రంగంలో రాపిడ్ ఫోర్స్ తరహాలో విల్లాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. తాను కూడా ఒక సివిల్ ఇంజనీర్‌నేనని గుర్తుచేసుకుంటూ.. కరీంనగర్‌లో 'శ్వేతా హోటల్' నిర్మించే సమయంలో నగరంలో హోటల్ నడవదని ఎంతోమంది అన్నారని, కానీ నేడు ఆ హోటల్‌లో రూములు దొరకని పరిస్థితి ఉందంటూ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ​ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ కాల్వ మల్లేశం, మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, తుల బాలయ్య, అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా కరీంనగర్ సెంటర్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
    1
    సివిల్ ఇంజనీరింగ్ రంగానికి భవిష్యత్తులో భారీ డిమాండ్: మాజీ మంత్రి గంగుల కమలాకర్
అత్యాధునిక టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణాలు..
అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని, నాణ్యతతో కూడిన తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా (ACCEI) కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 'బిల్డ్ ఎక్స్‌పో' 6వ ఎడిషన్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సివిల్ ఇంజనీర్లకు అపారమైన డిమాండ్ ఉంటుందని, విదేశాల్లో సివిల్ ఇంజనీర్ల లభ్యత కూడా కష్టంగా మారుతోందని తెలిపారు. హైదరాబాద్‌కు దీటుగా కరీంనగర్ అభివృద్ధి చెందుతోందని, నగరాల సర్వతోముఖాభివృద్ధిలో నిర్మాణ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కరీంనగర్ నగరం ఇప్పటికే స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంందని కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని, త్వరలో మానేరు రివర్ ఫ్రంట్ కూడా అందుబాటులోకి వస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు.
​ప్రస్తుతం నిర్మాణ రంగంలో రాపిడ్ ఫోర్స్ తరహాలో విల్లాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. తాను కూడా ఒక సివిల్ ఇంజనీర్‌నేనని గుర్తుచేసుకుంటూ.. కరీంనగర్‌లో 'శ్వేతా హోటల్' నిర్మించే సమయంలో నగరంలో హోటల్ నడవదని ఎంతోమంది అన్నారని, కానీ నేడు ఆ హోటల్‌లో రూములు దొరకని పరిస్థితి ఉందంటూ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు.
​ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ కాల్వ మల్లేశం, మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, తుల బాలయ్య, అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా కరీంనగర్ సెంటర్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    14 min ago
  • ఇల్లంతకుంట :వాణినికేతన్ హైస్కూల్లో ఘనంగా పోచమ్మ బోనాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని వాణి నికేతన్ హై స్కూల్లో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పోచమ్మ చిత్రపటం వద్ద శనివారం పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన విద్యార్థినిలు పోచమ్మ బోనాలు ఎత్తుకున్నారు. డప్పు చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాల మధ్య బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పోచమ్మ ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగను పాఠశాలలో నిర్వహించడం గర్వకారణం అన్నారు. పిల్లలకు చదువుతోపాటు సాంప్రదాయాలు, ఆచారాలపై అవగాహన కల్పించాలని లక్ష్యంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. బోనాల పండుగ ఐక్యమత్యానికి, సంస్కృతికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయనీలు సుమంగళి, శోభ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, శమిమా, రేణుక, జలజ, శాంత, పద్మ, స్వాతి, రేణుక, సునీత, ఉష, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, రాజు, తిరుపతి లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.
    1
    ఇల్లంతకుంట :వాణినికేతన్ హైస్కూల్లో ఘనంగా పోచమ్మ బోనాలు.
 
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని  వాణి నికేతన్  హై స్కూల్లో  పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పోచమ్మ చిత్రపటం వద్ద శనివారం పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన  విద్యార్థినిలు పోచమ్మ బోనాలు ఎత్తుకున్నారు.
డప్పు చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాల మధ్య బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పోచమ్మ ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగను పాఠశాలలో  నిర్వహించడం గర్వకారణం అన్నారు. పిల్లలకు చదువుతోపాటు  సాంప్రదాయాలు, ఆచారాలపై  అవగాహన  కల్పించాలని  లక్ష్యంతో  కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. బోనాల పండుగ ఐక్యమత్యానికి, సంస్కృతికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయనీలు సుమంగళి, శోభ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, శమిమా, రేణుక, జలజ, శాంత, పద్మ,  స్వాతి, రేణుక, సునీత, ఉష, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, రాజు, తిరుపతి లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    5 hrs ago
  • హుస్నాబాద్ లో పూర్తిస్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత ఆందోళన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పూర్తి స్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేశారు. ఈ మేరకు హుస్నాబాద్ పట్టణంలోని నూతన గ్రంథాలయం ఎదుట నిరసన తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో శాశ్వత గ్రంథాలయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిరుద్యోగ యువత వాపోయారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం నుండి వెళ్లిపోవాలని అక్కడ ఉన్నవారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ లో కట్టించిన నూతన గ్రంథాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు కేటాయించడం తగదన్నారు. హుస్నాబాద్ చుట్టుపక్కల 24 గ్రామాల నిరుద్యోగ యువతకు హుస్నాబాద్ లో శాశ్వత గ్రంథాలయం అత్య అవసరం ఉందన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి అన్ని వసతులతో కూడిన శాశ్వత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
    2
    హుస్నాబాద్ లో పూర్తిస్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత ఆందోళన
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పూర్తి స్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేశారు. ఈ మేరకు హుస్నాబాద్ పట్టణంలోని నూతన గ్రంథాలయం ఎదుట నిరసన తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో శాశ్వత గ్రంథాలయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిరుద్యోగ యువత వాపోయారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం నుండి వెళ్లిపోవాలని అక్కడ ఉన్నవారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ లో కట్టించిన నూతన గ్రంథాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు కేటాయించడం తగదన్నారు. హుస్నాబాద్ చుట్టుపక్కల 24 గ్రామాల నిరుద్యోగ యువతకు హుస్నాబాద్ లో శాశ్వత గ్రంథాలయం అత్య అవసరం ఉందన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి అన్ని వసతులతో కూడిన శాశ్వత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • జపాన్‌కు డ్రైవర్ల శిక్షణపై భాగస్వామ్యం దిశగా అడుగులు బద్దెనపల్లి ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన జపాన్ ప్రతినిధులు జపాన్‌కు నైపుణ్యమైన భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లను తీర్చిదిద్దే లక్ష్యంతో హనా విస్టా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు సంస్థ ప్రతినిధులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి లో ఐటిడీఆర్ సైట్ విజిట్ నిర్వహించారు.ఇట్టి పర్యవేక్షణ సంస్థ సీఈఓ సయూరి మత్సునో తెలంగాణ ఐఏఎస్ అధికారి హరి ప్రసాద్‌కు ఆదేశానుసారం , పర్య వేక్షించారు. డ్రైవింగ్ శిక్షణ విధానం, మౌలిక సదుపాయాలు, శిక్షణ పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు, మొత్తం శిక్షణ వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే, భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పరస్పర సహకారంపై చర్చించి, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పరచు కోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తెలంగాణ యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇట్టి పర్యవేక్షణ లో జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ ఐటీడీఆర్ ప్రిన్సిపాల్ దొరయ్ మురుగన్ పాల్గొన్నారు.
    1
    జపాన్‌కు డ్రైవర్ల శిక్షణపై భాగస్వామ్యం దిశగా అడుగులు
బద్దెనపల్లి ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన జపాన్ ప్రతినిధులు
జపాన్‌కు నైపుణ్యమైన భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లను తీర్చిదిద్దే లక్ష్యంతో హనా విస్టా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని  ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు సంస్థ ప్రతినిధులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి లో ఐటిడీఆర్ సైట్ విజిట్ నిర్వహించారు.ఇట్టి పర్యవేక్షణ సంస్థ సీఈఓ సయూరి మత్సునో తెలంగాణ ఐఏఎస్ అధికారి హరి ప్రసాద్‌కు ఆదేశానుసారం , పర్య వేక్షించారు. డ్రైవింగ్ శిక్షణ విధానం, మౌలిక సదుపాయాలు, శిక్షణ పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు, మొత్తం శిక్షణ వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే, భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పరస్పర సహకారంపై చర్చించి, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పరచు కోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తెలంగాణ యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇట్టి పర్యవేక్షణ లో జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ ఐటీడీఆర్ ప్రిన్సిపాల్ దొరయ్ మురుగన్ పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    28 min ago
  • వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టివేత రూ.2.15 లక్షల విలువైన అక్రమ మద్యం,టాటా సుమో స్వాధీనం.,డ్రైవర్ పరారీ వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టివేత రూ.2.15 లక్షల విలువైన అక్రమ మద్యం,టాటా సుమో స్వాధీనం.,డ్రైవర్ పరారీ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఎ.రాజేందర్ సిబ్బందితో కలిసి శనివారం మధ్యాహ్నం అవడం ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ MH-34 M 9927 గల టాటా సుమో గోల్డ్ వాహనం చెన్నూర్ వైపు నుంచి వస్తుండగా పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోవడంతో అనుమానం వచ్చి పోలీసులు వాహనాన్ని వెంబడించారు.ఈ క్రమంలో భీమారం మండలం పోలంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి-63పై బస్‌స్టాప్ సమీపంలో వాహనాన్ని రోడ్డుపక్కన వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.అనంతరం పంచుల సమక్షంలో వాహనాన్ని తనిఖీ చేయగా భారీ మొత్తంలో అక్రమ మద్యం లభించింది. అందులో ఆఫీసర్స్ ఛాయిస్ విస్కీ 120 సీసాలు,రాయల్ స్టాగ్ విస్కీ 108 సీసాలు, హేవర్డ్స్ 5000 బీర్ 216 టిన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం మొత్తం విలువ రూ.2,15,100గా నిర్ధారించారు. అనంతరం మద్యం, టాటా సుమో వాహనాన్ని భీమారం పోలీస్ స్టేషన్‌కు తరలించి,తెలంగాణ ఎక్సైజ్ చట్టం–1968లోని సెక్షన్ 34(ఎ) కింద సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పరారీలో ఉన్న వాహన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఎ.రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
    1
    వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టివేత

రూ.2.15 లక్షల విలువైన అక్రమ మద్యం,టాటా సుమో స్వాధీనం.,డ్రైవర్ పరారీ

వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టివేత
రూ.2.15 లక్షల విలువైన అక్రమ మద్యం,టాటా సుమో స్వాధీనం.,డ్రైవర్ పరారీ
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఎ.రాజేందర్ సిబ్బందితో కలిసి శనివారం మధ్యాహ్నం అవడం ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ MH-34 M 9927 గల టాటా సుమో గోల్డ్ వాహనం చెన్నూర్ వైపు నుంచి వస్తుండగా పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోవడంతో అనుమానం వచ్చి పోలీసులు వాహనాన్ని వెంబడించారు.ఈ క్రమంలో భీమారం మండలం పోలంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి-63పై బస్‌స్టాప్ సమీపంలో వాహనాన్ని రోడ్డుపక్కన వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.అనంతరం పంచుల సమక్షంలో వాహనాన్ని తనిఖీ చేయగా భారీ మొత్తంలో అక్రమ మద్యం లభించింది. అందులో ఆఫీసర్స్ ఛాయిస్ విస్కీ 120 సీసాలు,రాయల్ స్టాగ్ విస్కీ 108 సీసాలు, హేవర్డ్స్ 5000 బీర్ 216 టిన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం మొత్తం విలువ రూ.2,15,100గా నిర్ధారించారు. అనంతరం మద్యం, టాటా సుమో వాహనాన్ని భీమారం పోలీస్ స్టేషన్‌కు తరలించి,తెలంగాణ ఎక్సైజ్ చట్టం–1968లోని సెక్షన్ 34(ఎ) కింద సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పరారీలో ఉన్న వాహన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఎ.రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • గోదావరి తల్లికి వాయనం సమర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లో వరద నీటిని పరిశీలించారు. అనంతరం గోదావరి తల్లికి వాయనం సమర్పించారు.
    1
    గోదావరి తల్లికి వాయనం సమర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లో వరద నీటిని పరిశీలించారు. అనంతరం గోదావరి తల్లికి వాయనం సమర్పించారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    2 hrs ago
  • కరీంనగర్ జిల్లాలో ఆలయాల్లో చోరీకి పాల్పడ్డ నిందితుడు ఎంఏ హర్షద్ అరెస్ట్...ఆలయంలో చోరీకి పాల్పడి పారిపోతుండగా ఛేజింగ్ చేసి పట్టుకున్న రామడుగు పోలీసులు కరీంనగర్ జిల్లాలో పలు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడ్డ నిందితుడిని రామడుగు పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి మూడు వెండి కిరీటాలు, 4 వెండి జంజీరాలు, 1.5 గ్రాముల బంగారు పుస్తెలు, 9500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ రూరల్ ఏ సి పి కార్యాలయంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ ఏసీపీ విజయ్ కుమార్ సమక్షంలో అరెస్టు అయిన నిందితుడిని చూపించి వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా పోలాస కు చెందిన ఎం.ఏ. అర్షద్ ఖాన్ కరీంనగర్లో ఉంటూ సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో పగలంతా కూలి పని చేస్తూ రాత్రిపూట ఆలయాలు, తాళం వేసిన ఇళ్ళలో చోరీలకు పాల్పడ్డాడని తెలిపారు. వెదిర గ్రామంలోని ఆలయంలో చోరీకి పాల్పడి పారిపోతుండగా పోలీసులు చేజింగ్ చేసి పట్టుకున్నారని తెలిపారు. ఏడాది కాలంలో నిందితుడు చొప్పదండి రామడుగు గంగాధర, తిమ్మాపూర్, చిగురుమామిడి మండలాల్లో 12 ఆలయాల్లో చోరీకి పాల్పడినట్లు చెప్పారు. చోరీ చేసిన సొత్తును కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో విక్రయించేవాడని కరీంనగర్ లో మల్లికార్జున జువెలరీ షాపులో విక్రయించిన వెండి కిరీటం, వెండి చంద్రవంక, 2.5 గ్రాముల జత బంగారు పుస్తెలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చోరీ సొత్తును కొనుగోలు చేసిన షాపు యాజమానులపై సైతం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అడిషనల్ డిసిపి చెప్పారు. చాకచక్యంగా వరుస చోరీలకు పాల్పడే నిందితుడిని పట్టుకున్న రామడుగు పోలీసులను అభినందిస్తూ క్యాష్ అవార్డు అందజేశారు.
    4
    కరీంనగర్ జిల్లాలో ఆలయాల్లో చోరీకి పాల్పడ్డ నిందితుడు ఎంఏ హర్షద్ అరెస్ట్...ఆలయంలో చోరీకి పాల్పడి పారిపోతుండగా ఛేజింగ్ చేసి పట్టుకున్న రామడుగు పోలీసులు
కరీంనగర్ జిల్లాలో పలు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడ్డ నిందితుడిని రామడుగు పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి మూడు వెండి కిరీటాలు, 4 వెండి జంజీరాలు, 1.5 గ్రాముల బంగారు పుస్తెలు, 9500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ రూరల్ ఏ సి పి కార్యాలయంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ ఏసీపీ విజయ్ కుమార్ సమక్షంలో అరెస్టు అయిన నిందితుడిని చూపించి వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా పోలాస కు చెందిన ఎం.ఏ. అర్షద్ ఖాన్ కరీంనగర్లో ఉంటూ సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో పగలంతా కూలి పని చేస్తూ రాత్రిపూట ఆలయాలు, తాళం వేసిన ఇళ్ళలో చోరీలకు పాల్పడ్డాడని తెలిపారు. వెదిర గ్రామంలోని ఆలయంలో చోరీకి పాల్పడి పారిపోతుండగా పోలీసులు చేజింగ్ చేసి పట్టుకున్నారని తెలిపారు. ఏడాది కాలంలో నిందితుడు చొప్పదండి రామడుగు గంగాధర, తిమ్మాపూర్, చిగురుమామిడి మండలాల్లో 12 ఆలయాల్లో చోరీకి పాల్పడినట్లు చెప్పారు. చోరీ చేసిన సొత్తును కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో విక్రయించేవాడని కరీంనగర్ లో మల్లికార్జున జువెలరీ షాపులో విక్రయించిన వెండి కిరీటం, వెండి చంద్రవంక, 2.5 గ్రాముల జత బంగారు పుస్తెలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చోరీ సొత్తును కొనుగోలు చేసిన షాపు యాజమానులపై సైతం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అడిషనల్ డిసిపి చెప్పారు. చాకచక్యంగా వరుస చోరీలకు పాల్పడే నిందితుడిని పట్టుకున్న రామడుగు పోలీసులను అభినందిస్తూ క్యాష్ అవార్డు అందజేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.