హుస్నాబాద్ లో పూర్తిస్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత ఆందోళన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పూర్తి స్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేశారు. ఈ మేరకు హుస్నాబాద్ పట్టణంలోని నూతన గ్రంథాలయం ఎదుట నిరసన తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో శాశ్వత గ్రంథాలయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిరుద్యోగ యువత వాపోయారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం నుండి వెళ్లిపోవాలని అక్కడ ఉన్నవారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ లో కట్టించిన నూతన గ్రంథాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు కేటాయించడం తగదన్నారు. హుస్నాబాద్ చుట్టుపక్కల 24 గ్రామాల నిరుద్యోగ యువతకు హుస్నాబాద్ లో శాశ్వత గ్రంథాలయం అత్య అవసరం ఉందన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి అన్ని వసతులతో కూడిన శాశ్వత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
హుస్నాబాద్ లో పూర్తిస్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత ఆందోళన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పూర్తి స్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేశారు. ఈ మేరకు హుస్నాబాద్ పట్టణంలోని నూతన గ్రంథాలయం ఎదుట నిరసన తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో శాశ్వత గ్రంథాలయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిరుద్యోగ యువత వాపోయారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం
నుండి వెళ్లిపోవాలని అక్కడ ఉన్నవారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ లో కట్టించిన నూతన గ్రంథాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు కేటాయించడం తగదన్నారు. హుస్నాబాద్ చుట్టుపక్కల 24 గ్రామాల నిరుద్యోగ యువతకు హుస్నాబాద్ లో శాశ్వత గ్రంథాలయం అత్య అవసరం ఉందన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి అన్ని వసతులతో కూడిన శాశ్వత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
- హుస్నాబాద్ లో పూర్తిస్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత ఆందోళన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పూర్తి స్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేశారు. ఈ మేరకు హుస్నాబాద్ పట్టణంలోని నూతన గ్రంథాలయం ఎదుట నిరసన తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో శాశ్వత గ్రంథాలయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిరుద్యోగ యువత వాపోయారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం నుండి వెళ్లిపోవాలని అక్కడ ఉన్నవారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ లో కట్టించిన నూతన గ్రంథాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు కేటాయించడం తగదన్నారు. హుస్నాబాద్ చుట్టుపక్కల 24 గ్రామాల నిరుద్యోగ యువతకు హుస్నాబాద్ లో శాశ్వత గ్రంథాలయం అత్య అవసరం ఉందన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి అన్ని వసతులతో కూడిన శాశ్వత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.2
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరుపుతూ , అభిషేక్ సింగ్వి లాంటి మంచి న్యాయవాదులను నియమించి సుప్రీంకోర్టు లో న్యాయపరంగా సమర్థవంతంగా పోరాడిన ఫలితంగానే ఈ తీర్పు వచ్చిందన్నారు. గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులకు ఈ తీర్పు కొత్త ఊపునిస్తుందని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి అవసరాలు కూడా తీరనున్నాయని, రైతులకు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇవి ఎంతో దోహదపడతాయని మంత్రి తెలిపారు.తెలంగాణ హక్కులను పరిరక్షించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చొరవ, ప్రభుత్వం చేసిన న్యాయపోరాటం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.2
- ఇల్లంతకుంట :వాణినికేతన్ హైస్కూల్లో ఘనంగా పోచమ్మ బోనాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని వాణి నికేతన్ హై స్కూల్లో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పోచమ్మ చిత్రపటం వద్ద శనివారం పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన విద్యార్థినిలు పోచమ్మ బోనాలు ఎత్తుకున్నారు. డప్పు చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాల మధ్య బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పోచమ్మ ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగను పాఠశాలలో నిర్వహించడం గర్వకారణం అన్నారు. పిల్లలకు చదువుతోపాటు సాంప్రదాయాలు, ఆచారాలపై అవగాహన కల్పించాలని లక్ష్యంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. బోనాల పండుగ ఐక్యమత్యానికి, సంస్కృతికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయనీలు సుమంగళి, శోభ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, శమిమా, రేణుక, జలజ, శాంత, పద్మ, స్వాతి, రేణుక, సునీత, ఉష, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, రాజు, తిరుపతి లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.1
- ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బిసి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించాం. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని, విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా, విదేశీ ఉన్నత విద్యకు ఎంపికైనా, సర్టిఫికెట్లు లేక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరచూ జీవోలు జారీ చేస్తూ విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం సరైన విధానం కాదని, గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- అమాయకుడిపై దారుణ కుట్ర: గంజాయి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్ సివిల్ తగాదాలో ప్రత్యర్థిని జైలుకు పంపేందుకు పగతో రగిలిపోయిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తీరు కరీంనగర్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..ఈగల్ టీమ్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు, తన మిత్రుడైన తోడేటి శ్రీనివాస్‌కు చెందిన భూ వివాదంలో జోక్యం చేసుకున్నాడు. ఎలాగైనా ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని క్రిమినల్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి ఫెర్టిలైజర్ షాపులో పెట్టించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదయ్యేలా చేశాడు. అయితే తెప్పించిన గంజాయిలో మిగిలిన 370 గ్రాములను నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లో దాచుకున్నాడు. పక్కా సమాచారంతో కొత్తపల్లి పోలీసులు దాడి చేసి,గంజాయితో పాటు 4 ఫోన్లను స్వాధీనం చేసుకుని కానిస్టేబుల్ నాగరాజును అరెస్ట్ చేసినట్లు ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు.2
- మండల కేంద్రంలో బెజ్జంకి లో ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవ వేడుకలు బెజ్జంకి, ఆగస్టు 1: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సేవలను కొనియాడుతూ, ప్రజల దైనందిన జీవితంలో వారి పాత్ర ఎంతో కీలకమని వక్తలు పేర్కొన్నారు. ఎండ, వాన, చలి తేడా లేకుండా నిత్యం ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ సమాజానికి విశేష సేవలందిస్తున్న ఆటో కార్మికులను అభినందించారు. "మూడు చక్రాలపై ప్రయాణం... వెనుక వేలాది కుటుంబాల జీవనం" అనే సందేశంతో ఆటో డ్రైవర్ల శ్రమను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజలు కూడా వారికి సహకారం అందించాలని కోరారు. అనంతరం మండలంలోని ఆటో డ్రైవర్లందరికీ ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.2
- కరీంనగర్ జిల్లాలో ఆలయాల్లో చోరీకి పాల్పడ్డ నిందితుడు ఎంఏ హర్షద్ అరెస్ట్...ఆలయంలో చోరీకి పాల్పడి పారిపోతుండగా ఛేజింగ్ చేసి పట్టుకున్న రామడుగు పోలీసులు కరీంనగర్ జిల్లాలో పలు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడ్డ నిందితుడిని రామడుగు పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి మూడు వెండి కిరీటాలు, 4 వెండి జంజీరాలు, 1.5 గ్రాముల బంగారు పుస్తెలు, 9500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ రూరల్ ఏ సి పి కార్యాలయంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ ఏసీపీ విజయ్ కుమార్ సమక్షంలో అరెస్టు అయిన నిందితుడిని చూపించి వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా పోలాస కు చెందిన ఎం.ఏ. అర్షద్ ఖాన్ కరీంనగర్లో ఉంటూ సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో పగలంతా కూలి పని చేస్తూ రాత్రిపూట ఆలయాలు, తాళం వేసిన ఇళ్ళలో చోరీలకు పాల్పడ్డాడని తెలిపారు. వెదిర గ్రామంలోని ఆలయంలో చోరీకి పాల్పడి పారిపోతుండగా పోలీసులు చేజింగ్ చేసి పట్టుకున్నారని తెలిపారు. ఏడాది కాలంలో నిందితుడు చొప్పదండి రామడుగు గంగాధర, తిమ్మాపూర్, చిగురుమామిడి మండలాల్లో 12 ఆలయాల్లో చోరీకి పాల్పడినట్లు చెప్పారు. చోరీ చేసిన సొత్తును కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో విక్రయించేవాడని కరీంనగర్ లో మల్లికార్జున జువెలరీ షాపులో విక్రయించిన వెండి కిరీటం, వెండి చంద్రవంక, 2.5 గ్రాముల జత బంగారు పుస్తెలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చోరీ సొత్తును కొనుగోలు చేసిన షాపు యాజమానులపై సైతం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అడిషనల్ డిసిపి చెప్పారు. చాకచక్యంగా వరుస చోరీలకు పాల్పడే నిందితుడిని పట్టుకున్న రామడుగు పోలీసులను అభినందిస్తూ క్యాష్ అవార్డు అందజేశారు.4